breaking news
kartika depotsawam
-
కార్తీక మాసం ముగింపు సంధర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు
-
యాదాద్రికి కలిసొచ్చిన కార్తీకం
సాక్షి,యాదగిరికొండ (ఆలేరు) : యాదగిరీశుడికి కార్తీకమాసం కలిసొచ్చింది. పాతగుట్ట, ప్రధానాలయం కలిపి సత్యనారాయణస్వామి వ్రతాలు తదితర అన్ని విభాగాల ద్వారా రూ.6,15,91, 071 ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రూ.30 లక్షల ఆదాయం అధికంగా వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. కార్తీక మాసంలో యాదాద్రికి పెరిగిన ఆదాయం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఈ ఏడాది కార్తీకమాసంలో గతంలో కంటే ఆదాయం పెరిగింది. యాదగిరిగుట్ట దేవస్థానం వ్రతాలకు పెట్టింది పేరు. యాదాద్రికి సికింద్రాబాద్, హైదరాబాద్, మహబూబ్నగర్, బెంగళూరు, రాజమండ్రితోపాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి సైతం వచ్చి ఇక్కడ వ్రతాలను నిర్వహిస్తారు. అందుకనే యాదాద్రి దేవస్థానం రెందో అన్నవరంగా పేరుగాంచింది. కార్తీకమాసంలో ఎక్కువగా సత్యనారాయణ వ్రతాలను చేయించుకుంటారు. ఈ ఏడాది కార్తీకమాసంలో నెలాఖరు వరకు అంటే 30 రోజులలో మొత్తం 17,921 వ్రతాలు జరిగాయి. అలాగే పాతగుట్టలో సైతం వ్రతాలు పెరిగాయి. గతేడాది 1340 కాగా ఈ యేడాది 1520 వ్రతాలు జరిగినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వీటిపై స్వామి వారికి పాతగుట్ట, ప్రధానాలయం కలిపి వచ్చిన ఆదాయం రూ.89,60,500 రాగా గతేడాది రూ.87,97,500 వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్తీక మాసంలో అన్ని విభాగాల నుంచి ఆదాయం రూ.6,15,91,071 రాగా.. గతేడాది రూ.5,86, 69,307 వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. అంటే మొత్తంగా ఈ ఏడాది దేవస్థానానికి రూ.29,21,764 ఆదాయం పెరిగింది. -
దీపం దైవ స్వరూపం
కడప కల్చరల్: దీపం మానవ లోకానికి వెలుగునిచ్చే దైవ స్వరూపమని చిన్మయమిషన్ ఆచార్యులు నిర్మలానంద సరస్వతి పేర్కొన్నారు. చిన్మయమిషన్ కడపశాఖ ఆచార్యులు స్వామి శౌనకచైతన్య ఆధ్వర్యంలో ఆరు రోజులుగా స్థానిక మున్సిపల్ మైదానంలో జరుగుతున్న కార్తీక దీపోత్సవ సభకు శనివారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దీపాన్ని జ్ఞాన జ్యోతిగా భావించాలని, ప్రాపంచిక జ్ఞానానికి చివరి దశ ఆధ్యాత్మికమేనని తెలిపారు. మానవుడు ఉత్తమ గుణాలతో ఆత్మజ్యోతిగా శివజ్యోతిని చేరుకునేందుకు సత్కర్మల ద్వారా ప్రయత్నించాలని సూచించారు. పరుచుకున్న వెలుగు – ఈ సందర్భఃగా వేదికపై శివలింగానికి విశేష అభిషేకాలు, అలంకారం అనంతరం స్వామిని నిర్మలానంద ప్రధాన జ్యోతిని వెలిగించారు. వెంటనే భక్తులు కూడా దీపాలను వెలిగించి శివనామ స్మరణ చేశారు. నిర్వాహకులు ముల్లంగి ప్రసాద్, ఎలిశెట్టి శివకుమార్, చింతకుంట పుల్లయ్య, మాకం నాగరాజు, ఆనంద్ తదితరులు భక్తులకు ఎలాంటి అసౌక్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.