breaking news
Kushagra Ojha
-
IND vs SL: శ్రీలంకను మట్టికరిపించిన భారత్
శ్రీలంకతో రెండో అనధికారిక టెస్టులో భారత అండర్-19 జట్టు అదరగొట్టింది. ఆతిథ్య జట్టును ఏకంగా 211 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది.తొలి టెస్టు డ్రా కాగా మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా వన్డే సిరీస్‌ను ఆతిథ్య లంక యువ జట్టు 2-1తో వశం చేసుకోగా.. ఇరుజట్ల మధ్య గాలె వేదికగా తొలి అనధికారిక టెస్టు డ్రా అయింది.తొలి ఇన్నింగ్స్‌లో 411ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సోమవారం రెండో అనధికారిక టెస్టు మొదలైంది. కొలంబోలో టాస్ గెలిచిన శ్రీలంక అండర్-19 తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది. తొలి ఇన్నింగ్స్‌లో 105.2 ఓవర్లలో 411 పరుగుల మేర భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది.శతక్కొట్టిన కుశాగ్ర, మనాల్మొదటి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లలో ఓపెనర్లు లక్ష్య రాజేశ్ రాయ్ చందాని, సాగర్ విర్క్ డకౌట్ అయ్యారు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ కుశాగ్ర ఓజా (111), ఐదో స్థానంలో వచ్చిన మనాల్ చౌహాన్ (150) శతకాలతో అదరగొట్టారు. వీరికి తోడుగా కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ అర్ధ శతకం (78)తో రాణించాడు. లోయర్ ఆర్డర్లో చిగురుపాటి వెంకట 25 పరుగులు రాబట్టాడు.148 పరుగులకే లంక ఆలౌట్ఇక శ్రీలంక బౌలర్లలో గిమ్హాన్ మెండిస్ మూడు వికెట్లు తీయగా.. సెత్మిక సెనెవిరత్నె, దుల్నిత్ సిగెర, విఘ్నేశ్వరన్ ఆకాశ్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 148 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ దిమంత మహావితన 24, విరాన్ చముదిత 21, దుల్నిత్ సిగెర 31, సెత్మిక 25 పరుగులతో ఫర్వాలేదనిపించారు.భారత బౌలర్లలో ప్రణవ్ రాఘవేంద్ర, చిగురుపాటి వెంకట, జగన్నాథన్ హెంచుదేశన్, రోహిత్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. కావ్యా పటేల్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 148 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్‌కు 263 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.లక్ష్యం 472ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. మూడు వికెట్ల నష్టానికి 208 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈసారి ఓపెనర్లలో లక్ష్య రాయ్‌చందాని అజేయ శతకం (116 బంతుల్లో 100)తో మెరవగా.. సాగర్ విర్క్ (17) నిరాశపరిచాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఆర్యన్ సక్పా (6) విఫలం కాగా.. కెప్టెన్ యశ్వర్దన్ 20 పరుగులు చేయగలిగాడు. మనాల్ చౌహాన్ 51 పరుగలతో అజేయంగా నిలిచాడు.211 పరుగుల తేడాతో భారత్ జయభేరిఇక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని (263+208).. భారత్ శ్రీలంకకు 472 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. గురువారం నాటి ఆఖరి రోజు ఆటలో భాగంగా కేవలం 260 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ 211 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.చెలరేగిన భారత బౌలర్లులక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లలో సెనుజ వెకునగొడ (64), కెప్టెన్ విమత్ దిన్సార (64) అర్ధ శతకాలతో రాణించగా.. కవిజ గెమాగే 36, సెత్మిక 42 పరుగులతో ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రోహిత్ యాదవ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. చిగురుపాటి వెంకట మూడు వికెట్లు దక్కించుకున్నాడు. మిగిలిన వారిలో ప్రణవ్ రాఘవేంద్ర, జగన్నాథన్ హెంచుదేశన్, యశ్వర్దన్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.శ్రీలంక వర్సెస్ భారత్ రెండో అనధికారిక టెస్టు సంక్షిప్త స్కోర్లుభారత్: 411 & 208/3 డిక్లేర్డ్శ్రీలంక: 148 & 260చదవండి: IND vs ZIM: తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే! -
IND vs SL: శ్రీలంక ఆలౌట్.. భారీ ఆధిక్యంలో భారత్
భారత్ అండర్-19 జట్టుతో రెండో అనధికారిక టెస్టులో శ్రీలంక యువ జట్టు స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 148 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కాగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్- శ్రీలంక అండర్-19 జట్ల మధ్య సోమవారం రెండో యూత్ టెస్టు మొదలైంది.తొలిరోజే కుశాగ్ర సెంచరీకొలంబోలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో తొలి రోజు ఆట నిలిచే సమయానికి 65 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.ఓపెనర్లు లక్ష్య (0), సాగర్ (0) డకౌట్ కావడంతో... స్కోరు బోర్డు మీద ఒక్క పరుగు చేరకముందే మన జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ యశ్వర్ధన్తో కలిసి వన్‌డౌన్ బ్యాటర్ కుశాగ్ర ఓజా ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. కుశాగ్ర ఓజా శతకం (177 బంతుల్లో 103 బ్యాటింగ్; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సాధించగా... కెప్టెన్ యశ్వర్ధన్ చౌహాన్ (89 బంతుల్లో 78; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), మనల్ చౌహాన్ (108 బంతుల్లో 55 బ్యాటింగ్; 7 ఫోర్లు) అర్ధసెంచరీలతో మెరిశారు. లంక బౌలర్లను సమర్థంగా అడ్డుకున్న ఈజంట మూడో వికెట్‌కు 122 పరుగులు జోడించింది.రెండోరోజు ఆట సాగిందిలా..అనంతరం కెప్టెన్ అవుట్ కాగా... కుశాగ్రకు మనల్ చౌహాన్ అండగా నిలిచాడు... ఈ జోడీ అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 131 పరుగులు జతచేసింది. ఈ క్రమంలో 253/3 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. 411 పరుగులకు ఆలౌట్ అయింది. ఆట మొదలైన కాసేపటికే కుశాగ్ర (111) అవుట్ కాగా.. మనాల్ చౌహాన్ భారీ శతకం (244 బంతుల్లో 150)తో చెలరేగాడు.ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 105.2 ఓవర్లలో భారత్ 411 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన శ్రీలంక.. మంగళవారం ఆట పూర్తయ్యేసరికి 40 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 122 పరుగులు మాత్రమే చేసింది.148 పరుగులకు ఆలౌట్‌ఈ క్రమంలో 122/8 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన శ్రీలంక.. కేవలం మరో 26 పరుగులు జతచేసి ఆలౌట్ అయింది. దుల్నిత్ సిగెర 31 పరుగులతో లంక టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ దిమంత మహావితన 24, విరాన్ చముదిత 21, లోయర్ ఆర్డర్లో సెత్మిక సెనెవిరత్నె 25 (నాటౌట్) పరుగులతో ఫర్వాలేదనిపించారు.మిగిలిన వాళ్లలో అవీష సమాశ్ (9), సెనుజ వెకునగొడ (5), కెప్టెన్ విమత్ దిన్సారా (8), కవిజ గెమాగే (7), వికెట్ కీపర్ బ్యాటర్ జేసన్ ఫెర్నాండో (4), గిమ్హాన్ మెండిస్ (4), విఘ్నేశ్వరన్ ఆకాశ్ (4) పెవిలియన్‌కు వరుస కట్టారు.భారత బౌలర్లలో ప్రణవ్ రాఘవేంద్ర, చిగురుపాటి వెంకట, జగన్నాథన్ హేంచుదేశన్, రోహిత్ యాదవ్ తలా రెండు వికెట్లు కూల్చగా.. కావ్యా పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలో 263 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది భారత్.భారత్‌కు భారీ ఆధిక్యంబుధవారం నాటి భోజన విరామ సమయానికి 16 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. ఓపెనర్లలో సాగర్ విర్క్ (17) మరోసారి విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఆర్యన్ సక్పా (6) నిరాశపరిచాడు. ఓపెనర్ లక్ష్య రాయ్‌చందాని 31, కెప్టెన్ యశ్వర్దన్ 5 పరుగులతో క్రీజులో నిలిచారు. లంక బౌలర్లలో కవిజ గెమాగే తొలి రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 330 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది.చదవండి: ప్రపంచంలోనే బెస్ట్.. ఎందుకు ఆడించలేదు? -
IND vs SL: శ్రీలంకతో టెస్టు.. భారత్ భారీ స్కోరు
శ్రీలంక అండర్-19 జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత యువ జట్టు భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 411 పరుగులు చేసి ఆలౌట్ అయింది. గాలె వేదికగా శ్రీలంక- భారత్ అండర్-19 జట్ల మధ్య తొలి యూత్ టెస్టు ‘డ్రా’గా ముగిసిన సంగతి తెలిసిందే.ఓపెనర్లు డకౌట్ అయినా..ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య కొలంబో వేదికగా సోమవారం రెండో యూత్ టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది. తొలి రోజు ఆటలో ఓపెనర్లు లక్ష్య రాజేశ్ రాయ్ చందాని, సాగర్ విర్క్ డకౌట్ కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ కుశాగ్ర ఓజా.. కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు.శతక్కొట్టిన కుశాగ్రఈ క్రమంలో కుశాగ్ర శతకం పూర్తి చేసుకోగా.. యశ్వర్దన్ అర్ధ శతకం (78) చేసి అవుటయ్యాడు. కుశాగ్రకు తోడుగా ఐదో నంబర్ బ్యాటర్ మనాల్ చౌహాన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫలితంగా సోమవారం నాటి ఆట పూర్తయ్యేసరికి భారత్ 65 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.ఇక 253/3 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. భోజన విరామ సమయానికి 92 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 355 పరుగులు చేసింది. శతక వీరుడు కుశాగ్ర (193 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు: 111) రనౌట్ కాగా.. ఆల్‌రౌండర్ మనాల్ చౌహాన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.మనాల్ భారీ శతకంఅనంతరం అదే జోరు కొనసాగించిన మనాల్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. మొత్తంగా 224 బంతులు ఎదుర్కొన్న ఈ ఆల్‌రౌండర్.. 20 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 150 పరుగులు చేశాడు. అయితే, గిమ్హాన్ మెండిస్ బౌలింగ్‌లో విఘ్నేశ్వరన్ ఆకాశ్‌కు క్యాచ్ ఇవ్వడంతో అతడి మారథాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.మనాల్ అవుటైన తర్వాత భారత జట్టు వేగంగా వికెట్లు కోల్పోయింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఆర్యన్ సక్పా 10, జగన్నాథన్ హేంచుదేశన్ 4 పరుగులు చేసి వెనుదిరిగారు. రోహిత్ యాదవ్ డకౌట్ కాగా.. చిగురుపాటి వెంకట 25 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ప్రణవ్ రాఘవేంద్ర ఒక బంతిని ఎదుర్కొని ఖాతా ఏమీ తెరవలేదు.411 పరుగులకు ఆలౌట్‌ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 105.2 ఓవర్లలో 411 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కుశాగ్ర ఓజా (111), మనాల్ చౌహాన్ (150) సెంచరీలు.. యశ్వర్దన్ చౌహాన్ (78) అర్ధ శతకంతో రాణించడంతో భారత్‌కు ఈ మేర భారీ స్కోరు సాధ్యమైంది. ఇక శ్రీలంక బౌలర్లలో గిమ్హాన్ మెండిస్ మూడు వికెట్లు పడగొట్టగా.. సెత్మిక సెనెవిరత్నె, దుల్నిత్ సిగెర, విఘ్నేశ్వరన్ ఆకాశ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. చదవండి: ఇంగ్లండ్ అతడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది.. మీరేం చేస్తున్నారు? -
అనధికారిక టెస్టులో విధ్వంసకర సెంచరీ.. ఎవరీ కుషాగ్ర?
కొలంబో వేదికగా శ్రీలంక అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత అండర్-19 జట్టు తొలిరోజే పట్టు బిగించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 65 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరు డకౌట్ అయిన వేళ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కుషాగ్ర ఓఝా (103 నాటౌట్) అజేయ సెంచరీతో మెరిశాడు. కెప్టెన్ యశ్‌బర్దన్ (78), మనాల్ చౌహన్ (55 నాటౌట్) అర్ధశతకాలతో రాణించడంతో భారీ స్కోరు దిశగా సాగుతోంది. లంక బౌలర్లలో గిమ్హన్ మెండిస్ రెండు వికెట్లు తీయగా, సెత్మికా ఒక వికెట్ పడగొట్టాడు.ఎవరీ కుషాగ్ర?సున్నా పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును అజేయ సెంచరీతో నడిపించిను కుషాగ్ర ఒక్కసారిగా హీరో అయిపోయాడు. రాజస్తాన్‌కు చెందిన 16 ఏళ్ల కుషాగ్ర ఓఝా టాపార్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తుంటాడు. హంబన్‌టోటా వేదికగా శ్రీలంకతో జరిగిన యూత్ వన్డే సిరీస్ ద్వారా అండర్-19లో అరంగేట్రం చేసిన కుషాగ్ర ఆడిన తొలి మ్యాచ్‌లోనే 92 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తాజాగా తన తొలి అండర్-19 అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడుతున్న కుషాగ్ర.. డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో 50 ఓవర్ల ఫార్మాట్లతో పాటు సంప్రదాయ ఫార్మాట్లోనూ అండర్-19 జట్టులో టాప్-4 బ్యాటింగ్‌లో కుషాగ్ర ఓఝా కీలక ఆటగాడిగా మారిపోయాడు.2023-24 సీజన్లో రాజస్తాన్ తరఫున విజయ్ మర్చంట్ ట్రోఫీ ద్వారా అండర్-19 క్రికెట్లో అరంగేట్రం చేసిన కుషాగ్ర 2025-26 దేశవాళీ టోర్నీలో అండర్-19 కూచ్ బెహర్ ట్రోఫీలో 565 పరుగులు సాధించి గుర్తింపు పొందాడు. ఈ టోర్నీలోనే రెండు సెంచరీలు సహా నాలుగు హాఫ్‌సెంచరీలు సాధించాడు. 2026 అండర్-19 వరల్డ్‌కప్‌కు కూడా కుషాగ్ర పరిగణలో ఉన్నాడు.Read: బుడ్డోడా మజాకా.. సవతి సోదరుడైనా తమ్ముడంటే ప్రాణం!


