జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం చర్యలు తీసుకుంది. అధికార టీడీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించడంతో ఈసీ ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో సిద్ధార్ద్ కౌషిల్‌ను ఎస్పీగా నియమించింది. ఖాకీ బట్టలు తీసేస్తే తానూ రాజకీయ నేతనేనని గతంలో కోయ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.