breaking news
kuruba
-
నాపై కుట్రకు ప్లాన్.. సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సిద్దరామయ్య సోషల్ మీడియా వేదికగా తన కులం, సామాజిక నేపథ్యం కారణంగా కొందరు టార్గెట్ చేసి తనను దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దీంతో, కన్నడ రాజకీయంలో మరో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు సైతం సిద్దరామయ్యను ప్రశ్నిస్తున్నారు.ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోషల్ మీడియా వేదికగా..‘నాలుగు దశాబ్దాలుగా నేడు రాజకీయాల్లో ఉన్నాను. నా రాజకీయ జీవితం ఏనాడూ పూల పాన్పు కాదు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. చాలా మంది పెద్ద నాయకులు నన్ను రాజకీయంగా అంతం చేయడానికి అనేక మోసపూరిత కుట్రలు చేశారు. ప్రజల ఆశీర్వాదంతో నేను వాటన్నిటినీ అధిగమించాను. కానీ, కొందరు వ్యక్తులు ఇప్పుడు నాపై కులం, సామాజిక నేపథ్యం కారణంగా కుట్రలు చేస్తున్నారు. నా కులం కారణంగా నేను టార్గెట్ అవుతున్నాను.గొర్రెల కాపరి (కురుబ సామాజిక వర్గం) ముఖ్యమంత్రి అయ్యాడు. ఆర్థిక నిపుణులతో కలిసి బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడని కొన్ని వర్గాలు నాపై కక్ష కట్టాయి. వారు నన్ను అంతం చేస్తే వారి మార్గం సజావుగా మారుతుందని ప్లాన్ చేస్తున్నారు. నన్ను మాత్రమే కాకుండా, నాకు మద్దతు ఇచ్చే వ్యక్తులను కూడా అణగదొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను అన్నీ గమనిస్తున్నాను.ఇది నా ఒక్కడిపై జరిగిన కుట్ర కాదని నాకు బాగా తెలుసు. ఇది నన్ను నమ్మిన మీపై జరిగిన కుట్ర. అందుకే, నేను ఊపిరి ఉన్నంత వరకు, ఈ రాజకీయ కుట్రకు, అసూయ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతాను. ఇది నిజం. న్యాయం, ధర్మం కోసం పోరాటం చేస్తాను. మీ మద్దతుతో, నేను ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాను. నేను యుద్ధభూమి నుండి పారిపోయే పిరికివాడిని ఎప్పటికీ కాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు.దీంతో, సిద్దరామయ్య పోస్టుపై రాజకీయంగా చర్చ మొదలైంది. కర్ణాటక సీఎం కుర్చీ కోసం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం కన్నడ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరోవైపు.. సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారని ప్రతిపక్ష నేతలు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో కులం కార్డులో సిద్దరామయ్య కొత్త రాజకీయాలకు తెరలేపారని వ్యాఖ్యలు చేస్తున్నారు. "ಸಾಮಾಜಿಕ ನ್ಯಾಯಕ್ಕಾಗಿ ನನ್ನ ಉಸಿರಿರುವ ವರೆಗೆ ಹೋರಾಡುತ್ತೇನೆ"ನನ್ನ ನಾಲ್ಕು ದಶಕಗಳ ರಾಜಕೀಯ ಜೀವನ ಎಂದಿಗೂ ಹೂವಿನ ಹಾಸಿಗೆ ಆಗಿರಲಿಲ್ಲ, ಅದು ಕಲ್ಲು - ಮುಳ್ಳುಗಳ ಹಾದಿಯಾಗಿತ್ತು. ನನ್ನನ್ನು ರಾಜಕೀಯವಾಗಿ ಮುಗಿಸಲು ಹಲವಾರು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ನಾಯಕರು ಹಲವಾರು ಬಗೆಯ ಕುಟಿಲ ಕಾರಸ್ತಾನಗಳನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಅವುಗಳನ್ನೆಲ್ಲವನ್ನೂ ಜನತೆಯ… pic.twitter.com/rA8XGFuuZL— Siddaramaiah (@siddaramaiah) February 20, 2026 -
Gadikota Srikanth Reddy: లింగయ్యని కిరాతకంగా చంపుతుంటే ఏం చేశారు
-
వైఎస్ జగన్ మాతో చెప్పిన మాట
-
కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన వైఎస్ జగన్
-
Thopudurthi Prakash: సునీత డైరెక్షన్లో లింగమయ్య హత్య
-
కూటమి పాలనలో టీడీపీ అరాచకాలపై వైఎస్ జగన్ ఫైర్
-
ముస్లింలకు టికెట్లు ఇవ్వం
సాక్షి, బెంగుళూర్: కర్ణాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు తమను నమ్మరని, అందుకే తాము ముస్లింలకు టికెట్లు ఇవ్వబోమని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. గతంలో కర్ణాటక డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆయన వ్యాఖ్యలపై ప్రత్యర్థి పార్టీలు మండిపడుతున్నాయి. ‘కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటోంది. కాని మీకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం లేదు. కర్ణాటకలో మేము కూడా ముస్లింలకు టికెట్లు ఇవ్వం. ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్మరు. మమ్మల్ని నమ్మండి.. అప్పుడు మీకు టికెట్లతోపాటు ఏది కావాలంటే అది ఇస్తాం’ అని కర్ణాటకలోని కొప్పల్‌లో కురుబా, ఇతర మైనారిటీవర్గాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈశ్వరప్ప పేర్కొన్నారు. వెనుకబడిన కురుబా సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరప్ప గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. -
నేడు పరిగిలో కనకదాసు జయంతి
హిందూపురం రూరల్ : పెనుకొండ తాలూకా పరిధి పరిగి మండల కేంద్రంలో ఆదివారం భక్త కనకదాస జయంతి మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం సభ్యులు తెలిపారు. పరిగిలోని బీరలింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఉదయం 11 గంటలకు బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు బైక్‌ర్యాలీ, 9 గంటలకు మహిళలతో జ్యోతుల ఊరేగింపు ఉంటుంది. ఊరేగింపులో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వివరించారు. ముఖ్య అతిథులుగా పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్‌నారాయణ, కురుబసంఘం జిల్లా అధ్యక్షుడు రాగేపరుశురాం, రాయలసీమ కురుబసంఘం అధ్యక్షులు పీటీ నరసింహారెడ్డి, బోరంపల్లి ఆంజినేయులు, పెనుకొండ కాంగ్రెస్ ఇన్చార్జ్ కేటీ శ్రీధర్, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ హాజరవుతారని తెలిపారు. -
8న కురుబ వధూవరుల పరిచయ వేదిక
అనంతపురం రూరల్ : కురుబ వధూవరుల పరిచయ వేదికను ఈనెల 8న గుత్తిరోడ్డులోని కనకదాస కళ్యాణమంటపంలో నిర్వహిస్తున్నట్లు కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు రాగే పరశురాం తెలిపారు. మంగళవారం సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 8న నిర్వహించే వధూవరుల పరిచయ వేదికకు వధూవరుల పాస్ ఫొటోలతో హాజరు కావాలన్నారు. వేదికపైనే వధూవరుల వివరాలను సైతం వివరిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 9866166777, 9440488444 నంబర్లలో సంప్రదించాలని కోరారు. సమావేశంలో కురుబ సంఘం నాయకులు పిడుగు క్రిష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.


