టీవీ సీరియల్స్ తో వైవాహిక జీవితం నాశనం! | TV soaps may kill your love life, Study | Sakshi
Sakshi News home page

టీవీ సీరియల్స్ తో వైవాహిక జీవితం నాశనం!

Jul 7 2014 1:52 PM | Updated on Oct 17 2018 4:36 PM

టీవీ సీరియల్స్ తో వైవాహిక జీవితం నాశనం! - Sakshi

టీవీ సీరియల్స్ తో వైవాహిక జీవితం నాశనం!

ఆనందంగా సాగుతున్న మీ వైవాహిక జీవితంలో లేనిపోని వివాదాలు సతమతం చేస్తున్నాయా?

న్యూయార్క్: ఆనందంగా సాగుతున్న మీ వైవాహిక జీవితంలో లేనిపోని వివాదాలు సతమతం చేస్తున్నాయా? ఒకవేళ అలాంటి పరిస్థితులతో తరుచు చోటు చేసుకుంటూ ఉంటే దానిపై ఎప్పుడైనా దృష్టి పెట్టారా?అలా కాకుండా భార్యా భర్తలు ఎవరు వాదన వారిదే అన్నట్లుగానే ఎడమొహం-పెడమొహంగా ఉంటున్నారా? వైవాహిక జీవితంలో ఘర్షణలు చోటు చేసుకునే పరిస్థితులపై ఒకసారి ఆలోచించమంటున్నారు పరిశోధకులు. దీనికి అసలు కారణం టీవీ సీరియల్సేనట.

మీ జీవితంలో ప్రేమపూర్వక వాతావరణాన్ని చెడగొట్టడానికి టీవీ సీరియల్స్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. మీ జీవితభాగస్వామి ప్రతీరోజూ సాయంత్రం క్రమం తప్పకుండా సీరియల్స్ ను చూస్తే మాత్రం అది ఖచ్చితంగా వారి వైవాహిక జీవితంపై చూపుతుందని మిచిగాన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తేలింది. భార్యా భర్తల మధ్య విద్వేషాలు లేకుండా ఉండాలంటే సీరియల్స్ కు దూరంగా ఉండమంటున్నారు. దైనందిన జీవితంలో టీవీ అనేది కీలకపాత్ర పోషిస్తున్నా.. మీ భాగస్వామి అదే పనిగా సీరియల్స్ చూస్తూ ఉంటే మాత్రం వైవాహిక జీవితాన్నినాశనం చేసే అవకాశం అధికంగా ఉంటుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. కాగా, రియాల్టీ షోలను చూస్తే మాత్రం జీవిత భాగస్వాముల మధ్య మంచి వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుందని వీరు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement