breaking news
Kakoli Ghosh
-
మమతకు మరో ఎదురుదెబ్బ.. లీగల్ నోటీసు కలకలం
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. తిరుగుబాటు ఎంపీ కకోలీ ఘోష్ కుమారుడు డాక్టర్ బైద్యనాథ్ ఘోష్ దస్తిదార్.. మమతా బెనర్జీతో పాటు పలువురు సీనియర్ టీఎంసీ నేతలకు లీగల్ నోటీసులు పంపడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ ఘటన మమతకు ఊహించని షాకిచ్చింది.అయితే, వృత్తిరీత్యా సైకియాట్రిస్ట్ అయిన డాక్టర్ బైద్యనాథ్ ఘోష్ దస్తిదార్.. తాను బరాసత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి టీఎంసీ టికెట్ కోరినట్లు కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని ఆయన పేర్కొన్నారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ న్యాయపరమైన చర్యలకు దిగారు. ఈ లీగల్ నోటీసులు మమతా బెనర్జీతో పాటు టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా, కళ్యాణ్ బెనర్జీ, సౌగతా రాయ్, అలాగే పార్టీ నాయకురాలు సోనాలీ గుహలకు పంపినట్లు సమాచారం.నాపై తప్పుడు ప్రచారం..ఇటీవల టీఎంసీలో చెలరేగిన అంతర్గత విభేదాల సందర్భంగా కకోలి ఘోష్ దస్తిదార్ తిరుగుబాటుకు కారణం తన కుమారుడికి అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడమేనని కొందరు పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలను బైద్యనాథ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా..‘నా కోసం నా తల్లి ఎమ్మెల్యే టికెట్ అడిగిందనడం వంద శాతం అబద్ధం. రాజకీయ విభేదాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి. కుటుంబ సభ్యులను లాగడం సరైంది కాదు’ అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. లీగల్ నోటీసులో భాగంగా తనపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పరువునష్టం కేసులు సహా తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.Dr. Baidyanath Ghosh Dastidar, son of rebel TMC MP Kakoli Ghosh Dastidar, has sent a legal notice to former West Bengal Chief Minister Mamata Banerjee and several Trinamool Congress leaders including Mahua Moitra, Kalyan Banerjee, Sougata Roy, and Sonali Guha. In the notice,… pic.twitter.com/HCYU0lQ0ZT— ANI (@ANI) June 14, 2026ఐ-ప్యాక్ ప్రతినిధులే..తాను ఎప్పుడూ బరాసత్ నుంచి పోటీ చేయాలనే ఆసక్తి చూపలేదని బైద్యనాథ్ స్పష్టం చేశారు. అయితే టీఎంసీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఐ-ప్యాక్ (I-PAC) ప్రతినిధులే తనను సంప్రదించి బరాసత్ నుంచి పోటీ చేయాలని కోరారని ఆయన పేర్కొన్నారు. అలాగే స్థానిక పార్టీ కార్యకర్తలు ఆరోగ్య శిబిరాల్లో పాల్గొనాలని పలుమార్లు ఆహ్వానించినట్లు కూడా నోటీసులో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ పరిణామం ఇప్పటికే తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టీఎంసీకి మరింత ఇబ్బందికరంగా మారింది. ఇటీవల కకోలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలో టీఎంసీ ఎంపీల్లో ఒక వర్గం పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేసింది. తమకు మద్దతుగా గణనీయ సంఖ్యలో ఎంపీలు ఉన్నారని తిరుగుబాటు వర్గం ప్రకటించగా, పార్టీ అధిష్ఠానం వారిని "ద్రోహులు"గా అభివర్ణించింది. ఈ సంక్షోభం నేపథ్యంలో మమతా బెనర్జీ ఇటీవల పార్టీ సంస్థాగత నిర్మాణంలో పలు మార్పులు చేపట్టి తిరుగుబాటు నేతలను కీలక పదవుల నుంచి తప్పించారు. పార్టీపై తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
యూసుఫ్ పఠాన్‌కు మహువా స్ట్రాంగ్ వార్నింగ్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చోటుచేసుకున్న తిరుగుబాట్లు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 20 మంది లోక్‌సభ ఎంపీలు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) వైపు అడుగులు వేస్తున్నారనే ఊహాగానాల మధ్య రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ పరిణామాల దరిమిలా టీఎంసీ ఫైర్‌బ్రాండ్ ఎంపీ మహువా మోయిత్రా తిరుగుబాటుదారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ మ్యాండేట్‌ను ఉల్లంఘించి ఎన్డీఏతో చేతులు కలపాలని చూస్తున్న వారిని స్వార్థపరులుగా, దేశద్రోహులుగా ఆమె అభివర్ణించారు.‘వెన్నెముక ఉండాలి'.. యూసుఫ్ పఠాన్‌పై ఆగ్రహంమహువా మోయిత్రా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్' లో చేసిన ఒక పోస్ట్‌లో మాజీ క్రికెటర్, టీంఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్‌ను నేరుగా టార్గెట్ చేశారు. బీజేపీ అగ్రనేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ‘అమిత్ షా పిలిచారని మీరు ఢిల్లీకి పరిగెడుతున్నారా? కాస్త ధైర్యం ప్రదర్శించండి. మీరు భారతదేశం తరపున ఆడారు. మా జిల్లా ప్రజలు మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించారు. కాస్త సిగ్గు, వెన్నెముక ఉండాలి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల తీర్పు టీఎంసీకి ఇచ్చినదని, ఎన్డీఏకు కాదని ఆమె స్పష్టం చేశారు.బీజేపీ టికెట్‌పై గెలవాలని సవాల్పార్టీ మారే ఆలోచనలో ఉన్న అసమ్మతి ఎంపీలకు మహువా మోయిత్రా ఒక బహిరంగ సవాల్ విసిరారు. పసుపు రంగు మరకలున్న ప్యాంట్లు వేసుకున్న స్వార్థపూరిత దేశద్రోహులంతా వెంటనే బీజేపీలో చేరవచ్చని, అయితే ముందుగా తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసి, తిరిగి బీజేపీ టికెట్‌పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. పార్టీ వెలుపల వారి ఎన్నికల బలం ఎంతో నిరూపించుకోవాలని, అప్పుడే వారు ఎంతటి వీరులో తెలుస్తుందని ఎద్దేవా చేశారు.తల వంచేది లేదు: కాకోలి ఘోష్ దస్తీదార్మరోవైపు లోక్‌సభలో ప్రత్యేక సిట్టింగ్ ఏర్పాట్లు కోరిన 20 మంది అసమ్మతి ఎంపీల గ్రూపులో ఉన్న రెబల్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ ఈ విమర్శలపై ఘాటుగానే స్పందించారు. ‘నా తల తెగినా వంగేది లేదు, నేను ఇప్పటికే చాలా భరించాను’ అని ఆమె మీడియా సంస్థ ‘ఏఎన్ఐ’తో అన్నారు. తానేమీ 2011లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యాక పార్టీలోకి రాలేదని, గత 40 ఏళ్లుగా ఇక్కడే పోరాడుతున్నానని చెప్పారు. తనకు జాతీయ ప్రయోజనాలు, దేశ భద్రత మాత్రమే ముఖ్యమని స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: బీపీలకు, టెన్షన్లకు చెక్.. డాంకీలతో మైండ్ బ్లోయింగ్ ట్రీట్మెంట్! -
మమత పార్టీలో మంటలు
సాక్షి, న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు సంక్షోభం మరింత ముదిరింది. ఇప్పటికే పార్టీలో 58 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేసి పార్టీ చీఫ్ మమతా బెనర్జీపై ధిక్కార స్వరం విన్పించగా సోమవారం ఏకంగా 20 మంది ఎంపీలు సైతం పార్లమెంట్ వేదికగా ఎన్డీఏ కూటమికి మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించారు. విపక్షాల ‘ఇండియా’ కూటమి భేటీ కోసం మమత ఢిల్లీలో ఉండగానే టీఎంసీ అసమ్మతి ఎంపీలు ఈ తిరుగుబాటు జెండా ఎగరేసి పార్టీని మరింత సంక్షోభ సుడిగుండంలోకి నెట్టేశారు. ఎన్డీయేకు తమ మద్దతు ప్రకటిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు సోమవారం లేఖ రాశారు. పార్టీ చీఫ్ విప్ కకోలీ ఘోష్ దస్తీదార్ నాయకత్వంలో తిరుగుబాటు ఎంపీలు ఏకమయ్యారు. ‘‘నాతో కలిపి 20 మంది పార్టీ ఎంపీలు బెంగాల్ అభివృద్ధి కోసం ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మా నిర్ణయాని్న తెలుపుతూ స్పీకర్ బిర్లాకు ఇప్పటికే లేఖ రాశాం. మమ్మల్ని చీలికవర్గంగా గుర్తించాలని పేర్కొంటూ లోక్‌సభలో మాకు విడిగా సీటింగ్ కేటాయించాలని లేఖలో విన్నవించుకున్నాం’’ అని నాయకురాలు కకోలీ దస్తీదార్ తెలిపారు. అయితే చీఫ్ విప్ పదవి నుంచి కకోలీని గతంలోనే తప్పించామని, పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీని ఆ పదవిలో నియమించామని పేర్కొంటూ మే 20న స్పీకర్‌కు మమత రాసిన లేఖను టీఎంసీ పార్టీ సోమవారం బయటపెట్టింది. కకోలీ ప్రస్తుతం పార్టీలో ఏ పదవిలోనూ లేరు అని టీఎంసీ స్పష్టం చేసింది. ఇక ఎన్డీయేతో ప్రయాణం: దస్తీదార్ లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్‌గా తమ నాయకురాలు కకోలీ ఘోష్ దస్తీదార్‌ను కొనసాగించాలని రెబల్ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను కోరబోతున్నట్లు తెలిసింది. మేము ప్రజల తీర్పును అంగీకరిస్తున్నాం. మా భవిష్యత్ రాజకీయ ప్రయాణం ఎన్డీయేతో సాగాలని భావిస్తున్నామని తిరుగుబాటు ఎంపీలు తెలిపారు. లోక్‌సభ సభ్యత్వానికి వెంటనే రాజీనామా చేసి, బీజేపీలో చేరాలన్న ఆలోచన ప్రస్తుతానికి లేదని ఎంపీలు స్పష్టంచేశారు. లోక్‌సభలో ఎన్డీయేకు మద్దతిస్తూ ప్రత్యేక పార్లమెంటరీ వర్గంగా కొనసాగుతామని చెప్పారు. లోక్‌సభలో టీఎంసీకి ప్రస్తుతం 28 మంది ఎంపీలు ఉన్నారు. మూడింట రెండొంతుల మంది తిరుగుబాటు జెండా ఎగురవేశారు. దీంతో వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు పడే అవకాశం లేదని తెలుస్తోంది. అసమ్మతి ఎంపీలు ఢిల్లీలో పార్టీ నాయకురాలు శతాబ్దిరాయ్ నివాసంలో బెంగాల్ బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారితో సమావేశమయ్యారు. బీజేపీ నేతలతో 12 మంది టీఎంసీ ఎంపీలు సమావేశమయ్యారని టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ వెల్లడించారు. టీఎంసీ ఎంపీలు కకోలీ ఘోష్, శతాబ్ది రాయ్, అబూ తాహిర్ ఖాన్, అరూప్ చక్రవర్తి, ఖలీలుర్ రహమాన్, షర్మిల సర్కార్, రచనా బెనర్జీ, అసిత్ మల్, జగదీశ్ చంద్ర వర్మ బాసునీయ, కాలిపద సోరెన్, ప్రసూన్ బెనర్జీ, పార్థ బౌమిక్‌లు బీజేపీ నేతలతో భేటీ అయినట్లు కథనాలొచ్చాయి. రితబ్రత బెనర్జీతో ఫిర్హాద్ హకీం భేటీ మమతా బెనర్జీకి సన్నిహితుడైన టీఎంసీ సీనియర్ నాయకుడు, కోల్‌కతా మాజీ మేయర్ ఫిర్హాద్ హకీం సోమవారం బెంగాల్ అసెంబ్లీ ప్రాంగణంలో తిరుగుబాటు ఎమ్మెల్యేల నేత రితబ్రత బెనర్జీతో ఆయన చాంబర్లో సమావేశమయ్యారు. మరో తిరుగుబాటు ఎమ్మెల్యే సాందీపన్ సాహా సైతం హకీం వెంట వచ్చారు. ఇటీవలే మేయర్ పదవికి రాజీనామా చేసిన హకీం.. తిరుగుబాటు వర్గంతో సమావేశంకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈయన మమత తరఫున మధ్యవర్తిత్వం కోసం వచ్చారా? అనేది తెలియాల్సి ఉంది. కలకత్తా హైకోర్టులో టీఎంసీ పిటిషన్ తిరుగుబాటు వర్గం నాయకుడు రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని టీఎంసీ వ్యతిరేకించింది. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సోమవారం కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయని, అందుకే ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టాలని టీఎంసీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. 11న ఈ పిటిషన్‌ను విచారిస్తామని జస్టిస్ కృష్ణారావు తెలిపారు. -
'మహిళా ఎంపీ చీర లాగుతామన్నారు'
న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్ సందర్భంగా లోక్‌సభలో అధికార బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి సదానంద గౌడకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన తృణమూల్ ఎంపీలను బీజేపీ ఎంపీలు అభ్యంతరకర పదజాలంతో దూషించినట్టు ఆరోపణలు వచ్చాయి. బీజేపీ ఎంపీలు తనను బెదిరించారని అరుస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ పార్లమెంట్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలను వార్తా చానళ్లు ప్రసారం చేయడంతో కలకలం రేగింది. తాగొచ్చిన బీజేపీ ఎంపీ తమ పార్టీ సభ్యులపై దాడికి యత్నించారని కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు. తమ పార్టీ మహిళా ఎంపీ కకోలి ఘోష్ చీర లాగుతానని అతడు బెదిరించాడని చెప్పారు. అయితే ఈ ఆరోపణలను సదరు ఎంపీ తోసిపుచ్చారు.


