breaking news
legal cell leaders
-
స్థానికానికి లీగల్ సెల్ పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు నామినేషన్ నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకు అన్ని దశల్లో న్యాయపరమైన అండ అందించేందుకు పార్టీ లీగల్ సెల్ పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర, జిల్లా ప్రతినిధులతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. గత రెండున్నరేళ్లుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులకు లీగల్ సెల్ గట్టిగా అండగా నిలిచిందని అభినందించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు, ఇతర పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకునేలా సహకరించాలని సూచించారు. నామినేషన్ల దాఖలు, స్క్రూటినీ, పోలింగ్ సందర్భంగా ఎదురయ్యే సమస్యలపై వెంటనే స్పందించే వ్యవస్థ ఉండాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అన్నింటిలోనూ విఫలమై సజావుగా స్ధానిక ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీని ఎదుర్కోలేమన్న కారణంతో పోలీసులను, అధికారులను ఉపయోగించి అక్రమ కేసులు, వేధింపుల ద్వారా భయభ్రాంతులకు గురిచేసినా ధీటుగా ఎదుర్కొనేందుకు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సన్నద్ధంగా ఉండాలని సూచించారు.ప్రతి జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని లీగల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన చోట న్యాయవాదులను అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్ర స్థాయిలో కూడా సెంట్రల్ ఆఫీస్‌లో లీగల్ వార్‌రూమ్ తరహా వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. లీగల్ సెల్ నాయకులు టీమ్ స్పిరిట్‌తో పనిచేయాలని, యువ న్యాయవాదులతో పాటు పార్టీ పట్ల సానుభూతి కలిగిన అనుభవజ్ఞులైన న్యాయవాదుల సేవలను కూడా వినియోగించుకోవాలని కోరారు.అభ్యర్థుల నామినేషన్లకు లీగల్ సెల్ రక్షణగా నిలవాలి: చెవిరెడ్డిమాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో పోటీ చేసేలా అవసరమైన న్యాయ సహకారం అందించాలని కోరారు. అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్ఓసీలు, పోలీస్ క్లియరెన్స్ తదితర పత్రాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లీగల్ సెల్ ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలన్నారు. నామినేషన్లను అడ్డుకునే ప్రయత్నాలు జరిగితే వెంటనే న్యాయపరంగా స్పందించాలని సూచించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు జిల్లా స్థాయి లీగల్ నాయకులు పూర్తి సమయం కేటాయించి పార్టీ అభ్యర్థులకు బ్యాక్‌బోన్‌గా నిలవాలని కోరారు. నియోజకవర్గ స్థాయి లీగల్ సెల్ అధ్యక్షులు పార్టీ ఇన్చార్జులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు.ముందస్తు కార్యాచరణ అవసరం: లేళ్ల అప్పిరెడ్డివైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో పార్టీ కార్యకర్తలకు లీగల్ సెల్ అందించిన సహకారాన్ని అభినందించారు. నామినేషన్లకు అవసరమైన అన్ని సర్టిఫికెట్లు ముందుగానే సిద్ధం చేయించడం, నామినేషన్లు సక్రమంగా దాఖలు చేయించడం, ఎన్నికల సమయంలో ఎదురయ్యే సమస్యలను రిటర్నింగ్ అధికారుల నుంచి రాష్ట్ర లీగల్ సెల్ వరకు వెంటనే తీసుకెళ్లేలా స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న నియోజకవర్గాలు, ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరిగేలా లీగల్ సెల్ ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని కోరారు.వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జితో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రతి మండలానికి ఒక న్యాయవాదిని కేటాయించి, నామినేషన్లకు ముందే అభ్యర్థులకు అవసరమైన నో డ్యూస్ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రాలు, కేసులకు సంబంధించిన వివరాలు, ఇతర పత్రాలను సిద్ధం చేయించాలని చెప్పారు. నామినేషన్ పత్రాల తయారీ, అఫిడవిట్లు, స్క్రూటినీ సమయంలో అభ్యర్థులకు న్యాయవాదులు ప్రత్యక్షంగా సహకరించాలని సూచించారు. నామినేషన్ తిరస్కరణ జరిగితే వెంటనే సంబంధిత అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించాలన్నారు.పోలింగ్ సమయంలో సమస్యాత్మక ప్రాంతాల్లో ముందుగానే అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదులు చేయాలని సూచించారు. పోలింగ్, కౌంటింగ్ పూర్తయ్యే వరకు లీగల్ సెల్ నాయకులు, న్యాయవాదులు అభ్యర్థులకు అందుబాటులో ఉండాలని కోరారు. జూమ్ కాన్ఫరెన్స్‌లో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న న్యాయవాదులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: డ్యూయల్ డ్రామా! -
తప్పుడు సాక్ష్యాలతో కేసులు.. బాబు పాలనంతా అన్యాయమే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నాం.. న్యాయం, ధర్మం ఎక్కడా కనిపించడం లేదన్నారు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి. తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలతో కేసులను నడిపిస్తున్నారని ఆరోపించారు. అక్రమ, తప్పుడు కేసుల్లో బాధితుల తరఫున న్యాయవాదులు నిలబడాలన్నారు. న్యాయవాదుల సేవలను పార్టీ ఎప్పుడూ మరిచిపోదు అంటూ హమీ ఇచ్చారు. పార్టీకోసం కష్టపడే వారికి తప్పకుండా వారికి ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధుల భేటీ జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్..‘రాష్ట్రంలో ఇవాళ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. న్యాయవాదులుగా మీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీకి అన్నిరకాలుగా తోడుగా, పెద్దన్నగా మీరు ఉంటున్నారు. అడకపోతే అమ్మైనా అన్నం పెట్టదు. కోరకపోతే దేవుడైనా వరం ఇవ్వడు. పిటిషన్ వేయకపోతే, మీరు వాదనలు వినిపించకపోతే న్యాయం కూడా దక్కదు. న్యాయవాదులుగా మీరు పోషిస్తున్న పాత్ర అభినందనీయం. చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నాం. న్యాయం, ధర్మం ఎక్కడా కనిపించడం లేదు. తమకు వ్యతిరేకులని తెలిస్తే చాలు జైళ్లలో వేస్తున్నారు. నీచమైన సంస్కృతిని మనం చూస్తున్నాం.బెదిరింపులతో తప్పుడు కేసులు.. ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే వారి పరువు, ప్రతిష్టలతో ఆడుకోవడం. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో నడిపిస్తున్నారు. ప్రలోభాలు పెట్టి, బెదిరించి తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా కేవలం తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రంలో మొదటిసారి ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం. బాధితుల తరఫున న్యాయవాదులు నిలబడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయవాదులుగా మీ బాధ్యతలు మరింత పెరిగాయి. ఈ సేవలను పార్టీ ఎప్పుడూ మరిచిపోదు. మన ప్రభుత్వం హయాంలో మనం అనేక రకాలుగా న్యాయవాదులకు తోడుగా నిలిచాం. లా నేస్తం పేరిట న్యాయవాదులకు అండగా ఉన్నాం. అట్టడుగు వర్గాలకు తోడుగా నిలిచాం.జీపీలు, ఏజీపీల్లో అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చాం. న్యాయవాదుల సంక్షేమ నిధికోసం రూ.100 కోట్లు కేటాయించాం. ఇన్సూరెన్స్ కోసం 1/3 వాటాగా మన ప్రభుత్వమే ఇచ్చింది. ఇన్ని రకాలుగా మనం న్యాయవాదులకు మేలు చేశాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మాదిరిగా న్యాయవాదులను కూడా మోసం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానివి అన్నీ అబద్ధాలు, మోసాలే. అన్ని రంగాల్లో తిరోగమనమే. లా అండ్ ఆర్డర్ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. పురోగతి, అభివృద్ధి అన్నవి కనిపించడం లేదు. అవినీతి విచ్చలవిడిగా ఉంది.పని చేసిన వారికి తప్పకుండా గుర్తింపు..జగన్ 2.Oలో మీ అందరికీ ప్రాధాన్యత ఉంటుంది. పార్టీకోసం కష్టపడే వారికి తప్పకుండా వారికి ప్రాధాన్యత ఉంటుంది. పార్టీకి పనిచేసే వారికి డేటాబేస్ పెడుతున్నాం. దీని ఆధారంగానే వీరికి గుర్తింపు ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకోసం ఎవరు పనిచేస్తారో, వారికి ప్రాధాన్యత ఉంటుంది. మరి కొద్ది రోజుల్లో యాప్ కూడా విడుదల చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ అన్యాయం జరిగినా.. ఆ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. తన దగ్గరున్న ఆధారాలను, సాక్ష్యాలను యాప్‌లో అప్లోడ్ చేయవచ్చు. ఆటోమేటిక్‌గా ఇవన్నీ డిజిటల్ లైబ్రరీలోకి వస్తాయి. అన్యాయాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టం ప్రకారం చర్యలు ఉంటాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పు చేయకపోయినా దెబ్బలు తింటున్న వ్యక్తికి ఎంత బాధ ఉంటుందో, అన్యాయంగా బాధ పెట్టించిన వ్యక్తికి కూడా అర్థం కావాలి.లిక్కర్లో భారీగా అవినీతి.. లిక్కర్లో అవినీతి విపరీతంగా ఉంది. ఎంఆర్పీ రేట్లకు మించి అమ్ముతున్నారు. ప్రతీ గ్రామంలోనూ వీధికి ఒక బెల్టుషాపు ఉంది. బెల్టుషాపులకూ వేలం వేస్తున్నారు. ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతున్నారు. అక్కడ కూడా ఎమ్మార్పీ రేట్లు కన్నా అధికంగా అమ్ముతున్నారు. ఉచిత ఇసుక పేరిట దోపిడీ చేస్తున్నారు. ఉచిత ఇసుక ఎవరికి చేరుతోంది?. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రావడం లేదు. కొంతమంది పోలీసులు దగ్గరుండి పేకాట క్లబ్బులు నడిపిస్తున్నారు.అమరావతిలో కమీషన్ దందా..అమరావతిలో అవినీతికి అంతులేకుండా పోతోంది. చదరపు అడుగుకు రూ.4వేలు పెడితే ఫైవ్ స్టార్ సదుపాయాలు వస్తాయి. అమరావతిలో చదరపు అడుగుకు రూ.10వేలు ఖర్చు చేస్తున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరిట దోపిడీ చేస్తున్నారు. 10 శాతం ఇచ్చి 8 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారు. మనం రూ. 2.49లకు పీపీఏ చేసుకుంటే, దానిపై విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు రూ.4.60 పైసలకు పీపీఏ చేసుకుంటున్నారు. అవినీతికి అంతులేకుండా పోయింది. నియోజకవర్గంలో మట్టి, గ్రావెల్, మైనింగ్, పరిశ్రమలు నడపాలన్నా.. కమీషన్లు ఇవ్వాల్సిందే. పోలీసులు దగ్గరుండి వీటికి సహకరిస్తున్నారు. కళ్ల ముందే కరప్షన్ కనిపిస్తోంది అని ఆరోపించారు. -
గుంటూరు జైల్లో పోసానిని కలిసిన వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేతలు
సాక్షి, గుంటూరు: గుంటూరు జైల్లో పోసాని కృష్ణమురళిని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేతలు శనివారం కలిశారు. రిమాండ్‌లో ఉన్న పోసానితో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, లీగల్ సెల్ ప్రతినిధులు ములాఖాత్ అయ్యారు. అనంతరం మీడియాతో మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, పోసాని అనారోగ్యంతో ఉన్నారని.. కూటమి ప్రభుత్వం పోసానిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు.‘‘2016లో నంది అవార్డుల కమిటీలో ఏకపక్షంగా ఉందని మాట్లాడినందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై 12 కేసులు పెట్టారు. మీడియాతో మాట్లాడితే కేసులు పెడతారా?. మరోసారి ప్రెస్ మీట్ పెడితే మరో 6 కేసులు పెట్టారు. ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించి రాష్ట్రవ్యాప్తంగా పీటీ వారెంట్ల పేరుతో తిప్పి హింసిస్తోంది. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పోసానిపై పెట్టిన నాలుగు కేసుల్లో 111 సెక్షన్లు పెట్టి బయటికి రానివ్వకుండా కుట్ర చేశారు.’’ అని మనోహర్‌రెడ్డి మండిపడ్డారు.‘‘కోర్టు పోలీసులకు చివాట్లు పెడుతున్న మారటం లేదు. రెడ్ బుక్కు టీడీపీకే కాదు. మాక్కూడా బుక్కులు ఉన్నాయి. మేము కూడా పేర్లు నమోదు చేసుకుంటున్నాం. ఇప్పటివరకు నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా కేసులు పెడుతున్న 62 మందిని గుర్తించాం. చంద్రబాబు జైలుకెళ్లినప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగాలేదని పిటిషన్ల మీద పిటిషన్ల వేశారు. అమ్మో ఇంకేముంది అని హడావుడి చేశారు. అందరివి చంద్రబాబు లాంటి ప్రాణాలే. పోలీసులు ఆర్గనైజర్ క్రైమ్ చేస్తున్నారు. కేసులు పెట్టి పోలీసులు వాటి సమాచారాన్ని దాచేస్తున్నారు. ఒక కేసులో బెయిల్ రాగానే మరొక కేసుని బయటికి తీస్తున్నారు’’ అంటూ మనోహర్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
పోలీసుల తీరు బాధాకరం
అనంతపురం సెంట్రల్ : కనగానపల్లి మండలం బద్దలాపురంలో ఈనెల 2న జరిగిన ఘర్షణ æవిషయంలో అదుపులోకి తీసుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్త నల్లపరెడ్డిని నేటికీ అజ్ఞాతంలో ఉంచడం బాధాకరమని వైఎస్సార్సీపీ లీగల్‌సెల్ కన్వీనర్ నారాయణరెడ్డి, రాప్తాడు జెడ్పీటీసీ, అడ్వొకేట్ వెన్నపూస రవీంద్రారెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా ఎస్పీ రాజశేఖరబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఈనెల 2న దివంగత సీఎం వైఎస్ వర్ధంతి సందర్భంగా బద్దలాపురంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేయడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేశారన్నారు. ఈ ఘటనపై ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. అదే రోజు వైఎస్సార్సీపీ కార్యకర్త నల్లపరెడ్డి, మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. ఇంత వరకూ వారిని అరెస్ట్ చూపించడం కానీ ఇళ్లకు పంపడం గానీ చేయలేదన్నారు. చట్ట ప్రకారం కస్డడీలోకి తీసుకున్న 24 గంటల్లోపే అరెస్ట్ చూపించాలన్నారు. కేవలం మంత్రి పరిటాల సునీత ఒత్తిడి మేరకే వైఎస్సార్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా కారయదర్శి విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు.


