breaking news
Manchu Lakshmi
-
సరదాగా మంచు లక్ష్మీ బోటింగ్.. శ్రీలీల బ్యూటీఫుల్ లుక్..!
సిస్టర్‌కు నమ్రతా శిరోద్కర్ బర్త్ డే విషెస్..సరదా సరదాగా బోటింగ్ చేస్తోన్న మంచు లక్ష్మీ..సాగర తీరాన ఎనిమిది వసంతాలు హీరోయిన్ అనంతిక..గ్రీన్ డ్రెస్‌లో మెరిసిపోతున్న శ్వేతా బసు ప్రసాద్..బ్యూటీఫుల్ డ్రెస్‌లో హీరోయిన్ శ్రీలీల.. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Anandhi (@officialkayalanandhi) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Kubbra Sait (@kubbrasait) View this post on Instagram A post shared by Subhashree Rayaguru (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) -
కూతురు పేరు ప్రకటించిన మంచు మనోజ్, మౌనిక
టాలీవుడ్ హీరో మంచు మనోజ్, మౌనిక దంపతులు ఏప్రిల్ 13న పండంటి పాపకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తమ ముద్దల కూతురుకు పేరు పెట్టారు. గతేడాది రెండు కుటుంబాల అంగీకారంతో వివాహబంధంలోకి ఈ జంట అడుగుపెట్టింది. ఈ ఇద్దరికి ఇది రెండో వివాహమే. మాజీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల కుమార్తెనే మౌనిక.తమ ముద్దుల కుమార్తెకు 'దేవసేన శోభా MM' అని మంచు మనోజ్ నామకరణం చేశారు. ఆ పేరును సూచించడం వెనుకున్న కారణాన్ని తన ఇన్‌స్టాలో ఇలా వివరించారు. 'మీ అందరి ఆశీస్సులతో మా బిడ్డ 'దేవసేన శోభ MM'ను మీకు పరిచయం చేస్తున్నాం. ఇప్పటికే ఎమ్ఎమ్ పులి అనే తన ముద్దు పేరు ద్వారా అందరికీ బాగా తెలుసు. ఆ పరమేశ్వరుడి భుక్తులమైన మేము.. మా చిన్నారి తల్లి పేరును సాక్షాత్తు ఆ శివుని కుటుంబంలో సుబ్రహ్మణ్య స్వామి సతీమణి అయిన 'దేవసేన' పేరును మా పాపకు పెట్టుకున్నాం. మా అత్తగారు స్వర్గీయ శ్రీమతి శోభా నాగిరెడ్డి గారి పేరు నుంచి 'శోభ' అనే పేరును తీసుకున్నాం. వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కుటుంబంపై ఉంటాయి. మా జీవితంలో ఎల్లప్పుడూ అండగా ఉంటూ.. మాకు కొండంత బలంగా నిలుస్తున్న మా తల్లిదండ్రులు మోహన్ బాబు గారు శ్రీమతి నిర్మలా దేవి గారి ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి. నా జీవితంలో మొదటి నుంచి ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంటున్న మా అక్క లక్ష్మీ మంచు గారికి నా ధన్యవాదాలు.' అంటూ మనోజ్ ఒక లేఖను పంచుకున్నారు. దేవసేన పేరు చాలా బాగుందంటూ నెటిజన్లు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
ముంబైలో మంచు లక్ష్మీ కొత్త ఇల్లు.. వీడియో చూశారా?
మంచు ఫ్యామిలీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మోహన్ బాబు దగ్గర నుంచి మంచు లక్ష్మీ వరకు అందరూ సినిమాల్లో నటించారు. నటిస్తూనే ఉన్నారు. అలానే ఎప్పుడూ ఏదో ఓ విషయమై సోషల్ మీడియాలో ఉంటూనే ఉంటారు. అలా ఇప్పుడు మంచు లక్ష్మీ చర్చల్లోకి వచ్చింది. ముంబైలో కొత్త ఇల్లు కొనడమే దీనికి కారణం. తండ్రి మోహన్ బాబు అడుగుజాడల్లో ఇండస్ట్రీలోకి వచ్చిన మంచు లక్ష్మీ.. తొలుత నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది. 'అనఅనగా ఓ ధీరుడు' అనే సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. హీరోయిన్, సహాయ పాత్రల్లో పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె నటించిన 'ఆదిపర్వం' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. (ఇదీ చదవండి: నేను అనుకున్న కలని అతడు నిజం చేశాడు: చిరంజీవి) సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పటికే తండ్రి మోహన్ బాబు ఇంటిని, హైదరాబాద్ తన ఇంటిని హోమ్ టూర్స్ చేసిన మంచు లక్ష్మీ.. ఇప్పుడు ముంబైలో తను కొత్తగా తీసుకున్న ఇంటి టూర్ వీడియో కూడా చేసింది. ఇది పర్మినెంట్ ఫ్లాట్ కాదని చెప్పింది. చాలావరకు హైదరాబాద్ నుంచి తనకు నచ్చిన, కావాల్సిన వస్తువుల్ని తెచ్చేసుకున్నానని చెప్పుకొచ్చింది. తాను ఇప్పటికే చేసిన హోమ్ టూర్ వీడియోలకు మంచి స్పందన వచ్చిందని, అందుకే ఇప్పుడు ఈ హోమ్ టూర్ వీడియో కూడా చేశానని క్లారిటీ ఇచ్చింది. అయితే షూటింగ్స్ కోసం అప్పుడప్పుడు ముంబై వెళ్లి వస్తున్న మంచు లక్ష్మీకి అక్కడ ఉండేందుకు ఇబ్బంది అవుతున్నట్లు ఉంది. బహుశా అందుకే ఈ ఫ్లాట్ ని తీసుకున్నట్లు తెలస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్, ప్రభాస్, సూర్య లాంటి హీరోలకు ముంబైలో ఫ్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులో మంచు లక్ష్మీ కూడా చేరిందనమాట. (ఇదీ చదవండి: సాయిపల్లవికి రికార్డ్ రెమ్యునరేషన్.. 'రామాయణ' కోసం అన్ని కోట్లా?) -
మంచు లక్ష్మి 'ఆదిపర్వం' పాటలపై సంగీత దర్శకుల ప్రశంసలు
'ఆదిపర్వం' ఇది అమ్మవారి కథ, అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ, ఆ భక్తురాలిని దుష్ట శక్తుల నుండి కాపాడే ఓ క్షేత్రపాలకుడి కథ. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంజీవ్ కుమార్ మేగోటి దర్శకుడు. (ఇదీ చదవండి: సమంత గ్లామర్ ట్రీట్.. 'టాప్' లేపేసిందిగా!) ఐదు భాషల్లో త్వరలో రిలీజ్ కానుంది. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా పాటల్ని అన్విక ఆడియో ద్వారా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకులు ఆర్.పి.పట్నాయక్, ఎమ్.ఎమ్. శ్రీలేఖ, రఘు కుంచె తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆడియో వేడుకలో గీత రచయితలు, గాయనీగాయకులు, సంగీత దర్శకులకు సముచిత స్థానం కల్పించడమనే సత్సంప్రదయాన్ని పునః ప్రారంభించిన దర్శకనిర్మాతలు అభినందనీయులని వారు పేర్కొన్నారు. పాటలు చాలా బాగున్నాయని, ఈ చిత్రం సాధించే విజయంలో ఇవి తప్పకుండా ముఖ్యపాత్ర పోషిస్తాయని చెప్పుకొచ్చారు. ఇకపోతే దాదాపు రెండు వందలమందికి పైగా నటీనటులు ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అవుతుండటం విశేషం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. స్ట్రీమింగ్ ఆ రోజేనా?) -
బికినీలో టాలీవుడ్ స్టార్.. వీడియో వైరల్!
టాలీవుడ్లో మంచులక్ష్మి పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ నటులు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైనా తర్వాత తన సొంత టాలెంట్‌తో గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది మోహన్‌లాల్ నటించిన మాన్స్టర్ మూవీతో ప్రేక్షకులను అలరించిన మంచు లక్ష్మి ప్రసన్న.. ప్రస్తుతం అగ్నినక్షత్రం అనే సినిమాలో నటిస్తోంది. సినిమాలతో బిజీగా ఉండే మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటోంది. ప్రస్తుతం విదేశాల్లో వేకేషన్లో ఉన్న మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో బికినీలో కనిపిస్తూ గడ్డకట్టే చల్లని నీటిలో మునుగుతూ కనిపించింది. ఆ వీడియోలో సన్నింగ్ లుక్‌లో అభిమానులకు ఒక్కసారిగా షాకిచ్చింది టాలీవుడ్ భామ. ఇదంతా క్రియో థెరపీ కోసమేనంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం మంచులక్ష్మి ఫిన్లాండ్ వెకేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియో చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. Frozen thrill, no chill! ❄️ #CryoTherapy pic.twitter.com/MN4ccHl1yS — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) December 17, 2023 I am thrilled to reveal Telusa Telusa from the movie #Agninakshatram by @LakshmiManchu So turn up the volume and listen now:https://t.co/pptzkiUdJB And that's not all! "Vaanam Thuram Illaiye" is also out now in Tamil too.https://t.co/KWEwHZAOvq ♥️ pic.twitter.com/iE4CZQRGV0 — Samantha (@Samanthaprabhu2) March 9, 2023 -
నా భర్త ఇక్కడ ఉండరు అమెరికాలో ఉంటాడు
-
చిన్న సినిమాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్న యంగ్ లేడీ ప్రొడ్యూసర్స్
-
మోహన్ లాల్ తో వెరీ బోల్డ్ క్యారెక్టర్ చేస్తున్న : మంచు లక్ష్మి
-
మంచు లక్ష్మితో స్పెషల్ చిట్ చాట్
-
Manchu Lakshmi: పోలీసులకు ‘మంచు’ లంచ్
బంజారాహిల్స్ (హైదరాబాద్): లాక్డౌన్ సమయంలో రాత్రింబవళ్లు కష్టపడుతున్న పోలీసులకు తనవంతు సాయం చేసేందుకు ప్రముఖ సినీనటి మంచు లక్ష్మి ముందుకు వచ్చారు. ఫిలింనగర్‌లోని సీవీఆర్ న్యూస్ చౌరస్తా చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మంచు లక్ష్మి వారంరోజుల నుంచి లాక్డౌన్ విధులు నిర్వహిస్తున్న 50 మంది పోలీసులకు లంచ్ పంపిస్తున్నారు. ఇంట్లో వంట మనిషితో 50 మందికి సరిపడా భోజనాన్ని తయారు చేసించి తన సిబ్బంది ద్వారా పంపిస్తూ పెద్ద మనసును చాటుకుంటున్నారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ పోలీసులతోపాటు, ట్రాఫిక్ పోలీసులు మంచు లక్ష్మి పంపించిన భోజనాన్ని తింటున్నారు. డ్యాన్సర్ల కోసం కదిలిన దంపతులు.. సినిమా, ఈవెంట్, ఇతర షోలలో పనిచేసే సుమారు వందమంది డ్యాన్సర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు డ్యాన్స్ మాస్టర్ ఆట సందీప్‌తో పాటు ఆయన భార్య జ్యోతిరాజ్ ముందుకు వచ్చారు. వీరిద్దరు కలసి నిధుల సేకరణకు నడుం బిగించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ ప్రయత్నంలో తమకు సాయం చేయడమేకాక సంపూర్ణ మద్దతు ఇచ్చారని ఈ సందర్భంగా వారు తెలిపారు. కరోనా రోగుల కోసం రేణుదేశాయ్.. సినీనటి రేణుదేశాయ్ కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలసి కరోనా రోగులకు తనవంతు సాయం చేస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు, కరోనా రోగులకు ఆహారం, మందులు తదితర అవసరాల కోసం ఆమెకు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వివరాలు పంపిస్తే సహాయం చేస్తున్నారు. రోగి పేరు, ఆస్పత్రి పేరు, ఏ నగరం, ఎలాంటి సాయం కావాలో తెలుపుతూ ఫోన్ నంబర్లు పంపిస్తే చాలు.. ఆమె హైదరాబాద్, బెంగళూరు, చెన్నైనగరాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో తనవంతు సాయం అందిస్తున్నారు. గురువారం ఒక్కరోజే ఆమెకు 200 వినతులు వచ్చాయి. వాటన్నింటినీ పరిశీలించి ఎవరికి ఏం అవసరమో వాటిని జాబితా రూపొందించి సంబంధిత ఎన్జీవోలకు పంపిస్తుంటానని.. ఆయా సంస్థలవారు బాధితులకు సాయం అందజేస్తారని ఆమె తెలిపారు. -
మాల్దీవుల్లో వాలిపోయిన 'మంచు' ఫ్యామిలీ
షూటింగులతో బిజీబిజీగా ఉండే సినీ సెలబ్రిటీలు ఏమాత్రం వీలు కుదిరినా సేదతీరడానికి విదేశాలకు వాలిపోతుంటారు. ఫ్యామిలీతోనో, ఫ్రెండ్స్‌తోనే సరదాగా వెకేషన్ ట్రిప్‌కు వెళ్తుంటారు. ఈ మధ్యకాలంలో దక్షిణాదితో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ మధ్య ఎక్కువగా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అలా వెళ్లిన వారిలో రానా-మిహిక, నిహారిక-చైతన్య,కాజల్-కిచ్లు జంటలు కూడా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం మాల్దీవులు సెలబ్రిటీలకు ఫేవరెట్ ప్లేస్‌గా మారినట్లు తెలుస్తోంది. తాజాగా మంచు ఫ్యామిలీ కూడా మాల్దీవుల్లో వాలిపోయారు. మంచు మోహన్‌బాబు, ఆయన భార్య నిర్మల సహా మంచు లక్ష్మీ తన కూతురు, భర్త ఆండీ శ్రీనివాసన్ అక్కడి అందాలను ఆస్వాదిస్తున్నారు. చదవండి : (ఇక్కడ ఒక్క రాత్రికి రూ. 58 లక్షలు) మాల్దీవులు భూతలస్వర్గంగా ఉందని.. ఆకాశం, బీచ్‌లతో ఇక్కడి ప్రకృతి సోయగాలు ఎంతో బాగున్నాయని మంచు లక్ష్మీ పేర్కొంది. దీనికి సంబంధించి పలు ఫోటోలను సోషల్‌మీడియాలో పంచుకుంది. ఇక డైలాగ్‌కింగ్ మోహన్‌బాబు తన సతీమణితో సముద్రపు ఒడ్డున దిగిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. యంగ్‌లుక్‌లో కనిపిస్తున్నారంటూ మోహన్‌బాబు దంపతులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తన్నారు. చదవండి : (మజా మాల్దీవ్స్ ) ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి Beaching until further notice! 😉 Enjoying the beautiful sunset with nana and amma! 🌅❤️❤️❤️ It's so good to be finally out of the house and relish some quality time with the fam at @LUXSouthAri!✨ We are in heaven 😍🌊🌴🐚👙🐬🐋 pic.twitter.com/WH2zmbNWr2 — Lakshmi Manchu (@LakshmiManchu) January 21, 2021 View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) -
కొత్త షో అనౌన్స్ చేసిన మంచు వారమ్మాయి..
‘మేము సైతం’ షోతో బుల్లితెరలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మంచు లక్ష్మీ ప్రసన్న. టాక్ షోస్, రియాలిటీ షోలతో లక్ష్మీకి ఫాలోయర్స్ బాగానే పెరిగిపోయారు. గతేడాది కూడా ఓ బోల్డ్ షోను హోస్ట్ చేశారు మంచు లక్ష్మీ. దీని ద్వారా స్టార్స్ అందరి బెడ్రూమ్ ముచ్చట్లు బయటికి తీసుకొచ్చారు. ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ అంటూ మంచు లక్ష్మీ చేసిన ఈ షో బాగానే పాపులర్ అయింది. ఇక లాక్డౌన్ సమయంలో కూడా 'లాక్డ్ అప్ విత్ లక్ష్మీ మంచు' పేరుతో పలువురు సినీ, పొలిటికల్ సెలబ్రిటీలతో ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ఆమె ఇంటరాక్ట్ అయ్యారు. తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 8న మరో కొత్త షోకు శ్రీకారం చుట్టారు మంచు లక్ష్మీ. ఇందుకు సంబంధించిన ప్రోమోతో తన కొత్త షోను అనౌన్స్ చేశారు మంచు లక్ష్మీ. (చదవండి: ‘మళ్లీ జన్మలోనూ నా కూతురిగానే పుట్టాలి’) #ComingBackToLifeWithLakshmi It’s a series of positive,forward-looking conversations with celebrated personalities across the globe, Hosted by @LakshmiManchu Presented by @RanaDaggubati , the digital series will air on @SouthBaySound #ComeBackToLife pic.twitter.com/WiL21R8IZI — Lakshmi Manchu (@LakshmiManchu) October 8, 2020 సౌత్ బే సమర్పిస్తోన్న ఆ షో పేరు 'కమింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ లక్ష్మీ మంచు'. ఇది కూడా లాక్డౌన్ సమయంలో వచ్చిన 'లాక్డ్ అప్ విత్ లక్ష్మీ మంచు' తరహాలోనే ఉండబోతుంది. ఈ షోలో ఆమె ఫిలిమ్స్, స్పోర్ట్స్, ఫ్యాషన్, ఫుడ్.. తదితర రంగాలకు చెందిన సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయబోతున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళితో పాటు లక్ష్మీ ఫ్రెండ్ తాప్సీ పన్ను.. సెంథిల్ రామమూర్తి, సానియా మీర్జా, ప్రకాష్ అమృతరాజ్, శంతను, నిఖిల్, బిభు మొహాపాత్ర, పూజా ధింగ్రా, అన్నా పొలీవియౌ తదితరులు కనిపిస్తున్నారు. సౌత్ బే ప్రెజెంట్ చేస్తున్న 'కమింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ లక్ష్మీ మంచు' షో త్వరలోనే ప్రారంభం కానుంది. -
ఎన్కౌంటర్: మంచు లక్ష్మి కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: దిశ హత్య కేసులో నిందితుల ఎన్కౌంటర్ వార్త వినగానే చాలా సంతోషంగా ఫీలయ్యానని నటి మంచు లక్ష్మి అన్నారు. తప్పు చేసిన వారికి వెంటనే శిక్ష పడినందుకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగిందని వ్యాఖ్యానించారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ.. పోలీసులు ఎన్‌కౌంటర్‌పై వంద శాతం సంతృప్తిగా ఉన్నట్టు వెల్లడించారు. దోషులకు ఎంత త్వరగా శిక్ష పడాలని ఎలా కోరుకుంటానో, చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడని అలాగే కోరుకుంటానని చెప్పారు. అయితే ఎన్కౌంటర్ తర్వాత సెలబ్రేషన్స్ చూసి తనకు భయం వేసిందన్నారు. ఇది సెలబ్రేట్ చేసుకునే అంశం కాదని, ఈ ఎన్‌కౌంటర్‌ను చూసి ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారేమోనన్న భయాన్ని ఆమె వ్యక్తపరిచారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఇచ్చిన తీర్పులను వెంటనే అమలు చేసి న్యాయం జరుగుతుందన్న భరోసా కల్పించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..? ‘తప్పు చేసిన వారిని వెంటనే శిక్ష పడినందుకు సంతోషం. కానీ ఇది నిజంగా న్యాయమేనా? ప్రతిసారి దోషులను ఎన్కౌంటర్ చేసి చంపేయలేరు. చంపేయాలని అందరూ కోరుకుంటారు. ఎంతమందిని ఎన్కౌంటర్ చేసుకుంటూ వెళతారు? చనిపోయిన నలుగురు నిందితుల తల్లిదండ్రులు ఎంత కుమిలిపోయి ఉంటారు? వాళ్లను చూస్తుంటే నిరాక్షరాస్యుల్లా ఉన్నారు. ఎన్నో కష్టాలు పడి వాళ్లు తమ పిల్లలను ఇప్పటివరకు పెంచుకుంది ఇలా దారుణంగా చనిపోవడానికా? ఇది ఎందుకు జరుగుతోంది? నిర్భయ కేసులో దోషులకు శిక్ష పడి ఏడేళ్లు గడిచినా ఇప్పటివరకు అమలు చేయలేదు. ఇదే న్యాయం? మేము కట్టిన పన్నులతో ఏడేళ్లుగా నిర్భయ దోషులను జైళ్లో మేపుతున్నారు. దీన్ని మేము ప్రశ్నించాలనుకుంటున్నాం. ఆడపిల్ల గడప దాటి బయటకు వెళుతుంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి. దిశ చివరిసారిగా తన చెల్లితో ఫోన్లో మాట్లాడిన మాటలు విటుంటే మనసు తరుక్కుపోతోంది. 5 ఏళ్ల పసిపాప నుంచి 60 ఏళ్ల వృద్ధురాళ్లపై అఘాత్యాలు జరగడానికి కారణం ఏంటి? ముందు మనలో మార్పు రావాలి. ఇవాల్టీ ఘటనతో మన దేశంలో కూడా వెంటనే న్యాయం జరుగుతుందన్న నమ్మకం వచ్చింద’ని మంచు లక్ష్మి అన్నారు. సంబంధిత వార్తలు.. 'నేను ఎన్కౌంటర్లకు వ్యతిరేకం' నన్ను కూడా కాల్చి చంపండి దిశ కేసు: నేరం చేశాక తప్పించుకోలేరు ఎన్కౌంటర్: గుడిగండ్లలో ఉద్రిక్తత -
‘ఎన్ఆర్ఐ’ని క్లాప్ కొట్టి ప్రారంభించిన అమల
అవసరాల శ్రీనివాస్.. నటుడిగా, దర్శకుడిగా, హీరోగానూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతున్న నాయనా రారా ఇంటికి (ఎన్ఆర్ఐ) చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు. అక్కినేని అమల క్లాప్ కొట్టి మూవీ షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మీ, మహతి కథానాయికలుగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు నాని, అక్కినేని అఖిల్, సిరివెన్నెల సీతారామశాస్త్రిలాంటి ప్రముఖులు హాజరయ్యారు. పూర్తి హాస్యభరితంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగబాబు ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘షీ టీమ్స్’ డే...
-
భౌతికాతీత కోణాన్ని సజీవం చేయడమే యోగ
యోగా యోగా అంటే బరువు తగ్గటం కోసమో, సన్నబడటం కోసమో, నడుమునొప్పి, తలనొప్పి తగ్గటం కోసమో చేసేది కాదు. యోగా చేస్తే అవన్నీ ఎలాగూ జరుగుతాయి - మీరు ఎలాగూ ఆరోగ్యంగా, ప్రశాంతంగా, ప్రేమగా, సున్నితంగా తయారవుతారు. కానీ అవన్నీ యోగా వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే. అవి యోగా యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. మీరు బరువు తగ్గటానికి యోగా చేయనవసరం లేదు. అందుకోసం మీరు కొంచెం వివేకంతో తింటే, టెన్నిస్ ఆడితే లేదా ఈత కొడితే సరిపోతుంది. భౌతికాతీతమైన కోణాన్ని మీలో సజీవం చేయటమే యోగ యొక్క ముఖ్య ఉద్దేశం. అది సజీవమైనప్పుడు మాత్రమే ఈ సృష్టి మెల్లిగా అనేక విధాలుగా మీకు అందుబాటులోకి వస్తుంది. భౌతికాతీతమైన కోణం మీలో సజీవం అవ్వటం వల్ల మీరెప్పుడూ ఊహించనటువంటి విషయాలు కూడా మీ జీవితంలో యథార్థాలుగా మారతాయి. మీరు యోగ చేస్తుంటే, అధికంగా ఉన్న బరువు కచ్చితంగా తగ్గుతుంది. ఉదాహరణకు, కొందరు క్రియ యోగా మొదలుపెట్టినప్పుడు బరువు తగ్గుతారు, మరికొందరు బరువు పెరగటం మొదలుపెడతారు. మీ జీర్ణక్రియ సరిగ్గా లేకపోతే, మీరు క్రియలు చేయడం మొదలుపెట్టినప్పుడు... మీ జీర్ణ శక్తి ఉత్తేజితం అవుతుంది. మీ జీర్ణశక్తి మెరుగవటం వల్ల, ఆహారం మాంసంగా మారటం మరింత సమర్థవంతంగా జరుగుతుంది. అందువల్ల మీరు బరువు పెరగటం మొదలు అవుతుంది. మీ జీర్ణశక్తి ముందే బాగుండి, మీరు క్రియలు చేయటం మొదలుపెడితే, అప్పుడు కూడా ఆహారాన్ని ఉపయోగించుకునే మీ సామర్థ్యం మరింత మెరుగవుతుంది. కానీ ఆహారం అప్పుడు మాంసంగా కాకుండా, ఒక సూక్ష్మమైన శక్తిగా మార్చబడుతుంది. అప్పుడు మీరు ఎంత తిన్నా మీ బరువు తగ్గుతూనే ఉండటమే మీరు గమనిస్తారు.అదే మరోవిధంగా కూడా జరగవచ్చు. మీరు తీసుకునే ఆహారం నాటకీయంగా తగ్గిపోవచ్చు. కానీ మీరు బరువు తగ్గకపోవచ్చు. మనలో ఆహారం రూపాంతరం చెందే నిష్పత్తి మారటం వల్లే ఇలా జరుగుతుంది. యోగా మీ వ్యవస్థను పునరుత్తేజితం చేసి, మీ విజ్ఞతను పెంపొందిస్తుంది. అందువల్ల మీరు అతిగా తినరు. మీ శరీరంలో కొంత స్థాయి అవగాహన రాగానే, దానికి అవసరమైనంతే తినేటట్లుగా అది మారుతుంది. మీరు మీ జీవితాన్ని నియంత్రించటం వల్లనో లేక ఎవరో మీకు డైటింగ్ చేయమని చెప్పటం వల్లనో ఇది జరగదు. మీరు వ్యాయామం లేక డైటింగ్ చేస్తున్నారంటే, మిమ్మల్ని మీరు నియంత్రించుకోవటానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. యోగా సాధన చేస్తే, మిమ్మల్ని మీరు నియంత్రించుకునే అవసరం ఉండదు. మీరు కేవలం సాధన చేయండి. ఇది మీ వ్యవస్థను ఎలా చూసుకుంటుంది అంటే అది మిమ్మల్ని మీకు అవసరమైన దానికంటే ఎక్కువ తిననివ్వదు. యోగా చేయడానికి, బరువు తగ్గటానికి చేసే మిగతా పనులకి మధ్య ఉన్న అతిపెద్ద తేడా ఇదే! ప్రేమాశీస్సులతో,సద్గురు - సద్గురు జగ్గీ వాసుదేవ్ www.sadhguru.org -
దేహయంత్ర నియంత్రణ
యోగా ‘అంగమర్దన’ అనేది నేడు పూర్తిగా మరుగున పడిపోయిన ఒక ప్రత్యేకమైన యోగా విధానం. ఎటువంటి పరికరాల అవసరం లేకుండా చేయగలిగే తీవ్రమైన వ్యాయామం ఇది. మీకు కావలిసింది ఆరు బై ఆరు అడుగుల స్థలం మాత్రమే. ఆ తర్వాత ఇందులో మీరు చేసేదంతా మీ శరీరంతోనే. ఇది మీ శరీర బరువు, వేగాల సాయంతో మీ కండరాల యొక్క వంగే గుణాన్ని పెంచి క్రమక్రమంగా ఎంతో భిన్నమైన శారీరక సామర్థ్యాన్నీ, దృఢత్వాన్నీ కలిగిస్తుంది. మేము ప్రస్తుతం నేర్పిస్తున్నది ఒక 25 నిమిషాల ప్రక్రియే. కానీ ఇది ఆరోగ్యపరంగా, శ్రేయస్సుపరంగా అద్భుతాలను సృష్టించగలదు. శక్తిమంతమైన శరీరాన్ని నిర్మించడంలో, ఇది బరువులతో జిమ్‌లో చేసే వ్యాయామమంత సమర్థవంతమైనది. అదే సమయంలో ఇది వ్యవస్థ మీద ఎటువంటి అనవసరమైన ఒత్తిడిని కలిగించదు. ‘అంగమర్ధన’ అంటే అర్థం మీ అవయవాల మీద ఆధిపత్యం లేదా నియంత్రణ కలిగి ఉండటం. మీరు ఏ పని చేయదలచుకున్నా, మీ అవయవాల మీద ఎంత ఆధిపత్యం కలిగి ఉన్నారన్న విషయమే మీరు ఆ పనిని ఎంత బాగా చేయగలరు అనే దానిని నిర్ణయిస్తుంది. నేను ఒక క్రీడాకారుల జట్టులోనో, మరో దాంట్లోనో చేరి రాణించడం గురించి మాట్లాడటం లేదు. మీరు మీ మనుగడ కోసం చేసే పనులకు, మీ ముక్తి కోసం చేసే పనులకు మధ్య ఉన్న వ్యత్యాసం గురించి మాట్లాడుతున్నాను. మీరు మీ ముక్తి కోసం ఏదైనా చేయాలంటే, మీ అవయవాల మీద మీకు కొంత నియంత్రణ ఉండాలి. మీరు దీన్ని కేవలం ఒక వ్యాయామంగా చూసినా అంగమర్దన సరితూగుతుంది. కండరాలను దృఢం చేయడం, కొవ్వు తగ్గించడం అనేవి కేవలం సహ ప్రయోజనాలు మాత్రమే. ఈ సాధనతో మనం ముఖ్యంగా చేసేది మన శక్తిని ఒక స్థాయికి తీసుకెళ్ళి, దానిలో ఒక సమగ్రతను తీసుకురావడమే. అసలు విషయం ఏమిటంటే మిమ్మల్ని మీరు పూర్తి సామర్థ్యంతో పనిచేసే వ్యక్తిగా మలచుకోవాలి. ఎందుకంటే పూర్తి సామర్థ్యంతో పనిచేసే వ్యక్తిని మాత్రమే అత్యున్నత విషయాలను గ్రహించగలిగే స్థాయికి తీసుకెళ్ళగలం. ఒక వ్యక్తి నడిచే పద్ధతిని చూస్తే, అతను సరైన శారీరక వ్యాయామం చేసాడా, లేదా అనేది స్పష్టమౌతుంది. ఒక వ్యక్తి ముఖం చూస్తే, అతను తన మెదడును సరిగ్గా ఉపయోగించుకున్నాడా లేదా చెప్పవచ్చు. అలాగే మీరు నిశితంగా చూస్తే, ఒకరి శక్తి సరిగ్గా ఉత్తేజితం చేయబడిందా లేదా అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఒకరు ఏమి చేయగలరో, ఏమి చేయలేరో నిర్ణయించబడేది దీని ఆధారంగానే. మీ శక్తులపై మీకు పూర్తి నియంత్రణ ఉంటే, మీరు వాటిని విస్ఫోటనం చెందించవచ్చు. చాలా మంది ఏవో పెద్ద అనుభూతులను కోరుకుంటారు. కానీ దానికి అనుగుణంగా, అంటే ఆ అనుభూతులను పొందేందుకు యోగ్యంగా శరీరాన్ని మలచుకోవడానికి వారు సుముఖంగా ఉండరు. యోగాలో మీరు ఒక అనుభవం కోసం తాపత్రయపడరు. మీరు కేవలం దాన్ని పొందేందుకు సంసిద్ధులవుతారు, అంతే. అందుకు మీ అవయవాల మీద మీకు కొంత నియంత్రణ ఉండాలి. ప్రేమాశీస్సులతో... - మీ సద్గురు


