breaking news
Japan Fan
-
మాకు చిన్నతనం నుంచి అబ్బిన అలవాటు..
కొద్ది రోజుల క్రితం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హాలండ్ – జపాన్ మధ్య ‘ఫుట్‌బాల్ మ్యాచ్’ జరిగింది. వందలాది జపానీయ అభిమానులు, జపాన్ నుంచి ప్రత్యేకంగా వెళ్ళి ఆ ఆటను చూచి, అనందించి, తిరిగి వెళ్ళారు. ఆట 2–2 స్కోరుతో ‘డ్రా’గా ముగిసింది. అసలు విశేషం ఆట ముగిసిన తరవాత జరిగింది.జపాన్ నుంచి వచ్చిన అభిమానులందరూ కలిసి, స్టేడియంలో వాళ్ళు కూర్చొన్న భాగాన్ని ఊడ్చి, తుడిచి, అద్దంలా శుభ్రం చేసి, పోగయిన చెత్తను సంచీలలో తీసుకువెళ్ళి కుప్పతొట్లలో పోసి వెళ్ళారు. ‘ఎక్కడికయినా వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు, అక్కడ మా వల్ల పోగయిన చెత్తను మేమే శుభ్రం చేసివెళ్ళటం మాకు చిన్నతనం నుంచి అబ్బిన అలవాటు’ అన్నారట.ఈ చర్యతో వాళ్ళు మనకు మన సనాతన సంప్రదాయం బోధించే రెండు ముఖ్య ధర్మాలను ఆచరించి చూపిన ట్టయింది. మొదటిది ‘ఆత్మవత్ సర్వభూతాని’ – అన్ని ప్రాణులూ మన లాంటివే అన్న ధర్మం. కనక, మన వలన ఇతరులకు కష్టం కలగకూడదు. రెండు, అశుభ్రమైన పరిసరాలలో ఏ పనీ సమర్థంగా, తృప్తికరంగా జరపలేం, కార్యసాధనకు ఏకాగ్రత అవసరం. ఏకాగ్రతకు శుచి శుభ్రతలు దోహదం చేస్తాయి. లౌకికమైన పనుల విషయంలోనూ, ఆధ్యాత్మిక సాధనల విషయాల్లోనూ అన్ని చోట్లా ఇది వర్తిస్తుంది.యోగ శాస్త్రం చెప్పే యమ, నియమాలలో ప్రప్రథమ నియమం ‘శౌచం’. ‘శౌచం దైవీ గుణం, దాన్ని ఆచరించు; అశౌచం ఆసురీ గుణం, దాన్ని ఆచరించకు’ అని భగవద్గీత బోధిస్తుంది. ముఖ్యంగా పూజా, ధ్యానాది సాధనలలో పరిసరశుద్ధీ, ద్రవ్యశుద్ద్ధీ, శరీరశుద్ధీ మొదలైనవి చిత్తశుద్ధికీ, చిత్త ఏకాగ్రతకూ తోడ్పడతాయి అని పెద్దలు పదే పదే సూచిస్తూ ఉంటారు. జపాను అభిమానులు క్రీడాంగణ శుభ్రత పట్ల చూపిన నిబద్ధతను, ఆస్తిక గణాలు విద్యాలయాలూ, వీధులూ ఇత్యాది బహిరంగ ప్రదేశాలలోనూ, పుణ్యక్షేత్రాలూ, తీర్థాల లాంటి పవిత్ర ప్రదేశాలలోనూ చూపగలిగితే ఫలితాలు మహత్తరంగా ఉంటాయి. – ఎం. మారుతి శాస్త్రి -
ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆకట్టుకున్న జపాన్ అభిమానులు
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మాములుగా మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానులంతా తమ వెంట తెచ్చుకునే తిను బండారాలు సహా పేపర్లు, బ్యానర్లు, జెండాలు, పోస్టర్లను మ్యాచ్ ముగిశాక అక్కడే వదిలేసి వెళ్తుంటారు. మ్యాచ్ పూర్తయ్యాకా చూస్తే స్టేడియంలో చిన్నపాటి చెత్తకుండీ తయారవుతుంది. మ్యాచ్ తర్వాత చెత్తను క్లీన్ చేయలేక సిబ్బంది నానా అవస్థలు పడుతుంటారు. తాజాగా ఫిఫా ప్రారంభమైన నవంబర్ 20న ప్రారంభోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత ఖతర్ - ఈక్వెడార్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఫలితం పక్కనబెడితే ఆటముగిశాక జపాన్ కు చెందిన ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కొంతమంది స్టేడియం చుట్టూ కలియతిరుగుతూ ఇతర దేశాల ఫ్యాన్స్ పడేసిన చెత్తనంతా సంచుల్లోకి ఎత్తుతూ కనిపించారు. ఖతర్ కు చెందిన ఓ యూట్యూబర్ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో జపనీయులు స్టేడియంలో చెత్త ఉన్న చోటకు వెళ్లి దానిని సంచుల్లో ఎత్తుతూ కనిపించారు. తమ దేశం మ్యాచ్ కాకపోయినా ఆట చూడటానికి వచ్చిన జపనీయులు తమ చుట్టూ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా కనిపించేసరికి తట్టుకోలేకపోయారు. జపాన్ ప్రజలు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిస్తారు.అక్కడ రోడ్డు మీద వెళ్తూ చాక్లెట్ తింటే ఆ ప్యాక్ ను జేబులోనే పెట్టుకుని రోడ్డు మీద ఉన్న చెత్త డబ్బాల్లో పడేస్తారు. అందుకే జపాన్ లో వీధులు పరిశుభ్రంగా కనిపిస్తాయి. ఇదే సూత్రాన్ని జపాన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఖతర్ స్టేడియంలో కూడా పాటించారు. Japanese fans at the opening World Cup match cleaned up the stands after Qatar-Ecuador. 🇯🇵 Most respectful fans in the world. 👏 🎥 IG/qatarlivingpic.twitter.com/yZHhe0sQNw — Football Tweet ⚽ (@Football__Tweet) November 21, 2022 చదవండి: మరొక మ్యాచ్ ఓడితే అంతే సంగతి.. అర్జెంటీనా ప్రీక్వార్టర్స్ చాన్స్ ఎంత? -
ఎన్టీఆర్ కు షాకిచ్చిన జపాన్ యువతి
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఓ మహిళా అభిమాని స్వీట్ షాకిచ్చింది. ఏకంగా జపాన్ నుంచి ఆ యువతి తారక్‌ను కలిసేందుకే ఇండియాకు విచ్చేసింది. ఆమె సరాసరి హైదరాబాద్‌లో జరుగుతున్న 'జనతా గ్యారేజ్' షూటింగ్ స్పాట్‌కు వెళ్లడంతో అంతా ఆశ్చర్యపోయారు. తారక్ సినిమాలు కొన్ని జపనీస్‌లోకి డబ్ చేసి విడుదల చేయడం తెలిసిన విషయమే. 'బాద్షా' సినిమా అక్కడ మంచి బిజినెస్ చేసింది కూడా. అలా తారక్ సినిమాలు చూసి అభిమాని అయిపోయిన నాన్ అనే యువతి అతడిని కలిసేందుకు ఏకంగా జపాన్ నుంచి హైదరాబాద్‌కు చేరుకుంది. మంగళవారం నగరానికి చేరుకున్న ఆమె తారక్ ఎక్కడున్నాడో తెలుసుకుని డైరెక్ట్‌గా స్పాట్‌కు వెళ్లి యూనిట్ ను ఆశ్చర్యపరిచింది. తన అభిమాన నటుడిని కలుసుకుని ఉబ్బితబ్బిబ్బయ్యింది. తారక్ సినిమాల్లోని కొన్ని డైలాగులు తెలుగులో చెప్పి అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. తాను నటించిన పలు సినిమాల గురించి ఆమె మాట్లాడటం చూసిన ఎన్టీఆర్ మహదానంద పడిపోయారు. తెలుగు నేర్చుకోవాలని ఉందని, త్వరలో నేర్చేసుకుంటానని అంటోంది. ఎన్టీఆర్ సినిమాలన్నీ చూసినట్లు నాన్ చెప్పింది. అంతేకాకుండా ఆమె 'నాకు తెలుగు అంటే ఇష్టం' కోట్ రాసిన టీ షర్ట్ ధరించింది. ఎల్లలు దాటి వచ్చిన అభిమానానికి ఎన్టీఆర్‌తోపాటు యూనిట్ మొత్తం ఫుల్ ఖుషీ అయ్యారు. కాగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'జనతా గ్యారేజ్' ఆగష్టులో విడుదల కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు.


