breaking news
Lock Death
-
బాబూ.. చరిత్రలో ఇది చీకటి అధ్యాయం!
ఎంతటి పెద్ద కేసు అయినా దానిని మేనేజ్ చేయడం ఒక ఆర్ట్. అలాగే ఎంత చిన్న కేసు అయినా దానిని పెద్దదిగా చూపించడం కూడా ఓ కళే. ఇది అందరివల్ల సాధ్యం అయ్యే పని కాదు. కాని ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ విషయంలో ఉన్న నేర్పరితనం బహుశా దేశంలోనే ఇంకెవ్వరికి ఉండదేమో! దీనిని ప్రశంసగా అయినా తీసుకోవచ్చు. లేదా విమర్శగా అయినా భావించవచ్చు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడల్లా పలు ఎన్ కౌంటర్ ఘటనలు జరిగాయి. వాటిపై పెద్ద వివాదాలు చెలరేగాయి. అయినా వాటిలో తన ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చేసుకోగలిగిన తెలివి ఆయనది అని చెప్పాలి. అత్యంత సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అనే యువకుడి లాకప్ డెత్ కేసును చంద్రబాబు ఎలా హాండిల్ చేశారో చూడండి. సాయి కృష్ణ తల్లికాని, ఇతర కుటుంబ సభ్యులు కాని తొలుత మాట్లాడినదానికి, చంద్రబాబును కలిసిన తర్వాత చెప్పిన విషయాలకు ఎంత తేడా ఉందో గమనించి అంతా ఆశ్చర్యపోవలసి వచ్చింది.ఆ కుటుంబ సభ్యులకు ఏమి న్యాయం జరిగిందో ఎవరికి తెలియదు కాని,వారు చంద్రబాబు,పవన్ కళ్యాణ్‌లతో పాటు లోకేష్‌కు కూడా ధన్యవాదాలు తెలిపిన వైనం ఆసక్తికరంగా మారింది. వారికి నిజంగా ఏదైనా న్యాయం జరిగి ఉంటే అది ఏరకంగా జరిగిందో చెప్పి ఉండేవారు. బహిర్గతం చేయలేదంటే భయపడ్డారేమో అన్న సందేహం వస్తుంది. లేదా వారికి ఏమైనా ఇతరత్రా సాయం అందించడానికి అవగాహన కుదిరిందేమో అన్న సంశయం కలుగుతుంది. మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు దీనిపై వ్యాఖ్యానిస్తూ సాయికృష్ణ కుటుంబాన్ని మాయ చేసి ఉండవచ్చని, అయినా తాము ఈ కేసుపై పోరాటం ఆపబోమని అన్నారు. జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ మరింత గట్టిగా మాట్లాడుతూ సాయికృష్ణ కుటుంబం రాజీ పడినా, తాము వెనక్కి తగ్గబోమని, ఈ హత్య ఏపీ సమాజంపై జరిగిన దాడిగా తాము పరిగణించి ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తామని తెలిపారు. అంతేకాక ఆ కేసులోఎవరెవరి ప్రమేయం ఉండే అవకాశం ఉందో తెలుపుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ఎల్లో మీడియా కాని ,టీడీపీ పక్షాన ప్రచారం చేసే డిజిటల్ మీడియా కాని, తొలుత సాయికృష్ణపైన, ఆయన కుటుంబాన్ని పరామర్శించిన జగన్,వైఎస్సార్సీపీ నేతలపై అడ్డగోలుగా ప్రచారం చేశాయి.ఆ కుటుంబాన్ని కలవడం ద్వారా జగన్ చాలా పెద్ద తప్పు చేశారని, రౌడీషీటర్ కుటుంబాన్ని కలుస్తారా అని టీడీపీ నేతలు దూషించారు. సాయి తల్లిని పరామర్శించి జగన్ ధైర్యం చెప్పాక, పరిస్థితి తీవ్రతను గమనించిన చంద్రబాబు వ్యూహాత్మకంగా ఆమెను,ఇతర కుటుంబ సభ్యులను తన వద్దకు పిలిపించుకుని మాట్లాడి వారికి న్యాయం చేస్తామని తెలిపారు. ఆ తర్వాత వీరి స్వరం మారింది. ఈ ఉదంతంతో ఎల్లో మీడియా పరువుపోయినట్లయింది. చంద్రబాబు భేటీ తర్వాత ఎల్లో మీడియా ఫ్లేట్ ఫిరాయించేసింది. చంద్రబాబు ఎందుకు ఇంత కంగారుపడి ఆ కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడారన్నదానిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ కేసు కేవలం సిఐ నాగరాజుకే పరిమితం కాదని,ఆ పైన ఉన్న అధికారులకు,ప్రభుత్వంలో కీలకమైన పదవులలో ఉన్నవారికి కూడా చుట్టుకునే అవకాశం ఉందన్న భావనతో చంద్రబాబు ఈ జాగ్రత్త తీసుకుని ఉండవచ్చు. సాయి కుటుంబం వారు జనసేన పార్టీవారని, కాపు సామాజిక వర్గంవారని వెల్లడైంది. ఇటీవలి కాలంలో పలు ఘటనలలో కాపు వర్గానికి చెందినవారు కూడా ఇబ్బంది పడుతుండడం ప్రభుత్వానికి తీవ్ర నష్టం చేస్తోంది. ఈ నేపధ్యంలో సాయికృష్ణ కుటుంబ సభ్యులను తన వైపునకు తిప్పుకుంటే మొత్తం కేసు బలహీనపడిపోవచ్చని అనుకుని ఉండవచ్చని అంటున్నారు.ఈ కేసు బహిర్గతం అయిన తర్వాత,ఏపీలో పలు ఇతర పోలీస్ స్టేషన్ లలో ఇలాంటి లాకప్ హింసలు, పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు మరిన్ని వెలుగులోకి రావడం కూడా ఆందోళన కలిగించి ఉండవచ్చు.కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే హింసను తాళలేక ఒక దళిత యువకుడు క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్న కేసు కూడా ప్రజలలోకి వెళ్లింది. వైఎస్సార్సీపీ నేతలు అతని కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి తీవ్రమైన విమర్శలు చేశారు. తెనాలి, కౌతాళం, విజయనగరం తదితర చోట్ల కూడా మరికొన్ని వేధింపుల కేసులు మీడియాలో రిపోర్టు అయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక లోకేష్ రెడ్ బుక్ పేరుతో జరిగినన్ని అరాచకాలు ఇన్నీ అన్నీ కావు. ప్రభుత్వం అరాచకాలు నిర్వహించడానికి ఒక శాఖను ఏర్పాటు చేసిందా అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. సుమారు ఏభై రోజులపాటు సాయికృష్ణ కేసును ప్రభుత్వం పట్టించుకోలేదు. పోలీసు అధికారుల చుట్టూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఎన్ని రోజులు తిరిగినా ఫలితం దక్కలేదు. చివరికి వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ కేసులో అనేక విషయాలను వెలుగులోకి తీసుకురావడంతో కలకలం ఏర్పడింది.ఆ తర్వాత విజయలక్ష్మి తన బిడ్డ బూడిదైనా ఇవ్వండి అని వాపోయిన కధనం సాక్షి మీడియాలో వచ్చినప్పుడు హృదయమున్న ప్రతి వ్యక్తికి ఆవేదన కలిగించింది. హింసించి హతమార్చడమే కాకుండా, ఆ యువకుడిని కాల్చి బూడిద చేయడమేమిటని అందరూ మాట్లాడుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి ,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రాజకీయాలకు అతీతంగా, కులాలతో సంబంధం లేకుండా సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించి,ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం, ఆ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించడంతో ఒక్కసారిగా చంద్రబాబు ప్రభుత్వం ఉలిక్కిపడింది.తదుపరి అర్ధరాత్రి వేళ కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన కృష్ణలంక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ నాగరాజును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరో వైపు విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన ఇన్ చార్జీ అమ్మిశెట్టి వాసు ఈ బాధిత కుటుంబంతో రాయబేరాలు చేసి డబ్బు ఆఫర్ చేశారన్న ఆరోపణ వచ్చింది. ఈ కేసులో ప్రభుత్వం వైపు నుంచి తప్పు జరిగిందన్న అనుమానం బలపడింది. ఈ సంగతిని సాయి మేనమామే తెలిపారు.జనసేన నేతలకు ఈ ఘోరం గురించి చెప్పినా పట్టించుకోలేదని,అందువల్లే తాము అంబటి రాంబాబుకు వివరాలు అంందిచామని ఆయన చెప్పారు. వరంగల్ లో ఒక బాలుడి పలకరించడానికి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో ఈ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లకపోవడం కూడా విమర్శలకు దారి తీసింది. చంద్రబాబు ఒక సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ ,డిజిపిలతో దీని గురించి చర్చించారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సర్కిల్ ఇన్ స్పెక్టర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఒక ఎసీపీ స్థాయి అధికారిని దర్యాప్తునకు తొలుత నియమించినా,ఆ తర్వాత ఐపిఎస్ లతో కూడిన ఒక సిట్ ను ఏర్పాటు చేశారు.అయినా కేసులో న్యాయం జరుగుతుందా?లేదా?అన్న సందేహాలపై చర్చలు జరుగుతున్నాయి. సీబీఐ విచారణకు విపక్షం డిమాండ్ చేస్తోంది. కేవలం ఒక్క సిఐ మాత్రమే ఇలాంటి ఘోరం చేయలేరని, ఉన్నతాధికారుల ప్రమేయం కూడా కచ్చితంగా ఉందని జడ శ్రావణ్ ఆరోపించారు.ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వంలోని పెద్దలకు కూడా ముందే తెలుసని,వాటిని బయటపెడతానని ఆయన అన్నారు..సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడ సీపీ ఆధ్వర్యంలో ఉండే టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకు రావడం,కృష్ణ లంక పోలీస్ స్టేషన్ లోను, తదుపరి ఒక ప్రైవేటు హోటల్ లోను పెట్టి తీవ్రంగా హింసించడం, గాయపడ్డ అతనిని ఆస్పత్రికి తీసుకువెళ్లడం, ప్రాణం కోల్పోయిన సాయికృష్ణు బస్టాండ్ లో అనాధ శవంగా చూపే ప్రయత్నం చేసి, ఆ తర్వాత స్మశానవాటికలో దహనం చేయడం వంటి ఘట్టాలను జడ శ్రవణ్ పూసగుచ్చినట్లు వివరించారు.కాగా తన కుమారుడిని పోలీసులు పొట్టన పెట్టుకున్నారని ఆరోపించి పలు ప్రశ్నలు వేసిన సాయికృష్ణ తల్లి,ఆమె సోదరులు శుక్రవారం నాడు చంద్రబాబును కలిసిన తర్వాత తమకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని అంటూ,ఆయన వంటి మహోన్నత వ్యక్తి,పవన్ కళ్యాణ్, లోకేష్ వంటి నాయకులు తమకు న్యాయం చేసి చూపించి ప్రభుత్వ పాలన సరిగ్గా ఉందని చాటారని మేనమామ నవరంగ్ అనడం పలు సందేహాలకు తావిచ్చింది. ప్రభుత్వం అంత గొప్పగా పని చేసి ఉంటే, ఒకరోజు ముందు ఇదే నవరంగ్ తమను ఎవరూ పట్టించుకోలేదని ఎందుకు విమర్శించారో తెలియదు. ఈ కేసులో వారికి ఎలాంటి న్యాయం జరిగిందో క్లారిటీగా సాయి కుటుంబ సభ్యులు చెప్పలేదు. ప్రభుత్వమూ వివరణ ఇవ్వలేదు. చంద్రబాబు పద్దెనిమిదేళ్ల పాలనకాలంలో ఇలాంటివి పలు ఘటనలు జరిగాయి.నక్సైలైట్ల ఉద్యమ ప్రభావం అధికంగా ఉన్న రోజులలో కొన్ని ఎన్ కౌంటర్లు జరిగాయి. గత టరమ్ లో తిరుమలలో తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలు ఇరవై మంది ఎదురుకాల్పులలో మరణించారు. పుష్కరాలలో తొక్కిసలాట లో 29 మంది మరణించిన విషయంలో సిసిటీవీ ఫుటేజీ మిస్ అవడం మిస్టరీ అని అప్పట్లో విపక్షాలు విమర్శించేవి. ఇలాంటి ఘటనలలో ఎన్ని ఆరోపణలు వచ్చినా తన ప్రభుత్వానికి,తన పదవికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆయన జాగ్రత్తపడగలిగారు. గతంలో కోడెల శివప్రసాద్ ఆస్పత్రిలో బాంబులు పేలి నలుగురు మరణించినప్పుడు సీబీఐ విచారణ జరగకుండా చూసుకోగలిగారు. చింతమనేని ప్రభాకర్ తో సహా పలువురు టీడీపీ,జనసేన ఎమ్మెల్యేలపై అనేక ఆరోపణలు వచ్చినా పోలీసులు నిశ్చేష్టులై ఉంటున్నారన్న విమర్శ ఉంది. బలహీనవర్గాలవారిపైన ప్రత్యర్ది పార్టీవారిపైన మాత్రం పోలీసులు రెచ్చిపోతున్నారు.ఈ టరమ్ లో ఎన్ని వందలమందిని రెడ్ బుక్ పేరుతో వేధించారో లెక్కలేదు.తెనాలిలో ముగ్గురు యువకులను నడిరోడ్డులో కూర్చోబెట్టి అరికాళ్లపై దారుణంగా పోలీసులు కొట్టడం మొదలు , పలు కేసుల్లో తీవ్రంగా హింసించడం, చిన్న,చిన్న కేసులలో సైతం వైఎస్సార్సీపీవారైతే నడిరోడ్డుపై నడిపించి అవమానించడం, అదే టీడీపీ వారు ఎన్ని దౌర్జన్యాలు చేసినా నామమాత్రంగా కేసు పెట్టడం వంటివి చేస్తున్నారు. అంబటి రాంబాబు,జోగి రమేష్ ,నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వంటి మాజీ మంత్రుల ఇళ్లపై గంటల తరబడి టీడీపీ క్యాడర్ దాడి చేస్తే మాత్రం పోలీసులు చూసిచూడనట్లు వ్యవహరించారు.దీనితో ఏపీలో పోలీసు రాజ్యం ప్రజలను ఎలా పీడిస్తోందో వివరిస్తూ జగన్ దేశం అంతటికి తెలియచేసే యత్నం చేశారు. చంద్రబాబు ఎంత మేనేజ్ మెంట్ నేర్పరి అయినా ,ఎన్ని కేసుల్లో ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చినా,ఈ సాంకేతిక యుగంలో అన్నీ తెలిసిపోతున్నాయి.చరిత్రలో ఇదో చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందన్న సంగతి ఆయన ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సాయం సమయం
విపత్కర పరిస్థితుల్లో ‘మేం ఉన్నాం’ అంటూ సినిమా పరిశ్రమ సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుకొస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే షూటింగ్స్ అన్నీ రద్దు కావడంతో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీపై ఆధారపడి జీవనం సాగించే చిన్నస్థాయి కళాకారుల జీవనశైలి కుంటుపడింది. దీంతో అటు కరోనా వైరస్‌పై పోరాడేందుకు కొందరు, చిన్నస్థాయి కళాకారులకు అండగా ఉండేందుకు మరికొందరు సినిమా తారలు ఇప్పటికే విరాళాలు ప్రకటించారు. గురువారం మరికొంతమంది తమ వంతు సాయంగా విరాళాలను ప్రకటించారు. ఈ వివరాలు. ► చిరంజీవి – కోటి రూపాయలు (కరోనా కారణంగా ఉపాధి కాల్పోయిన సినీ వేతన కార్మికుల సంక్షేమం కోసం). ► మహేశ్‌బాబు – కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్‌కు 50 లక్షలు, తెలంగాణకు 50 లక్షలు.) ► ప్రభాస్ – కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్‌కు 50లక్షలు, తెలంగాణకు 50 లక్షలు.) ► పవన్‌కల్యాణ్ – 2 కోట్లు (ప్రధానమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల సహాయనిధికి కోటి రూపాయలు.) ► ఎన్టీఆర్ – 75 లక్షలు (ఆంధ్రప్రదేశ్‌కు 25 లక్షలు, తెలంగాణకు 25 లక్షలు, తెలుగు సినీ కార్మికులకు 25 లక్షలు.) ► రామ్‌చరణ్ – 70 లక్షలు (కేంద్ర, తెలుగురాష్ట్ర ప్రభుత్వాల సహాయనిధికి) ► ‘నాంది’ (ప్రస్తుతం ‘అల్లరి’ నరేష్ హీరోగా నటిస్తున్న చిత్రం) యూనిట్లో రోజువారి వేతనంతో జీవనం సాగించే 50మందికి పైగా ఉన్న కార్మికులకు చిత్రనిర్మాత సతీష్ వేగేశ్నతో కలిసి ప్రతి ఒక్కరికి తలా 10వేల రూపాయలను సాయంగా అందించాలని ‘అల్లరి’ నరేశ్ నిర్ణయించుకున్నారు. ► సాయితేజ్ – 10 లక్షలు (ఆంధ్రప్రదేశ్‌కు 5 లక్షలు, తెలంగాణకు 5 లక్షలు.) ► నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్ – 20 లక్షలు (ఆంధ్రప్రదేశ్‌కు 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు.) ► త్రివిక్రమ్ – 20 లక్షలు (ఆంధ్రప్రదేశ్‌కు 10లక్షలు, తెలంగాణకు 10 లక్షలు.) ► అనిల్ రావిపూడి – 10 లక్షలు ( ఆంధ్రప్రదేశ్‌కు 5లక్షలు, తెలంగాణకు 5లక్షలు) ► కొరటాల శివ – 10 లక్షలు ( ఆంధ్రప్రదేశ్‌కు 5 లక్షలు, తెలంగాణకు 5 లక్షలు.) -
లాకప్ డెత్!
సాక్షి, చెన్నై: విచారణ పేరిట పోలీసు స్టేషన్లో ఓ యువకుడిని సబ్ ఇన్స్పెక్టర్ కాల్చి చంపేశాడు. చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు కత్తితో పొడుచుకుని హైడ్రామా సాగించి, చివరకు సస్పెండ్‌కు గురయ్యాడు. రామనాథపురం జిల్లా ఎస్పీ పట్నంలో చోటు చేసుకున్న ఈ ఘటన మైనారిటీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలను రగిల్చింది. ఇటీవల విచారణ పేరిట అమాయకుల్ని వేధించే పోలీసుల సంఖ్య రాష్ట్రంలో పెరుగుతోంది. ఇటీవల ఓ మహిళను వేధించినందుకుగాను పోలీసు యంత్రాంగం కోర్టు చుట్టూ తిరుగుతోంది. ఈ వేధింపుల ఫిర్యాదులతో పలువురిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెకానిక్ షాపు లో చోటు చేసుకున్న వాగ్యుద్ధం చివరకు ఓ యువకుడ్ని బలిగొనేలా చేసింది. చిన్న వివాదాన్ని బూతద్దంలో పెట్టే యత్నం చేసిన పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ చివరకు ఆ యువకుడిని తన తూటాలకు బలి చేశాడు. తాను హత్య కేసులో ఇరుకున్నారు. వివాదం : రామనాథపురం జిల్లా తిరువాడనై సమీపంలోని ఎస్పీ పట్నంకు చెందిన సయ్యద్ మహ్మద్(22) తన మోటార్ సైకిల్‌ను సర్వీసింగ్ నిమిత్తం అదే ప్రాంతంలోని మెకానిక్ అరుల్ దాసుకు ఇచ్చాడు. మోటార్ సైకిల్‌ను సర్వీసింగ్ అనంతరం తీసుకెళ్లేందుకు వచ్చిన క్రమంలో సయ్యద్ మహ్మద్‌కు అరుల్ దాసుకు మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. అక్కడున్న వాళ్లు దీన్ని గుర్తించి ఇద్దరికీ నచ్చ చెప్పి పంపించేశారు. అయితే, తనను కత్తితో సయ్యద్ బెదిరించాడంటూ అరుల్ దాసు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సబ్ ఇన్స్పెక్టర్ కాళిదాసు బృందం విచారణ పేరుతో మంగళవారం రాత్రి సయ్యద్‌ను బలవంతంగా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఏమి జరిగిందో ఏమోగానీ , కొన్ని గంటల వ్యవధిలో సయ్యద్ శవమయ్యారు. పోలీసు స్టేషన్లో మూడు రౌండ్లు కాల్పుల శబ్దం రావడంతో ఇన్స్పెక్టర్ ఆగ్రహానికి సయ్యద్ బలయ్యాడన్న ప్రచారం వేగం పుంజుకుంది. అదే సమయంలో సయ్యద్ తనను కత్తితో పొడిచాడని, అందుకే తాను ఆత్మరక్షణ నిమిత్తం కాల్పులు జరిపినట్టు కొత్త హైడ్రామాను కాళిదాసు రచించడం ఆ పరిసరాల్లో కలకలాన్ని రేపింది. రంగంలోకి విచారణ బృందం : ఎస్పీ పట్నం పోలీసు స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో జిల్లా ఎస్పీ మయిల్ వాహనం, ఏఎస్పీ నల్ల దురై, డీఎస్పీ శేఖర్లు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే యత్నం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. జిల్లా న్యాయమూర్తి నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగి ఈ ఘటనపై విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ఎస్ఐపై చర్యలు తీసుకుంటామని బాధితులకు ఎస్పీ హామీ ఇవ్వడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. మైనారిటీల్లో ఆగ్రహ జ్వాల: ఈ ఘటన బుధవారం ఉదయాన్నే మైనారిటీ సంఘాల్లో ఆగ్రహ జ్వాలను రగిల్చింది. పోలీసుల తీరును నిరసిస్తూ జిల్లాలో పలు చోట్ల ఆందోళనలు రాజుకున్నాయి. మనిద నేయ మక్కల్ కట్చి నేత, ఎమ్మెల్యే జవహరుల్లా నేతృత్వంలో ఆ పార్టీ వర్గాలు పోలీసుల చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఆందోళనలకు దిగారుు. నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న సయ్యద్‌ను కాల్చి చంపడంతో అతడి తల్లి, సోదరి, సోదరుడు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తించారు. అతడి తల్లి అంధురాలు కావడంతో తీవ్ర మనోవేదనలో పడ్డ మైనారిటీ సంఘాలు తమ వంతు సహకారం అందించడంతో పాటుగా ప్రభుత్వం ద్వారా రూ.10 లక్షలు నష్ట పరిహారం ఇప్పించడమే లక్ష్యంగా ఆందోళనకు సిద్ధం అయ్యాయి. ఎస్ఐ సస్పెన్షన్: మదురైకు చెందిన ఎస్ఐ కాళిదాసు అందరితో దురుసుగా వ్యవహరించే వాడని విచారణలో తేలింది. అలాగే, మదురైలో పనిచేస్తున్న సమయంలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసి కేసులో ఇరుక్కున్నట్టు తేలింది. అక్కడి నుంచి ఇటీవలే బదిలీ మీదకు ఎస్పీ పట్నంకు వచ్చాడు. అతడి చరిత్రను తిరగేసిన అధికారులు, ప్రస్తుతం విచారణ పేరుతో సయ్యద్‌ను కాల్చి చంపి, కత్తితో పొడుచుకుని కాళిదాసు హైడ్రామా సాగించి ఉంటాడన్న భావనలో పడ్డారు. ఈ నేపథ్యంలో కాళి దాసును సస్పెండ్ చేస్తూ ఎస్పీ మయిల్ వాహనం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనపై హత్యా నేరం కేసు నమోదుకు మైనారిటీ సంఘాలు పట్టుబడుతుండడంతో, సమగ్ర విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. -
మడకశిరలో లాకప్ మరణం
మడకశిర: అనంతపురం జిల్లా మడకశిర పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం లాకప్ డెత్ జరిగింది. మడకశిర మండలం కల్లుమర్రి గ్రామానికి చెందిన బషీర్ (35) లాకప్‌లో మరణించాడు. విషయం తెలియగానే మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. స్థానిక ఎస్ఐ సద్గురుడు, మరో నలుగురు కానిస్టేబుళ్లు కలిసి బషీర్‌ను కొట్టి చంపారని ఆరోపించారు. తీవ్రతను గమనించిన ఎస్ఐ, కానిస్టేబుళ్లు అక్కడి నుంచి ఉడాయించారు. గత నెల 12న మడకశిరలో 20 టన్నుల ఐరన్ రాడ్ల అపహరణ కేసులో బషీర్‌ను సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు అర్ధరాత్రి బషర్ లాకప్‌లో ఉరి వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే.. బషీర్‌ను పోలీసులు గత శుక్రవారమే స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు కుటుంబ సభ్యుల కథనం. కాగా, అనంతపురం ఎస్పీ సెంథిల్‌కుమార్ మడకశిర ఎస్ఐ సద్గురుడుతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.


