ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ ‘లేబులింగ్‌’ వెనక ఇంత కష్టం ఉంటుందా..? | Rashida Vapiwala: How LabelBlind is automating food labelling across India | Sakshi
Sakshi News home page

ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ ‘లేబులింగ్‌’ వెనక ఇంత కష్టం ఉంటుందా..? ఈజీగా కొనేలా..

Jan 21 2026 5:28 PM | Updated on Jan 21 2026 5:51 PM

Rashida Vapiwala: How LabelBlind is automating food labelling across India

సూపర్‌మార్కెట్‌ షెల్ఫ్‌ నుంచి ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ పాకెట్‌ తీసుకొని న్యూట్రీషన్‌ ఫ్యాక్ట్స్, రెగ్యులేటరీ సింబల్స్, చిన్న చిన్న డిస్కైమర్‌లు చూడడం అనేది సాధారణ విషయం. అయితే ఈ సాధారణ దృశ్యం వెనుక పెద్ద కష్టమే ఉంది. బ్రాండ్‌ల ‘లేబులింగ్‌’ వెనక కనిపించని కష్టం ఎంతో ఉంది. మన దేశంలో ప్యాకేజ్డ్‌–ఫుడ్‌ మార్కెట్‌ విస్తృతమవుతున్న రోజుల్లో ‘లేబులింగ్‌’ ప్రక్రియ మాత్రం నత్తకు క్లోజ్‌ఫ్రెండ్‌లా స్లోగా ఉండేది. ఈ నేపథ్యంలోనే ‘లేబులింగ్‌’ ప్రక్రియను స్పీడెత్తించడానికి ‘లేబుల్‌బ్లైండ్‌’ అనే స్టార్టప్‌ను ప్రారంభించి అంతర్జాతీయ స్థాయిలో అద్భుత విజయాన్ని సాధించింది న్యూట్రీషన్‌ ఎక్స్‌పర్ట్‌ రషీద వాపీవాలా...

మన దేశంలో ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ మార్కెట్‌ వృద్ధి చెందినప్పటికీ, లేబులింగ్‌ విషయంలో మాత్రం పొరపాట్లు దొర్లుతూనే ఉన్నాయి. తప్పులు లేకుండా ‘లేబులింగ్‌’ ప్రక్రియను సకాలంలో పూర్తిచేయడం సమస్యగా ఉండేది. 

ఈ నేపథ్యంలోనే పోషకాహార నిపుణురాలు రషీదా వాపివాలా ‘లేబుల్‌బ్లైండ్‌’ను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రీషన్‌లో మాస్టర్స్, ఆ తరువాత పీహెచ్‌డీ చేసిన రషీద హెల్త్‌ టోటల్, డైట్‌ ఫర్‌ ఇండియా, మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీలలో పనిచేసింది.

ఫుడ్‌ రేటింగ్‌తో మొదలై...
స్థిరమైన కార్పొరేట్‌ కెరీర్‌ను వదులుకొని కొత్తదారి ఎంచుకోవాలనుకోవడం కొందరికి రిస్క్‌. అయితే రషీద మాత్రం రిస్క్‌ అనుకోలేదు. ‘ఆహారం మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూశాను. అదే సమయంలో లేబుల్స్‌తో వినియోగదారులు ఎలా గందరగోళానికి గురవుతున్నారో చూశాను. 

సమాచారానికి సంబంధించి కంపెనీలు, వినియోగదారులు స్పష్టతతో ఉండాలని నమ్ముతాను’ అంటున్న రషీద ముంబై కేంద్రంగా ‘లేబుల్‌బ్లైండ్‌’ను ఫుడ్‌ రేటింగ్‌ వెబ్‌సైట్‌గా ప్రారంభించింది. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ‘లేబుల్‌ బ్లైండ్‌’ పనితీరును గుర్తించి ప్యాక్‌ లేబులింగ్‌ నియమాలను తెలియజేసే ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ హోదా ఇచ్చింది.

ఫోల్‌సోల్‌
‘ప్రిన్సిపల్‌ ఇవ్వెస్టిగేటర్‌’ అవకాశంతో రషీదకు మన దేశంలోని పెద్ద ఫుడ్‌ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడే అవకాశం వచ్చింది. పెద్ద కంపెనీలలో కూడా డిజిటలైజేషన్‌ ప్రక్రియ ఊపందుకోక΄ోవడాన్ని గమనించిన రషీద ‘ఫోల్‌సోల్‌’కు శ్రీకారం చుట్టింది. ఇది ‘లేబుల్‌బ్లైండ్‌’కు సంబంధించిన క్లౌడ్‌ బేస్డ్‌ సాఫ్ట్‌వేర్‌. ఫుడ్‌ లేబులింగ్‌ ప్రక్రియను సులభతరం చేసింది. ఒకప్పుడు ఈ ప్రక్రియకు వారాలు, నెలల సమయం తీసుకునేది. 

‘60 నుంచి 100 సెకన్‌లలో మా ఏఐ సాధనాలు నివేదికను రూపొందిస్తాయి’ అంటుంది రషీద. డైరీ, బేకరి, స్నాక్స్‌...మొదలైన విభాగాలలో ‘లేబుల్‌బ్లైండ్‌’ పనిచేస్తోంది. 2021 నుంచి 2023 మధ్య మెనూలేబులింగ్‌కు సంబంధించి రెస్టారెంట్లు, హోటల్స్, క్విక్‌–సర్వీస్‌ రెస్టారెంట్‌(క్యూస్‌ఆర్‌)లతో కలిసి పనిచేసింది. 2023 నుంచి 2024 మధ్య కాలంలో కంపెనీ అంతర్జాతీయంగా విస్తరించింది. వేగవంతమైన, కచ్చితమైన, ప్రపంచవ్యాప్త నిబంధనలకు అనుగుణంగా ఉండే లేబులింగ్‌ కోసం చూస్తున్న కంపెనీలకు ‘ఫోల్‌సోల్‌’ ఒక కీలక సాధనంగా మారింది.

డైనమిక్‌ లేబుల్స్‌
మొదట్లో సవాళ్లు ఎదురైనా నైపుణ్యం ఉన్న బృందాన్ని ఏర్పాటు చేసుకోవడంలో, కంపెనీని విజయపథంలో నడిపించడంలో విజయం సాధించింది రషీద. స్టాటిక్‌ ప్యాకేజింగ్‌కు మాత్రమే కంపెనీ పరిమితమైపోలేదు. ఎన్నో కొత్త ఫీచర్‌లను ఆవిష్కరించింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూఆర్‌–బేస్డ్‌ డైనమిక్‌ లేబుల్స్‌ను ఆవిష్కరించింది. ఎగుమతికి సంబంధించిన వివరాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాల సమాచారం, మాన్యుఫ్యాక్చర్‌ డేటా అప్‌డేట్‌ చేయడానికి బ్రాండ్‌లకు ఇది ఉపయోగపడుతుంది.  

పెద్ద కంపెనీల నమ్మకాన్ని గెల్చుకొని...
ప్రారంభదశలోనే టాటా స్టార్‌బక్స్, ఐటీసీ హోటల్స్, టిమ్‌ హోర్టన్స్‌ ఇండియాలాంటి పెద్ద కంపెనీల నమ్మకాన్ని గెల్చుకుంది లేబుల్‌బ్లైండ్‌. మెనూ–లేబులింగ్‌ సోల్యూషన్స్‌కి సంబంధించి ఈ కంపెనీలు ఇప్పటికీ ‘లేబుల్‌బ్లైండ్‌’ యాక్టివ్‌ యూజర్‌లుగా ఉన్నాయి. ప్యాకేజ్డ్‌–ఫుడ్‌ క్లయింట్‌లలో బికానో, బికనేర్‌వాలా, ఎవరెస్ట్‌ స్పైసెస్, మదర్‌ రెసీపీ(దేశాయ్‌ బ్రదర్స్‌), గోల్టి మసాలా, థియోబ్రొమా...మొదలైనవి ఉన్నాయి. ప్రస్తుతం ‘లేబుల్‌బ్లైండ్‌’ నలభైకి పైగా భారతీయ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. వీటిలో ఎక్కువ కంపెనీలు యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా...మొదలైన దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తాయి.

తొలి రోజుల్లో సవాళ్లు
తొలి అడుగులు వేస్తున్న కాలంలో కంపెనీకి కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. ఫుడ్‌ రెగ్యులేషన్స్‌కు సంబంధించి సంక్లిష్ట అంశాలను అర్థం చేసుకోవడం, సరిౖయెన టీమ్‌ను తయారుచేసుకోవడం కాస్త కష్టం అయింది. మన దేశ నియమాలకు, ఇతర దేశ నియమాలకు తేడా ఉంటుంది. ‘సాంకేతికత, ఆహారనియంత్రణ అనే రెండింటిలోనూ నైపుణ్యం కలిగిన వ్యక్తులను కనుగొనడం కష్టంగా అనిపించింది’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది రషీద. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement