breaking news
kandanaolu
-
స్నేహితులే హత్య చేసి.. పొదల్లో పడవేసి
కందనూలు: వడ్ల వ్యాపారంలో జరిగిన లావాదేవీల తో మనస్పర్థల కారణంగా స్నేహితులే ఓ వ్యక్తిని హ త్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజినేపల్లి మండలంలోని మంగనూర్ గ్రామానికి చెందిన ఎండీ హసన్ (36) ఈ నెల 22న స్నేహితులు పానుగంటి అరవింద్, వీరకారి శివాజీతో కలిసి హైదరాబాద్ బయలుదేరాడు.షాద్‌నగర్ టోల్గేట్ దాటిన తర్వాత అతడి ఆచూకీ దొరకలేదు. దీంతో ఈ నెల 23న హసన్ సోదరుడు ఎండీ హాజీ షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా బూర్గుల ప్రాంతంలోని ట్రూ ల్యాండ్ మార్క్ వెంచర్ సమీపంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 25వ తేదీ ఉదయం హసన్ బంధువులు చివరి లోకేషన్ పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టగా.. కాశిరెడ్డిగూడ శివారులో ట్రూ ల్యాండ్ మార్క్ వెంచర్లో పొదల మధ్య హసన్ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్, డాగ్‌స్క్వాడ్ సాయంతో అధారాలు సేకరించారు.వడ్ల వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఆర్థిక వివాదాల నేపథ్యంలో హసన్ స్నేహితులే హత్య చేసి మృతదేహాన్ని పొదల్లో పడవేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని షాద్‌నగర్ పోలీసులు తెలిపారు. -
కందనవోలు సంబరాలు ఘనంగా నిర్వహిద్దాం
- కార్తీక మాసం ముగిసేలోగా నిర్వహణకు చర్యలు - జేసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ - కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): కందనవోలు సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. సంబరాల నిర్వహణపై గురువారం సాయంత్రం కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిభింబించేలా, లోకల్ టూరిజాన్ని ప్రోత్సహించేలా కందనవోలు సంబరాలను నిర్వíßంహిచాలన్నారు. ఇందుకోసం జాయింట్ కలెక్టర్ హరికిరణ్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు మెంబరు కన్వీనర్‌గా, డీఆర్డీఏ, డ్వామా పీడీలు, యువజన సంక్షేమ అధికారి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్, సమాచార శాఖ డీడీలు సభ్యులుగా నియమించారు. వేడుకల నిర్వహణకు, కల్చరల్, పబ్లిసిటీ, సావరిన్ కమిటీ, తదితర కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. కార్తీక మాసం ఈనెల 29న ముగుస్తున్నందునా 27, 28, 29 తేదీల్లో సంబరాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. కందనవోలు సంబరాలపై హైస్కూలు, జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించాలన్నారు. నిర్వహణపై పూర్తి ప్రణాళికలను సోమవారం సమర్పించాలని పర్యాటక శాఖ అధికారిని ఆదేశించారు. సమావేశంలో జేసీ హరికిరన్, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, డ్వామా పీడీ పుల్లారెడ్డి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, కర్నూలు ఆర్డీఓ రఘుబాబు, జిల్లా పర్యాటక శాఖ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


