breaking news
love life
-
శ్రీదేవితో రహస్య వివాహం నుంచి భార్య బెదిరింపుల వరకు..
బాలీవుడ్ లెజెండరీ నటుడు, ‘డిస్కో కింగ్’, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి అనారోగ్యంతో కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ కానున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన జీవితంలోని పలు అంశాలు మరోమారు చర్చల్లోకి వచ్చాయి. మిథున్ చక్రవర్తి సినీ ప్రయాణం అద్భుతంగా సాగినా, ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం అనేక వివాదాలు, విషాదాలు, నాటకీయ పరిణామాలతో నిండిపోయింది. పరిశ్రమలోని పలువురు ప్రముఖ నటీమణులతో ఆయన సాగించిన ప్రేమాయణాలు, రహస్య వివాహాలు నాడు సంచలనం సృష్టించాయి.కమల్ హాసన్ మాజీ భార్యతో..1970లలో మిథున్ చక్రవర్తి వరుస హిట్లతో సినిమా రంగంలో దూసుకుపోతున్నారు. ఆ సమయంలో ‘హమారా సంసార్’ చిత్రంలో కమల్ హాసన్ మాజీ భార్య సారికతో ఆయన కలిసి నటించారు. అప్పుడు ఇద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం ప్రేమగా మారింది. అయితే కొద్ది నెలలకే ఈ బంధం అర్ధాంతరంగా ముగిసిపోయిందంటారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సారికనే స్వయంగా మిథున్‌కు దూరమైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.మోడల్,నటి హెలెనా లూక్‌తో వివాహంసారికతో బ్రేకప్ తర్వాత మానసికంగా కుంగిపోయిన మిథున్, మోడల్ కమ్ నటి హెలెనా లూక్‌కు దగ్గరయ్యారు. జావేద్ ఖాన్‌తో ఐదేళ్ల రిలేషన్షిప్ ముగిసిన హెలెనా కూడా ఆ సమయంలో ఒంటరిగానే ఉన్నారు. ఇద్దరి పరిస్థితులు ఒకేలా ఉండటంతో 1979లో వారు వివాహం చేసుకున్నారు. కానీ ఈ బంధం కేవలం నాలుగు నెలలు మాత్రమే నిలిచింది. మిథున్ ప్రవర్తన కారణంగా హెలెనా విడాకులు తీసుకున్నారని అంటారు.హెలెనా బయటపెట్టిన మిథున్ టాక్సిక్ నేచర్విడాకుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హెలెనా లూక్, మిథున్‌తో తన అనుభవాన్ని ఒక పీడకలగా అభివర్ణించారు. మిథున్ తనను మానసికంగా ఎంతో వేధించారని, తన మాజీ ప్రియుడితో సంబంధం ఉందని నిత్యం అనుమానించే వారని ఆమె వెల్లడించారు. మిథున్‌కు అప్పట్లోనే వేరే మహిళలతో సంబంధాలు ఉండటం వల్లే, తనపై లేనిపోని అభూతకల్పనలు ఆపాదించేవారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. విడాకుల అనంతరం హెలెనా బాలీవుడ్‌కు పూర్తిగా దూరమై న్యూయార్క్‌లో స్థిరపడ్డారు.కిశోర్ కుమార్ మాజీ భార్య యోగితా బాలితో పెళ్లిహెలెనాతో విడాకుల అనంతరం మిథున్ జీవితంలోకి సింగర్ కిశోర్ కుమార్ మాజీ భార్య యోగితా బాలి ప్రవేశించారు. కిశోర్ కుమార్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత, యోగితా 1979లో మిథున్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత తన సినిమా కెరీర్‌ను పూర్తిగా పక్కన పెట్టి, సంసారమే సర్వస్వంగా బతుకుతానని ఆమె ప్రకటించారు. ఈ దంపతులకు మహాక్షయ్ (మిమోహ్), ఉష్మే, నామాషి అనే ముగ్గురు కుమారులు జన్మించడంతో పాటు దిశాని అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు.శ్రీదేవి ఎంట్రీతో వైవాహిక జీవితంలో తుఫాన్అంతా సజావుగా సాగుతున్న సమయంలో 1985లో మిథున్ జీవితంలోకి దివంగత నటి శ్రీదేవి అడుగుపెట్టారు. ‘జాగ్ ఉతా ఇన్సాన్’ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యారు. అప్పటికే పెళ్లయినప్పటికీ మిథున్.. శ్రీదేవితో ప్రేమలో పడిపోయారు. మీడియా కథనాల ప్రకారం, వీరిద్దరూ 1985లో అత్యంత రహస్యంగా వివాహం కూడా చేసుకున్నారు. ఈ సీక్రెట్ మ్యారేజ్ బాలీవుడ్ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది.భార్య యోగితా బాలి ఆత్మహత్యాయత్నంమిథున్, శ్రీదేవిల రహస్య వివాహం, వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న యోగితా బాలి తీవ్రంగా కుంగిపోయారు. భర్త మోసాన్ని తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు యత్నించినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తరువాత ఆమె, తన పిల్లలతో కలిసి మిథున్ నుంచి దూరంగా వెళ్లిపోయారు. ఈ పరిణామం మిథున్, నిర్మాత బోనీ కపూర్ మధ్య ఉన్న స్నేహ బంధాన్ని కూడా శాశ్వతంగా దెబ్బతీసింది.శ్రీదేవితో పెళ్లి రద్దు.. యోగితా బాలితో తిరిగి..మిథున్ తన మొదటి భార్య యోగితాకు విడాకులు ఇవ్వలేడని, ఆమెను పూర్తిగా వదిలించుకోలేడని గ్రహించిన శ్రీదేవి కీలక నిర్ణయం తీసుకున్నారు. 1988లో మిథున్‌తో జరిగిన వివాహాన్ని ఆమె చట్టబద్ధంగా రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత శ్రీదేవి బోనీ కపూర్‌ను వివాహం చేసుకోగా, మిథున్ తిరిగి తన మొదటి భార్య యోగితా బాలి వద్దకు చేరారు. యోగితను ఒప్పించి ఆమెను ఇంటికి రప్పించుకున్న మిథున్, ఆ తర్వాత తమ మూడో సంతానాన్ని స్వాగతించారు. ఎన్నో వివాదాలు, కష్టాలను ఎదుర్కొన్న మిథున్ చక్రవర్తి ప్రస్తుతం తన భార్య యోగితా బాలి, పిల్లలతో కలిసి ఉంటున్నారు. వారి కుమారులు మిమోహ్, ఉష్మే, నామాషి, కూతురు దిశాని కూడా సినీరంగంలో రాణిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘రక్త సంబంధం’.. ఇది సీరియల్ కాదు.. సినిమా కానే కాదు! -
ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్
Major Actor Adivi Sesh Reveals His Love In Latest Interview: ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. యంగ్ హీరో అడవి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు అడవి శేష్. ఈ క్రమంలోనే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి, ఎఫైర్స్ వంటి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు శేష్. 'పెళ్లి చేసుకోమంటూ ఇంట్లో అనట్లేదా' అని యాంకర్ అడిగిన ప్రశ్నకు 'పెళ్లి చేసుకోమంటూ ఇంట్లో ఒకే ఒత్తిడి ఉండేది. ఇప్పుడు అమ్మాయి అయితే చాలు అనే స్టేజ్‌కు వచ్చేసింది. పెళ్లి విషయం వచ్చిన ప్రతిసారి ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ వంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారని చెబుతుంటాను.' అని చెప్పాడు శేష్. తర్వాత 'మరి ఆయనకు లవ్ ఎఫైర్స్ ఉన్నాయి అలా ఉన్నాయా' అని అడిగిన ప్రశ్నకు 'ఆయనలా నాకు మాత్రం ఎవరితో ఎఫైర్స్ లేవు. అమెరికాలో ఉన్నప్పుడు ప్రేమలో కాస్త దెబ్బతిన్నా. నా పుట్టినరోజు నాడే ఆమెకు పెళ్లి అయింది.' అంటూ తదితర ఆసక్తికర విషయాలను అడవి శేష్ పంచుకున్నాడు. చదవండి: డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. ఇంకా ఆ ఇంటర్వ్యూలో 'మా తెలుగు వాడు హిందీకి వెళ్లి సాధించాడని అంతా అంటుంటే చాలా గర్వంగా ఉంది. ఓవర్‌నైట్ సక్సెస్ రావడానికి పదేళ్లు పట్టింది. చిరంజీవి, మహేశ్‌బాబుకు అభిమానులు ఎలా ఉంటారో నేను మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్‌కు అభిమానిని. అక్కడ చెడుల ఉంది అంటే.. ఆ పరిసరాల్లో నేను కనిపించను. నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. నాకు ఏదైనా నచ్చిందంటే దానిని ఎక్కువగా చేసేందుకు ఇష్టపడతాను. తగిలించుకుంటే వదిలించుకోవడం కష్టం' అంటూ పేర్కొన్నాడు అడవి శేష్. చదవండి: బిజినెస్‌మేన్ కిడ్నాపర్‌గా మారితే.. ఆ వీధుల్లో ఫ్యామిలీతో మహేశ్ బాబు సెల్ఫీ.. 'రోజులో ఒకసారి' అంటూ పోస్ట్ -
నేను సింగిల్, కాదు మింగిల్.. ఏం చెప్పాలో తెలియట్లేదు: అనుపమ పరమేశ్వరన్
Anupama Parameswaran Reveals Her Love Life In Latest Interview: ‘ప్రేమమ్’ మూవీతో సినీ పరిశ్రమకు పరిచయమైంది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. చేసింది కొన్ని సినిమాలే అయినా అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. సినిమాల్లో డిసెంట్ రోల్స్ ఎంచుకుంటూ అందం, అభినయంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. ఎక్కువ సమయంలో సోషల్ మీడియాలో గడిపే అనుపమ తరచూ తన ఫొటోలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు చేరువుగా ఉంటోంది. ఈ క్రమంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇటీవల రౌడీబాయ్స్ మూవీతో సందడి చేసిన అనుపమ ప్రస్తుతం కార్తికేయ 2, 18 పేజీస్, బటర్ ఫ్లై సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఈ క్యూట్గుమ్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నాకు లవ్ మ్యారేజ్‌పై మంచి అభిప్రాయమే ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కపుల్స్‌ను చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. నాకు కూడా ప్రేమ వివాహమే చేసుకోవాలని ఉంది. మా పేరేంట్స్‌కు కూడా ఈ విషయం తెలుసు. నేను పెళ్లంటు చేసుకుంటే కచ్చితంగా లవ్ మ్యారెజే చేసుకుంటా. నేను సింగిల్.. కాదు మింగిల్.. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే నా రిలేషన్షిప్ స్టేటస్ నాకు కూడా సరిగ్గా తెలియట్లేదు. నేనైతే ప్రేమలో ఉన్నా.. మరి అవతలి సైడ్ నుంచి ఏమనుకుంటున్నారో తెలియదు. ప్రస్తుతం వన్ సైడ్ లవ్ అని చెప్పగలను.' అంటూ తెలిపింది అనుపమ పరమేశ్వరన్. చదవండి: లిప్ లాక్ సీన్లు.. అందుకే ఆ రేంజ్లో అనుపమ రెమ్యునరేషన్! -
విజయవాడలో భారీ సైబర్ మోసం
-
నేను ఇన్స్టాల్మెంట్స్లో ప్రేమించను: నటి
Radhika Madan Opens Up About Love: 'నాకు ఇన్స్టాల్మెంట్స్లో ప్రేమించడం నచ్చదు. అందుకే లవ్ విషయంలో చాలా సీరియస్‌గా ఉంటా. అయితే జీరో పర్సెంట్ లేదంటే 100%' అంటూ లవ్ విషయంలో తన వైఖరిని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పింది నటి రాధిక మదన్. ఇటీవలె ఆమె నటించిన 'శిద్ధత్' సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రమోషన్స్‌లో పాల్గొన్న రాధిక ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇక 'మేరీ ఆషీకి తుమ్ సే హై' అనే టెలివిజన్ షోతో కెరీర్ ప్రారంభం చేసిన రాధిక 'పటాకా' సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆంగ్రేజీ మీడియం సినిమాతో పాటు రే వెబ్‌సిరీస్‌లో రాధిక నటనకు గాను విమర్శల ప్రశంసలు పొందింది. తాను పోషించే ప్రతి పాత్రను సవాల్‌గా స్వీకరిస్తానని, 200శాతం బెస్ట్‌గా ఇచ్చేందుకు ట్రై చేస్తానని తెలిపింది. కాగా ఈమె నటించి శిద్ధత్ సినిమా అక్టోబర్ 1నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
ఆ పట్టింపు లేదు
జీవితం ఎవర్నీ వదిలి పెట్టదు. ఓ ఆట ఆడుకుంటుంది. ఆటలో గెలుపోటములు సహజం. మీరు జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలను ఎలా అధిగమిస్తారు? అన్న ప్రశ్నను హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ ముందు ఉంచితే – ‘‘మనం ఏ పని చేసినా ఓ రిజల్ట్ ఉంటుంది. అది విజయమే కానక్కర్లేదు. అంతమాత్రాన బెంగ పెట్టుకుని సమయాన్ని వృథా చేయడం సరికాదు. నేను నటించిన సినిమాలన్నీ సక్సెస్ అవుతాయని చెప్పలేను. అది నా చేతిలో లేదు. నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, కథలోని నా పాత్రలకు పూర్తి న్యాయం చేసేలా కృషి చేయడమే నా పని. జయాపజయాలు ముఖ్యం కాదు. మన ప్రయాణంలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ తప్పులు దిద్దుకుంటూ ముందుకు వెళ్లడమే జీవితం. యాక్టర్ కావాలని చాలామంది కలలు కంటుంటారు. ఆ అదృష్టం నాకు దక్కినందుకు ఆనందంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు. మరి లవ్ లైఫ్ సంగతేంటి? అని అడిగినప్పుడు – ‘‘ప్రస్తుతానికి సింగిలే. నా మనసుకు నచ్చిన వ్యక్తితో మింగిల్ అవడానికి సిద్ధమే. అతను వయసులో పెద్దవాడా? చిన్నవాడా? అనే పట్టింపు నాకు లేదు’’ అని రకుల్ పేర్కొన్నారు. ఇటు సౌత్ అటు నార్త్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారీ బ్యూటీ. -
ప్రేమ విషయంలో చాలా తప్పులు చేశా
లాస్ ఏంజిల్స్: తన వ్యక్తిగత జీవితంలో చాలా తప్పులు చేశానని అమెరికా గాయని, నటి జెన్నిఫర్ లోపెజ్ పాశ్చాత్తాపం వ్యక్తం చేశారు. మూడు పెళ్లిళ్లు విచ్ఛిన్నం కావడం, ఓ నిశ్చితార్థం పెళ్లి పీటల వరకు వెళ్లకనే వీగిపోవడం, ఈ మధ్య ప్రియుడు కాస్పెర్ స్మార్ట్ దూరం కావడంతో జెన్నిఫర్‌ను బాధించాయి. ప్రేమ విషయంలో తాను చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని చెప్పారు. ఇలాంటి సంఘటనలు మళ్ల జరగకుండా ప్రయత్నిస్తున్నాని అన్నారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన 45 ఏళ్ల జెన్నిఫర్ ఓ ఇంటర్య్వూలో వ్యక్తిగత జీవితం, ప్రేమ, పెళ్లిళ్ల గురించి మాట్లాడారు. 'నేను చాలా తప్పులు చేశానని అందరికీ తెలుసు. ప్రతీసారి పొరపాటు చేశా. చాలా బాధపడ్డా. ఇలాంటి తప్పులు మళ్లీ చేయరాదు. నా పిల్లలు తండ్రి లేకపోవడం లోటుగా భావిస్తున్నారని తెలుసు. వారిని కంటికిరెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది' అని జెన్నీఫర్ అన్నారు. -
టీవీ సీరియల్స్ తో వైవాహిక జీవితం నాశనం!
న్యూయార్క్: ఆనందంగా సాగుతున్న మీ వైవాహిక జీవితంలో లేనిపోని వివాదాలు సతమతం చేస్తున్నాయా? ఒకవేళ అలాంటి పరిస్థితులతో తరుచు చోటు చేసుకుంటూ ఉంటే దానిపై ఎప్పుడైనా దృష్టి పెట్టారా?అలా కాకుండా భార్యా భర్తలు ఎవరు వాదన వారిదే అన్నట్లుగానే ఎడమొహం-పెడమొహంగా ఉంటున్నారా? వైవాహిక జీవితంలో ఘర్షణలు చోటు చేసుకునే పరిస్థితులపై ఒకసారి ఆలోచించమంటున్నారు పరిశోధకులు. దీనికి అసలు కారణం టీవీ సీరియల్సేనట. మీ జీవితంలో ప్రేమపూర్వక వాతావరణాన్ని చెడగొట్టడానికి టీవీ సీరియల్స్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. మీ జీవితభాగస్వామి ప్రతీరోజూ సాయంత్రం క్రమం తప్పకుండా సీరియల్స్ ను చూస్తే మాత్రం అది ఖచ్చితంగా వారి వైవాహిక జీవితంపై చూపుతుందని మిచిగాన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తేలింది. భార్యా భర్తల మధ్య విద్వేషాలు లేకుండా ఉండాలంటే సీరియల్స్ కు దూరంగా ఉండమంటున్నారు. దైనందిన జీవితంలో టీవీ అనేది కీలకపాత్ర పోషిస్తున్నా.. మీ భాగస్వామి అదే పనిగా సీరియల్స్ చూస్తూ ఉంటే మాత్రం వైవాహిక జీవితాన్నినాశనం చేసే అవకాశం అధికంగా ఉంటుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. కాగా, రియాల్టీ షోలను చూస్తే మాత్రం జీవిత భాగస్వాముల మధ్య మంచి వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుందని వీరు అభిప్రాయపడుతున్నారు.


