breaking news
labor exploitation
-
ఆప్కాస్ ఉద్యోగాలకు మంగళం!?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల శ్రమ దోపిడీకి మళ్లీ రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్డ్ సర్వీసెస్ (ఆప్కాస్) కింద సకాలంలో జీతాలు, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలు పొందుతున్న ఉద్యోగులు టీడీపీ కూటమి ప్రభుత్వ తాజా నిర్ణయంతో 2014 నాటి ఏజెన్సీ అవుట్ సోర్సింగ్ విధానంలోకి వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రణాళిక సిద్ధమైంది. దీంతో.. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఒప్పంద ప్రాతిపదికన నియమించే ఉద్యోగాలను ఇకపై టీడీపీ అనుయాయులకు కట్టబెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమగ్ర శిక్ష రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీల్లోని 1,095 ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 26న నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టులను జనవరి 31 నాటికి భర్తీ ప్రక్రియ పూర్తిచేసి ఆప్కాస్ ద్వారా వేతనాలు ఇచ్చేందుకు మార్గదర్శకాలు కూడా జారీచేశారు. దీంతో వేలల్లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా ఈ పోస్టుల భర్తీని నిలిపివేసింది. వీటిలో ఏఎన్ఎం, హెడ్కుక్, అసిస్టెంట్ కుక్, డే అండ్ నైట్ వాచ్ ఉమెన్, అటెండర్, స్వీపర్, స్కావెంజర్ వంటి దాదాపు 500 పోస్టులను ఏజెన్సీ ద్వారా భర్తీచేయాలని నిర్ణయించి అవుట్ సోర్సింగ్ సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధంచేశారు. దీంతోపాటు సంక్షేమ శాఖలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు తదితర 10 విభాగాల్లో మరో 2,600 పోస్టులను కూడా ఇదే విధానంలో అప్పగించనున్నారు.ఆప్కాస్‌తో ఎలాంటి సంబంధంలేకుండా కాంట్రాక్టు సంస్థలే వేతనాలు చెల్లించేలా చర్యలు చేపట్టారు. అయితే, ఈ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కాస్ ద్వారా ఒక్కరోజు మినహాయించి 12 నెలల వేతనాలు చెల్లిస్తుండగా, ఇకపై వారికి 10.5 నెలలు మాత్రమే వేతనాలు ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే ప్రైవేటు ఏజెన్సీ ద్వారా పాఠశాల విద్యాశాఖలో అవుట్ సోర్సింగ్ విధానంలో వొకేషనల్ ఇన్స్ట్రక్టర్లను నియమించగా, వీరికి సదరు సంస్థ ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకుండా వేధిస్తోంది. ఈ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్లు, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు, అకౌంటెంట్, ఏఎన్ఎం, టీచింగ్, హాస్టల్ వార్డెన్స్, పార్ట్‌టైమ్ టీచింగ్ స్టాఫ్ పోస్టులకు ప్రతిభ, పని అనుభవాన్ని పట్టించుకోకుండా స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం తమకు కావాల్సిన వారిని ఎంపిక చేశారు. వీటిలో ఒక్కో పోస్టుకు ఓ రేటు కట్టి వసూలు చేసినట్లు తెలిసింది. నాటి టీడీపీ ప్రభుత్వంలో శ్రమ దోపిడీ.. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియామకాలను గత టీడీపీ ప్రభుత్వం నిలిపివేసింది. కొత్తగా కాంట్రాక్టు విధానం తీసుకొచ్చింది. తన వర్గంలోని అనుయాయులకు లబి్ధచేకూర్చేందుకు మధ్యవర్తులుగా ‘అవుట్ సోర్సింగ్’ కంపెనీలను తెరపైకి తెచ్చింది. ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీ పోస్టులను మొత్తం గంపగుత్తగా తన వర్గం వారికి (మేన్‌పవర్ ఏజెన్సీలు) అప్పగించి వారితోనే నియామకాలు చేపట్టింది. వేతనాలు సైతం సదరు కంపెనీయే చెల్లించేది. ఈ కాంట్రాక్టు ఏజెన్సీల ద్వారా ఉద్యోగంలో చేరాలంటే లంచాలు ఇచ్చుకోవాల్సి వచ్చేది. అప్పట్లో ఈ ఉద్యోగులకు ఒప్పందం ప్రకారం వేతనాలు ఇవ్వకపోగా, జీతంలో కోతలు సర్వసాధారణమయ్యాయి. పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులు సైతం ఎగవేశాయి. నియామకాల్లో ఒక విధానం అంటూ లేకుండా దారుణంగా ప్రవర్తించాయి. ఎవరైనా ప్రశి్నస్తే నిర్దాక్షిణ్యంగా ఊస్టింగే. దీంతో చిరుద్యోగులకు రక్షణ లేకుండాపోయింది. మళ్లీ మధ్యవర్తులతో దోపిడీకి స్కెచ్!.. మరోవైపు.. ఆప్కాస్‌ను రద్దుచేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించడంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో.. కొత్తగా చేపట్టే నియామకాలను మధ్యవర్తులు, మేన్‌పవర్ కంపెనీలకు అప్పగించేందుకు ఈనెల 9న ప్రభుత్వం ఉత్తర్వులు (జీఓ–12) జారీచేసింది. తొలివిడతలో 10 రకాల ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉద్యోగాలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తోంది. ఇందులో, సమగ్ర శిక్షలోని కేజీబీవీలు.. ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ సొసైటీ.. గిరిజన సంక్షేమ శాఖ.. ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ సొసైటీ (గురుకులాలు).. బీసీ సంక్షేమ శాఖ.. మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ.. మైనారిటీ సంక్షేమ శాఖ.. వికలాంగు లు, ట్రాన్స్‌జెండర్, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ ..జువెనైల్ వెల్ఫేర్, కరెక్షనల్ సర్వీసెస్, వీధి పిల్లల సంక్షేమ శాఖ.. ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టి ట్యూషన్స్ సొసైటీలున్నాయి. వీటిల్లో ఖాళీగా ఉన్న 3 వేలకు పైగా పోస్టులను ప్రైవేటు అవుట్ సో ర్సింగ్ ఏ జెన్సీలకు అప్పగించడంతో పాటు ఏడాదిలో 10.5 నెలలకే జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. ప్రభు త్వం 2016 ఆగస్టులో జారీచేసిన జీఓ ఎంఎస్ నెం.151 ప్రకారం ఈ నియామకాలు ఉండాలని పేర్కొనడంతో చిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆప్కాస్ కింద 1.07 లక్షల మందికి రక్షణ..రాష్ట్రంలో చిరుద్యోగులను దోచుకుంటున్న అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు, మేన్‌పవర్ కంపెనీల నుంచి చిరుద్యోగులకు రక్షణ కల్పించేందుకు గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్డ్ సర్విసెస్ (ఆప్కాస్) సంస్థను 2019 డిసెంబరులో చట్టబద్ధంగా ప్రారంభించింది. అప్పటిదాకా తీవ్ర శ్రమదోపిడీకి గురవుతున్న ఈ ఉద్యోగులను ఆప్కాస్ కిందకు తెచ్చి వారికి గరిష్ట ప్రయోజనాలు కల్పించారు. అలాగే, ప్రైవేట్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు, మధ్యవర్తులను పూర్తిగా తొలగించారు. ఎస్సీ/ఎస్టీ/ బీసీ, మైనారిటీలు, మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. ఎవరికీ లంచాలిచ్చే ఆస్కారం లేకుండా, ఎలాంటి కోతలు విధించకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించారు. పీఎఫ్, ఈఎస్ఐ రక్షణ కల్పించారు. ఇలా ప్రస్తుతం ఆప్కాస్ కింద 1.07 లక్షల మంది పనిచేస్తున్నారు. ఐదు నెలలుగా జీతాలు ఇవ్వని ఏజెన్సీలు..సమగ్ర శిక్ష పరిధిలో అమలవుతున్న ఎన్ఎస్క్యూఎఫ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఏపీ మోడల్ స్కూల్స్, సంక్షేమ పాఠశాలల్లో విద్యార్థులకు వివిధ ట్రేడ్స్‌లో వొకేషనల్ శిక్షణ ప్రారంభించారు. శిక్షణ కోసం తొమ్మిది వొకేషనల్ ట్రైనింగ్ పార్ట్నర్ ఏజెన్సీల (ప్రైవేట్ ఏజెన్సీలు) ద్వారా 3,350 మంది ఇన్స్ట్రక్టర్లను నియమించారు. అయితే, వీరికి ఐదు నెలలుగా జీతాలివ్వకుండా ఏజెన్సీలు వేధిస్తున్నాయి. దీంతో.. ఓ ట్రైనర్ ‘తాము చేస్తున్నది వెట్టిచాకిరీనా మరేంటో అర్థం కావడంలేదు. వేతనాల్లేకుండా ఎలా బతకాలి’ అని సోషల్ మీడియాలో చేసిన పోస్టు కన్నీళ్లు పెట్టిస్తోంది. ‘బ్రహ్మచారిగా ఉన్న తనకే ఇలా ఉంటే కుటుంబాలు ఉన్నవారి పరిస్థితి ఇంకెంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిద’ని ఆయన వాపోయాడు. -
ఆ ఎనిమిదినీ అంతం చేయాలి
‘‘మన భారతీయ చిత్రసీమల్లో హిందీ పరిశ్రమ మాత్రమే పెద్దది అనుకోవడం పొరపాటు. తెలుగు పరిశ్రమ కూడా టాప్ ప్లేస్‌లో ఉంది’’ అన్నారు కంగనా రనౌత్. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నోయిడాలో ఫిల్మ్ సిటీ నిర్మించాలనుకుంటున్నాం అని పేర్కొన్నారు. ఈ విషయం గురించి కంగనా మాట్లాడుతూ – ‘‘యోగి ఆదిత్యనాథ్‌గారి నిర్ణయం అభినందించదగ్గది. సినిమా పరిశ్రమలో ఇలాంటి సంస్కరణలు చాలా జరగాలి. అయితే భారతీయ సినిమా అంటే హిందీ మాత్రమే కాదు. తెలుగు మేకర్స్ ప్యాన్ ఇండియా సినిమాలు రూపొందించడానికి ముందుకు వస్తున్నారు. వివిధ కారణాల వల్ల ఒక్కో ఇండస్ట్రీగా మనందరం ఉన్నప్పటికీ మన పరిశ్రమలన్నీ కలసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మారాలి. మనందరం ఇలా విడివిడిగా ఉండటం డబ్బింగ్ అవుతున్న హాలీవుడ్ సినిమాలకు ఉపయోగకరంగా మారింది. ఉత్తమమైన ప్రాంతీయ చిత్రాలకు దేశవ్యాప్త గుర్తింపు లభించదు. కానీ హాలీవుడ్ సినిమాకు దేశవ్యాప్త విడుదలలు ఏంటి? హిందీ సినిమాల్లో కరువవుతున్న నాణ్యత, మోనోపోలీ వల్లే ఇదంతా. మనందరం సినిమా పరిశ్రమను వివిధ టెర్రరిజమ్‌ల నుండి కాపాడాలి. వాటిని అంతం చేయాలి. అవేంటంటే... ► నెపోటిజమ్ టెర్రరిజమ్ ► డ్రగ్స్ మాఫియా టెర్రరిజమ్ ► సెక్సిజమ్ టెర్రరిజమ్ ► ప్రాంతీయ మరియు మతపరమైన టెర్రరిజమ్ ► విదేశీ సినిమాల టెర్రరిజమ్ ► పైరసీ టెర్రరిజమ్ ► శ్రమ దోపిడీ టెర్రరిజమ్ ► ప్రతిభను దోచుకునే టెర్రరిజమ్.. ఈ ఎనిమిది టెర్రరిజమ్‌ల నుంచి కాపాడాలి’’ అని ట్వీట్ చేశారు కంగనా. -
శ్రమ దోపిడీకి గ్రీన్ సిగ్నల్
రాయదుర్గం మున్సిపాలిటీలో 279 జీఓ అమలుకు ఆమోదం ఔట్సోర్సింగ్ స్థానంలో వర్క్డ్ సోర్స్ కార్మికులను వెంటాడుతున్న బానిసత్వ భయం రాయదుర్గంటౌన్ : మునిసిపల్ కార్మికు లు ఒళ్లు వంచి పని చేయడం లేదనే సా కుతో పనుల నిర్వహణను ప్రైవేటు సం స్థలకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభు త్వం సిద్ధమైంది. ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి వర్క్డ్ సోర్సింగ్ విధానంతో పని చేయించాలని జీఓ 279 విడుదల చేసింది. ఈ జీవో శ్రమదోపిడీకి లైసెన్సు అని కార్మికులు మండిపడుతున్నారు. తా ము కాంట్రాక్టర్ల కింద బానిసలు గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నా రు. పారిశుద్ధ్యం మెరుగు పేరిట యూజర్ చార్జీల పేరుతో ప్రజల పై భారం మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై సర్వత్రా అం సంతృప్తి వ్యక్తమవుతోంది. చాలా మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే రాయదుర్గం లో మాత్రం 279 జీఓ అమలుకు ఆమో దం లభించింది. ఇప్పటికే సాంకేతికపరమైన అనుమతి కూడా మంజూరైంది. కాంట్రాక్ట్ కార్మికులు 1,418 మంది జిల్లా వ్యాప్తంగా అనంతపురం కార్పొరేష¯ŒSతోపాటు 11 మునిసిపాలిటీల్లో మొత్తం 1,418 మంది కాంట్రాక్ట్ కార్మికులు పబ్లిక్ హెల్త్ సెక్ష¯ŒS కింద పనిచేస్తున్నారు. రెగ్యులర్ కార్మికులతో పోలిస్తే దాదాపు సగం మంది కాంట్రాక్ట్ కార్మికులే ఉన్నారు. కొత్త ఉద్యోగాల నియామకం లేకపోగా చనిపోయిన వారి కార్మికుల పిల్లలు, రిటైర్డ్ ఉద్యోగుల వారసుల్లో చాలామంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కిందనే కొనసాగుతున్నారు. అనంతపురం కార్పొరేష¯ŒSలో 401 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉండగా, ధర్మవరంలో 140, గుంతకల్లులో 120, గుత్తిలో 80, పామిడిలో 37, తాడిపత్రిలో 120, హిందూపురంలో 220, మడకశిరలో 50, కళ్యాణదుర్గంలో 60, పుట్టపర్తిలో 80, రాయదుర్గంలో 60, కదిరిలో 110 మంది ఉన్నారు. కార్మికులకు కీడు చేస్తుంది జీఓ 279 అమలు వల్ల కాంట్రాక్ట్ కార్మికులు పీఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కోల్పో యే ప్రమాదం ఉంది. కాంట్రాక్టర్ల చెప్పుచేత ల్లో నలిగిపోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. కార్మికులకు కీడు చేసే ఈ జీవోను ప్రభు త్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. – వెంకటేశులు, కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మిక సంఘం అధ్యక్షుడు, రాయదుర్గం మునిసిపాలిటీ శ్రమ దోపిడీనే జీఓ అమలు వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. వారి శ్ర మను కాంట్రాక్టర్లు దోచుకుంటారు. ఈ జీవోను అమలు పరచ డం ద్వారా ప్రధానంగా స్థానిక సంస్థల అధికారాలను బలహీన పరచి ప్రజలపై యూజర్ చార్జీల భారం మోపడానికి అవకాశం ఉంది. – వి.రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి -
ఉపాధిపై పుర్రె పోటు
ఆదుకోని చట్టాలు.. ఆకలి తీర్చని పని. పొద్దంతా కష్టం.. రోగాలతో సతమతం.. ఇదీ క్లుప్తంగా బీడీ కార్మికుల జీవితం. విరామం లేకుండా కష్టిస్తున్నా జీవితమంతా దుర్భరమే. పండగలు, పబ్బాలకు దూరమై.. కుటుంబ పోషణలో లీనమై.. అవసరానికి ఆదుకోని సంపాదనతో అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే కొందరు పీఎఫ్ లేక శాపగ్రస్తులు కాగా.. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అందరి ‘పుర్రె’లు పగిలిపోయేలా ఉన్నాయి. * శ్రమ దోపిడీకి గురవుతున్న బీడీ కార్మికులు * ఆదుకోని యాజమాన్యాలు.. ఆసరా ఇవ్వని వేతనాలు * కేంద్ర ప్రభుత్వ ‘పుర్రె’ నిర్ణయంపై నిరసన జ్వాలలు * నష్టపోతున్నామని.. ఇబ్బందులు పెట్టొద్దని వేడుకోలు మిరుదొడ్డి: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది కార్మికులు బీడీ రంగాన్నే నమ్ముకున్నారు. వీరిలో అధిక శాతం మహిళలు కావడం గమనార్హం. జిల్లాలో సుమారు 82 వేల మంది పనిచేస్తున్నారు. అందులో 60 వేల మందికి ఫీఎఫ్ నంబర్లు ఉండగా.. 22 వేల మంది నాన్ పీఎఫ్ నంబర్లు కలిగి ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంతో పాటు సిద్దిపేట, నంగునూరు, గజ్వేల్, రామాయంపేట, మెదక్, నర్సాపూర్, తూప్రాన్, అందోల్, జోగిపేట, సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల్లో కార్మికులు ఎక్కువగా ఉన్నారు. కనీస వేతనాల చట్టం ప్రకారం ఒక కార్మికుడికి వెయ్యి బీడీలు చుట్టినందుకు రూ.152 చెల్లించాలి. ఇందులో పీఎఫ్ కటింగ్ పోను రూ.139 ఇస్తున్నారు. టేకే దారులు అందులోనూ రూ.3 నుంచి రూ.5 వరకు తగ్గించి అందజేస్తున్నారు. పీఎఫ్ కార్డులు లేవన్న సాకుతో వారి శ్రమను దోచేస్తున్నారు. నెలకు కనీసం 26 రోజుల పని దినాలను కల్పించాలన్న నిబంధన ఉన్నా 15 రోజులు కూడా వర్క కల్పించడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. సరిపడని ఆకు, తంబాకు బీడీ యాజమాన్యం ప్రతి వెయ్యి బీడీల తయారీకి 650 గ్రాముల ఆకు, దానికి సరిపడా తంబాకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే, ఆకు తూకంలో తాము మోసపోతున్నామని కార్మికులు చెబుతున్నారు. నాణ్యత లేని ఆకు అందిస్తుండటంతో అదనంగా కిలోకు రూ.100 నుంచి లేక రూ.120లు చెల్లించి ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నామన్నారు. వైద్య సేవలు నిల్ మహిళా బీడీ కార్మికులు ఉదయం నుంచి రాత్రి వరకు బీడీలు చుడుతూనే ఉంటారు. దీంతో వారికి శ్వాస సంబంధిత వ్యాధులు, మెడ.. వెన్ను నొప్పులు వెంటాడుతున్నాయి. వీరికి డెస్పెన్సరీలతో పాటు మొబైల్ ఆస్పత్రుల ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు చేయించాల్సి ఉన్నప్పటికీ అవేమీ అమలులో లేవు. దీంతో అనారోగ్యానికి గురైతే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. తెర మీదకి ‘పుర్రె’ గుర్తు ఇప్పటికే అనేక విధాలుగా దోపిడీకి గురవుతున్న బీడీ కార్మికుల జీవితాలను కేంద్ర ప్రభుత్వం సైతం ఇబ్బందుల్లోకి నెట్టింది. బీడీ కట్టలపై పుర్రె గుర్తు ముద్రించాలన్న నిర్ణయంతో కార్మికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల తమ బతుకులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవనోపాధికి చిచ్చుపెట్టే పుర్రె గుర్తును తొలగించాల్సిందేనని పలు బీడీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మహిళలు ఇప్పటికే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. తొలగింపుపై తీర్మానం బీడీ కార్మిక రంగాన్ని విచ్ఛిన్నం చేసే అవకాశం ఉన్న పుర్రె గుర్తును కేంద్ర ప్రభుత్వం వెంటనే తొలగించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మిరుదొడ్డి మండల సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానాన్ని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి బలపరిచారు. తెలంగాణలో ఎక్కువ శాతం బీడీ రంగాన్ని నమ్ముకున్నారని.. బీడీ కట్టలపై పుర్రెగుర్తును ముద్రించాలన్న యోచనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. - దుబ్బాక ఎమ్మెల్యే ఉద్యమాలు చేస్తాం బీడీ కార్మికుల నోట్లో మట్టి కొట్టేలా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తున్నాం. కార్మికుల ఉపాధిపై దెబ్బ కొట్టడం సరికాదు. సంక్షోభంలో ఉన్న బీడీ కార్మిక రంగాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టడం ఎంత వరకు సమంజసం. పుర్రె గుర్తును తొలగించే వరకు బీడీ కార్మికులతో ఐక్య ఉద్యమాలు చేస్తాం. - గొడ్డుబర్ల భాస్కర్, తెలంగాణ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు పరేషాన్ చేస్తున్నరు ఆకు తూకంలో తేడాలు వస్తున్నయ్. నాణ్యత లేని ఆకే ఎక్కువగా ఉంటుంది. వెయ్యి బీడీలు చేయాలంటే గగనంగా మారుతోంది. అదనంగా ప్రైవేటుగా రూ.120 తో ఆకు కొంటున్నం. గివ్వన్ని సమస్యలతో కొట్టు మిట్టాడుతుంటే పుర్రె గుర్తు పెడ్తమని మమ్మల్ని పరేషాన్ చేస్తున్నరు. - బోయిని కనకవ్వ, బీడీ కార్మికురాలు పట్టించుకునేటోళ్లు లేరు బీడీలు చుట్టేటప్పుడు తంబాకుతో రోగాల పాలైతున్నం. మెడ నొప్పులు, వెన్ను నొప్పులతో మస్తు ఇబ్బందులు పడుతుంటం. రోగాల పాలై మంచాన పడ్డా ఎవరూ పట్టించుకోరు. చేసేది లేక వ్రైవేటు దవాఖానల చూపెట్టుకుంటున్నం. - అక్కమ్మ బాలమణి, బీడీ కార్మికురాలు పుర్రెగుర్తు తొలగించాలి పొగ తాగితే కాన్సర్ వస్తదనే సాకుతో బీడీ కట్టలపై పుర్రె గుర్తు పెడతారా? మద్యం మీద లేని ఆంక్షలు బీడీలపైనే ఎందుకు? మద్యంతో సంసారాలు గుల్ల అవుతున్నాయి. జీవనోపాధి కలిగించే బీడీ కట్టలపై పుర్రె గుర్తు పెట్టుడు సరికాదు. మా పొట్టలు కొట్టొద్దు, పుర్రెగుర్తు తొలగించాలి. - వనం పద్మ, బీడీ కార్మికురాలు నిర్వీర్యం చేయడానికే... బీడీ రంగాన్ని నిర్వీర్యం చేయడానికే కేంద్రం పుర్రె గుర్తును తెరమీదికి తెచ్చింది. దీని వల్ల కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయి. ప్రభుత్వం వెంటనే పుర్రెగుర్తు ముద్రించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇందుకోసం మండల సర్వ సభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. - పంజాల కవిత, ఎంపీపీ మిరుదొడ్డి


