breaking news
kamalhassan
-
85 ఏళ్ల బామ్మగా కాజల్.. ఇది ఫిక్స్
ఇండియన్ 2 చిత్రంలో తన పాత్ర ఏమిటన్నది నటి కాజల్ అగర్వాల్ బయట పెట్టేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఏ విషయాన్నీ దర్శకుడు శంకర్ బయట పెట్టరాదని కండిషన్ పెట్టారని చెబుతూనే తన పాత్ర గురించి స్పష్టంగా చెప్పేశారు. దక్షిణాదిలో అగ్ర నటిగా వెలిగిన కాజల్‌కు ప్రస్తుతం అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అయితే తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఒక్కో చిత్రం చేస్తున్న ఈ బ్యూటీ ఎంతో ఆశలు పెట్టుకున్న చిత్రం ఇండియన్–2. కారణం కమలహాసన్‌తో తొలిసారిగా జత కట్టడం. దీన్ని స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కించడం. ఇండియన్–2 చిత్రంలో ఎప్పుడెప్పుడు నటిద్దామా..? అని ఎదురు చూసిన కాజల్ ఇటీవల ఆ చిత్ర షూటింగ్లో పాల్గొన్నారు. ఆ అనుభవాలను చెబుతూ ఇండియన్–2 చిత్రం విడుదలైన తరువాత తన ఇమేజ్ వేరే లెవల్‌కు చేరుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో నటించాలని దర్శకుడు శంకర్ తనను సంప్రదించినప్పుడు ఎలాంటి పాత్రను ఇస్తారోనని బయపడినట్లు తెలిపారు. ఆ తరువాత ఇండియన్–2 చిత్రంలో తన పాత్ర 85 ఏళ్ల బామ్మదని తెలిసిందని పేర్కొన్నారు. ఈ పాత్రకు తాను న్యాయం చేయగలనా? అన్న సందేహం కలిగిందని ఇప్పుడా సందేహం పటాపంచలు అయిపోయిందని చెప్పారు. కారణం ఇండియన్–2 చిత్రంలో కమలహాసన్ పోషిస్తున్న పాత్ర తరువాత అంతగా చెప్పుకోదగ్గ పాత్ర తనదేనని తెలిసిందన్నారు. అందుకే ఈ పాత్ర కోసం చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టి నటిస్తున్నట్లు చెప్పారు. ఈ పాత్రకు మేకప్ కోసమే అనేక గంటలు పడుతోందని అంది. దానిపై అంతగా శ్రద్ధ చూపడానికి కారణం అంత ప్రాముఖ్యత కలిగిన పాత్ర అని పేర్కొన్నారు. చిత్ర షూటింగ్ తదుపరి షెడ్యూల్ పిబ్రవరిలో మొదలవుతుందని అన్నారు. ఈ చిత్రం గురించి ఇంకేమీ బయటకు చెప్పరాదన్నది దర్శకుడు శంకర్ నిబంధన అని చెప్పింది. కాబట్టి ఇప్పటికి ఈ చిత్రం గురించి ఏమీ చెప్పలేనని కాజల్ పేర్కొంది. అన్నట్టు ఈ బ్యూటీకి మరో అవకాశం తలుపు తట్టిందన్నది తాజా సమాచారం. మలయాళ యువ నటుడు దుల్కర్ సల్మాన్‌తో జత కట్టడానికి సిద్ధమవుతోందని టాక్. తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలిసింది. -
‘రజనీ, కమల్ కంటే నేనే సీనియర్’
చెన్నై: రజనీకాంత్, కమలహాసన్‌ల కంటే తానే సీనియర్‌నని నటుడు టీ.రాజేందర్ పేర్కొన్నారు. ఈయన గురువారం చెన్నైలోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ రజనీకాంత్, కమలహాసన్ రాజకీయాల గురించి తనను అడగడంలో అర్థం లేదని అన్నారు. నటులుగా రజనీకాంత్, కమలహాసన్‌లకు తాను అభిమానినని అన్నారు. అయితే రాజకీయాల్లో తాను వారిద్దరి కంటే సీనియర్‌నని అన్నారు. రాజకీయాల్లో విజయం సాధించడానికి అనుభవం ఉంటే చాలదని,అదృష్టం ఉండాలని అన్నారు, తాను అధికారాన్ని పొందడానికి రాజకీయ పార్టీని ప్రారంభించలేదని అన్నారు. అసలు ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల గురించి మాట్లాడడమే మానుకున్నానని అన్నారు. తన చిత్రాల విజయానికి పామర ప్రజలు, మహిళలే కారణం అన్నారు. అయితే ఇప్పుడు సినిమాలను డబ్బున్న వాళ్లే చూసే పరిస్థితి నెలకొందని అన్నారు. వచ్చే నెల 22న చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్ జిల్లాల సినీ డిస్ట్రిబ్యూటర్ల సంఘానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రాజేందర్ జట్టు పోటీ చేయనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.ఈ జట్టులో టీ.రాజేందర్ అధ్యక్ష పదవికి, మన్నర్ ఫిలింస్ మన్నర్ కార్యదర్శి పదవికి పోటీ చేయనున్నట్లు తెలిపారు. -
తమిళ్ మున్నేట్ర పడమ్
2018లో సినిమాలు చూశాం.గొప్పగా చెప్పుకున్నాం.2019లోనూ పక్కవాళ్ల సినిమాల కంటే గొప్పగా ఉండాలని కోరుకుందాం.2018లో తమిళులు సినిమాల్లో ముందడుగు ఎలా వేశారో తెలుసుకుందాం.మున్నేట్రమ్ అంటే ముందడుగు.ఇంద(ఈ) తమిళ్ మున్నేట్ర పడమ్ పాక్కలామ్ (చూద్దాం). సంవత్సరం పూర్తి కావస్తోంది. కొత్త ఏడాది మొదలుపెట్టాలంటే ఈ ఏడాది ఎలా గడిచిందో విశ్లేషించుకోవాలి. మన సినిమాలకు సంబంధించిన లెక్కలు మొదలుపెట్టేశాం. ప్లస్సులు, మైనస్సులు, లాభ నష్టాలు అన్నీ లెక్క తేలుతున్నాయి. మనం ఎలా ఉన్నామో తెలియడానికి స్వీయ విశ్లేషణ ఒక్కటే సరిపోదు... మనం ఎక్కడున్నామో తెలియాలంటే పక్క ఇండస్ట్రీ వాళ్లతో పోల్చి చూసుకుంటే తప్పు లేదు. ఈ ఏడాది తమిళంలో వచ్చిన ‘పడమ్’(సినిమా)ల ప్రస్తావన.ఈ ఏడాది మొదటి సినిమా సీజన్‌ను విక్రమ్, సూర్య మొదలెట్టారు. పొంగల్‌కు పోటీగా రిలీజ్ అయిన ‘స్కెచ్’, తానా సేంద కూట్టమ్(గ్యాంగ్)’ చిత్రాలు యావరేజులుగా నిలిచాయి. ‘తానా సేంద కూట్టమ్’ పాటలు మార్కెట్‌ను విపరీతంగా ఊపేసినా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ కాలేదనే చెప్పాలి. తెలుగు ప్రేక్షకులను భయపెట్టిన అనుష్క ‘భాగమతి’ ఏకకాలంలో తమిళంలోనూ విడుదలైంది. అక్కడ కొంత శాతం మాత్రమే ప్రేక్షకులు భయపడడంతో యావరేజ్‌గా నిలిచింది. అలా గ్రాండ్ స్టార్ట్ లేకుండానే 2018లో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది తమిళ పరిశ్రమ. హంగామా లేదు ఫిబ్రవరిలో విజయ్ సేతుపతి ‘ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్ (ఓ మంచి రోజు చూసి చెబుతాను) రిలీజ్ అయింది. ఈ సినిమా ద్వారా నిహారిక కొణిదెల తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. జీవా, జై, శివ, కేథరీన్, నిక్కీ గల్రానీలతో దర్శకుడు సుందర్.సి తెరకెక్కించిన ‘కలకలప్పు 2’ అనుకున్నంత ఆడలేదు. ‘యాక్షన్ కింగ్’ అర్జున్ తన కుమార్తెను పరిచయం చేస్తూ తెరకెక్కించిన ‘సొల్లి విడవా’ సరిగ్గా ఆడలేదు. ‘36 వయదినిలే’తో కమ్‌బ్యాక్ ఇచ్చిన జ్యోతిక ఆ తర్వాత బాల దర్శకత్వంలో చేసిన చిత్రం ‘నాచ్చియార్’. ఇందులో పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించారు జ్యోతిక. సినిమా బాగానే ఆడింది. మొదటి నెల లానే రెండో నెల కూడా కలకలప్పు (హంగామా) లేకుండా మామూలుగా గడిచింది. బొమ్మ పడలేదు మధ్యలో ఏర్పడ్డ థియేటర్ల సమస్య కారణంగా రిలీజ్లు పల్చబడ్డాయి. పూర్తిగా బంద్ అయ్యాయి కూడా. దాంతో వెండితెరపై బొమ్మ పడలేదు. బాక్స్‌లన్నీ ల్యాబుల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఆ వివాదం సద్దుమణిగిన తర్వాత ఆగిపోయిన చిత్రాలన్నీ కూడా గేటు వదిలిన నీళ్లలా వారానికి 4,5 చిత్రాలు విడుదలయ్యాయి. విభిన్న కథ– స్క్రీన్‌ప్లేతో సినిమాలు రూపొందిస్తాడనే పేరు పొందిన కార్తీక్ సుబ్బరాజ్ సైలెంట్ థ్రిల్లర్ ‘మెర్కురీ’తో వచ్చాడు. ప్రభుదేవా ముఖ్య పాత్రలో నటించిన ఈ సైలెంట్ సినిమాకు మంచి చప్పట్లే పడ్డాయి. ‘మహానటి’ని ఏకకాలంలో ‘నడిగయర్ తిలగమ్’గా తమిళంలో రిలీజ్ చేశారు. సినిమాకు మంచి ప్రశంసలు వినపడ్డా అక్కడక్కడా జెమినీ గణేశన్ పాత్ర తీర్చిదిద్దిన విధానంపై కొందరు అసంతృప్తి వ్యక్తపరిచారు. మన ఫోన్లో ఉన్న సమాచారంతోనే మనల్ని ఎలా మభ్యపెట్టొచ్చు అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ‘ఇరుంబుదురై’ (అభిమన్యుడు) చిత్రం విశాల్‌కు ఈ మధ్య కాలంలో పెద్ద హిట్‌గా నిలిచింది. మంచి వసూళ్లూ రాబట్టింది. కార్తీ రైతుగా కనిపించిన ‘కడైకుట్టి సింగం’ (చినబాబు) దెబ్బకు థియేటర్స్‌ను కన్నీటి పర్యంతం చేసేసింది. ఉద్వేగభరిత కుటుంబ కథా చిత్రంగా వంద రోజులాడేసింది. తమిళంలో మంచి హిట్ సాధించి, తెలుగులో ‘చిన్నబాబు’గా రిలీజ్ అయింది. తమిళ కమర్షియల్ సినిమాల్లో కనిపించే ఫార్ములాని పేరడీ చేసి తెరకెక్కించిన చిత్రం ‘తమిళ పడమ్ 2’. ‘తమిళ పడమ్’కు సీక్వెల్. బాగానే నవ్వుకున్నారు ఆడియన్స్. మన తెలుగు ‘సుడిగాడు’కు ఈ చిత్రమే ప్రేరణ. కామెడీ డాన్‌గా విజయ్ సేతుపతి చేసిన ‘జుంగా’ పెద్ద నష్టాన్నే మిగిల్చింది. యువన్ శంకర్ రాజా నిర్మాతగా మారి తీసిన ‘ప్యార్ ప్రేమ కాదల్’కు పాస్ మార్కులు పడ్డాయి. ఫస్ట్ పార్ట్‌కు ఐదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన కమల్ హాసన్ ‘విశ్వరూపం 2’ చిత్రానికి తెలుగులో మంచి స్పందన రాకపోయినా తమిళంలో డీసెంట్ హిట్‌గా నిలిచింది. పలు వాయిదాల తర్వాత విడుదలైన నయనతార ‘ఇమైక్క నొడిగళ్’ మంచి హిట్ సాధించింది. ఈ సినిమా ద్వారానే రాశీ ఖన్నా తమిళ ఎంట్రీ ఇచ్చారు. శివకార్తికేయన్ ‘సీమరాజా’ పండగ సినిమాగా మిగిలిపోయింది. సమంత ‘యు టర్న్’ మంచి హిట్‌గా నిలిచింది. సీక్వెల్స్ ‘సామీ స్క్వేర్ (సామి 2), సండైకోళి 2 (పందెం కోడి 2) ఫస్ట్ పార్ట్ మ్యాజిక్‌ని రిపీట్ చేయలేకపోయాయి. విజయ్ దేవరకొండ ‘నోటా’కు మన దగ్గర అనుకున్నన్ని ఓట్లు పడకపోయినా తమిళంలో మంచి మెజారిటీ సాధించింది. ‘జయం’ రవి స్పేస్ సినిమా ‘టిక్ టిక్ టిక్’ కూడా మంచి ప్రయత్నం అనిపించుకుంది. చాలా కాలం తర్వాత మణిరత్నం సినిమా సూపర్ హిట్ టాక్ని తీసుకొచ్చింది. అరవింద స్వామి, శింబు, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘చెక్క చివంద వానమ్’(నవాబ్) మంచి సక్సెస్‌గా నిలిచింది. విజయ్ – మురగదాస్ కాంబినే షన్లో వచ్చిన ‘సర్కార్’ సినిమా కలెక్షన్స్‌ల వర్షం కురిపించింది. అందులో రాజకీయ వివాదాల సహాయం కూడా లేకపో లేదు. జ్యోతిక ‘కాట్రిన్ మొళి’ పర్వాలేదనిపించింది.ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీ ఎక్కువగా డిస్కస్ చేసుకున్న సైకో థ్రిల్లర్ ‘రాక్షసన్’. విష్ణు విశాల్ హీరోగా నటించి, నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది అద్భుతమైన రివ్యూలను సంపాదించిపెట్టింది. ప్రస్తుతం ఈ థ్రిల్లర్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు నితిన్. ఇలాంటి రివ్యూస్ అందుకున్న మరో సినిమా ‘పరియేరుమ్ పెరుమాళ్’. దళిత సిద్ధాంతాలతో, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలతో మారి సెల్వరాజ్ రూపొందించిన ఈ చిత్రం కూడా మంచి రివ్యూలను అందుకుంది.దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో శంకర్ రూపొందించిన గ్రాఫికల్ సృష్టి చిట్టి. ‘2.0’ చూసిన ప్రేక్షకులు ‘హాలీవుడ్ సినిమా చూసినట్టే ఉంది’ అని అభినందించారు. ఆ ఆనందాన్ని కోట్లతో కలెక్షన్ల రూపంలో తెలియజేశారు. గత శుక్రవారం సుమారు నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ‘మారీ 2, అడంగామారు, కానా, సిలుక్కువారిపట్టి సింగం’ సినిమాలు విడుదలయ్యాయి. మామూలుగా తమిళనాడులో ఒకేసారి ఇన్ని సినిమాలు విడుదల నిషిద్ధం. రూల్ బ్రేక్ చేసి, థియేటర్లకొచ్చిన ఈ ఐదు సినిమాలూ వసూళ్లు పంచుకుంటున్నాయి. అలా ఈ ఏడాది స్టార్ హీరోలు ఫార్ములానే నమ్ముకుంటే.. యంగ్ హీరోలు కొత్త కొత్త కాన్సెప్ట్స్‌తో దూసుకుపోయారు. బాక్సాఫీస్ ఆకలి తీర్చడానికి స్టార్ హీరోల సినిమాలు.. వంక పెట్టడానికి వీల్లేకుండా రివ్యూలు సాధించిన చిన్న సినిమాలూ ఉన్నాయి. మార్కెట్ ఉన్న హీరోలు డబ్బింగ్ సినిమాల ద్వారా మనల్ని పలకరిస్తూనే ఉన్నారు. అలా తమిళ, తెలుగు ఇండస్ట్రీలు ఎప్పటికప్పుడు మంచి సినిమాలు మార్చుకుంటూ, కొత్త కథలను ఇచ్చి పుచ్చుకుంటూ.. బైలింగువల్స్గా కొనసాగాలని కోరుకుందాం. ఇండియన్ సినిమా స్థాయిని ఇంకొంచెం పైకి తీసుకెళ్లడానికి కిందుండి (భౌగోళికంగా) కృషి చేద్దాం. గ్యాంగ్స్ట్టర్ ఇయర్ ఈ ఏడాది ధనుష్ ‘ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ చిత్రం ద్వారా హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘వడ చెన్నై’ రిలీజ్ అయింది. నార్త్ చెన్నైలోని ఓ గ్యాంగ్ గురించి చర్చించిన ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ చిత్రాల్లో ఓ డిఫరెంట్ అటెంప్ట్ అనిపించింది. అలాగే ‘మారి’ సీక్వెల్‌గా రూపొందిన ‘మారి 2’ను రిలీజ్ చేశారు. మరోవైపు ‘రాక్షసన్, పరియేరుమ్ పెరుమాళ్’ వంటి పేరు సంపాదించిపెట్టిన రెండు చిత్రాల దర్శకులు తమ నెక్ట్స్ సినిమాలను ధనుష్‌తో చేస్తున్నట్టు ప్రకటించేశారు. రజనీ ఎక్స్‌ప్రెస్ స్టార్ హీరోలు ఏడాదికి ఒక్కసారి కనిపించడమే ఎక్కువ అనుకుంటున్న రోజుల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండు సినిమాలను రిలీజ్ చేశారు. మరో సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశారు. ‘రోబో’ సీక్వెల్ ‘2.ఓ’ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయి విడుదలలో జాప్యం అవుతూ వచ్చి ఈ ఏడాది రిలీజ్ అయింది. అలాగే పా. రంజిత్ తెరకెక్కించిన ‘కాలా’ జూలైలో రిలీజ్ అయింది. ‘కబాలీ’ తర్వాత రజనీతో తీసిన ‘కాలా’ సినిమాతో రంజిత్ అన్ని వర్గాల ఆడియన్స్‌ను రంజింపచేయలేకపోయారు. ఇక కార్తీక్ సుబ్బరాజ్‌తో రజనీ చేస్తున్న ‘పేట్టా’ షూటింగ్ కూడా అనుకున్నదానికంటే 15 రోజుల ముందే కంప్లీట్ చేసి ఆశ్చర్యపరిచారు. లేడీ సూపర్ స్టార్ రెండు డిఫరెంట్ జానర్ల సినిమాలతో ఈ ఏడాది స్క్రీన్‌పై కనిపించారు నయనతార. కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఇమైక్క నొడిగళ్’, డార్క్ కామెడీ ‘కోకో’ (కోలమావు కోకిల) చిత్రాలు రెండూ సూపర్‌హిట్. స్టార్ హీరోలకు సమానంగా ‘కోకో’కు చెన్నైలో ఉదయం నాలుగు గంటల షోలు ఏర్పాటు చేయడం విశేషం. నయన్ ఫాలోయింగ్ ఎలా ఉందో చెప్పడానికి ఇదో నిదర్శనం. పాంచ్ పటాకా ఈ మధ్య తమిళ సినిమాల గుర్తించి ప్రస్తావించాలంటే కచ్చితంగా డిస్కస్ చేయాల్సిన పేరులా విజయ్ సేతుపతి మారిపోయారు. దానికి కారణం ఆయన స్క్రిప్ట్‌ల ఎంపికే. ఈ ఏడాది ఏడు చిత్రాల్లో కనిపించారు సేతుపతి. (రెండు గెస్ట్ రోల్స్). ‘ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్ (ఓ మంచి రోజు చూసి చెబుతాను) సినిమాతో ఓపెన్ చేసి ‘జుంగా, చెక్క చివంద వానమ్, 96, సీతకాత్తి’, సినిమాల్లో కనిపించారు. ‘జుంగా’లో అల్లరి డాన్‌గా కనిపిస్తే, ‘చెక్క చివంద వానమ్’లో పోలీస్ ఆఫీసర్ రసూల్‌గా కనిపించి, పవర్ కోసం పరిగెడుతున్న అన్నదమ్ములను ఏరిపారేశారు. ఆ తర్వాత టాక్ ఆఫ్ ది సౌత్ ఇండస్ట్రీ అయిన ‘96’లో కనిపించారు. జానకి, రామచంద్రన్ అనే ఇద్దరి ప్రేమకథను టేప్రికార్డర్లో పెట్టి రివైండ్ బటన్ నొక్కి అందర్నీ పాత జ్ఞాపకాల్లో పడేసిన సినిమా ఇది. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన 8 సంవత్సరాల్లోనే సేతుపతి 25వ సినిమా (సీతకాత్తి) మైలు రాయి అందుకోవడం విశేషం. -
రజనీ, కమల్ ఎవరైనా రాజకీయాల్లొకి రావొచ్చు
తమిళసినిమా: రజనీకాంత్, కమలహాసన్ ఇలా ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చునని, అయితే వచ్చిన తరువాత నూరు శాతం అంకిత భావం కలిగి ఉండాలని హాస్యనటుడు వివేక్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం నామక్కల్ సమీపంలోని పొదుపట్టి గ్రామంలోని గ్రీన్‌పార్క్ పాఠశాలలో జరిగిన సాంస్కృత కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఈయన విలేకరులతో మాట్లాడుతూ తమిళనాడులో వర్షాభావం అధికంగా ఉందన్నారు. దీంతో పంటలు పండక రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారన్నారు. వర్షాభావాన్ని అధిగమించడం విద్యార్థులు,యువత చేతి లో ఉందని అన్నారు. దివంగత పూర్వ రాష్ట్రపతి, విజ్ఞాని అబ్దుల్ కలామ్ విజ్ఞప్తి మేరకు తాను రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టానన్నారు. ఇప్పటికే 28 లక్షల 90 వేల మొక్కలను నాటామని, కోటి మొక్కలను నాటాలన్నది మా లక్ష్యమని అన్నారు. విద్యార్థులు మొక్కలు నాటే కార్యానికి నడుం బిగించాలన్నారు. అప్పుడే ప్రభుత్వం ముందుకు వచ్చి మీకు సహకరిస్తుందని చెప్పారు. రజనీకాంత్, కమలహాసన్‌ల రాజకీయరంగప్రవేశం గురించి మాట్లాడుతూ ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చునని, అయితే వచ్చిన తరువాత వంద శాతం అంకిత భావంతో ప్రముఖ నేతలు కామరాజర్, కక్కన్, ఓమందూర్రామ్, పశుంపెన్ ముత్తురామలింగం, అబ్దుల్‌కలాం లాంటి ఉత్తమ నేతలా పేరు తెచ్చుకోవాలని వివేక్ పేర్కొన్నారు. -
సినిమాను కాపాడండి- సీనియర్ నటుడు
తమిళసినిమా: సినిమాను కాపాడండి అంటూ కేంద్ర మంత్రి అరుణ్ జెట్లీకి నటుడు కమలహాసన్ విజ్ఞప్తి చేశారు. కేంద్రప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విధానం (జీఎస్టీ) జూలై 1న అమల్లోకి రానుంది. కాగా జీఎస్టీ పన్ను విధానాన్ని కోలీవుడ్ సినీ పరిశ్రమ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేంద్రం ఈ విషయం పునఃపరిశీలించి పన్ను శాతాన్ని తగ్గించని పక్షంలో తాను సినిమాను వదిలేస్తానని నటుడు కమలహాసన్ ఇటీవల దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా జీఎస్టీ పన్ను విధానాన్ని తాము తప్పు పట్టడం లేదని, సినిమా టిక్కెట్లపై ఈ పన్ను విధానంతో 28శాతం అదనంగా భారం పడుతుందని, దీంతో ప్రాంతీయ భాషా చిత్రాలకు తీవ్ర ముప్పు కలుగుతుందని కమలహాసన్ అన్నారు. ఈ విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలని కౌన్సిల్‌ను వేడుకుంటున్నట్లు ఆయన ట్విట్టర్లో పేర్కొంటూ సినిమాను కాపాడాలని కేంద్రమంత్రి అరుణ్‌జెట్లీకి విజ్ఞప్తి చేశారు. -
బాలచందర్‌కు ప్రముఖుల నివాళి
-
బాలచందర్‌కు ప్రముఖుల నివాళి
చెన్నై : ప్రముఖ సినీ దర్శకుడు బాలచందర్ భౌతికకాయానికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. చెన్నైలోని ఆళ్వార్‌పేటలోని ఆయన నివాసానికి బుధవారం ఉదయం సినీ, రాజకీయ నేతలతో పాటు, పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటున్నారు. బాలచందర్‌ను కడసారి దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. ఎంఎస్ విశ్వనాథన్, ఏఆర్ రెహ్మాన్, నెపోలియన్, కాంచన, వాణీజయరాం, కె.ఎస్.రవికుమార్, అర్చన, కుష్బూ తదితరులు బాలచందర్ పార్థివ దేహాన్ని సందర్శించి, అంజలి ఘటించారు. మరోవైపు షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్న నటుడు కమల్ హాసన్ ...బాలచందర్ మరణవార్త వినగానే హుటాహుటీన చెన్నై బయల్దేరారు. మరికొద్దిసేపట్లో ఆయన చెన్నై చేరుకోనున్నారు. కాగా బాలచందర్ అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం జరగనున్నట్లు సమాచారం.