breaking news
Packaged Food
-
మిడిల్ క్లాస్‌కు మెలోడీ!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వివిధ వస్తువులపై సవరించిన కొత్త పన్ను రేట్లు సోమవారం నుంచి అమల్లోకి రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ... జీఎస్టీ 2.0గా పేర్కొంటున్న ఈ సవరణలతో చాలా వస్తువుల ధరలు మారబోతున్నాయి. మధ్యతరగతి భారతావనికి ఈ పన్నుల మార్పు ఎంతో మేలు చేస్తుందని, చాలా వస్తువుల ధరలు తగ్గుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ సైతం ఇదే చెప్పారు. ఈ నేపథ్యంలో అసలు జీఎస్టీ మండలి చేసిన సవరణల వల్ల ఎవరికి లాభం? ధరల్లో హెచ్చుతగ్గులు ఏ రకమైన ప్రభావం చూపబోతున్నాయి? దీనిపై ‘సాక్షి’ సమగ్ర కథనమిది.. ఇక 12 శాతం; 28 శాతం ఉండవు... సేల్స్‌ట్యాక్స్, వ్యాట్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ సహా పలు రకాల పరోక్ష పన్నులన్నిటినీ తొలగిస్తూ 2017 జూలై నుంచీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) అమల్లోకి వచ్చింది. తక్కువ పన్నురేట్లుండాలని మొదట లకి‡్ష్యంచినా సాధ్యం కాలేదు. తాజా సవరణలతో అది సాధ్యమై జీఎస్టీ శ్లాబ్‌లు 3కు తగ్గాయి. తక్కువ శ్లాబ్‌లుంటే పాలన, ధరల నిర్ణయం, బిల్లింగ్ సులువవుతుంది. పన్ను అధికారులపైనా భారం తగ్గుతుంది. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత ప్రధానమైనది.. 12 శాతం, 28 శాతం పన్ను రేట్లను పూర్తిగా తొలగించటం. కొన్ని విలాస, అనారోగ్య (సిన్) వస్తువుల కోసం 40 శాతం పన్ను రేటును చేర్చటం. వాస్తవంగా చూస్తే చాలావరకూ ఆహార పదార్థాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ 5% పరిధిలోకి వచ్చాయి. కొన్నింటిపై పన్నే లేకుండా చేశారు. గతంలో వీటిపై 12, 28 శాతం పన్ను రేట్లుండేవి. ఇది అత్యధికులకు ఊరటే. ఇక కొన్ని విలాస వస్తువులు, కూల్‌డ్రింక్స్, టొబాకో ఉత్పత్తులు, పాన్ మసాలా వంటివి మాత్రం 28 శాతం పన్ను పరిధిలో ఉండగా ఇపుడు 40 శాతం శ్లాబ్‌లోకి వెళ్లాయి. తగ్గింపు ప్రయోజనాలు ఎక్కువే... ముఖ్యంగా ప్రాణాధార ఔషధాలపై పన్ను భారం తొలగిపోనుంది. మరెన్నో ఔషధాలు, వైద్య పరికరాలు, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులైన టూత్‌బ్రష్, టూత్‌పేస్ట్, సబ్బులు, షాంపూలు, హెయిర్ ఆయిల్, టాల్కమ్ పౌడర్, షేవింగ్ క్రీమ్‌తో పాటు నెయ్యి, పన్నీరు, బటర్, నమ్కీన్, కెచప్, డ్రై ఫ్రూట్స్, కాఫీ దగ్గర్నుంచి.. పెద్ద సైజు టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, కార్ల వరకు మొత్తం 375 ఉత్పత్తుల ధరలు గతంతో పోల్చితే తగ్గనున్నాయి. ఈ తగ్గింపు వల్ల జనం చేతుల్లో మరికొంత డబ్బు మిగులుతుంది కనక ఇది సేవింగ్స్‌లోకి, స్టాక్ మార్కెట్లోకి మళ్లే అవకాశం ఉందనేది ప్రభుత్వం అంచనా. అంతిమంగా ఇది ఆర్థిక వృద్ధికి దారితీయాలనేది లక్ష్యం. అయితే అదే తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు తగ్గిపోకూడదు కనక విలాస, అనారోగ్య వస్తువులపై ఏకంగా పన్ను శాతం 40కి పెంచారు. ధర పెరిగే వస్తువులివీ.. ⇒ బీడీ మినహా సిగరెట్లు, సిగార్లు, గుట్కా, పాన్ మసాలా, నికొటిన్ ఉత్పత్తులు గతంలో ఉన్న 28 శాతం నుంచి 40 శాతానికి చేరాయి. అయితే ఈ పెంపు ప్రస్తుతానికి అమల్లోకి రాదు. బీడీలపై పన్నును మాత్రం 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. బిహార్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో సిగరెట్లు తాగేవారికన్నా బీడీలు కాల్చేవారు దాదాపు మూడురెట్లు ఎక్కువనేది గమనార్హం. ⇒ కార్బొనేటెడ్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, కెఫైన్ ఆధారిత పానీయాలను 28 నుంచి 40 శాతంలోకి చేర్చారు. ⇒ లాటరీ టికెట్లు, కేసినో సేవలు, ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారాలపై పన్ను రేటు 40 శాతంగా నిర్ణయించారు. ⇒ 1,500 సీసీకన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న ఎస్‌యూవీలు, హై–ఎండ్ కార్లపై ఇకపై 40 శాతం జీఎస్టీ అమలవుతుంది. ⇒ ఫ్యాట్స్, చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉండే ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్ కూడా ఇకపై 40 శాతం శ్లాబ్‌లోకి వస్తాయి. మధ్యతరగతిపై ప్రభావమెంత? మధ్య తరగతి ప్రజలకు ఈ సవరణల్లో ఎక్కువ లాభం తెచ్చేవి ఏవైనా ఉన్నాయంటే అవి కిరాణా సరుకులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులే. చాలా వస్తువులు 18, 12 శాతాల నుంచి 5 శాతం పరిధిలోకి రావటమే ఇందుకు కారణం. ఇక ఔషధాలు, బీమా రూపేణా కలిసొచ్చేది ఎక్కువే. అందుకే ప్రతినెలా కొంత కచ్చితంగా ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. పట్టణ మధ్య తరగతి కుటుంబాల్లో ఈ నెలవారీ ఆదా మందులను కూడా పరిగణనలోకి తీసుకుంటే రూ.1700 నుంచి రూ.2200 వరకూ ఉండవచ్చనేది నిపుణుల అంచనా. పైపెచ్చు ఈ జీఎస్టీ సవరణల్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ఏ వస్తువుపై ఎంత తగ్గిందనేది ప్రతి తయారీదారూ కచ్చితంగా ప్రకటించాలనే నియమాన్ని పెట్టింది. ఈ మేరకు తయారీదారులు రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా విస్తృత ప్రచారం కల్పిస్తోంది. పైపెచ్చు ఉత్పత్తిదారులు తగ్గించినా రిటైల్ అమ్మకందారులు తగ్గించకపోతే పన్ను తగ్గింపు ప్రయోజనం జనానికి చేరదు కనక ఈ అమలు తీరును 6 నెలల పాటు నిశితంగా పర్యవేక్షించనుంది కూడా.ఏవి చౌకగా లభిస్తాయంటే..⇒ వెన్న, నెయ్యి, చీజ్, కండెన్స్డ్ మిల్‌్క, యూహెచ్‌టీ మిల్క్ వంటివి గతంలో 12, 5 శాతాల్లో ఉండగా ఇపుడు 5, సున్నా శాతాల్లోకి వచ్చాయి. ⇒ బిస్కెట్లు, కేక్‌లు, పాస్తా, ఓట్స్, కార్న్‌ఫ్లేక్స్ వంటి బ్రేక్‌ఫాస్ట్ సిరెల్స్, చీజ్ పఫ్‌లు, పలు రకాల కన్ఫెక్షనరీ ఉత్పత్తులు గతంలో ఉన్న 18 నుంచి 5 శాతానికి దిగివస్తాయి. ⇒ వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులైన షాంపూలు, తల నూనె, టూత్‌పేస్ట్, సబ్బులు చాలావరకూ గతంలో 18 శాతంలో ఉండగా ఇపుడు 5 శాతం పరిధిలోకి వచ్చాయి. ⇒ ఆహార దినుసులతో పాటు శీతల పానీయాల పరిధిలోకి రాని జ్యూస్‌లు, మొక్కల ఆధారిత మిల్క్ డ్రింక్‌లు, పలురకాల డ్రైఫ్రూట్స్ గతంలో 12, 28 శాతాల్లో ఉండగా ఇపుడు 5 శాతానికి వచ్చాయి. ⇒ చిన్న, మిడ్‌సైజ్ కార్లపై గతంలో ఉన్న 28 శాతం పన్నును 18 శాతానికి తగ్గించారు. వాహనాల ధర ఎక్కువ కనక ఈ పన్ను తగ్గింపు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు అన్ని కంపెనీలూ జీఎస్టీ సవరణకు అనుగుణంగా తమ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ⇒ 32 అంగుళాలకు మించి ఉన్న టీవీలపై ఇప్పటి వరకు ఉన్న 28 శాతం జీఎస్టీ కాస్తా 18 శాతం కిందకు వచ్చింది. దీంతో వాటి మోడళ్ల ఆధారంగా రూ.2,500 నుంచి రూ.85,000 వరకు ధరలు తగ్గాయి. ప్రముఖ కంపెనీలు సోనీ, ఎల్జీ, ప్యానాసోనిక్ ఇప్పటికే కొత్త ధరలను ప్రకటించాయి. ఏసీలు, కొన్ని రకాల వాషింగ్ మెషీన్లపైనా జీఎస్టీ 28% నుంచి 18 శాతానికి తగ్గింది. ⇒ నిర్మాణంలోకి వినియోగించే సిమెంట్, ఇతర బిల్డింగ్ మెటీరియల్స్పైనా జీఎస్టీ తగ్గించడమనేది ఇళ్ల మార్కెట్‌కు అనుకూలించనుంది.ముందు వరుసలో కార్ల కంపెనీలు... ⇒ మారుతి సుజుకీలో ప్రారంభ శ్రేణి కార్లు అయిన ఎస్ప్రెస్సోపై రూ.1,29,600, ఆల్టో కే10పై రూ.1,07,600 వరకు ధర తగ్గింది. గ్రాంట్ విటారాపై రూ.1.07 లక్షలు, ఎక్స్ఎల్ 6పై రూ.52,000, ఎర్టిగాపై రూ.46,400 వరకు ధర తగ్గిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇతర అన్ని మోడళ్లపైనా ధరలు తగ్గాయి. ⇒ టాటా మోటార్స్ తన పంచ్ ఎస్‌యూవీపై రూ. 85,000, నెక్సాన్‌పై రూ.1.55 లక్షల వరకు ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కర్వ్‌పై రూ.65,000, హ్యారియ ర్, సఫారీ ధరలు రూ.1.45 లక్షల వరకు తగ్గాయి. ⇒ మహీంద్రా అండ్ మహీంద్రా తన మోడళ్ల ధరలను గరిష్ఠంగా రూ.1.56 లక్షల వరకు తగ్గించింది. ఇందులో పాపులర్ మోడల్ బొలెరో ధర రూ.1.27 లక్షలు తగ్గింది. థార్ డీజిల్ వేరియంట్లపై రూ.1.35 లక్షల వరకు తగ్గింది. ⇒ కియా కార్ల ధరలు రూ.4.48 లక్షల వరకు చౌక అవుతున్నాయి. మెర్సెడెస్ బెంజ్ తన విలాస కార్లు ఏ–క్లాస్‌పై రూ.2 లక్షల వరకు, ఎస్–క్లాస్‌పై రూ.10 లక్షల వరకు ధరలు తగ్గించింది. బీఎండబ్ల్యూ కార్ల ధరలు రూ.13.6 లక్షల మేర తగ్గాయి. జాగ్వార్ ల్యాండ్ రోవర్ వాహన ధరలు రూ.4.5–30.4 లక్షల మధ్య తగ్గాయి. హీరో మోటోకార్ప్ బైక్‌లు, స్కూటర్ల ధరలు రూ.15,743 వర కు, హోండా మోటార్ సైకిల్ వాహన ధరలు 350 సీసీలోపు ఉన్న వాటిపై రూ.18,800 వరకు తగ్గాయి.వీటిపై ఇక నో జీఎస్టీ జీవిత బీమా, ఆరోగ్య బీమాపై ఇప్పటి వరకు 18 శాతం జీఎస్టీ అమల్లో ఉండగా, పూర్తి మినహాయింపు ఇచ్చారు. దీంతో ఈ మేరకు పాలసీ ప్రీమియం ధరలు తగ్గుతాయి. జీవిత బీమా పాలసీల్లోనూ ఎన్నో రకాలున్నాయి. వీటిపై భిన్నమైన జీఎస్టీ అమలవుతోంది. టర్మ్ ఇన్సూరెన్స్‌పై 18 శాతం... ఎండోమెంట్ ప్లాన్లపై మొదటి ఏడాది 4.5 శాతం.. రెండో ఏడాది నుంచి 2.25 శాతం చొప్పున కాల వ్యవధి ముగిసే వరకు ప్రీమియంపై జీఎస్టీ చెల్లించాల్సి వచ్చేది. సింగిల్ ప్రీమియం పాలసీలపై 1.8 శాతం, యులిప్ ప్లాన్లపై (పెట్టుబడి భాగం కాకుండా, బీమా రక్షణ చార్జీలపైనే) 18 శాతం అమల్లో ఉంది. వీటన్నింటిపై జీఎస్టీ మినహాయింపు ఇచ్చారు. ఇకపై ఈ మేరకు ప్రీమియం భారం తగ్గుతుంది. కేన్సర్, జన్యు సంబంధిత, అరుదైన వ్యాధులు, గుండె జబ్బులకు వినియోగించే 33 ఔషధాలను జీఎస్టీ నుంచి మినహాయించారు. వీటికి తోడు 12 శాతం పరిధిలో ఉన్న పలు ఔషధాలను 5 శాతం శ్లాబుకు మార్చడంతో ఈ మేరకు ఉపశమనం లభించనుంది. గ్లూకో మీటర్లు, డయాగ్నోస్టిక్స్ కిట్లు కూడా 5 శాతం కిందకు మారాయి. ఈ మేరకు ఎంఆర్పీలను సవరించాలని, లేదంటే పాత ఎంఆర్పీ రేట్లపై తగ్గించి విక్రయించాలని (సెపె్టంబర్ 22 నుంచి) ఔషధ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. -
సెలబ్రిటీలు మెచ్చిన స్టార్
అమెరికాలో చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి స్వదేశానికి తిరిగి వచ్చిన రేవంత్ హిమంత్సింగ్కా ఫుడ్ లేబుల్స్ చదవడం ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కలిగించడానికి, ఆరోగ్య అక్షరాస్యతను మెరుగుపరచడానికి నడుం కట్టాడు. సర్టిఫైడ్ హెల్త్‌కోచ్ అయిన రేవంత్ జంక్ ఫుడ్ వల్ల కలిగే అనర్థాల గురించి ప్రచారం చేయాలనే లక్ష్యంతో అమెరికా నుంచి ఇండియాకు తిరిగివచ్చాడు. ఒకప్పుడు ఫైనాన్స్, హెల్త్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్...మొదలైన వాటికి సంబంధించి సెల్ఫ్–హెల్ఫ్ బుక్ ప్రచురించాడు. ఇందులో ప్యాకేజ్డ్ గూడ్స్ లేబుల్స్‌పై కూడా ఒక చాప్టర్ ఉంది. సోషల్ మీడియాలో రేవంత్ ఎలా పాపులర్ అయ్యాడు అనే విషయానికి వస్తే...పిల్లల హెల్త్–డ్రింక్ బోర్న్‌విటాపై ఒక వీడియో విడుదల చేశాడు. డ్రింక్‌లో చక్కెర మొత్తాన్ని ఈ వీడియో హైలైట్ చేస్తుంది ఇది సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. ఈ వీడియో పుణ్యమా అని రేవంత్ రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయ్యాడు. ఆ తరువాత ‘ఫుడ్‌ఫార్మర్’ ట్యాగ్‌లైన్‌తో మ్యాగీ, మ్యాంగో జ్యూసెస్లాంటి ప్యాకేజ్డ్ కంటెంట్‌పై అవగాహన కలిగించడానికి మరిన్ని వీడియోలు చేశాడు. సెలబ్రిటీలు కూడా ఈ వీడియోలను షేర్ చేసేవారు.వివిధ వేదికలపై మాట్లాడే ఆహ్వానాలు రావడం, తరచూ పర్యటనలు చేయడం ఇబ్బందిగా మారడంతో కోల్కత్తా నుంచి ముంబైకి మకాం మార్చాడు హిమంత్సింగ్కా. పాఠశాలలో హెల్త్‌పై సబ్జెక్ట్ లేదు. వైద్యులతో కలిసి డయాబెటిస్, పీసీఓఎస్లాంటి సబ్జెక్ట్లపై కోర్సులు రూపొందించాలనుకుంటున్నాను. కోర్సుల ఫీజులను స్వచ్ఛంద కార్యక్రమాలకు వినియోగించాలనుకుంటున్నాను. ప్రజలను ఆరోగ్య అక్షరాస్యులుగా మార్చాల్సిన అవసరం ఉంది’ అంటున్నాడు. ‘ఫుడ్‌ఫార్మర్’గా పాపులర్ అయిన రేవంత్ తాజాగా ‘ఫోర్బ్స్ ఇండియా టాప్ డిజిటల్ స్టార్స్–2024’ జాబితాలో చోటు సంపాదించాడు. View this post on Instagram A post shared by Revant Himatsingka (@foodpharmer)(చదవండి: -
హైదరాబాద్ గోదామును డీలిస్ట్ చేసిన జొమాటో
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన విక్రయదారుగా ఉన్న హైదరాబాద్‌లోని హైపర్ప్యూర్ను డీలిస్ట్ చేసినట్లు ప్రకటించింది. ఇటీవల హైపర్‌ప్యూర్ గోదాములో ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) తనిఖీ నిర్వహించింది. అందులో ఫుడ్ ప్యాక్‌పై తప్పుడు ప్యాకింగ్ తేదీ నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. దాంతో జొమాటో స్పందించింది. కంపెనీ విక్రయదారుగా ఉన్న హైపర్ప్యూర్ను డీలిస్ట్ చేసినట్లు తెలిపింది.హైదరాబాద్‌లోని హైపర్‌ప్యూర్ గోదాములో పుట్టగొడుగుల ప్యాక్‌పై తప్పుడు ప్యాకింగ్ తేదీ నమోదు చేసినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించింది. ఈ వ్యవహారంపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ మాట్లాడుతూ..‘జొమాటో సర్వీసుల్లో భాగంగా హైపర్ప్యూర్తో కలిసి పని చేశాం. కానీ ఇటీవల ఎఫ్ఎస్ఎస్ఏఐ తనిఖీల్లో గోదాములోని అవకతవకలను గుర్తించారు. బటన్ మష్రూమ్కు సంబంధించిన 90 ప్యాకెట్లపై ప్యాకేజింగ్ తేదీ తప్పుగా ముద్రించినట్లు కనుగొన్నారు. జొమాటో ప్రతినిధులు కూడా ఈ సమస్యను గుర్తించారు. ఇది మానవ తప్పిదంగా భావిస్తున్నాం. వెంటనే హైపర్‌ప్యూర్ సర్వీసులను మా డేటాబేస్ నుంచి తొలగిస్తున్నాం. ఈ లోపాన్ని సకాలంలో గుర్తించడంలో మా బృందాలకు సహాయపడే కఠినమైన మార్గదర్శకాలు, సాంకేతిక వ్యవస్థలు మా వద్ద ఉన్నాయి’ అని గోయల్ తెలిపారు.ఇదీ చదవండి: ఆర్బీఐలో ఉద్యోగానికి దరఖాస్తులు.. అర్హతలివే..బిజినెస్-టు-బిజినెస్ (బి2బి) వ్యాపార విభాగమైన జొమాటో హైపర్‌ప్యూర్, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కేటరర్స్‌కు మాంసం, చేపలు, ఇతర ఆహారపదార్థాలు సరఫరా చేస్తుంది. కస్టమర్లకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు గోయల్ చెప్పారు. -
ప్యాకేజీపై అన్ని వివరాలు ఉండాల్సిందే..
ప్యాక్ చేసి విక్రయించే వస్తువులకు సంబంధించిన పూర్తి వివరాలను ప్యాకేజీపై తెలియజేయాలని భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ డ్రాఫ్ట్(ముసాయిదా)ను జారీ చేసింది. అందులో భాగంగా లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) రూల్స్ 2011లో సవరణలు చేయాలని ప్రతిపాదించింది.ఈ సవరణలు ఆమోదం పొందితే ఆఫ్‌లైన్, ఆన్లైన్ మార్కెట్లో విక్రయించే ప్యాకేజ్డ్ కమోడిటీలు అన్నింటికీ ఈ నియమాలు వరిస్తాయని పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం.. అన్నిరకాల వినియోగ వస్తువుల ప్యాక్‌లపై తయారీదారు/ ప్యాకర్/ దిగుమతిదారు పేరు, చిరునామా, వారి మాతృదేశం, ఆ వస్తువుల కామన్, జనరిక్ పేరు, నికర పరిమాణం, తయారు చేసిన నెల, సంవత్సరం, గరిష్ఠ చిల్లర ధర, ఒక్కో యూనిట్ అమ్మకం ధర, ఏ తేదీలోపు వినియోగించాలి, వినియోగదారుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరాలు ఉండాలి. అన్ని బ్రాండ్లకూ ఒకేరకమైన విధానం అమలుచేయడం వల్ల వినియోగదారులకు ఆ వస్తువుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే వీలవుతుందని ప్రభుత్వం తెలిపింది.జులై 29, 2024లోపు ప్రతిపాదిత సవరణలపై వినియోగదారులు, తయారీదారులు తమ అభిప్రాయాలను కేంద్ర వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖకు సమర్పించవచ్చని ప్రభుత్వ ప్రకటనలో పేర్కొన్నారు.ఇదీ చదవండి: విదేశీ వర్కర్ల భద్రతకు మరిన్ని కఠిన నిర్ణయాలుఈ ప్రతిపాదనల నుంచి మినహాయింపు ఉన్న వస్తువులు25 కిలోగ్రాములు లేదా 25 లీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న ప్యాకేజీలు.50 కేజీలు లేదా అంతకంటే ఎక్కువ పరిమాణంలో విక్రయించే సిమెంట్, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు.పారిశ్రామిక లేదా సంస్థాగత వినియోగదారుల కోసం ఉద్దేశించిన ప్యాకేజీ వస్తువులు. -
ఇంట్లో కంటే బయటి దానికే ఎక్కువ ఖర్చు
మారుతున్న జీవనప్రమాణాల కారణంగా మనం తీసుకునే ఆహారంలోనూ విభిన్న ధోరణి కనిపిస్తుంది. గడిచిన దశాబ్దకాలంలో పట్టణ ప్రాంతంలోని ప్రజలు ఆహారం విషయంలో దేనికి ఎక్కువగా ఖర్చు చేస్తున్నారో తెలియజేస్తూ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇప్లిమెంటేషన్(మోస్పీ), ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఆసక్తికర నివేదికను విడుదల చేశాయి. నివేదిక వివరాల ప్రకారం.. దశాబ్దకాలంలో ఆహార ఖర్చులు పెరిగాయి. మొత్తం ఫుడ్ బడ్జెట్లో ఇంట్లో ఆహారం తయారీకి 2012లో 42.6 శాతం వెచ్చించేవారు. ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ వంటి బయటి ఆహారానికి 57.4 శాతం ఖర్చు చేశారు. అదే 2023లో ఇంట్లో ఫుడ్ తయారీకి 39.7 శాతం, బయటిఫుడ్ కోసం 60.3శాతం ఖర్చు చేసినట్లు తెలిసింది. అందులో భారీగా ప్రాసెస్డ్ ఫుడ్, బెవరేజెస్‌కు ఎక్కువగా డబ్బు వెచ్చించినట్లు నివేదికలో తెలిపారు. కింద ఇచ్చిన వివరాల ద్వారా కేటగిరీవారీగా ఎంత శాతం ఖర్చుచేశారో తెలుసుకోవచ్చు. ఇదీ చదవండి: 100 నుంచి 75 వేల పాయింట్ల వరకు ప్రస్థానం 2012లో.. 2023లో.. బేవరేజెస్, ప్రాసెస్డ్ఫుడ్ 9 శాతం 10.5 శాతం పాలు, పాల ఉత్పత్తులు 7 శాతం 7.2 శాతం తృణధాన్యాలు 6.6 శాతం 4.5శాతం కూరగాయలు 4.6 శాతం 3.8 శాతం గుడ్లు/ ఫిష్/ మాంసం 3.7 శాతం 3.5 శాతం పండ్లు/ డ్రైఫ్రూట్స్ 3.4 శాతం 3.8 శాతం పప్పులు 1.9 శాతం 1.2 శాతం చక్కెర, ఉప్పు 1.2 శాతం 0.6 శాతం -
ప్యాకేజ్డ్ ఉత్పత్తుల ముద్రణలో కీలక మార్పులు..
న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ ఉత్పత్తులు అన్నింటిపై ‘తయారీ తేదీ’ని, ‘యూనిట్ విక్రయ ధర’ను తప్పనిసరిగా ముద్రించాలన్న నిబంధన జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. ఇలాంటి ఉత్పత్తులను వేర్వేరు పరిమాణాల్లో విక్రయిస్తారు కాబట్టి ‘యూనిట్ విక్రయ ధర’ ఎంతనేది వినియోగదారులకు తెలియాల్సిన అవసరం ఉందని, తద్వారా వారు కొనుగోలు విషయంలో తగు నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. గతంలో ప్యాకేజ్డ్ ఉత్పత్తులపై తయారీ తేదీని లేదా దిగుమతి చేసుకున్న తేదీని లేదా ప్యాక్ చేసిన తేదీని ముద్రించేందుకు కంపెనీలకు వెసులుబాటు ఉండేది. దాన్ని ప్రస్తుతం మార్చారు. తయారీ తేదీని ముద్రించడం వల్ల సదరు ఉత్పత్తి ఎన్నాళ్ల క్రితం తయారైనదీ వినియోగదారులకు స్పష్టంగా తెలిసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే యూనిట్ ధరను ముద్రించడం వల్ల గ్రాముల లెక్కన ఖరీదు ఎంత ఉంటోందో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు 2.5 కేజీల గోధుమ పిండి ప్యాకెట్‌పై గరిష్ట చిల్లర ధరతో (ఎంఆర్పీ) పాటు కేజీ (యూనిట్) ధర ఎంత అనేది కూడా ముద్రించాల్సి ఉంటుంది. ఒకవేళ కేజీ కన్నా తక్కువ పరిమాణం ఉంటే ఎంఆర్పీతో పాటు గ్రాముకి ఇంతని ముద్రించాలి. -
వందే భారత్‌లో 6 నెలలు అవన్నీ బ్యాన్.. ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం!
ఇండియన్ రైల్వే దినదినాభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగానే మరింత వేగవంతమైన ప్రయాణం కోసం గత కొంత కాలంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పుట్టుకొస్తున్నాయి. నేడు చాలామంది దూరప్రయాణాలు చేసేవారు కూడా వందే భారత్‌లో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతున్నారు. కాగా కొంతమంది ప్యాసింజర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా రైల్వే శాఖ ఇప్పుడు కొన్ని మార్పులు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, వందే భారత్ ట్రైన్లలో లంచ్ లేదా డిన్నర్ ఆర్డర్ చేసే ప్రయాణికులకు మెనూలో లేని పదార్థాలు కూడా విక్రయిస్తున్నారని, ఫుడ్ ఐటమ్ కవర్లన్నీ కొందరు కోచ్‌లోనే పడేయడం వల్ల అపరిశుభ్రత ఏర్పడుతోందని, ఇది ప్రయాణికుల సౌకర్యానికి భంగం కలిగిస్తుందని కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రయాణికుల ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ బేకరీ ఉత్పత్తులు, స్వీట్స్, కూల్ డ్రింక్స్, లా కార్టే ఐటెమ్స్ వంటి వాటిని ఆరు నెలలు పాటు నిషేదించింది. ఫుడ్ కవర్లు కోచ్‌లో ఉండటం వల్ల.. కొన్ని సార్లు ఆటోమాటిక్ డోర్లు ఓపెన్ అవుతున్నాయి. అంతే కాకుండా వ్యర్దాల వల్ల కోచ్‌లో దుర్వాసన కూడా వ్యాపిస్తోంది. ఈ కారణాల వల్ల రైల్వేశాఖ ఈ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఇదీ చదవండి: భారత్ మీదే ఆశలన్నీ.. జర్మన్, జపనీస్ కంపెనీల తీరిది! ఇప్పటి వరకు వందే భారత్ రైళ్లలో ఎలాంటి ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారనే విషయం మీద కూడా కొంత గందరగోళం నెలకొంది. అయితే ఇకపై బుక్ చేసేటప్పుడు బుకింగ్ సమయంలోనే ప్రయాణానికి ముందు రీకన్ఫర్మేషన్ క్యాటరింగ్ సర్వీస్ వివరాలు ప్రయాణికులకు మెసేజ్ రూపంలో వస్తాయి. ఇది ప్రయాణికులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. -
పెరుగు, లస్సీపై జీఎస్టీ విషయంలో వెనక్కి తగ్గిన కేంద్రం
-
ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తులపై జీఎస్టీ బాదుడు.. పెరుగు, మజ్జిగలపైనా పెంపు
న్యూఢిల్లీ: నిత్యావసర ఉత్పత్తులపై జీఎస్టీ బాదుడు షురూ అయింది. 25 కిలోలు/లీటర్లు, అంతకులోపు పరిమాణంలో ఉండే ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తులపై (బ్రాండెడ్ కాకపోయినా) కొత్తగా 5 శాతం జీఎస్టీ పడనుంది. ప్యాక్ చేసి విక్రయించే గోధుమ పిండి, మైదా వంటి అన్ని రకాల పిండులు, బియ్యం, గోధుమల వంటి ధాన్యాలు, పప్పు దినుసులు తదితరాలన్నింటికీ ఇది వర్తిస్తుంది. వీటిని ‘ప్రీ ప్యాకేజ్డ్, లేబుల్డ్ కమోడిటీ’ విభాగం కిందకు చేరుస్తూ 5 శాతం జీఎస్టీని కేంద్రం సోమవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. వీటిని లూజ్‌గా కొనుగోలు చేస్తే ఈ పన్నుండదని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) పేర్కొంది. అలాగే 25 కిలోలకు/లీటర్లకు మించిన పరిమాణంలో విక్రయించినా జీఎస్టీ పడదని స్పష్టం చేసింది. కొత్త పన్ను రేట్లపై సందేహాలను నివృత్తి చేస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ధరలు పెంచిన ప్రముఖ సంస్థలు పెరుగు, మజ్జిగ, పనీర్, టెట్రా ప్యాక్‌లో విక్రయించే పానీయాలపైనా జీఎస్టీ 12 నుంచి 18 శాతానికి పెరిగింది. ఈ నిర్ణయాన్ని ప్రముఖ సంస్థలు అమల్లోకి తీసుకొచ్చేశాయి. బటర్‌మిల్క్, పెరుగు, లస్సీ, టెట్రా ప్యాక్‌ల్లో విక్రయించే పానీయాలపై ధరలను 5 శాతం పెంచినట్టు అమూల్ బ్రాండ్ పేర్కొంది. కొత్త జీఎస్టీ రేట్ల ప్రకారం ధరలను సవరిస్తున్నట్టు మదర్ డెయిరీ కూడా మంగళవారమే ప్రకటన జారీ చేసింది. ఇదీ చదవండి: ఇలా అయితే జీఎస్టీ ఉండదు: నిర్మలా సీతారామన్ క్లారిటీ -
ఇలా అయితే జీఎస్టీ ఉండదు: నిర్మలా సీతారామన్ క్లారిటీ
సాక్షి, ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా ద్వారా కీలక ప్రకటన చేశారు. ప్యాకేజీ ఫుడ్స్, ఆసుపత్రి బెడ్స్‌పై 5 శాతం జీఎస్టీ బాదుడుపై విమర్శలు చెలరేగిన నేపథ్యంలో జీఎస్టీ వర్తించని కొన్నివస్తువుల జాబితాను విడుదల చేశారు. జీఎస్టీపై గందరగోళం నెలకొనడంతో సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ప్రీప్యాకింగ్ లేదా లేబెల్డ్ చేసి విక్రయిస్తేనే జీఎస్టీ వర్తిస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఓట్స్, మొక్కజొన్న, బియ్యం, పప్పు, బియ్యం, రవ్వ, సెనగపిండి, పెరుగు, లస్సీ, మరమరాలు వంటి నిత్యావసర వస్తువులను బ్రాండెడ్‌గా, ప్యాక్ చేసి విక్రయిస్తే మాత్రమే పన్ను ఉంటుందని ఆమె వివరణ ఇచ్చారు. ఇవే ఉత్పత్తులను విడిగా, ప్యాక్ చేయకుండా, విక్రయిస్తే జీఎస్టీ వర్తించదని ఆర్థికమంత్రి వెల్లడించారు. లూజ్‌గా లేదా, బహిరంగ విక్రయాలపై జీఎస్టీ వర్తించదు అంటూ 14 వస్తువుల జాబితాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ట్వీట్ చేశారు. లేబుల్ లేని లేదా ప్యాక్ చేయని, విడిగా అమ్మే వస్తువులపై జీఎస్టీ ఉండదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వరుస ట్వీట్లలో స్పందించిన నిర్మలా సీతారామన్ గత నెలలో జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశం ఏకగ్రీవ నిర్ణయం ప్రకారం చర్య తీసుకున్నామంటూ పన్ను పెంపును సమర్ధించుకున్నారు. The @GST_Council has exempt from GST, all items specified below in the list, when sold loose, and not pre-packed or pre-labeled. They will not attract any GST. The decision is of the @GST_Council and no one member. The process of decision making is given below in 14 tweets. pic.twitter.com/U21L0dW8oG — Nirmala Sitharaman (@nsitharaman) July 19, 2022 -
నిబంధనలకు విరుద్ధంగా... మల్టీప్లెక్స్, థియేటర్లలో ధరల బాదుడు
సాక్షి హైదరాబాద్: మల్టీప్లెక్స్, థియేటర్లలో ‘దోపిడీ’ ఆగడం లేదు. ప్యాకేజ్డ్ కమొడిటీస్ చట్టం అమలు మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. నిర్దేశించిన ధరలకే అన్ని రకాల వస్తువులు, ఆహార పదార్థాలు విక్రయించాలన్న ప్రభుత్వ ఆదేశాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్యాక్ చేసిన కొన్ని వస్తువుల ఎమ్మార్పీపై సైతం బాదేస్తున్నారు. ఆహార పదార్థాలపై మాత్రం ఇష్టారీతిన స్టిక్కర్లు వేసి అమ్మకాలు సాగిస్తున్నారు. యథేచ్ఛగా దోపిడీ.. ఐఎస్ఐ బ్రాండ్ లీటర్ మంచినీళ్ల ధర బహిరంగ మార్కెట్లో రూ.19. మల్టీప్లెక్స్‌లో మాత్రం రూ. 25కు అమ్ముతున్నారు. 400 ఎంఎల్ కోకాకోలా ధర రూ.70., ఎగ్‌పఫ్ రూ.50, సమోసా 40. పాప్‌కార్న్ రూ.160కు విక్రయించడం సర్వసాధారణమైంది. ఇక పాప్‌కార్న్, కూల్‌డ్రింక్ కంబై¯Œన్డ్ అప్‌సైజ్ కపుల్ కాంబోను జీఎస్టీ ధర చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ధరల సూచికలో పేర్కొన్న వాటి కంటే ఎక్కువగానే వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. సంబంధిత నిర్వాహకులను నిలదీస్తే కేవలం ప్యాకేజ్డ్ ఫుడ్ ఎమ్మార్పీ ధరలకు విక్రయించాలని నిబంధన ఉందని, ప్యాకింగ్ లేని ఆహార పదార్థాల విషయంలో నిబంధనలు తమకు వర్తించవన్నట్లుగా వ్యవహరించడం గమనార్హం. దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన తూనికలు, కొలతల శాఖ ప్రేక్షక పాత్ర పోషించడం విస్మయానికి గురిచేస్తోంది. నిబంధనలు ఇలా.. తినుబండారాలు, మంచినీటి బాటిళ్లు, కూల్డ్రింకులు నిర్ణీత ధరలకే విక్రయించాలి. విడిగా అమ్మే తినుబండారాలు అందించే కంటైనర్లపై బరువు, పరిమాణం, తయారీ గడువు, తేదీలతో పాటు ఎ మ్మార్పీ స్పష్టంగా కనిపించేలా స్టిక్కర్ ఉండాలి. ఇవన్నీ వినియోగదారులుకు స్పష్టంగా కనిపించేలా బోర్డుపై ప్రదర్శించాలి. ధర మారితే ఎప్ప టికప్పుడు మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంది. ఒకే బ్రాండ్ తినుబండారాలు కాకుండా వివిధ బ్రాండ్స్ అందుబాటులో ఉంచాలి. ప్యాకేజ్డ్ రూపంలో ఉన్న వస్తువులపై తయారీదారు పూర్తి చిరునామా, వస్తువు పేరు, తయారీ తేదీ, నికర బరువు, ఎమ్మార్పీ, కస్టమర్ కేర్ వివరాలు ఉంచాలి. ఎమ్మార్పీ ఉన్న ఫుడ్స్ మాత్రమే విక్రయించాలి. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్, వాట్సాప్ నంబర్ ప్రదర్శించాలి. కేసులకే పరిమితం మల్టీప్లెక్స్, థియేటర్లలో మంచినీటి బాటిళ్లు, కూల్‌డ్రింక్స్, ఇతర తినుబండారాలు ఎమ్మార్పీపై కనీసం ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా చర్యలు తప్పవన్న తూనికలు, కొలతల శాఖ కేవలం కేసుల నమోదుతో చేతులు దులుపుకొంటోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి కేసు నమోదు చేసి రూ. 25 వేలు జరిమానా, రెండోసారి నిబంధనల ఉల్లంఘనకు రూ. 50 వేలు, మూడోసారి రూ. లక్ష జరిమానాతో పాటు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష విధించాల్సి ఉంటుంది. అధికారులు మల్టీప్లెక్స్, థియేటర్ల వైపు కనీసం కన్నెత్తి చూడకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. -
ప్యాకేజ్డ్ కమోడిటీ: అంకెల మాయాజాలానికి చెక్
న్యూఢిల్లీ: బిస్కెట్ ప్యాకెట్‌పై బరువు ఎంత ఉందని చూస్తే.. 88 గ్రాములుగా కనిపిస్తుంది. అదే గోధుమ పిండి ప్యాకెట్ 3.5 కేజీలతో ఉంటుంది. ఈ తరహా అనుభవాలు వినియోగదారులకు సర్వ సాధారణం. ఉత్పత్తుల విక్రయంలో వివిధ కంపెనీల మధ్య ఏకరూపత కనిపించదు. దీనివల్ల ధరలను పోల్చుకోవడం వినియోగదారులకు సాధ్యపడదు. అందుకనే కంపెనీలు వ్యూహాత్మకంగా నిత్యావసరాల ప్యాకేజీ ఉత్పత్తులపై అంకెల ట్రిక్కులను అనుసరిస్తుంటాయి. కానీ, ఇకపై ఇవి కుదరవు. ప్రతీ ప్యాకెట్‌పై గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ) ఉండాల్సిందే. అలాగే, యూనిట్ ధర ఎంతన్నదీ ముద్రించాల్సి ఉంటుంది. ఈ మేరకు లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీలు) నిబంధనలు, 2011కు కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ సవరణలు తీసుకొచ్చింది. వచ్చే ఏప్రిల్ నుంచి ఇవి అమల్లోకి రానున్నట్టు సంబంధిత శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ధరలు ఇలా ముద్రించాలి.. కిలోకు మించిన బరువుతో ఉండే ప్యాకెట్లపై ఎంఆర్పీతోపాటు. ఒక కిలో ధర ఎంతన్నదీ ముద్రించాలి. కిలో కంటే తక్కువ బరువుతో ఉండే ఉత్పత్తులపై ఎంఆర్పీతోపాటు.. ఒక గ్రాము ధర ఎంతన్నదీ ప్రచురించాలి. ఏ పరిమాణంలో అయినా సరే.. షెడ్యూల్2 రద్దు కానుంది. కంపెనీలు 100 గ్రాములు, 200 గ్రాములు, 500 గ్రాములు, ఒక కిలో, 1.25 కిలో, 1.5 కిలో, 1.75 కిలో, 2 కిలోలు, 5కిలోల పరిమాణాల్లోనే 19 రకాల కమోడిటీలను విక్రయించాలని షెడ్యూల్2 నిర్ధేశిస్తోంది. వీటికి భిన్నమైన పరిమాణాల్లో విక్రయించాలంటే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో అన్ని కంపెనీలు అనుమతులు పొందడం లేదని గుర్తించడంతో.. కంపెనీలకు స్వేచ్ఛనిచ్చే ఉద్దేశంతో షెడ్యూల్ 2ను రద్దు చేస్తూ సవరణ తీసుకొచ్చారు. రూపాయిల్లో పేర్కొంటే చాలు.. ప్రస్తుతం ఉత్పత్తులపై ఎంఆర్పీని పైసలతోపాటు పేర్కొనాల్సి ఉండగా.. ఇకమీదట రూపీల్లో పేర్కొంటే సరిపోతుందని నిబంధనల్లో సవరణలు తీసుకొచ్చారు. అలాగే, ప్యాకెట్‌పై నంబర్లలో లేదా యూనిట్లో పరిమాణాన్ని పేర్కొంటే సరిపోతుంది. లేదంటే ఎన్ని పీసులు, ఎన్ని సెట్లు ఉన్నాయో కూడా పేర్కొనవచ్చు. ఇక దిగుమతి చేసుకునే కమోడిటీలపై ప్రస్తుతం కంపెనీలు దిగుమతి తేదీ లేదా తయారీ తేదీ లేదా తిరిగి ప్యాకేజీ చేసిన తేదీని పేర్కొనే ఆప్షన్ కలిగి ఉన్నాయి. దీని స్థానంలో ఇక మీదట తయారీ తేదీ ఒక్కటే తెలియజేయాల్సి ఉంటుంది. వినియోగదారులకు తయారీతేదీ ఒక్కటే ప్రామాణికం కనుక ఈ మార్పును తీసుకొచ్చారు. -
ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ షేర్లు హాట్.. హాట్
రెండు రోజులుగా అమెరికా మార్కెట్ల పతనం, చైనాతో సరిహద్దు వద్ద వివాదాలు దేశీ స్టాక్ మార్కెట్లను దెబ్బతీస్తున్నప్పటికీ ఎంపిక చేసిన కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ట్రెండ్‌కు ఎదురీదుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా ఇటీవల కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీలు హిందుస్తాన్ ఫుడ్స్ లిమిటెడ్, డీఎఫ్ఎం ఫుడ్స్ లిమిటెడ్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. వెరసి వారాంతాన నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో మరోసారి సందడి చేశాయి. ఇందుకు ప్రధానంగా కోవిడ్-19 నేపథ్యంలో ప్యాకేజ్డ్ ఫుడ్‌కు పెరుగుతున్న ఆదరణ కారణమవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ఈ ఏడాది క్యూ1లో హిందుస్తాన్ ఫుడ్స్ పటిష్ట ఫలితాలు సాధించడం జత కలిసినట్లు తెలియజేశారు. ఎఫ్ఎంసీజీ విభాగంలో కార్యకలాపాలు విస్తరించిన ఈ కంపెనీలు ఇకపై మెరుగైన పనితీరును చూపవచ్చన్న అంచనాలు సైతం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నట్లు వివరించారు. వివరాలు చూద్దాం.. హిందుస్తాన్ ఫుడ్స్ లిమిటెడ్ శుక్రవారం వరుసగా మూడో రోజు హిందుస్తాన్ ఫుడ్స్ కౌంటర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. దీంతో ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 858 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. గత 2 రోజుల్లోనూ అప్పర్ సర్క్యూట్లను తాకుతూ వచ్చింది. అంతేకాకుండా ఈ ఏడాది మార్చిలో నమోదైన కనిష్టం రూ. 380 నుంచి చూస్తే 126 శాతం దూసుకెళ్లింది. కంపెనీ ప్రధానంగా హిందుస్తాన్ యూనిలీవవర్, పెప్సీ కో తదితర ఎఫ్ఎంసీజీ దిగ్గజాలకు కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రొడక్టులను తయారు చేసి విక్రయిస్తుంటుంది. డీఎఫ్ఎం ఫుడ్స్ లిమిటెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ విభాగంలో క్రాక్స్, కర్ల్స్, నట్‌ఖట్ తదితర బ్రాండ్లు కలిగిన డీఎఫ్ఎం ఫుడ్స్ కౌంటర్ శుక్రవారం వరుసగా నాలుగో రోజూ వెలుగులో నిలిచింది. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 7 శాతం జంప్‌చేసింది. రూ. 360ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. చివరికి 2.6 శాతం లాభంతో రూ. 342 వద్ద స్థిరపడింది. గత 4 సెషన్లలోనే డీఎఫ్ఎం ఫుడ్స్ షేరు 24 శాతం ర్యాలీ చేసింది. ఈ బాటలో 2020 మార్చిలో నమోదైన కనిష్టం రూ. 154 నుంచి షేరు 133 శాతం జంప్ చేయడం గమనార్హం. -
ప్యాకేజ్డ్ ఫుడ్‌తో నో ప్రాబ్లమ్
క్షి, హైదరాబాద్: ఆహార పదార్థాల ద్వారా కరోనా వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉం దనే దానికి ఎలాంటి ఆధారాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. అయితే, ఆహార పదార్థాల వినియోగం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్యాకేజ్డ్ ఫుడ్‌తో వైరస్ వ్యాప్తి జరగదని వెల్లడించింది. ఏ ఆహార పదార్థమైనా పరిమిత స్థాయిలో తీసుకోవాలని, వినియోగానికి ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఫలానా పదార్థాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కరోనా రాదనే ప్రచారంలో వాస్తవం లేదని తెలిపింది. డబ్ల్యూహెచ్‌వో చెబుతున్న జాగ్రత్తలివీ.. ►ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయల ద్వారా కోవిడ్–19 వ్యాప్తి చెందుతుందన్న దానికి ఆధారాల్లేవు. తగిన జాగ్రత్తలతో తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ►పండ్లు, కూరగాయలను వాడే ముందు శుభ్రపరచాలి. ముందుగా చేతుల్నిసబ్బుతో కడుక్కున్నాక ముట్టుకోవాలి. ఆపై వాటిని స్వచ్ఛమైన నీటితో కడగాలి. పచ్చివి తినాల్సి వస్తే మరింత శుభ్రంగా కడగాలి. ► జీవం ఉన్న జంతువులు, మనుషుల్లోనే వైరస్ బతికి ఉండడంతో పాటు, వైరస్ వ్యాప్తికి అవకాశం ఉంది. ప్యాకేజీ ఉపరితలాల ద్వారా వైరస్ వ్యాపించదు. కాబట్టి ప్యాకేజీ ఫుడ్ హానికరం కాదు. ఈ ఫుడ్ ప్యాకెట్లను శానిటైజ్ చేయాల్సిన పనిలేదు. కానీ వాటిని ముట్టుకునే ముందు, తినేటప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ►ఆహార పదార్థాల్లో ఉండే ఇతర వైరస్లు, బ్యాక్టీరియాల మాదిరిగానే నిర్ణీత ఉష్ణోగ్రత వరకు ఉడికిస్తే కరోనా వైరస్ కూడా చనిపోతుంది. మాంసం, గుడ్లను కనీసం 70 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉడికించాలి. అయితే, మాంసం పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ►గృహావసరాల కోసం మార్కెట్లు, మాల్స్‌కు వెళ్లినంత మాత్రాన కరోనా సోకదు. కానీ మాల్స్, మార్కెట్లలోకి ప్రవేశించే ముందు చేతులు శానిటైజ్ చేసుకోవాలి. దగ్గు లేదా తుమ్ము వస్తే మోచేతిని అడ్డుపెట్టుకోవాలి. కనీసం మీటర్ భౌతికదూరం పాటించాలి. మాస్క్ రక్షణ తప్పనిసరి. సరుకులు తీసుకుని ఇంటికి వెళ్లాక చేతులు కడుక్కోవాలి. ►నిత్యావసరాల హోం డెలివరీ కారణంగా వైరస్ వ్యాపించదు. కానీ ఆ సరుకులు తెచ్చే వ్యక్తులు జాగ్రత్తలు పాటించాలి. సరుకులు తీసుకున్న తర్వాత చేతులు చాలా జాగ్రత్తగా, శుభ్రంగా కడుక్కోవాలి. ►వైరస్ బారినపడకుండా బలమైన ఆహారం తీసుకోవడం అవసరమే. మంచి ఆహారపుటలవాట్లు కలిగి ఉండాలి. ధాన్యాలు, పండ్లు, మాంసం, కూరగాయలు, గింజలు, పీచు పదార్థాలు ఎక్కువ తినాలి. పసుపు, అల్లం ఎక్కువగా తీసుకుంటే కరోనా రాదనే ప్రచారంలో వాస్తవం లేదు. ►హెర్బల్ టీ ఆరోగ్యపరంగా మంచిదే. కానీ కరోనా వైరస్‌ను నివారించదు. ఏ ఆహార పదార్థమైనా పరిమిత స్థాయిలో తీసుకోవడమే మేలు. -
ప్యాకేజ్డ్ ఫుడ్‌పై అదాని దృష్టి...
♦ ఆహార వ్యాపారం వాటా 25% లక్ష్యం ♦ ప్రస్తుతం ఆదాయం రూ. 18,000 కోట్లు ♦ మరో 5 లక్షల టన్నుల సామర్థ్యంతో రిఫైనరీలు ♦ అదాని విల్మర్ సీవోవో ఆంగ్షూ మల్లిక్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్రాండెడ్ వంటనూనెల విక్రయంలో మొదటి స్థానంలో ఉన్న అదాని విల్మర్ ఇప్పుడు ప్యాకేజ్డ్ ఫుడ్ విభాగంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రకటించింది. బ్రాండెడ్ ఆహార పదార్థాల వినయోగం పెరుగుతుండటంతో ఈ రంగంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు అదాని విల్మర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆంగ్షూ మల్లిక్ తెలిపారు. ‘ఫార్చూన్’ బ్రాండ్ పేరుతో బియ్యం, పప్పులు, పిండి, సోయా నగెట్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బాసుమతి బియ్యాన్ని మాత్రమే విక్రయిస్తున్నామని, తెలుగు రాష్ర్ట ప్రజలకోసం త్వరలోనే సోనామసూరి, ఇతర రకాల బ్రాండెడ్ బియ్యాలను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం మొత్తం వ్యాపారంలో ఆహార పదార్థాల విభాగం కేవలం 5 శాతంగా ఉందని, వచ్చే నాలుగేళ్లలో దీన్ని 25 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మల్లిక్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆహార పదార్థాల ఉత్పత్తుల సామర్థ్యం 2.5 లక్షల టన్నులుగా ఉందని, దీన్ని వచ్చే నాలుగేళ్లలో 10 లక్షల టన్నులకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందుకోసం స్థానిక రైస్, ఫ్లోర్ మిల్లుల యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నామన్నారు. ప్రస్తుతం అదాని విలమర్ వ్యాపారం సుమారు రూ. 18,000 కోట్లు ఉండగా, ఇందులో రూ. 3,500 కోట్లు ఆహార విభాగం నుంచి వస్తుండగా, మిగిలినది వంటనూనెల నుంచి వస్తున్నట్లు తెలిపారు. దేశంలో బ్రాండెడ్ వంటనూనెల వ్యాపారం ఏటా సగటున 15 శాతం చొప్పున వృద్ధి చెందుతోందన్నారు. ఇదే విధంగా వచ్చే నాలుగేళ్లు వృద్ధి చెందితే తమ రిఫైనరీ సామర్థ్యాన్ని ప్రస్తుత 30 లక్షల టన్నుల నుంచి 35 లక్షల టన్నులకు పెంచాల్సి వస్తుందన్నారు. అదాని గ్రూపునకు కృష్ణపట్నం, మంత్రాలయంలతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 22 సొంత రిఫైనరీలు, 24 లీజ్ ఆధారిత రిఫైనరీలను కలిగి వుంది. దేశవ్యాప్తంగా ఏటా 185 లక్షల టన్నుల వంట నూనెలు వినియోగిస్తుంటే ఇందులో బ్రాండెడ్ వాటా 55 శాతంగా ఉంది. అదానికి చెందిన ‘ఫార్చూన్’ బ్రాండ్ 19.5% మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో ఉంది. దేశంలో సగటను ప్రతి మనిషి ఏటా 16 లీటర్ల వంట నూనెలను వినియోగిస్తున్నారని, ఇది ప్రపంచ సగటు 24 లీటర్ల కంటే తక్కువగా ఉండటంతో ఈ రంగంలో విస్తరణకు అనేక అవకాశాలున్నట్లు మల్లిక్ వివరించారు. పేటీఎంతో ఒప్పందం: తెలుగు రాష్ట్రాల్లో ‘ఫార్చూన్’ బ్రాండ్‌ను విస్తరణకు అదాని విల్మర్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాయి. ఫార్చూన్ సన్ ఫ్లవర్ ఆయిల్ కొనుగోలు చేసిన వారికి క్యాష్ బ్యాక్‌తో పాటు, బంగారం, కార్లు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. పేటీఎం ద్వారా నగదు చెల్లించిన వారికి లీటరుకు రూ. 30, 5 లీటర్లకు రూ. 100 క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్నారు. ఈ ఆఫర్ మార్చి 15 వరకు అమల్లో ఉంటుంది.


