breaking news
kanipakam vinayaka swamy
-
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు కలికిరి కిరికిరి
సాక్షి, అమరావతి/చిత్తూరు రూరల్: శాస్త్రాలు, సంప్రదాయాలు తరువాత.. ముందు నా మాట నెగ్గాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు చిత్తూరు జిల్లా పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్. కాణిపాకం వినాయకుడి బ్రహ్మోత్సవాల్లో చంద్రప్రభ వాహనసేవకు కొందరిని ఉభయదారులుగా చేర్చాల్సిందేనని మంకుపట్టు పడుతున్నారాయన. అయితే.. ఇలా చేర్చడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయానికి విరుద్ధమని ఉభయదారులు చెబుతున్నారు. దీనికి తాము అంగీకరించబోమని మీడియా సమావేశం ఏర్పాటుచేసి మరీ స్పష్టం చేశారు. పూతలపట్టు నియోజకవర్గంలోని కాణిపాకంలోని స్వయంభూ వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలను ఏటా వినాయకచవితి పండుగ రోజు నుంచి 21 రోజులు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో స్వామిని రోజుకొక వాహనంపై ఊరేగిస్తారు. ఒక్కోసేవకు తరతరాలుగా కొన్ని గ్రామాలకు చెందిన కొన్ని కుటుంబాలవారే ఉభయదారులుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి సెపె్టంబర్ 16 వరకు నిర్వహించనున్నారు. అయితే.. చంద్రప్రభ వాహనసేవలో మూడు గ్రామాలకు చెందిన కొందరిని ఉభయదారులుగా చేర్చాలని ఎమ్మెల్యే పట్టుబడున్నారు. చంద్రప్రభ వాహనసేవకు కాణిపాకం, చిన్నకాంపల్లి, వడ్రంపల్లి, కారకంపల్లి, ఉత్తర బ్రాహ్మణపల్లి, పుణ్యసముద్రం, సంతపల్లి, మారేడుపల్లి, అగరంపల్లి, 45.కొత్తపల్లి, చిగరపల్లి, తిరువణంపల్లి, బొమ్మసముద్రం గ్రామాల వారు మాత్రమే తరతరాలుగా ఉభయదారులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు పట్నం, పైపల్లి, సిద్ధంపల్లి గ్రామాలకు చెందిన కొందరిని ఉభయదారులుగా చేర్చాలని ఎమ్మెల్యే పట్టుపడుతున్నారు. తాను ఎమ్మెల్యేగా చెప్పినా కూడా వారిని ఉభయదారులుగా చేర్చుకోకపోవడం ఏంటని పలువురిని బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. ఉభయదారుల వ్యవహారాల్లో జోక్యం కుదరదు కొత్తవారిని చేర్చాలన్న ఎమ్మెల్యే మురళీమోహన్ సూచనకు తాము అంగీకరించకపోవడంతో ఆయన కక్షసాధింపు చర్యలకు దిగారని చంద్రప్రభ వాహనసేవ ఉభయదారుల్లో కొందరు బుధవారం చిత్తూరులో మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఆగమశా్రస్తాలు, తరతరాల సంప్రదాయాలతో ముడిపడి ఉన్న బ్రహ్మోత్సవాల్లో ఇప్పుడు కొత్తగా ఉభయదారులుగా చేర్చుకోవడం కుదరదని స్పష్టం చేశారు. ‘అసలు ఉభయదారుల వ్యవహారాల్లో వేలు పెట్టడానికి నువ్వెవరు? ఎమ్మెల్యే అయినంత మాత్రాన నువ్వు చెప్పినవాళ్లందరినీ ఉభయదారులుగా చేర్చుకోవాలా? అలా సాధ్యం కాదని చెప్పినందుకు మాలో ఒకరిని ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండీతిప్పలు లేకుండా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టించారు. దారిన పోయేవాళ్లందరినీ ఆలయ ఉభయదారులుగా అంగీకరించే ప్రసక్తేలేదు. మరోమారు ఎమ్మెల్యే మురళీమోహన్ ఈ వ్యవహారంలో తలదూరిస్తే ఆలయం ఎదుటే ధర్నా చేస్తాం..’ అని చెప్పారు. -
కాణిపాకం వినాయకునికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి పెద్దిరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే ఎస్ బాబు, ఆలయ అధికారి వెంకటేష్.. మంత్రికి ఘన స్వాగతం పలికారు. వేదపండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాణిపాకం వినాయక ఆలయంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇవీ చదవండి: మంచి పనులకు విఘ్నాలు తొలగాలి మహా గణపతిం మనసా స్మరామి... -
నేటి నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు
సాక్షి, కాణిపాకం(యాదమరి): లోకాలనేలే నాయకుడి బ్రహ్మోత్సవాలకు కాణిపాకం పుణ్యక్షేత్రం ముస్తాబైంది. సోమవారం వినాయక చవితి నుంచి 21 రోజులు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించడానికి ఆలయాధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పోలీసు బందోబస్తు పటిష్టం చేశారు. విద్యుత్ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలు, అవసరమైన ప్రసాదాలను సిద్ధం చేశారు. ఆలయంలోని మూషిక, అన్వేటి, సుపథ మండపాలు, నవగ్రహ ఆలయం, అభయాంజనేయ స్వామి సన్నిధిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రధాన ద్వారం వద్దనున్న ధ్వజస్తంభాన్ని విదేశీ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. విద్యుత్ దీపాలతో ఆలయ పరిసరాలను శోభాయమానంగా అలం కరించారు. సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యత ఇస్తామని ఈఓ దేముళ్లు తెలిపారు. వినాయకా..భువికి దిగి రావయ్యా! కాణిపాకం (యాదమరి): వినాయకా!..భువికి దిగి రావయ్యా..అనే రీతిలో బ్రహ్మోత్సవాలకు కాణిపాకం ముస్తాబైంది. భక్తులకు క్యూలు ఏర్పాటు చేశారు. భక్తుల కాలక్షేపానికి ఆస్థాన మండపంలో, వరసిద్ధుని అనుబంధ వరదరాజుల స్వామి ఆలయ ముందు ఏర్పాటు చేసి పందిట్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రోజు ఉత్సవమూర్తుల ఊరేగింపులో మేళ తాళాలు, భజనలు, పిల్లన గోవి పాటలు, భక్తి గీతాలాపనలు ఏర్పాటు చేశారు. గణేష దీక్షధారుణ భక్తులు రోజూ రెండు పర్యాయాలు దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. భక్తులు సెల్ఫోన్లు భద్రపరచడానికి, పాదరక్షకులు పెట్టుకునేందుకు,వేర్వేరు ప్రాంతాలలో కౌంటర్లు ఏర్పాటు చేశారు. స్వామివారిని ద ర్శనం చేసుకున్న భక్తులకు ఉచితంగా పులిహోర, చక్కెర పొంగలి పంపిణీ చేయనున్నారు. నేడు వరసిద్ధునికి పట్టువస్త్రాల సమర్పణ కాణిపాక శ్రీ వరసిద్ధునికి బ్రహ్మోత్సవాలలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉదయం 9 గంటలకుకి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఈఓ దేముళ్లు తెలిపారు. ముఖ్య అతిథిగా ఎక్సైజ్ అండ్ కమర్షియల్ ట్యాక్స్ శాఖామాత్యులు కె.నారాయణస్వామి, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ స్వామివారి దర్శనం కాణిపాకం (యాదమరి): స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి 21 రోజుల పాటు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో కాణిపాక ఆలయ ఈవో దేముళ్లుతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ. సాక్షి : ఆలయ ఈఓగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. ఎలా ఉంది? ఈఓ: స్వామివారి బ్రహ్మోత్సవాల ముందు నేను ఇక్కడ ఈఓగా బాధ్యతలు స్వీకరించాను. పెద్ద బాధ్యతే ఇది. అందరి సహకారంతో విజయవంతం చేస్తాను. సాక్షి : భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఈఓ: బ్రహ్మోత్సవాలలో రోజూ లక్ష మంది వరకు భక్తులు రావచ్చని అంచనా వేశాం. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేశాం. సాక్షి : ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఈఓ: భక్తులకు అందుబాటులో రూ.100 గదుల 100 ఉన్నాయి. అలాగే ఏసీ రూమ్లు 80 ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి బస్సులలో వచ్చే యాత్రికులకు డార్మిటరీలు, కల్యాణ మండపాలు ఉన్నాయి. అలాగు బస్టాండ్ నుంచి ఆలయం వరకు ఉన్న మార్గంలో 270 వరకు బాత్రూమ్లు ఏర్పాటు చేశాం. సాక్షి : సామన్య భక్తులకు దర్శనం ఎలా కల్పిస్తారు? ఈఓ: బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తున్నాం. ఉదయం 4.30 గంటల నుంచి స్వామి వారి దర్శనం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. చవితి రోజున ఇంకా త్వరగా దర్శనం ప్రారంభించడానికి ప్రయత్నిస్తాం. సాక్షి: వీఐపీలకు ఏ సమయంలో దర్శనం కల్పిస్తారు? ఈఓ: వీఐపీలకు ఉదయం 8 గంటల లోపు, రాత్రి 8 గంటల తరువాత దర్శనం కల్పించనున్నాం. బ్రహ్మోత్సవాల సమయంలో నిత్య సేవలు రద్దు చేస్తున్నాం. సాక్షి : భక్తులకు దర్శనాల ఏర్పాట్లు ఏమిటి? ఈఓ: భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉచితం, రూ.10, రూ.51, రూ.100, ప్రముఖులకు వేర్వేరుగా దర్శనం క్యూలు ఏర్పాటు చేశాం. అలాగే చంటి పిల్లలకు, గర్భవతులకు, వృద్ధులకు ప్రత్యే క క్యూలను ఏర్పాటు చేశాం. క్యూలలో తాగునీటి వసతి కల్పించాం. ఫ్యాన్లు ఏర్పాటు చేశాం. సాక్షి : ప్రసాదాల మాటేమిటి? ఈఓ: భక్తులకు రూ.10 లడ్డూలు 80 వేలు, రూ.50 లడ్డూలు 15 వేలు, రూ.100 లడ్డూలు 10 వేలు , వడలు 5 వేల వరకు సిద్ధం చేశాం. సాక్షి : భక్తులను ఆకట్టుకునేలా ఏం చేశారు? ఈఓ: విద్యుద్దీపాలంకరణతో ఆలయానికి సరికొత్త శోభను తీసుకొచ్చాం. అలాగే ఆలయం అంతటా ప్రత్యేక పుష్పాలంకరణ చేస్తున్నాం. స్వామివారి బ్రహ్మోత్సవ విశేషాలు తెలిపే విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేశాం. సాక్షి : భక్తులకు భోజన వసతి కల్పిస్తున్నారా? ఈఓ: భక్తులకు ఆలయ నిత్యాన్నదాన కేంద్రంలో రోజూ 3,500 మందికి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భోజన వసతి కల్పిస్తాం. అలాగే 21 రోజుల పాటు నిరంతర అన్నదాన కమిటీ సభ్యులు ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు అన్నదానం చేస్తారు. సాక్షి : బ్రహ్మోత్సవాలలో ప్రత్యేక కార్యక్రమాలు? ఈఓ: ఈ ఏడాది నుంచి ఆలయంలో ప్రత్యేక పవిత్రోత్సవాలను నిర్వహించేందుకు శ్రీకారం చుడుతున్నాం, అలాగే వేద సభ నిర్వహించేం దుకు అర్చకులు, వేదపండితులను సంప్రదిస్తున్నాం. ఈ నెల 6న చాగంటి కోటేశ్వరరావుతో ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. భక్తు ల కాలక్షేపం కోసం ప్రతి రోజూ మధ్యాహ్నం హరికథ, సాయంత్రం భరతనాట్యం, కూచిపూడి, నృత్య ప్రదర్శనలు, రాత్రుల్లో నాటక ప్రదర్శనలు మొదలైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. -
కాణిపాకం విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న రామ్ గోపాల్వర్మ
-
రికార్డు స్థాయిలో వరసిద్ధుని ఆదాయం
కాణిపాకం(ఐరాల) : కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరింది. గత ఏడాది బ్రహ్మోత్సవాల్లో రూ.89 లక్షల ఆదాయం రాగా ఈ ఏడాది రూ.కోటి 7 లక్షలకు చేరింది. శుక్రవారం ఆలయ ఆన్వేటి మండపంలో ఈవో పి.పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేపట్టారు. 31 రోజులకు గాను నగదు రూపంలో రూ.1,07,86,619 వచ్చింది. బంగారం 50 గ్రాములు, కేజీ వెండి కానుకగా అందింది. నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.9,297, ప్రచార రథం హుండీ ద్వారా రూ.14,505, భిక్షాండి హుండీలో రూ.8,311 వచ్చింది. విదేశీ కరెన్సీ సైతం వచ్చినట్లు ఈవో పూర్ణచంద్రరావు వెల్లడించారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన ఏపీ వెంకటేషు, ఏఈవో కేశవరావు, సూపరింటెండెంట్ రవీంద్ర, స్వాములు వెంకటేశ్వరరావు, ఇన్స్పెక్టర్లు మల్లికార్జున, చిట్టిబాబు పాల్గొన్నారు.