breaking news
Malaysia Team
-
‘హ్యాట్రిక్’ విజయంతో సెమీస్‌లోకి భారత్
హులున్‌బుయిర్ (చైనా): ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోరీ్నలో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. గత ఏడాది రన్నరప్ మలేసియా జట్టుతో బుధవారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ బృందం 8–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. మలేసియా జట్టుపై భారత్‌కిది అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో భారత జట్టు మరో రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉండగానే తొమ్మిది పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది. భారత్ తరపున రాజ్‌కుమార్ పాల్ (3వ, 25వ, 33వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ సాధించాడు. అరిజీత్ సింగ్ హుండల్ (6వ, 39వ ని.లో) రెండు గోల్స్ చేయగా... జుగ్రాజ్ సింగ్ (7వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (22వ ని.లో), ఉత్తమ్ సింగ్ (40వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. మలేసియా జట్టుకు అఖీముల్లా అనూర్ (34వ ని.లో) ఏకైక గోల్ అందజేశాడు. గత ఏడాది ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఈ రెండు జట్లు చివరిసారి ముఖాముఖిగా పోటీపడ్డాయి. నాటి ఫైనల్లో అర్ధభాగం ముగిసేసరికి 1–3 గోల్స్‌తో వెనుకబడ్డ భారత్ ఆ తర్వాత తేరుకొని చివరకు 4–3 గోల్స్ తేడాతో నెగ్గి విజేతగా అవతరించింది. ఈసారి మాత్రం మలేసియాపై ఆరంభం నుంచే భారత్ పూర్తి ఆధిపత్యం చలాయించింది. మ్యాచ్ మొదలైన మూడో నిమిషంలోనే రాజ్‌కుమార్ మలేసియా డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ గోల్ చేశాడు. ఆ తర్వాత నాలుగు నిమిషాల వ్యవధిలో భారత్ మరో రెండు గోల్స్ చేసి 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా భారత్ తమ జోరు కొనసాగించింది. ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ 2–1తో జపాన్‌పై, కొరియా 3–2తో చైనాపై గెలిచాయి. నేడు జరిగే నాలుగో లీగ్ మ్యాచ్‌లో కొరియాతో భారత్ ఆడతుంది. హులున్‌బుయిర్ (చైనా): ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోరీ్నలో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. గత ఏడాది రన్నరప్ మలేసియా జట్టుతో బుధవారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ బృందం 8–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. మలేసియా జట్టుపై భారత్‌కిది అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో భారత జట్టు మరో రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉండగానే తొమ్మిది పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది. భారత్ తరపున రాజ్‌కుమార్ పాల్ (3వ, 25వ, 33వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ సాధించాడు. అరిజీత్ సింగ్ హుండల్ (6వ, 39వ ని.లో) రెండు గోల్స్ చేయగా... జుగ్రాజ్ సింగ్ (7వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (22వ ని.లో), ఉత్తమ్ సింగ్ (40వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. మలేసియా జట్టుకు అఖీముల్లా అనూర్ (34వ ని.లో) ఏకైక గోల్ అందజేశాడు. గత ఏడాది ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఈ రెండు జట్లు చివరిసారి ముఖాముఖిగా పోటీపడ్డాయి. నాటి ఫైనల్లో అర్ధభాగం ముగిసేసరికి 1–3 గోల్స్‌తో వెనుకబడ్డ భారత్ ఆ తర్వాత తేరుకొని చివరకు 4–3 గోల్స్ తేడాతో నెగ్గి విజేతగా అవతరించింది. ఈసారి మాత్రం మలేసియాపై ఆరంభం నుంచే భారత్ పూర్తి ఆధిపత్యం చలాయించింది. మ్యాచ్ మొదలైన మూడో నిమిషంలోనే రాజ్‌కుమార్ మలేసియా డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ గోల్ చేశాడు. ఆ తర్వాత నాలుగు నిమిషాల వ్యవధిలో భారత్ మరో రెండు గోల్స్ చేసి 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా భారత్ తమ జోరు కొనసాగించింది. ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ 2–1తో జపాన్‌పై, కొరియా 3–2తో చైనాపై గెలిచాయి. నేడు జరిగే నాలుగో లీగ్ మ్యాచ్‌లో కొరియాతో భారత్ ఆడతుంది. -
హైదరాబాద్ ఘనవిజయం
సాక్షి, అంబర్‌పేట: రాజీవ్‌గాంధీ అఖిల భారత అండర్–19 టి20 ఫెడరేషన్ కప్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. అంబర్‌పేట వాటర్ వర్క్స్ క్రికెట్ మైదానంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మలేసియా జట్టుపై 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులు చేసింది. సాగర్ చౌరాసియా (55) అర్ధసెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లలో సంజయ్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం 143 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన మలేసియా జట్టు 13.1 ఓవర్లలో 49 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. హైదరాబాద్ బౌలర్లలో అజయ్‌దేవ్ గౌడ్ (4/18), నితిన్ గోపాల్ (2/6) విజృంభించారు. అంతకుముందు జరిగిన టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వి. హనుమంతరావు (వీహెచ్), మాజీ ఎంపీ వివేక్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి... నేటి యువత క్రీడలపై ఆసక్తి చూపడం శుభపరిణామమని... అంతర్జాతీయ స్థాయిలోనూ వీరందరూ తమ సత్తా చూపాలని రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి అన్నారు. క్రికెట్ నేడు ఉన్నత వర్గాలకు చెందిన క్రీడాకారుల ఆటగానే భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సత్తా ఉన్న ప్రతి క్రికెటర్‌ను ప్రోత్సహించేందుకు గత నాలుగేళ్లుగా రాజీవ్‌గాందీ క్రికెట్ ఫెడరేషన్ అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వీహెచ్.. మాట్లాడుతూ... క్రీడాకారులను ప్రోత్సహించి వారు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమని అన్నారు.