మండలంలోని ఆలూర్ గ్రామస్తులెవరూ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో మాట్లాడొద్దంటూ నాలుగు రోజుల క్రితం వీడీసీ చేసిన తీర్మానాన్ని ఉపసంహరించు
వీడీసీ తీర్మానం ఉపసంహరణ
Oct 16 2016 11:11 PM | Updated on Sep 4 2017 5:25 PM
ఆర్మూర్ :
మండలంలోని ఆలూర్ గ్రామస్తులెవరూ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో మాట్లాడొద్దంటూ నాలుగు రోజుల క్రితం వీడీసీ చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఆదివారం గ్రామంలో సమావేశమైన వీడీసీ ప్రతినిధులు జిల్లాలు, మండలాల ఏర్పాటు ప్రక్రియను చర్చించారు. అయితే దసరా రోజు మండలం ఏర్పాటు కాకపోవడంతో, సమాచార లోపంతో ఎమ్మెల్యేతో గ్రామస్తులు మాట్లాదవద్దని తీర్మానం చేశామన్నారు. ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. ఎంపీ కవిత విదేశీ పర్యటన నుంచి రాగానే ఆలూర్ మండల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంతో మండలాన్ని సాధించుకుంటామన్నారు. వీడీసీ సభ్యులు లింగారెడ్డి, రాజమల్లు, గంగారెడ్డి, మల్లయ్య, రాజన్న, గంగాధర్, శంకర్, ముత్తెన్న, మల్లేష్, గంగాధర్, గంగారాం, రాజన్న, గంగన్న ఉన్నారు.
Advertisement
Advertisement