breaking news
Koya Praveen
-
Big Question: DIG క్యాప్ పెట్టలేదు అంటే దానికి అర్థం అదే..
-
నువ్వొక పోలీసువి గుర్తుందా.. DIG ప్రవీణ్ కుమార్ ఓవర్ యాక్షన్ కి అంబటి స్ట్రాంగ్ కౌంటర్..
-
YSRCP నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు: వెల్లంపల్లి శ్రీనివాస్
-
DIG ప్రవీణ్ పత్తేపారం కామెంట్స్.. కారుమూరి ఉగ్రరూపం
-
డీఐజీ కోయ ప్రవీణ్ తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్
సాక్షి, మచిలీపట్నం: వైఎస్సార్ కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో జరుగుతున్న హింసపై కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ స్పందించిన తీరును మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్రంగా ఖండించారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న పోలీస్ అధికారి కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ 'వైఎస్సార్సీపీ వారు పత్తి యాపారం చేస్తే ఇట్లాగే ఉంటుంది' అంటూ వ్యాఖ్యానించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.కడప జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తాము నిర్వర్తించాల్సిన బాధ్యతను గాలికి వదిలి, పత్తియాపారం చేయడం వల్లే వరుసగా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా నామినేషన్ ఘట్టం నుంచి ప్రచారం వరకు హింస, దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నాయని, నామినేషన్ నాడు ఎవరైతే దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడ్డారో వారే ప్రతి రోజూ తమ అరాచకాన్ని కొనసాగిస్తున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.ముందు వారిని నియంత్రించాల్సిన అధికారులు పత్తి యాపారం చేస్తున్నారా అని నిలదీశారు. 'మేం ఉన్నాం కాబట్టే తలలు తెగలేదు' అని డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పిన దానిని బట్టి చూస్తే, టీడీపీ వారు వేసుకున్న ప్లాన్ ప్రకారం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాముల తలలు తెగేవేనని, ఆయన ఉండబట్టే అది జరగలేదని అర్థమవుతోంది.ఇటువంటి సమర్థులైన, నిజాయితీపరులైన అధికారికి ప్రెసిడెన్షియల్ పోలీస్ మెరిటోరియల్ అవార్డు, లేదా గ్యాలెంటీ అవార్డులు ఇవ్వాలని తాము రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తామని అన్నారు. అంతే కాకుండా ఇదే అధికారి గాయపడిన వైఎస్సార్సీపీ నాయకుల గురించి మాట్లాడుతూ వారి శరీరంలో గాయాలు కనిపించడం లేదు కానీ, వారు ధరించిన దుస్తులపై మాత్రం రక్తపు మరకలు కనిపిస్తున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేయడం మరో విడ్డూరమని అన్నారు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి కొమ్ముకాసే కొందరు అధికారులకు తాత్కాలికంగా రాజకీయ శుక్లాలు వస్తాయని, ఆ పార్టీ అధికారానికి దూరం కాగానే వారికి ఆ శుక్లాలు తొలగిపోయి వాస్తవాలు కనిపిస్తాయని అన్నారు. -
నువ్వు పోలీస్.. ఫ్యాక్షనిస్ట్ కాదు.! DIGకి కేతిరెడ్డి మాస్ వార్నింగ్
-
మేము లేకపోతె తలలు ఎగిరిపోయేవి.. కర్నూల్ DIG వివాదాస్పద వ్యాఖ్యలు
-
ప్రకాశం ఎస్పీ బదిలీ
-
వారికి ముప్పేమి లేదనుకుంటున్నా
విశాఖపట్నం : మావోల చెర నుంచి ఇంకా టీడీపీ నేతలు విడుదల కాలేదని విశాఖపట్నం జిల్లా ఎస్పీ డా.కోయ ప్రవీణ్ వెల్లడించారు. మంగళవారం విశాఖపట్నంలో కోయ ప్రవీణ్ మాట్లాడుతూ... మావోయిస్టులతో బుధవారం గిరిజన ప్రజా సంఘాలు చర్చించనున్నాయని తెలిపారు. మావోలు వాళ్లంతట వాళ్లే టీడీపీ నేతలను పలిచారు... కాబట్టి సదరు నేతలకు ముప్పేమి ఉండదని తాను భావిస్తున్నట్లు కోయ ప్రవీణ్ అభిప్రాయపడ్డారు. విశాఖపట్నం జిల్లాలో జీకేవీధిలోని మండల టీడీపీ అధ్యక్షుడు మామిడి బాలయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు ముక్తల మహేష్‌తోపాటు జన్మభూమి కమిటీ మండల అధ్యకుడు వందనం బాలయ్యను సోమవారం మావోయిస్టులు అపహరించారు. జీకే వీధి మండలంలోని కొత్తగూడ వద్ద వీరిని కిడ్నాప్ చేశారు.బాక్సైట్ తవ్వకాలను రద్దు చేయకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని మావోలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో బంద్ పాటించాలని మావోయిస్టులు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. -
ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు
విశాఖపట్నం: గాలికొండ మావోయిస్టు దళ సభ్యులు మంగళవారం విశాఖపట్నం రూరల్ ఎస్పీ కోయ ప్రవీణ్ ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు విశాఖపట్నం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కోయ ప్రవీణ్ వెల్లడించారు. దళ సభ్యులు వంతల చిన్నంనాయుడు, సన్నంనాయుడుతోపాటు పెదబయలు ఏరియా కమిటీ సభ్యుడు పంగి సోమరాజు, మిలిషియా సభ్యుడు పంగి చంటి లొంగిపోయారు. వీరు పలు కేసుల్లో నిందితులని ఆయన చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావస చర్యల్లో భాగంగా ప్రభుత్వం తరపున అందవలసిన వసతులు అందజేస్తామన్నారు. -
మావోయిస్టులపై ఉక్కుపాదం
గంజాయి రవాణా నిరోధంపై దృష్టి రోడ్డు ప్రమాదాల నివారణకు కార్యాచరణ కొత్త ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్ విశాఖపట్నం: జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామని కొత్త ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్ హెచ్చరించారు. జిల్లా కొత్త ఎస్పీగా ఆయన సోమవారం ఆయన ప్రస్తుత ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు దుగ్గల్ పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. అనంతరం కొత్త ఎస్పీ ప్రవీణ్ మాట్లాడుతూ గత ఎస్పీ దుగ్గల్ జిల్లాలో శాంతి భద్రతల్ని పరిరక్షించి, మావోయిస్టుల కార్యక్రమాలపై పట్టు సాధించారని ప్రశంసించారు. తాను కూడా అవే విధానాలను కొనసాగిస్తానని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం మావోయిస్టులు స్తబ్దుగా ఉన్నారని చెప్పారు. వారు చేసే విధ్వంసాలను అడ్డుకునేందుకు జిల్లా పోలీసులు సన్నద్ధంగా ఉన్నారన్నారు. గంజాయి రవాణా నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రయివేటు భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) డి.ఎన్.కిషోర్, జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) ఎ.ఆర్.దామోదర్, నర్సీపట్నం ఏఎస్పీ విశాల్ గున్ని, పాడేరు ఏఎస్పీ ఎ.బాబూజి, చింతపల్లి సబ్ డివిజన్ ఆఫీసర్ ఇ.జి.అశోక్‌కుమార్. అనకాపల్లి సబ్ డివిజన్ ఆఫీసర్ వి.ఎస్.ఆర్.మూర్తి, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఎస్.కిరణ్‌కుమార్ ఎస్పీని కలసి అభినందనలు తెలిపారు.