breaking news
Killer Drones
-
దోమ దండుపై డ్రోనాస్త్రం!
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం ఏడు నుంచి పది లక్షల మంది దోమల కారణంగా చనిపోతున్నారు. మనల్ని ముప్పు తిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించి, రోగాల బారిన పడేలా చేసే దోమలను గాలిలోనే ఎన్కౌంటర్ చేయడానికి ‘కిల్లర్ డ్రోన్స్’ రాబోతున్నాయి!దోమల నివారణ పద్దతులో ప్రధానమైనవి దోమ తెరలు, కీటకనాశినులు. అయితే వీటిలో ప్రతిదానికి ఏదో ఒక పరిమితి ఉంది. ఉదాహరణకు, పురుగు మందుల వలన పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో దోమలను నిర్మూలించడానికి పరిశోధకులు అత్యాధునికమైన పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు.సోనార్–గైడెడ్ డ్రోన్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ ఫ్లైట్ కంట్రోల్ సాంకేతికతను ఉపయోగించి దోమల పనిపట్టే అత్యాధునిక యంత్రం... సోనార్–గైడెడ్ డ్రోన్. పురుగు మందులు, లేజర్లు, విద్యుత్ గ్రిడ్లను ఉపయోగించడానికి బదులుగా వేగంగా తిరిగే ప్రొఫెల్లర్లను ఉపయోగించి దోమలను నిర్మూలిస్తుంది సోనార్–గైడెడ్ డ్రోన్. గాలిలో ఎగురుతున్న దోమలను ఒక్కటొక్కటిగా గుర్తించి వాటిని నిర్మూలిస్తుంది. ఆప్టికల్ కెమెరాలపై ఆధారపడే సంప్రదాయ డ్రోన్లలా కాకుండా డ్రోన్ అల్ట్రా సోనిక్ ఫేజ్డ్–సోనార్ సాంకేతికత (ఒకే పరికరంలో అనేక చిన్న సౌండ్–వేవ్ పార్ట్స్ ఉపయోగించడం) ఆధారంగా ఈ దోమ నిర్మూలన డ్రోన్‌ను నిర్మించారు. తక్కువ కాంతిలో, చీకటిలో కూడా దోమలను గుర్తించే డ్రోన్ ఇది. కీటకాలను వాటి రూపాన్ని బట్టి ఈ డ్రోన్ గుర్తించదు. ప్రతి దోమ జాతికి ఉండే ప్రత్యేకమైన వింగ్బీట్ ‘ఫింగర్ ప్రింట్’ ద్వారా గుర్తిస్తుంది. ఇతర కీటకాలకు ముప్పు వాటిల్లకుండా కేవలం దోమలనే లక్ష్యంగా చేసుకునేలా ఈ డ్రోన్‌ను డిజైన్ చేశారు.లెసోనార్ 2దోమల సమస్యకు పరిష్కార మార్గంగా ఫ్రెంచ్ స్టార్టప్ టోర్నియోల్ 40 గ్రాముల బరువు ఉన్న ఒక డ్రోన్‌ను రూపొందించింది. ఈ డ్రోన్ నిర్దిష్ట ప్రాంతంలో గస్తీ కాస్తూ, అవసరమైనప్పుడు ఛార్జింగ్ కోసం తిరిగి వస్తుంది. గాలిలో దోమలను గుర్తించిన వెంటనే వాటిపై దూసుకెళ్లి తన ప్రొపెల్లర్స్‌తో వాటిని గాలిలోనే నిర్మూలిస్తుంది. టోర్నియోల్ తాజా మోడల్ లెసోనార్ 2. ఇందులో 32 అల్ట్రా సోనిక్ ఎమిటర్స్ ఉంటాయి. ఈ ఎమిటర్స్ మనుషులకు వినబడని అల్ట్రాసోనిక్ పల్స్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి సమీపంలోని వస్తువులు లేదా కీటకాలపై పరావర్తనం చెందుతాయి. పరావర్తనం చెందిన పల్స్‌ను గ్రహించే 380 మైక్రోఫోన్లు సౌండ్‌ను ప్రాసెస్ చేసి, పరిసరాల రియల్– టైమ్ 3డీ మ్యాప్‌ను రూపొందిస్తాయి. కెమెరాకు బదులుగా సోనార్ ను ఉపయోగించడం వల్ల డ్రోన్ కాంపాక్ట్ (చిన్నగా)గా ఉండగలుగుతుంది. రాత్రిపూట కూడా చూడగలుగుతుంది.సెక్యూరిటీ ఫీచర్స్‌తో...కవరేజ్ ప్రాంతాన్ని గుర్తించడం, ఫర్మ్‌వేర్‌ను అప్డేట్ చేయడం, ఫైట్ షెడ్యూల్స్ రూపొందించడం.. మొదలైన పనుల కోసం ఈ డ్రోన్‌కు ప్రత్యేక యాప్, వెబ్ ఇంటర్‌ఫేస్‌లు ఉంటాయి.‘భద్రతా ఫీచర్స్ ఉండేలా మా డ్రోన్‌ను రూపొందించాం. మనుషులు, పెంపుడు జంతువులకు సురక్షిత దూరాలను పాటిస్తుంది. చిన్న పరిమాణం, తక్కువ బరువు వలన అనుకోకుండా తాకినా ఎలాంటి ప్రమాదం ఉండదు’ అని తెలియజేస్తుంది కంపెనీ వెబ్సైట్. సబ్స్క్రిప్షన్ ఆప్షన్‌తో ఈ కిల్లర్ డ్రోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.‘ఫోటాన్ మ్యాట్రిక్స్ ల్యాబ్’ అనే సంస్థ దోమల పని పట్టడానికి ఒక కొత్తరకం పరికరాన్ని రూపొందించింది. ఈ పరికరం నుంచి వచ్చే నీలం, ఊదారంగు కాంతి దోమ కనిపించగానే ఎటాక్ చేస్తుంది. తొలి అడుగులలో ఏ పరికరానికైనా పరిమితులు ఉంటాయి. ఈ కిల్లర్ డ్రోన్లకు కూడా అలాంటి పరిమితులు ఉండి ఉండవచ్చు. అయితే కాలక్రమంలో ఆ పరిమితులకు పరిష్కారాలు తప్పకుండా వస్తాయి అంటున్నారు నిపుణులు.అందుకే... దోమల దినోత్సవంఆడ అనోఫెలెస్ దోమలు మలేరియాను వ్యాపింపజేస్తాయని సర్ రోనాల్డ్ రాస్ 1897లో చేసిన చారిత్రక ఆవిష్కరణకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్ట్ 20న ‘దోమల దినోత్సవం’ జరుపుతారు. ఈ ఆవిష్కరణ వైద్యశాస్త్రంలో పెద్ద ముందడుగు.దోమలపై మైక్రోసాఫ్ట్ గురి!దోమల నివారణకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడంపై టెక్ కంపెనీలు ఆటోమేషన్, రోబోటిక్స్‌పై దృష్టి పెట్టాయి. మైక్రోసాఫ్ట్‌తో సహా పలు సంస్థలు దోమల నిర్మూలన కోసం కొత్త హైటెక్ సాధనాలను పరీక్షిస్తున్నాయి. జికా వ్యాధిని వ్యాప్తి చేసేవిగా పేరుగాంచిన ఈడిస్ ఈజిప్టి దోమలను పట్టుకోవడానికి మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక స్మార్ట్ట్రాప్ను పరీక్షిస్తోంది. కాలిఫోర్నియాలో ‘అల్ఫాబెట్’కు చెందిన లైఫ్ సైన్సెస్ విభాగం దోమల జనన నియంత్రణకు సాంకేతిక పరిష్కారాలు అన్వేషిస్తోంది. -
రష్యాపై భారీ డ్రోన్ దాడులు
కీవ్: ఉక్రెయిన్ మరోసారి తన లాంగ్రేంజ్ కిల్లర్ డ్రోన్ల సత్తాను రష్యాకు చూపింది. ఆక్రమిత క్రిమియా సహా డజనుకు పైగా ప్రాంతాల్లో గురువారం రాత్రి భీకర దాడులకు పాల్పడింది. నాలుగేళ్ల క్రితం రష్యా దురాక్రమణ మొదలయ్యాక ఉక్రెయిన్ చేపట్టిన భారీ దాడుల్లో ఇదొకటని చెబుతున్నారు. వాటిల్లిన నష్టాన్ని అధికారికంగా రష్యా ప్రకటించనప్పటికీ, స్వతంత్ర వార్తా సంస్థలు మాత్రం నొవొమొస్కోవ్స్క్ లోని రసాయన కర్మాగారం, జలవిద్యుత్ ప్లాంట్లలో పేలుళ్లు సంభవించినట్లు తెలిపాయి. క్రిమియాలోని కీలకమైన నౌకాశ్రయం కెర్చ్‌లోని గగనతల రక్షణ వ్యవస్థలతోపాటు రష్యా యుద్ధ నౌకలపై డ్రోన్ దాడి జరిపినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. దాడులతో నౌకల్లో భారీగా మంటలు చెలరేగినట్లు వెల్లడించింది. రాజధాని మాస్కో దిశగా దూసుకొచ్చిన 47 డ్రోన్లను కూల్చివేశామని అధికారులు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యక్షమైన 660 ఉక్రెయిన్ డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. జెలెన్స్కీ 40 రోజుల ఆపరేషన్ శాంతి చర్చల దిశగా రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తన 40 రోజుల ఆపరేషన్‌ను ప్రకటించిన కొద్ది గంటల్లోనే రష్యాపై డ్రోన్ దండును వదలడం గమనార్హం. రష్యా లోతట్లు ప్రాంతాల్లో ఉన్న ఇంధన, చమురు కేంద్రాలే లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ చేసిన దాడులు తీవ్ర ప్రభావం చూపాయి. -
భారత్‌కు కిల్లర్ డ్రోన్లు
వాషింగ్టన్: భారత్ సహా మిత్ర దేశాలకు ఆయుధాలు అమ్మడానికి ఉన్న అడ్డంకులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలగించారు. అధునాతన డ్రోన్లు సహా ఇతర సంప్రదాయ ఆయుధ సంపత్తి ఎగుమతులను వేగవంతం చేయాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు. అమెరికా నుంచి అధిక సంఖ్యలో నిఘా డ్రోన్లు కొనుగోలు చేయాలనుకుంటున్న భారత్‌కు ఈ నిర్ణయం మేలుచేయనుంది. అమెరికా కిల్లర్ డ్రోన్లు సమకూర్చుకోవడం సులభం కానుంది. ఈ మేరకు అణుయేతర ఆయుధాల బదిలీ(సీఏటీ) నూతన విధానంపై ట్రంప్ సంతకం చేశారు. అధ్యక్షుడి జాతీయ భద్రతా విధాన ప్రాధమ్యాలకు అనుగుణంగా సీఏటీని రూపొందించినట్లు శ్వేతసౌధం ప్రెస్ సెక్రెటరీ శాండర్స్ చెప్పారు. తాజా నిర్ణయం అమెరికా మిత్ర దేశాల సైన్యాలను బలోపేతం చేస్తుందన్నారు. మిత్ర దేశాలకు అధునాతన ఆయుధాలను సమకూర్చడం ద్వారా అవి ఇకపై చైనా, రష్యాలపై ఆధారపడవని ట్రంప్ అసిస్టెంట్ పీటర్ చెప్పారు.


