kedharnath
-
మంచుకొండల్లో ఓంకార నాదం
హిమగిరి గుండెల్లో వెలిగిన జ్యోతిర్లింగం విశ్వనాథుడి కైలాస ధామం కేదార్నాథ్ ఈ యాత్ర అంటేనే మదిలోని గుబుళ్లన్నీ వదిలేసి పరమశివుని పాదాల దగ్గర మౌనంగా కూర్చోవడంలాంటిది. గాలిలో వినిపించే ‘ఓం నమఃశివాయ‘ మంత్రం, గంటల నాదం, ఆలయ ప్రాంగణంలో ఉండే అద్మాత్మిక దివ్య శక్తి మనకు తెలియకుండానే మనల్ని ఒక భక్తి లోకానికి తీసుకుని వెళ్తుంది.కేదార్నాథ్ కేవలం ఒక టూరిజం స్పాట్ మాత్రమే కాదు. ఇది ప్రతి భక్తుడి జన్మ ధన్యం అయ్యే ఒక పవిత్ర క్షేత్రం. హిమవంతుడి ఒడిలో, పర్వతాల మధ్య కొలువుతీరిన ఆ మహాదేవుని చూసే ప్రతి కన్ను ధన్యమే అని భక్తుడికి అనిపిస్తుంది. మహాదేవుడి దివ్య సన్నిధిలోకేదార్నాథ్ ఆలయం దగ్గర నిల్చుని ఆకాశంలో చూస్తే ఆ ధవళ వర్ణపు మంచు కొండలు, శివ భగవానుడి జటాజూటంలా కనిపిస్తాయి. ఆయలం లోపల ఉండే స్వయంభూ లింగం ముందు తలవంచితే ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ చిన్నవిగా అనిపిస్తాయి. ఆ చల్లటి గాలిలో కూడా భక్తుల గుండెల్లో ఉన్న భక్తి వేడిని నింపుతుంది.సందర్శనీయ ప్రదేశాలు ఆలయం వెనక ఉన్న భైరవనాథ్ క్షేత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి వెళ్తే మొత్తం కేదార్ లోయ మహాదేవుడి పాదాల దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది. అది చూస్తేనే భక్తి పరవశం కలుగుతుంది.కొంచెం దూరంలో ఉండే వాసుకి తల్ సరస్సు నిత్య ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తుంది. అది చూస్తే ప్రకృతి మొత్తం ఆ శివుడి రూపమే అని అర్థం అవుతుంది.తెలియాల్సినవి..దర్శన సమయం: ఆలయ ద్వారాలు అక్షయ తృతీయ నుంచి కార్తీక పౌర్ణమి వరకు భక్తుల కోసం తెరిచి ఉంటాయి.ప్యాకేజీలు: కేదార్నాథ్ వెళ్లాలనుకునే భక్తుల కోసం 5 రోజుల నుంచి 10 రోజుల వరకు బడ్జెట్‌ను బట్టి అనేక ప్యాకేజీలు లభిస్తాయి.రిజిస్ట్రేషన్: యాత్రకు వెళ్లే ముందు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ పోర్టల్‌లో బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. క్యూఆర్ కోడ్ పాస్ జాగ్రత్తగా కాపాడుకోవాలి.ప్రయాణం: ఉత్తరాఖండ్‌లోని రిషికేష్ నుండి రుద్రప్రయాగ్ మీదుగా గౌరీకుండ్ చేరుకోవాలి. అక్కడి నుండి 16 కి.మీ ట్రెక్కింగ్ ప్రారంభమవుతుంది.వసతి సదుపాయాలు: కేదార్నాథ్ టాప్ దగ్గర కాటేజీలు, రూమ్‌లు ఉంటాయి. అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే మంచిది.ఏం చూడాలి? ఏం తినాలి?కేదార్నాథ్ వెళ్తే సాయంత్రం జరిగే హారతి తప్పక చూడాలి. ఆ హారతి వెలుగులో ఆలయం బంగారు వర్ణంలో మెరిసి΄ోతుంది. కేదార్‌నాథ్‌లో భోజనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఖర్చు మాత్రం కాస్త ఎక్కువే ఉంటుంది. ఇక్కడ లభించే ‘పహాడి మ్యాగీ’ ఒక క్విక్ స్నాక్‌లా ఎంజాయ్ చేయవచ్చు.ఎలా వెళ్లాలంటే.. హరిద్వార్‌లో గంగా స్నానం చేసి రిషికేష్ నుంచి కేదార్ యాత్ర మొదలు పెట్టడం ఒక సంప్రదాయం. అక్కడి నుంచి రిషికేష్ సోన్ ప్రయాగ్ మార్గంలో నుండి గౌరీకుండ్ చేరుకోవాలి. అక్కడి నుంచి కాలినడకన యాత్రనున కొనసాగించాల్సి ఉంటుంది. చాలా మంది ఈ యాత్రను ట్రెక్కింగ్ అని పిలుస్తుంటారు. కానీ మనం మాత్రం దీనిని ఒక తపస్సులా భావించి అంతే పవిత్రంగా అడుగులు ముందుకేయాలి. ప్రతి అడుగులో ‘శంభో శంకర’ అంటూ భక్తులు పైకి వెళ్తుంటే ఆ పర్వతాలే స్పందిస్తున్నట్టుగా అనిపిస్తుంది.ఎక్కడ ఉండాలి?కేదార్నాథ్ లోయలో ఉండటం అంటే మహాదేవుడి ఒడిలో నిద్రించడం లాంటిదే. చిన్న చిన్న కాటేజీల్లో కూర్చుని బయట చూస్తే గుడి దగ్గర వెలిగే దీపాలు ఆకాశంలోని నక్షత్రాల్లా కనిపిస్తాయి. ఏం చేయాలి? ఆలయ ప్రాంగణంలో మౌనంగా కూర్చుని ధ్యానం చేయవచ్చు. ఫోన్లలో ఫొటోలు తీయడానికి బదులు కళ్లతో చూస్తూ మనసులో శివుడిని కొలుస్తూ గడిపిన క్షణాలు జీవితాంతం గుర్తుంటాయి. వీలు చూసుకొని మందాకిని నది తీరంలో కూర్చొని ఆ ప్రవాహాన్ని ఫీల్ అవ్వాలి. నది ప్రవాహంలో మన మదిలోని ఆలోచనలను కొట్టుకు పోతున్నట్టుగా భావించి, కడిగిన ముత్యంలాంటి మనసుతో ఇంటికి తిరిగి చేరుకోవచ్చు. సూర్యోదయం సమయంలో ఆలయం బంగారు వర్ణంలో మారడం చూడటాన్ని అస్సలు వదులుకోకూడదు.యాత్ర – బడ్జెట్ వివరాలుకేదార్నాథ్ యాత్ర ప్లాన్ చేస్తున్నప్పుడు ప్యాకేజీ అంటే కేవలం టికెట్ మాత్రమే కాదు. అది మన ప్రయాణం, భోజనం, వుండే చోటు అన్నీ కలిసిన ఒక పూర్తి ప్రణాళిక. ఈ యేడాది కేదార్నాథ్ ఆలయం ద్వారాలు ఏప్రిల్ 22న తెరుచుకున్నాయి. కాబట్టి మీరు ఇప్పుడే మీ యాత్ర ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు. పర్యటను ఎలా ఎంచుకుంటున్నారు అనేదానిని బట్టి, మొత్తం ఖర్చు మారుతుంది.బడ్జెట్ అంచనాసాధారణంగా 5 రోజుల నుంచి 10 రోజుల వరకు యాత్రకు అయ్యే ఖర్చు బడ్జెట్లో రూ.25,000 నుంచి రూ.35,000 వరకు ఉంటుంది.కాస్త కంఫర్ట్‌గా వెళ్లాలి అనుకుంటే రూ.45,000 నుంచి రూ.65,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇక లగ్జరీగా, సౌకర్యవంతంగా యాత్ర చేయాలి అనుకుంటే మాత్రం రూ.1.4 లక్ష నుంచి రూ.2.3 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది.రవాణా ఖర్చులుట్రావెల్ విషయానికి వస్తే.. రైలులో సుమారు రూ.5,000 వరకు ఖర్చు అవుతుంది. హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ వరకు అప్ అండ్ డౌన్ రూ.17,000 నుంచి రూ.33,000 వరకు, లేదా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు రూ.13,000 నుంచి రూ.17,000 వరకు ఖర్చు అవుతుంది. చాలా మంది ముందుగా ఢిల్లీ చేరుకుని, అక్కడి నుంచి హరిద్వార్ లేదా రిషికేష్‌కు బస్ లేదా ట్రైన్లో వెళ్లి యాత్రను కొనసాగిస్తారు.వసతి సదుపాయాలుగౌరీకుండ్, సోన్ ప్రయాగ్ ప్రాంతాల్లో బడ్జెట్ గెస్ట్ హౌజ్‌లు రూ.1,000 లోపు దొరుకుతాయి. స్టాండర్డ్ హోటల్స్ సుమారు రూ.3,000 వరకు ఉంటాయి. కేదార్నాథ్ టాప్ దగ్గర పీక్ సీజన్లో ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది. జీఎంవీఎన్ టెంట్స్ లేదా రూమ్స్ రూ.1,000 నుంచి ప్రారంభమవుతాయి కానీ ముందుగా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడం తప్పనిసరి.ఫుడ్ ఖర్చుఫుడ్ విషయానికి వస్తే సింపుల్ థాలీ లేదా స్నాక్స్ కోసం రోజుకు ఒక వ్యక్తికి సుమారు రూ.500 నుంచి రూ.1,000 వరకు ఖర్చు అవుతుంది. మొత్తంగా ఫుడ్, స్టే కలిపి రోజుకు రూ.1,200 నుంచి రూ.4,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.ప్యాకేజీలు, హెలికాప్టర్ఐఆర్సీటీసీ ఫ్లైట్ ప్యాకేజీలు ఎంచుకుంటే హైదరాబాద్ నుంచి సుమారు రూ.74,000లో సకల సౌకర్యాలతో ట్రిప్ పూర్తి చేసుకోవచ్చు. అదే కొన్ని బడ్జెట్ ప్యాకేజీలు రూ.27,000 నుంచే లభిస్తాయి. సోన్ ప్రయాగ్ నుంచి కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది. దీనికి రూ.7,000 నుంచి రూ.10,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ సర్వీస్‌ను ఐఆర్సీటీసీ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి.లోకల్ ట్రాన్స్పోర్ట్లోకల్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్‌కు గవర్నమెంట్ షటిల్ ట్యాక్సీ ఫేర్ కేవలం రూ.50 మాత్రమే ఉంటుంది, అయితే ప్రైవేట్ ట్యాక్సీలు ఎక్కువగా చార్జ్ చేసే అవకాశం ఉంది.ముఖ్య సూచనలుమే, జూన్ నెలల్లో యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాస్త ప్రశాంతంగా యాత్ర చేయాలనుకుంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలోనూ న్ చేసుకోవచ్చు. వెళ్లే ముందు వాతావరణ అప్డేట్స్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. స్థానిక అధికారుల సూచనలు టించడం చాలా ముఖ్యం. ఈ బడ్జెట్ వివరాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే, ప్లాన్, సీజన్ ఆధారంగా ఖర్చులు మారవచ్చు. – ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు -
శివయ్య భక్తులకు శుభవార్త
కేదార్నాథ్: ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ధామ్ ఆలయ ద్వారాలు ఈ ఏడాది(2026) ఏప్రిల్ 22న భక్తుల దర్శనం కోసం తెరుచుకోనున్నాయి. హిమాలయ పర్వత శ్రేణులలో కొలువై ఉన్న పరమశివుని ఈ దివ్య క్షేత్రానికి ప్రతి ఏటా దేశం నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. శీతాకాలం విరామం తర్వాత బాబా కేదార్నాథ్ దర్శనం పునఃప్రారంభం కానుండటంతో ఉత్తరాఖండ్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొననుంది.ఆలయ కమిటీ నిర్ణయించిన ప్రకారం ఏప్రిల్ 22 ఉదయం 8:00 గంటలకు వృషభ లగ్నంలో కేదార్నాథ్ ఆలయ తలుపులు శాస్త్రోక్తంగా తెరుచుకోనున్నాయి. ఉఖిమఠ్‌లోని శీతాకాల నివాసమైన ఓంకారేశ్వరాలయంలో ఈ ప్రారంభ తేదీ , సమయాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది కేదార్నాథ్ ఆలయ ప్రధాన పూజారిగా టీ గంగాధర్ లింగ్‌ను నియమించారు. ఆలయంలో జరిగే పవిత్ర పూజా కార్యక్రమాలను, ఆచారాలను ఈయన పర్యవేక్షించనున్నారు.కేదార్‌నాథ్‌తో పాటు ఉత్తరాఖండ్‌లోని ఇతర ప్రముఖ పుణ్యక్షేత్రాల (చార్ ధామ్) ప్రారంభ తేదీలను కూడా అధికారులు వెల్లడించారు. బద్రీనాథ్ ఆలయ ద్వారాలు 2023, ఏప్రిల్ 23న ఉదయం 6:15 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో తెరుచుకుంటాయి. అంతకుముందే ఏప్రిల్ 7 నుండి వార్షిక యాత్ర ప్రారంభం కానుంది. అలాగే గంగోత్రి, యమునోత్రి ఆలయాలు అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని 2026, ఏప్రిల్ 19న భక్తుల కోసం తెరుచుకోనున్నాయి.కేదార్నాథ్ యాత్ర పునఃప్రారంభం కానుండటంతో హిమాలయాల ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని వేలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాత్రికులు తమ ప్రయాణం, వసతి, ఆరోగ్యానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎత్తయిన ప్రాంతాలలో ఉండే వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని, తగిన జాగ్రత్తలతో ఆధ్యాత్మిక యాత్రను సిద్ధం చేసుకోవాలని తెలిపారు.ఇది కూడా చదవండి: Prayagraj: పుణ్యస్నానాల్లో సరికొత్త రికార్డు.. క్యూలో లక్షలాదిగా.. -
ఆలయంలో ప్రేమికులు చేసిన పనిని సమర్థించిన నటి
కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో ఒక యువతి తన ప్రియుడికి ప్రపోజ్ చేసింది. దానిని వారి యూట్యూబ్‌లో పెట్టారు. ఆ వీడియో వైరల్ కావడంతో.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆలయ సిబ్బంది పోలీసులను కోరారు. దీంతో ఉత్తరాఖండ్ పోలీసులు కూడా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అదే సమయంలో, ఈ జంటకు సినిమా కారిడార్ నుంచి మద్దతు లభించింది. బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఈ జంటకు తన మద్దతును అందించింది. (ఇదీ చదవండి: మహేష్ డాటర్ సితారకు ఇంత ఫేమ్ రావడానికి కారణం ఎవరో తెలుసా?) తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ జంట ఫోటోతో పాటు ఇలా తెలిపారు. భక్తుడికి పవిత్రమైన ప్రదేశం దేవాలయం కాబట్టి వారి ప్రేమకు దేవుడి ఆశీర్వాదం కోరుకున్నారని రవీనా తెలిపింది. అంతేకాకుండా ప్రేమకు దేవుడు ఎప్పుడు వ్యతిరేకంగా మారాడో చెప్పాలని ప్రశ్నించింది. బహుశా అందరి మాదిరి పాశ్చాత్య మార్గంలో గులాబీలు, కొవ్వొత్తులు, చాక్లెట్, రింగులు ఇచ్చి తమ ప్రేమను తెలపడమే మంచిదని భావిస్తున్నారా? అని పేర్కొంది. నిజంగా ఇది బాధాకరం. తమ ప్రేమ సఫలం కావడానికి దేవుడి ఆశీస్సులు కావాలని కోరుకున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో చెప్పాలని రవీనా కోరింది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్-కె' నుంచి బిగ్ అనౌన్స్మెంట్..!) ఇటీవల కేదార్నాథ్ ఆలయం సమీపంలో తన ప్రియుడితో కలిసి కనిపించిన మహిళా యూట్యూబర్ ఈ వీడియోను చిత్రీకరించింది. ఆమె మోకాళ్లపై నిల్చోని తన ప్రియుడికి ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేసింది. ఈ వీడియో కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత, కొందరు వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పరమ శివుడి ముందే పరాచకాలా అంటూ పలువురు ఈ జంటపై మండిపడుతున్నారు. ఇక నుంచి ఆలయ ప్రాంగణంలో మొబైల్ బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో, బద్రీ-కేదార్నాథ్ ఆలయ కమిటీ కూడా ఈ వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మరీ పోలీసుల ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది. -
నవాబ్ చేసిన తప్పేంటి? ఎందుకీ డ్రామా?
మహాభారత స్వర్గారోహణ పర్వంలో.. యుధిష్ఠిరుడు(ధర్మరాజు) వెంట మేరు పర్వతం శిఖరాగ్రానికి చేరుకుంటుంది ఓ శునకం. అయితే ఇంద్రుడు మాత్రం శునకం అపవిత్రమైందని దాని ప్రవేశానికి అడ్డుపడతాడు. విశ్వాసానికి మారుపేరు.. పైగా ఎలాంటి లాభాపేలేకుండా నిస్వార్థంతో తన వెంట నడిచిన శునకానికి అనుమతి ఇవ్వాలంటూ ధర్మరాజు వేడుకుంటాడు. ఆపై ఆ శునకం యమధర్మరాజు పెట్టిన పరీక్షగా తేలడం.. చివరకు ధర్మమే నెగ్గుతుందని చెప్పడంతో ఆ ఘట్టం ముగుస్తుంది. ఇప్పుడు ఈ సందర్భం ఇప్పుడు ఎందుకు అంటారా?.. కేధార్నాథ్ యాత్రలో ఓ ఘటన ఇప్పుడు ఇంటర్నెట్ దృష్టిని ఆకట్టుకుంటోంది. అదే సమయంలో అభ్యంతరాలు.. ప్రతి విమర్శలు దారి తీసింది అది. నవాబ్ అనే ఓ శునకం.. తన ఓనర్‌తో కలిసి కేదార్నాథ్ పుణ్యక్షేత్రంలో కలియ దిరగడమే ఇందుకు ప్రధాన కారణం. నోయిడాకు చెందిన వికాస్ త్యాగి(33) అనే వ్యక్తి.. ఎక్కడికి వెళ్లినా తన పెంపుడు కుక్క నవాబ్ వెంటపెట్టుకెళ్లడం అలవాటు. ఈ క్రమంలో చార్ధామ్ యాత్రకు వెళ్లిన వికాస్ కూడా నవాబ్‌ను తీసుకెళ్లాడు. View this post on Instagram A post shared by Nawab Tyagi Huskyindia0 (@huskyindia0) కేదార్నాథ్ పుణ్యక్షేత్రం నంది విగ్రహం దగ్గర దాని పాదాలను ఉంచి, నుదుట కుంకుమ కూడా పెట్టాడు. ఈ వీడియో కాస్త ఇన్స్టాగ్రామ్, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయ్యింది. అయితే బద్రీనాథ్-కేదార్నాథ్ టెంపుల్ కమిటీ మాత్రం ఈ వీడియోపై మరోలా రియాక్ట్ అయ్యింది. సదరు భక్తుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బుధవారం ఒక ఫిర్యాదు చేసింది. ఆ విజువల్స్ మతపరమైన మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ వాదించింది. అంతేకాదు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది. అయితే వికాస్ మాత్రం తన చర్యను సమర్థించుకుంటున్నాడు. గత నాలుగేళ్లలో నవాబ్ తనతో పాటు దేశంలో ఎన్నో గుడులు తిరిగాడని, అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయని, కానీ, ఇప్పుడు ఈ డ్రామాలు ఎందుకని ప్రశ్నిస్తున్నాడు. ఈ కుక్క కూడా దేవుడి సృష్టిలో భాగమనే అంటున్నాడు. View this post on Instagram A post shared by Nawab Tyagi Huskyindia0 (@huskyindia0) 20 కిలోమీటర్ల ట్రెక్కింగ్ తర్వాత ఆయాలనికి చేరుకున్నాం. దారి పొడువునా ఎంతో మంది భక్తులు.. నవాబ్‌ను దగ్గరికి తీసుకున్నారు. దానితో ఫొటోలు తీసుకున్నారు. ఆ భక్తగణానికి లేని అభ్యంతరం.. కమిటీ వాళ్లకే వచ్చిందా? అని ప్రశ్నిస్తున్నాడు వికాస్. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో వికాస్‌కే విపరీతమైన మద్దతు లభిస్తోంది. స్వర్గారోహణలో యుధిష్ఠిరుడు వికాస్ అయితే.. వెంట వెళ్లిన శునకం నవాబ్ అని పోలుస్తున్నారు. కడకు ధర్మమే నెగ్గుతుందని కామెంట్లు చేస్తున్నారు చాలామంది. చదవండి: అయ్యా ఎమ్మెల్యే సారూ అదేం పని.. వీడియో -
బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల సందర్శనకు ప్రధాని మోదీ
గోపేశ్వర్ (ఉత్తరాఖండ్): హిమాయాల్లోని బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలను ప్రధాన నరేంద్ర మోదీ మేలో సందర్శించనున్నారు. గంగోత్రి, యమునోత్రిలతో కూడిన చార్ ధామ్ యాత్రలో భాగమైన ఈ ఆలయాలు ఏటా శీతాకాలంలో ఆర్నెల్లు మూతబడి ఉంటాయన్నది తెలిసిందే. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు మే 3న, కేదార్నాథ్ మే 6, బద్రీనాథ్ మే 8న తెరుచుకోనున్నాయి. చదవండి: (మంత్రులకు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన యూపీ సీఎం యోగి) -
కూలిన విమానం; రెండు ఐఏఎఫ్ హెలికాప్టర్లతో...
డెహ్రాడూన్ : భారత వైమానిక దళం మరోసారి సత్తా చాటింది. కేదార్నాథ్ సమీపంలో కూలిపోయిన ఓ పౌర విమానాన్ని కాపాడటంలో విజయవంతమైంది. ఈ నెల 26న ఎమ్ఐ-17, వీ5 అనే రెండు భారత వైమానిక దళ విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. వివరాలు.. కొద్ది రోజుల క్రితం యుటి ఎయిర్ ప్రైవేటు విమానం కేదార్నాథ్ దేవాలయం సమీపంలో 1500 అడుగులో ఎత్తులో హెలిప్యాడ్ వద్ద కూలిపోయింది. దీంతో ఆ విమానాన్ని బయటకు తీసేందుకు సహాయం చేయాల్సిందిగా సదరు సంస్థ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ద్వారా భారత వైమానిక దళాన్ని కోరింది. అంతేగాక దేవాలయం మూసివేయకముందే వాటిని బయటకు తీయాలని విఙ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో శనివారం రంగంలోకి దిగిన ఐఏఎఫ్ హెలికాప్టర్లు.. సదరు విమానాన్ని ఘటనా ప్రాంతం నుంచి తరలించాయి. వీటిలో ఒకటి కూలిన విమానాన్ని పైకి తీయడానికి ప్రయత్నించగా, మరొకటి దానికి సహాయాన్ని అందించింది. కూలిన విమానాన్ని హెలికాప్టర్‌కు కింది భాగాన కట్టి, అనంతరం దానిని పైకి తీసి డెహ్రడూన్‌లోని సహస్త్రధార ప్రాంతానికి చేర్చారు. కేదార్నాథ్ ప్రాంతంలో ఇరుకైన లోయలు, కేవలం ఫుట్ ట్రాక్ కనెక్టివిటీ మాత్రమే ఉన్నందున విమానాన్ని వేరే ప్రాంతానకి తరలించడం ఓ సవాలుగా మారిందని, అయితే ఐఏఎఫ్ దీనిని విజయవంతంగా పూర్తి చేసిందని... ఇది ఐఏఎఫ్ నైపుణ్యతకు నిదర్శమని భారత వైమానికి దళ ప్రతినిధి పేర్కొన్నారు. #WATCH On 26 October, Mi 17 V5 helicopters of Indian Air Force evacuated a crashed aircraft of UT Air Pvt limited at 11500 feet at Kedarnath helipad. The helicopter was flown to Sahastradhara near Dehradun #Uttarakhand pic.twitter.com/fgoOxKIMSr — ANI (@ANI) October 27, 2019 -
భారీ వర్షాలు.. హై అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ : భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందలు పడుతున్నారు. మరో రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాగల 36 గంటల్లో ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో కేదార్నాథ్, యమునోత్రి యాత్రికులకు ముందుస్తు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్ష సూచన ఉండటంతో వరదలు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలను రంగంలోకి దింపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాదిన కురుస్తున భారీ వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే పది మందికి పైగా మృతి చెందారు. కొండచరియలు విరిగిపడడంతో కొండ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారు. హిమచల్ ప్రదేశ్‌లోని బీయాస్ నది తీవ్ర ఉదృతంగా ప్రవహిస్తుడడంతో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే హై అలర్టు ప్రకటించారు. -
చార్‌థామ్ యాత్రలో తెలుగువాళ్ల అవస్థలు
చార్దామ్: ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రలో తెలుగువాళ్లు అవస్థలు పడుతున్నారు. ఏజెంట్ మోసంతో గుంటూరు జిల్లా వాసులు చిక్కుల్లో పడ్డారు. సుమారు 62మంది తెలుగువాళ్లు కేథార్‌నాథ్‌లో చిక్కుకుపోయారు. వీళ్లలో 42మంది గుంటూరు జిల్లా వినుకొండ, నరసరావుపేట యాత్రికులు ఉన్నారు. ఏజెంట్ మోసంతో చార్ధామ్ యాత్ర మధ్యలోనే నిలిచిపోయింది. శిఖర దర్శనం చేయిస్తానంటూ హెలికాప్టర్ కోసం డబ్బులు తీసుకున్న ఏజెంట్ ఆ తర్వాత పత్తా లేకుండా పోవడంతో యాత్రికులు కష్టాలు పడుతున్నారు. గడ్డకట్టిన చలిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీళ్లలో 40మందికి పైగా మహిళలు కూడా ఉన్నారు.


