పేరు మార్చుకున్న ప్రముఖ ఐటీ కంపెనీ
ప్రముఖ దేశీయ ఐటీ సేవల సంస్థ ఎల్టీఐ మైండ్‌ట్రీ (LTIMindtree) తన పేరును మార్చుకుంది. కంపెనీ కొత్త పేరును ఎల్‌టీఎం లిమిటెడ్ (LTM Limited)గా ప్రకటించింది. తన కొత్త బ్రాండ్ గుర్తింపు, లోగోను ఆవిష్కరించింది. వేణు లాంబును చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించిన సంవత్సరం తర్వాత తన పేరును అధికారికంగా మార్చుకుంది."వ్యాపార సృజనాత్మకత భాగస్వామి" (Business Creativity Partner)గా కొత్త గుర్తింపు, స్థానాన్ని ప్రకటిస్తూ, ఎల్‌టీఎం తన సాంకేతిక సామర్థ్యాలు, లోతైన డొమైన్ నైపుణ్యం కలిసి వాటాదారులకు అర్థవంతమైన విలువను ఎలా సృష్టిస్తాయో వివరించింది. ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది."మార్కెట్లు మారుతున్నాయి, క్లయింట్ల అంచనాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో, మన ప్రస్తుత సామర్థ్యాలు, భవిష్యత్తు దృష్టిని ప్రతిబింబించే బ్రాండ్‌తో ముందుకు సాగుతున్నాము. బిజినెస్ క్రియేటివిటీ భాగస్వామిగా, మనం పని చేసే కొత్త మార్గాలు, కొత్త ఉత్పాదకత నమూనాలు, విలువ సృష్టించే కొత్త విధానాలను రూపొందిస్తున్నాము" అని సీఈఓవేణు లాంబు తెలిపారు.ఎల్టీఐ మైండ్‌ట్రీ లిమిటెడ్.. లార్సెన్ & టుబ్రో గ్రూప్‌కు చెందిన ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కన్సల్టింగ్ అండ్ డిజిటల్ సొల్యూషన్స్ సంస్థ. ఎల్‌అండ్‌టీఐ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ విలీనంతో ఏర్పడిన ఈ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల సంస్థలకు డిజిటల్ మార్పు, క్లౌడ్, డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సేవలను అందిస్తోంది. ఇటీవల విడుదల చేసిన డిసెంబర్ త్రైమాసిక (Q3) ఆర్థిక ఫలితాల ప్రకారం.. కంపెనీ ఆదాయం సుమారు 11 శాతం పెరిగి రూ. 10,781 కోట్లకు చేరుకోగా, పునరావృతం కాని (one-off) వ్యయ ప్రభావాల కారణంగా నికర లాభం సుమారు 12 శాతం తగ్గి రూ. 960 కోట్లుగా నమోదైంది.ఇదీ చదవండి: ఉద్యోగం వద్దనుకుంటే.. గూగుల్ ఆఫర్ ఇదే..