breaking news
labelling norms
-
ప్యాకేజ్డ్ ఫుడ్ లేబుల్స్ : సుప్రీం సీరియస్, కేంద్రానికి అల్టిమేటం
సాక్షి, న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ ఫుడ్‌పై లేబుల్స్ వ్యవహరంలో సుప్రీంకోర్టు సీరియస్‌గా స్పందించింది. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై (Packaged Food Products) చక్కెర, ఉప్పు , సంతృప్త కొవ్వుల (Saturated Fat) పరిమాణం ఎక్కువగా ఉంటే హెచ్చరిక లేబుళ్లను (Front-of-pack warning labels) నిబంధనల ప్రకారం ముద్రించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరిచింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, FSSAI (భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ)కి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. "మీరు ఈ పని చేయకపోతే, మేమే ఆర్డర్ ఇస్తాం" అని అత్యున్నత న్యాయస్థానం అల్టిమేటం జారీ చేసింది. దీనిపై తుది నిర్ణయం తెలపడానికి కేంద్ర ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇచ్చింది.హెచ్చరిక లేబుళ్ల అమలుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, లేదంటే కోర్టు స్వయంగా తగు ఆదేశాలు జారీ చేస్తుందని స్పష్టం చేసింది. పిల్లలు, పౌరుల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేసింది. కేవలం సాధారణ పోషకాహార పట్టిక సరిపోదని, స్పష్టమైన హెచ్చరిక లేబుల్స్ ఉండాలని కోర్టు అభిప్రాయపడింది.ఈ సందర్బంగా కార్పొరేట్ ఒత్తిళ్లపై అత్యున్నత కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుడ్ ఇండస్ట్రీ వ్యతిరేకిస్తుందనే కారణంతో ఈ లేబుళ్ల ప్రక్రియను ఆలస్యం చేయడంపై జస్టిస్ జె.బి. పారడీవాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు కార్పొరేట్ కంపెనీల ఒత్తిడికి తలొగ్గుతున్నారా అని ప్రశ్నించింది. ప్రజా ఆరోగ్యం ముఖ్యమని తెలిపింది.ఇది దేశ పౌరుల, ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన అంశమని, వ్యాపార వర్గాల ప్రయోజనాల కంటే వినియోగదారుల ఆరోగ్యమే ముఖ్యమని కోర్టు పేర్కొంది. లేబుల్ మీద హెచ్చరికలు ఉంచడం అంటే అమ్మకాలను ఆపడం కాదని, తాము ఏమి తింటున్నారో వినియోగదారులకు స్పష్టంగా తెలియజెప్పడమేనని తేల్చి చెప్పింది.కేంద్రం వాదనను తోసిపుచ్చిన కోర్టుసాంప్రదాయ భారతీయ పిండివంటలు/స్నాక్స్ (ఉదాహరణకు నమకీన్ వంటివి) పై ఎరుపు రంగు హెచ్చరిక మార్కులు పడతాయని, విదేశీ ప్రమాణాలను ఇక్కడ నేరుగా అమలు చేయడం కష్టమని కేంద్రం తరఫు న్యాయవాది వాదించారు. అయితే, ఈ వాదనను తిరస్కరించిన కోర్టు "భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోవాలా?" అని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు తుది నిర్ణయం కోసం కేంద్ర ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇచ్చింది. లేనిపక్షంలో తదుపరి విచారణలో కోర్టు నేరుగా ఉత్తర్వులు జారీ చేస్తుందని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: చాట్‌జీపీటీ సాయం : తల్లి, తమ్ముడ్ని హత్య చేసిన 17 ఏళ్ల టీనేజర్కాగా ప్యాకెట్ల ముందు భాగంలోనే (Front-of-Pack) అనారోగ్యకరమైన అంశాల (ఉప్పు, చక్కెర, ఫ్యాట్) సమాచారాన్ని స్పష్టమైన గుర్తులు లేదా హెచ్చరికల రూపంలో ముద్రించాలని దాఖలైన పిటీషన్‌పై విచారించిన ఈ సుప్రీం తాజా వ్యాఖ్యలు చేసింది. కేవలం సాధారణ పోషకాహార పట్టిక సరిపోదని, స్పష్టమైన హెచ్చరిక లేబుల్స్ ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. ఇదీ చదవండి: మాల్యా కేసు : బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు -
ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల్లో ‘గ్లూటెన్’ గుర్తింపు
ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల తయారీలో పారదర్శకత పెంచే దిశగా అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) కీలక అడుగు వేసింది. గ్లూటెన్‌తో సీలియాక్ వ్యాధి(గ్లూటెన్ తీసుకున్నప్పుడు శరీరంలోని రోగనిరోధక శక్తి పొరపాటున చిన్న పేగులపై దాడి చేస్తుంది) వస్తున్నందున కోట్లాది మంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక నిర్ణయం తీసుకుంది. గ్లూటెన్ కలిగిన ధాన్యాల లేబెలింగ్, ‘క్రాస్-కాంటాక్ట్’(ఇతర ధాన్యాలతో కలయిక ) నివారణపై సమగ్ర సమాచారాన్ని కోరుతూ తాజాగా ప్రకటన విడుదల చేసింది.లేబెలింగ్‌లో పారదర్శకతే లక్ష్యంప్రస్తుతం అనేక ఆహార ఉత్పత్తుల్లో గోధుమలతో పాటు రై (rye), బార్లీ (barley) వంటి ధాన్యాలను ఉపయోగిస్తున్నారు. అయితే, వీటిని ప్యాకెట్లపై స్పష్టంగా పేర్కొనకపోవడం వల్ల సీలియాక్ వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని కట్టడి చేసేందుకు ఎఫ్‌డీఏ కొన్ని అంశాలపై దృష్టి సారించింది. రై, బార్లీ కలిగిన ఉత్పత్తుల లేబెలింగ్ విధానాన్ని తీసుకురావాలని తెలిపింది. ఓట్స్ సహజంగా గ్లూటెన్ రహితమైనప్పటికీ ఇతర ధాన్యాలతో కలయిక(క్రాస్ కాంటాక్ట్) వల్ల వాటిలో గ్లూటెన్ చేరే అవకాశం ఉంది. దీనిపై స్పష్టమైన డేటాను సేకరిస్తోంది. ఈ ధాన్యాల వల్ల కలుగుతున్న ప్రతికూల ఆరోగ్య పరిస్థితులు, అలర్జీల తీవ్రతను అంచనా వేయనుంది.ఈ సందర్భంగా ఎఫ్‌డీఏ కమిషనర్ మార్టీ మకరీ మాట్లాడుతూ ‘సీలియాక్ వ్యాధి లేదా గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారు తాము తినే ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చాలా సందర్భాల్లో కచ్చితమైన సమాచారం లేక వారు ఆహారం తీసుకునే విషయంలో కేవలం అంచనాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మార్చడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.డేటా లోపాలపై దృష్టిఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) నివేదికలు, కొంతమంది ప్రజల నుంచి అందిన పిటిషన్లను సమీక్షించిన ఎఫ్‌డీఏ ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటాలో కొన్ని అంశాలను గుర్తించింది. ఆహార పదార్థాల్లో రై లేదా బార్లీ ఉన్నప్పటికీ వాటి వివరాలు వెల్లడించట్లేదు. దీనివల్ల ‘ఇమ్యూనోగ్లోబులిన్-E’ (IgE) ఆధారిత ఆహార అలర్జీల తీవ్రత పెరుగుతోంది. క్రాస్-కాంటాక్ట్ వల్ల ఓట్స్‌లో గ్లూటెన్ పరిమాణం ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో తీసుకోబోయే కఠిన నియంత్రణ చర్యలకు ఈ సమాచార సేకరణ పునాదిగా మారుతుందని, తద్వారా వినియోగదారులకు మరింత సురక్షితమైన ఆహారం లభింస్తుందని సంస్థ తెలిపింది.ఇదీ చదవండి: ఇకపై సిల్వర్ రీసైక్లింగ్ -
ప్యాకేజ్డ్ ఫుడ్ ‘లేబులింగ్’ వెనక ఇంత కష్టం ఉంటుందా..?
సూపర్‌మార్కెట్ షెల్ఫ్ నుంచి ప్యాకేజ్డ్ ఫుడ్ పాకెట్ తీసుకొని న్యూట్రీషన్ ఫ్యాక్ట్స్, రెగ్యులేటరీ సింబల్స్, చిన్న చిన్న డిస్కైమర్లు చూడడం అనేది సాధారణ విషయం. అయితే ఈ సాధారణ దృశ్యం వెనుక పెద్ద కష్టమే ఉంది. బ్రాండ్ల ‘లేబులింగ్’ వెనక కనిపించని కష్టం ఎంతో ఉంది. మన దేశంలో ప్యాకేజ్డ్–ఫుడ్ మార్కెట్ విస్తృతమవుతున్న రోజుల్లో ‘లేబులింగ్’ ప్రక్రియ మాత్రం నత్తకు క్లోజ్ఫ్రెండ్లా స్లోగా ఉండేది. ఈ నేపథ్యంలోనే ‘లేబులింగ్’ ప్రక్రియను స్పీడెత్తించడానికి ‘లేబుల్‌బ్లైండ్’ అనే స్టార్టప్‌ను ప్రారంభించి అంతర్జాతీయ స్థాయిలో అద్భుత విజయాన్ని సాధించింది న్యూట్రీషన్ ఎక్స్పర్ట్ రషీద వాపీవాలా...మన దేశంలో ప్యాకేజ్డ్ ఫుడ్ మార్కెట్ వృద్ధి చెందినప్పటికీ, లేబులింగ్ విషయంలో మాత్రం పొరపాట్లు దొర్లుతూనే ఉన్నాయి. తప్పులు లేకుండా ‘లేబులింగ్’ ప్రక్రియను సకాలంలో పూర్తిచేయడం సమస్యగా ఉండేది. ఈ నేపథ్యంలోనే పోషకాహార నిపుణురాలు రషీదా వాపివాలా ‘లేబుల్‌బ్లైండ్’ను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రీషన్‌లో మాస్టర్స్, ఆ తరువాత పీహెచ్డీ చేసిన రషీద హెల్త్ టోటల్, డైట్ ఫర్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలలో పనిచేసింది.ఫుడ్ రేటింగ్‌తో మొదలై...స్థిరమైన కార్పొరేట్ కెరీర్‌ను వదులుకొని కొత్తదారి ఎంచుకోవాలనుకోవడం కొందరికి రిస్క్. అయితే రషీద మాత్రం రిస్క్ అనుకోలేదు. ‘ఆహారం మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూశాను. అదే సమయంలో లేబుల్స్‌తో వినియోగదారులు ఎలా గందరగోళానికి గురవుతున్నారో చూశాను. సమాచారానికి సంబంధించి కంపెనీలు, వినియోగదారులు స్పష్టతతో ఉండాలని నమ్ముతాను’ అంటున్న రషీద ముంబై కేంద్రంగా ‘లేబుల్‌బ్లైండ్’ను ఫుడ్ రేటింగ్ వెబ్‌సైట్‌గా ప్రారంభించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) ‘లేబుల్ బ్లైండ్’ పనితీరును గుర్తించి ప్యాక్ లేబులింగ్ నియమాలను తెలియజేసే ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ హోదా ఇచ్చింది.ఫోల్‌సోల్‘ప్రిన్సిపల్ ఇవ్వెస్టిగేటర్’ అవకాశంతో రషీదకు మన దేశంలోని పెద్ద ఫుడ్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడే అవకాశం వచ్చింది. పెద్ద కంపెనీలలో కూడా డిజిటలైజేషన్ ప్రక్రియ ఊపందుకోక΄ోవడాన్ని గమనించిన రషీద ‘ఫోల్‌సోల్’కు శ్రీకారం చుట్టింది. ఇది ‘లేబుల్‌బ్లైండ్’కు సంబంధించిన క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్. ఫుడ్ లేబులింగ్ ప్రక్రియను సులభతరం చేసింది. ఒకప్పుడు ఈ ప్రక్రియకు వారాలు, నెలల సమయం తీసుకునేది. ‘60 నుంచి 100 సెకన్లలో మా ఏఐ సాధనాలు నివేదికను రూపొందిస్తాయి’ అంటుంది రషీద. డైరీ, బేకరి, స్నాక్స్...మొదలైన విభాగాలలో ‘లేబుల్‌బ్లైండ్’ పనిచేస్తోంది. 2021 నుంచి 2023 మధ్య మెనూలేబులింగ్కు సంబంధించి రెస్టారెంట్లు, హోటల్స్, క్విక్–సర్వీస్ రెస్టారెంట్(క్యూస్ఆర్)లతో కలిసి పనిచేసింది. 2023 నుంచి 2024 మధ్య కాలంలో కంపెనీ అంతర్జాతీయంగా విస్తరించింది. వేగవంతమైన, కచ్చితమైన, ప్రపంచవ్యాప్త నిబంధనలకు అనుగుణంగా ఉండే లేబులింగ్ కోసం చూస్తున్న కంపెనీలకు ‘ఫోల్‌సోల్’ ఒక కీలక సాధనంగా మారింది.డైనమిక్ లేబుల్స్మొదట్లో సవాళ్లు ఎదురైనా నైపుణ్యం ఉన్న బృందాన్ని ఏర్పాటు చేసుకోవడంలో, కంపెనీని విజయపథంలో నడిపించడంలో విజయం సాధించింది రషీద. స్టాటిక్ ప్యాకేజింగ్‌కు మాత్రమే కంపెనీ పరిమితమైపోలేదు. ఎన్నో కొత్త ఫీచర్లను ఆవిష్కరించింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూఆర్–బేస్డ్ డైనమిక్ లేబుల్స్‌ను ఆవిష్కరించింది. ఎగుమతికి సంబంధించిన వివరాలు, ప్లాస్టిక్ వ్యర్థాల సమాచారం, మాన్యుఫ్యాక్చర్ డేటా అప్డేట్ చేయడానికి బ్రాండ్లకు ఇది ఉపయోగపడుతుంది. పెద్ద కంపెనీల నమ్మకాన్ని గెల్చుకొని...ప్రారంభదశలోనే టాటా స్టార్‌బక్స్, ఐటీసీ హోటల్స్, టిమ్ హోర్టన్స్ ఇండియాలాంటి పెద్ద కంపెనీల నమ్మకాన్ని గెల్చుకుంది లేబుల్‌బ్లైండ్. మెనూ–లేబులింగ్ సోల్యూషన్స్కి సంబంధించి ఈ కంపెనీలు ఇప్పటికీ ‘లేబుల్‌బ్లైండ్’ యాక్టివ్ యూజర్లుగా ఉన్నాయి. ప్యాకేజ్డ్–ఫుడ్ క్లయింట్లలో బికానో, బికనేర్వాలా, ఎవరెస్ట్ స్పైసెస్, మదర్ రెసీపీ(దేశాయ్ బ్రదర్స్), గోల్టి మసాలా, థియోబ్రొమా...మొదలైనవి ఉన్నాయి. ప్రస్తుతం ‘లేబుల్‌బ్లైండ్’ నలభైకి పైగా భారతీయ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. వీటిలో ఎక్కువ కంపెనీలు యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా...మొదలైన దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తాయి.తొలి రోజుల్లో సవాళ్లుతొలి అడుగులు వేస్తున్న కాలంలో కంపెనీకి కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. ఫుడ్ రెగ్యులేషన్స్‌కు సంబంధించి సంక్లిష్ట అంశాలను అర్థం చేసుకోవడం, సరిౖయెన టీమ్‌ను తయారుచేసుకోవడం కాస్త కష్టం అయింది. మన దేశ నియమాలకు, ఇతర దేశ నియమాలకు తేడా ఉంటుంది. ‘సాంకేతికత, ఆహారనియంత్రణ అనే రెండింటిలోనూ నైపుణ్యం కలిగిన వ్యక్తులను కనుగొనడం కష్టంగా అనిపించింది’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది రషీద. -
బాణాసంచాలో విషపూరిత రసాయనాలు!
న్యూఢిల్లీ: బాణాసంచా తయారీలో విషపూరిత రసాయన పదార్ధాలు వాడడం చాలా ప్రమాదకరమని సీబీఐ నివేదిక వెల్లడించిందని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. బాణాసంచా తయారీలో బేరియం వాడకం, బాణాసంచాపై జరిపే ముద్రణ(లేబిలింగ్)లో కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. హిందుస్తాన్ ఫైర్వర్క్స్, స్టాండర్డ్ ఫైర్వర్క్స్ సంస్థలు పెద్ద స్థాయిలో బేరియంను కొనుగోలు చేసినట్లు తెలిసిందని జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. అయితే ఉత్పత్తిదారులకు మరో అవకాశం ఇవ్వదలిచామని, సీబీఐ నివేదికను వారికి అందించాలని కోర్టు సూచించింది. మనదేశంలో ఎక్కడోఒకచోట ప్రతిరోజూ ఏదో ఒక ఉత్సవం జరుగుతుంటుందని, ఈ కారణంతో బాణాసంచాపై విచారణ నిలిపివేయలేమని, ప్రజలకు కలిగే ఇబ్బందులను పరిశీలించాలని కోర్టు వ్యాఖ్యానించింది. -
తప్పుడు వార్తలకు ట్విటర్ చెక్
న్యూఢిల్లీ: తప్పుదోవ పట్టించే వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు ట్విటర్ గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇలాంటి ట్వీట్లకు ప్రత్యేక ముద్ర వేయనుంది. ప్రజలకు హానిచేసే విధంగా ఉన్నాయని భావించిన పక్షంలో సదరు ట్వీట్లను పూర్తిగా తొలగించేందుకు ట్విటర్ చర్యలు తీసుకుంటుంది. తెలిసో తెలియకో తప్పుదోవ పట్టించేలా రూపొందించిన మీడియా, ట్వీట్లను షేర్ చేయదల్చుకునే యూజర్లను ముందస్తుగా హెచ్చరించేలా సాంకేతికతను ఉపయోగించనుంది. విషయం గురించి యూజర్లకు మరింత వివరంగా తెలిసేందుకు సదరు పోస్ట్‌లపై వివరణ పొందుపర్చనుంది. మార్చి 5 నుంచి తప్పుడు ట్వీట్లను లేబులింగ్ చేసే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ట్విటర్ వెల్లడించింది. (చదవండి: యూట్యూబ్ కీలక నిర్ణయం)


