breaking news
jivanreddi
-
కాంగ్రెస్ నరహంతక పార్టీ
- జెడ్పీని కుదిపేసిన ‘గంగుల’ వ్యాఖ్యలు - సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే కమలాకర్ మధ్య వాగ్వాదం సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ వాగ్వాదానికి వేదికగా మారింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ ‘నరహంతక పార్టీ’ అనడంతో వివాదం చెలరేగింది. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చర్చలో భాగంగా కాటారం జెడ్పీటీసీ సభ్యుడు నారాయణరెడ్డి పెద్దపల్లిలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో చరిత్రలో ఎక్కడా లేనంతగా ఒకేసారి మాజీ మంత్రి శ్రీధర్‌బాబు సహా 300 మందిపై అన్యాయంగా కేసులు పెట్టారని ఆరోపించారు. దీంతో టీఆర్ఎస్ సభ్యులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ సభ్యులు మళ్లీ లేచి డౌన్ డౌన్ అన్నందుకే కేసులు పెడితే టీఆర్ఎస్ నేతల మీద ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఈ అంశంపై వాడీవేడిగా చర్చ జరుగుతున్న సమయంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అక్రమ కేసుల గురించి ప్రస్తావించాల్సి వస్తే అందులో కాంగ్రెస్ ప్రభుత్వమే ముందు వరుసలో ఉంటుందని, ఆ పార్టీ నరహంతక పార్టీ అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కమలాకర్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎల్పీ ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నరహంతకుల పార్టీ అన్నందుకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పి మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. నేరెళ్లలో ఇసుక లారీల ప్రమేయంతో 12 మంది చనిపోగా ఇవన్ని ప్రభుత్వానికి కనిపించడం లేదా, నరహంతకుల పార్టీ ఎవరిదో చెప్పాలని జీవన్‌రెడ్డి నిలదీశారు. -
వీడీసీ తీర్మానం ఉపసంహరణ
ఆర్మూర్ : మండలంలోని ఆలూర్ గ్రామస్తులెవరూ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో మాట్లాడొద్దంటూ నాలుగు రోజుల క్రితం వీడీసీ చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఆదివారం గ్రామంలో సమావేశమైన వీడీసీ ప్రతినిధులు జిల్లాలు, మండలాల ఏర్పాటు ప్రక్రియను చర్చించారు. అయితే దసరా రోజు మండలం ఏర్పాటు కాకపోవడంతో, సమాచార లోపంతో ఎమ్మెల్యేతో గ్రామస్తులు మాట్లాదవద్దని తీర్మానం చేశామన్నారు. ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. ఎంపీ కవిత విదేశీ పర్యటన నుంచి రాగానే ఆలూర్ మండల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంతో మండలాన్ని సాధించుకుంటామన్నారు. వీడీసీ సభ్యులు లింగారెడ్డి, రాజమల్లు, గంగారెడ్డి, మల్లయ్య, రాజన్న, గంగాధర్, శంకర్, ముత్తెన్న, మల్లేష్, గంగాధర్, గంగారాం, రాజన్న, గంగన్న ఉన్నారు. -
ఫేస్బుక్ అమ్మాయి ఫ్రెండ్షిప్ రిక్వస్ట్!
‘ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్లకుంటాయి...’ ఫేస్బుక్ స్నేహాంలో కూడా ఈ వాక్యాన్ని అన్వయించుకోవచ్చు. తాము ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయాలనుకొంటున్నామో, చాటింగ్ చేద్దామనుకొంటున్నామో అమ్మాయిలకూ, అబ్బాయిలకూ చాలా క్లారిటీ ఉంటుందని చెప్పవచ్చు. ‘‘డియర్ గర్ల్... నీకు నేను ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పెట్టినంత మాత్రాన నిన్ను లవ్ చేస్తున్నట్టు కాదు, నిన్ను లవ్‌లో పడేయాలని కాదు, ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్‌ను డిలీట్ చేయడం నీ గొప్పతనమూ కాదు..!’’ తన ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయని అమ్మాయికి ఒక అబ్బాయి పెట్టిన మెసేజ్ ఇది... విరిసే ప్రతి పువ్వూ పరిమళాన్ని వెదజల్లలేదు. ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెట్టిన వాళ్లంతా ‘ఫ్రెండ్స్’ కాలేరు! తను తిరస్కరించిన రిక్వెస్ట్‌కు కొంచెం ఘాటుగా, స్వీటుగా అమ్మాయి చెప్పిన సమాధానం ఇది! అమ్మాయిలతో స్నేహం చేయడానికి అబ్బాయిలు కెరటాల్లా ఎగసి పడుతున్నారు! ఇగోలు చంపుకొని ఫ్రెండ్షిప్ కోసం రిక్వెస్ట్ పెడుతూ స్నేహం కోసం అర్థిస్తున్నారు. కానీ ఇలాంటి అబ్బాయిలు ఎక్కువమంది ఉండటం అమ్మాయిలకు ఇబ్బందిగా మారుతోంది. సోషల్నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో అమ్మాయి, అబ్బాయిల మధ్య కొత్త పోరాటానికి దారి తీస్తోంది. అబ్బాయిలు ఇంతగానా..! ఒక లేడీ ప్రొఫైల్ మీద ఒక అకౌంట్ ఉంటే దానికి రోజుకు సగటున పదిమంది అబ్బాయిల నుంచి ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్స్ వస్తున్నాయి. లాగిన్ అయిన మరుక్షణం డజన్ల సంఖ్యలో ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్‌లు కనిపిస్తుండే సరికి చాలా మంది అమ్మాయిలు నివ్వెర పోతున్నారు! మరోవైపు - డెరైక్ట్‌గా మన మొహం చూపించాల్సిన పని లేదు, ఒకే క్లిక్‌తో స్నేహాన్ని సంపాదించే అవకాశం ఉంది. అమ్మాయి ఫ్రెండ్షిప్కు ఓకే చెబితే పర్వాలేదు, లేదంటే.. లివిట్! - ఇదీ అబ్బాయిల తీరు. నిజమైన ఫ్రెండ్షిప్కు స్థానముందా?! ఇద్దరు అపరిచితులైన అమ్మాయి, అబ్బాయిల మధ్య ఫేస్బుక్లో స్నేహం చిగురించే అవకాశం ఉందా? అంటే సమాధానానికి చాలా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడంతో మొదలు కొని, వారి స్నేహం కొనసాగాలంటే చాలా ఫ్యాక్టర్స్ పనిచే యాల్సి ఉంటుంది. అవన్నీ సహకరిస్తే ఫేస్బుక్స్నేహం ఫలప్రదం అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి ఫ్యాక్టర్స్‌లో చదువు, ఉద్యోగం, కులం... అన్నీ ప్రభావం చూపుతున్నాయి. అందమైన ప్రొఫైల్.. ‘ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్లకుంటాయి...’ ఫేస్బుక్ స్నేహాంలో కూడా ఈ వాక్యాన్ని అన్వయించుకోవచ్చు. తాము ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయాలనుకొంటున్నామో, చాటింగ్ చేద్దామనుకొంటున్నామో అమ్మాయిలకూ, అబ్బాయిలకూ చాలా క్లారిటీ ఉంటుందని చెప్పవచ్చు. తమ స్టడీస్‌కూ, కెరీర్‌కు, లైఫ్‌కు, లైఫ్‌స్టైల్‌కు... రీచ్ అవుతారనుకొనే వారికే అమ్మాయిలు తమ ఎఫ్బీ అకౌంట్‌కు స్వాగతం చెప్పే ట్రెండ్ కనిపిస్తోందిప్పుడు. దీన్ని బట్టి అబ్బాయిల ఎఫ్బీ ప్రొఫైల్‌ను బట్టి అమ్మాయిలు స్పందిస్తున్నారని అనుకోవచ్చు. సామాజిక ‘వర్గం’ కూడా..! ఫేస్బుక్ స్నేహాల్లో వ్యక్తిగత అభిరుచులు చాలా వరకూ ప్రభావాన్ని చూపిస్తున్నాయనేది చెప్పుకొన్న విషయమే. ఇందులో సామాజికవర్గాన్ని బట్టి యాక్సెప్టెన్స్ ఉంటుందనేది బహిరంగ రహస్యం. అయితే ప్రతి సారీ ఇది చెల్లుబాటు కావడం లేదు. అమ్మాయిలే అల్టిమేట్! అమ్మాయిల నుంచి అబ్బాయిలకు రిక్వెస్ట్ వచ్చే పరిస్థితులు అత్యంత అరుదు. అమ్మాయిలు తమ రిక్వైర్‌మెంట్స్‌కు రీచ్ అయిన వారినే స్నేహితులుగా సమ్మతినిచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ విషయంలో అమ్మాయిలే అల్టిమేట్ అని చెప్పవచ్చు! - జీవన్‌రెడ్డి.బి మారు పేరే మంచిది! ఒక అమ్మాయి బస్టాప్‌లో కనిపిస్తే పది మంది అబ్బాయిలు బైకులు ఆపుకొని చూస్తారు. ఫేస్బుక్లో కూడా అంతే. ఒక రాయి వేద్దామని అబ్బాయిలు రిక్వెస్ట్ పెట్టవచ్చు. తనకూ ఒక గర్ల్‌ఫ్రెండ్ ఉందని చెప్పుకోవడానికి వీలుంటుందని అబ్బాయిలు ఇలాంటి ప్రయత్నం చేయవచ్చు. ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ రావడం అంటే అమ్మాయిలకు ఒక రకంగా ఇగో శాటిష్ఫ్యాక్షనే. తన పోస్టింగ్స్‌కు ఎక్కువ లైక్స్ కోరుకొనే అమ్మాయిలు ఫ్రెండ్స్ సంఖ్యను పెంచుకొంటారు. భావాలను పంచుకోవడానికే ఫేస్బుక్ కావాలనుకొనే అమ్మాయిలు మారు పేర్లమీద, ఫోటోలు పెట్టకుండా, అకౌంట్‌ను అపరేట్ చే సే అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. - యండమూరి వీరేంద్రనాథ్, ప్రముఖ రచయిత.