'మహిళా ఎంపీ చీర లాగుతామన్నారు' | Sakshi
Sakshi News home page

'మహిళా ఎంపీ చీర లాగుతామన్నారు'

Published Tue, Jul 8 2014 5:48 PM

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ

న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్ సందర్భంగా లోక్సభలో అధికార బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి సదానంద గౌడకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన తృణమూల్ ఎంపీలను బీజేపీ ఎంపీలు అభ్యంతరకర పదజాలంతో దూషించినట్టు ఆరోపణలు వచ్చాయి.

బీజేపీ ఎంపీలు తనను బెదిరించారని అరుస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ పార్లమెంట్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలను వార్తా చానళ్లు ప్రసారం చేయడంతో కలకలం రేగింది. తాగొచ్చిన బీజేపీ ఎంపీ తమ పార్టీ సభ్యులపై దాడికి యత్నించారని కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు. తమ పార్టీ మహిళా ఎంపీ కకోలి ఘోష్ చీర లాగుతానని అతడు బెదిరించాడని చెప్పారు. అయితే ఈ ఆరోపణలను సదరు ఎంపీ తోసిపుచ్చారు.

Advertisement
 
Advertisement
 
Advertisement