breaking news
jansena
-
KSR Comment: తమిళనాడులో జనసేన.. ఊసరవెల్లి సిగ్గుపడేలా పవన్ తీరు
-
బాబుపై సుమోటో కేసులేవీ పవన్?: అంబటి
గుంటూరు, సాక్షి: రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమకేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు మూడు నాలుగు రోజులు అక్రమంగా నిర్బంధించి చిత్ర హింసలకు గురి చేస్తున్నారని సీరియస్ అయ్యారు. దీనిపై వైయస్సార్సీపీ లీగల్ సెల్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత కూడా అరెస్టులు చేపిస్తున్నారని అన్నారు. ఆయన గుంటూరులో సోమవారం మీడియాతో మాట్లాడారు.అక్రమ కేసులు బనాయించిన అధికారులను మేం అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలే ప్రసక్తి లేదని వైఎస్ జగన్ చెప్పారు. అక్రమ కేసులు బనాయించి చట్ట విరుద్ధంగా వ్యవహరించిన అధికారులు డిప్యూటేషన్‌పై వచ్చి వెళ్లినా.. రిటైర్ అయిపోయిన వదిలే ప్రసక్తే లేదని క్లియర్‌గా చెప్పారు. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని పవన్ కల్యాణ్ అంటున్నారు. అధికారులను బెదిరించడం ఏమిటని పవన్ మాట్లాడుతున్నారు. అంటే పవన్ కల్యాణ్ మమ్మల్ని బెదిరిస్తున్నారా?. మీ బెదిరింపులకు భయపడే వారు ఇక్కడ లేరు.అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడితేనే వైఎస్ జగన్ భయపడలేదు. పెద్దపెద్ద వాళ్లతో ఎదురు తిరిగి పోరాడిన వ్యక్తి వైఎస్ జగన్. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులు సంఘ విద్రోహ శక్తులని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలుపై మరి సుమోటోగా కేసు నమోదు చేయాలిగా.. అని పవన్‌ను సూటిగా ప్రశ్నించారు...సుధారాణిని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కొట్టారు.మాజీమంత్రి విడుదల రజనిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. మాటలతో చెప్పుకోలేని విధంగా ఆమెను దూషిస్తూ అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. సాక్షాత్తు డీజీపీకి ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు. గత ప్రభుత్వంలో బాగా పనిచేసిన ముగ్గురు అధికారులపై వైఎస్సార్సీపీ ముద్ర వేసి సస్పెండ్ చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కీలక పోస్టింగ్‌లో ఉన్న 14 మంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు కూటమి ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇవ్వలేదు. సూపర్ సిక్స్, ఉచిత ఇసుక ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు పోలీసులపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారో నా నోటితో నేను చెప్పలేను’’ అని అన్నారు. -
టీడీపీ, జనసేనలో వర్గ విభేదాలు.. మంత్రికి నిరసన సెగ
తూర్పుగోదావరి, సాక్షి: నిడదవోలు టీడీపీ, జనసేనలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. కంసాలిపాలెంలో మంత్రి కందుల దుర్గేష్‌కు నిరసన సెగ తగిలింది. తమను పట్టించుకోవటం లేదని మంత్రిని టీడీపీ నేతులు నిలదీశారు. మంత్రి దుర్గేష్ ఎదుటే టీడీపీ, జనసేన నేతలు ఘర్షణకు దిగారు. -
పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం చంద్రబాబు
-
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: ఏపీలో మళ్లీ ‘ఫ్యాన్’ ప్రభంజనమే
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీకి తిరుగులేదని మరోసారి స్పష్టమైంది. సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు శనివారం సాయంత్రం వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించి మళ్లీ అధికారంలోకి రానుందని ఎగ్జిట్‌పోల్స్ తేల్చాయి. వైఎస్సార్ సీపీ విజయ భేరి మోగించనుందని స్పష్టం చేశాయి. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సీఎం జగన్ ప్రభుత్వానికే మరోసారి జనం జై కొట్టనున్నారని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి రాబోతుందని ఆరా సంస్థ తేల్చింది. 94 నుంచి 104 స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలవబోతుందని ఆరా మస్తాన్ తెలిపారు. 13-15 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలవబోతుందని ఆరా అంచనా వేసింది. షర్మిలకు డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదని ఆరా మస్తాన్ తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 98 నుంచి 116 వరకు.. టీడీపీ 59-77 వస్తాయని ఆత్మసాక్షి సంస్థ అంచనా వేసింది. వైఎస్సార్సీపీకి 117 నుంచి 120.. టీడీపీకి 48 నుంచి 50 సీట్లు దక్కవచ్చని రేస్ తెలిపింది.ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్:ఆత్మసాక్షి: వైఎస్సార్సీపీ: 98-116టీడీపీ 59-77రేస్:వైఎస్సార్సీపీ-117-120టీడీపీ-48-50పోల్ స్ట్రాటజీ గ్రూప్:వైఎస్సార్సీపీ- 115-125టీడీపీ- 50-60ఆపరేషన్ చాణక్య:వైఎస్సార్సీపీ: 95-102టీడీపీ: 64-68చాణక్య పార్థదాస్:వైఎస్సార్సీపీ: 110-120టీడీపీ: 55-65 పోల్ స్ట్రాటజీ గ్రూప్:వైఎస్సార్సీపీ: 115-125టీడీపీ: 50-60జన్మత్:వైఎస్సార్సీపీ: 95-103టీడీపీ: 67-75అగ్నివీర్:వైఎస్సార్సీపీ: 124-128టీడీపీ: 46-49పోల్ లాబొరేటరీ:వైఎస్సార్సీపీ: 108టీడీపీ: 67WRAP స్ట్రాటజీస్:వైఎస్సార్సీపీ: 158-171టీడీపీ-0-4ఏబీపీ- సీ ఓటర్:వైఎస్సార్సీపీ 97-108టీడీపీ 67-78ఏపీ లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్:ఆరా మస్తాన్:వైఎస్సార్సీపీ: 13-15టీడీపీ:10-12ఆత్మసాక్షి:వైఎస్సార్సీపీ: 17టీడీపీ: 08రేస్:వైఎస్సార్సీపీ-19టీడీపీ- 06టైమ్స్ నౌ-ఈటీజీ:వైఎస్సార్సీపీ: 14టీడీపీ-11 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించి సత్తా చాటింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేశారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. సీఎం జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక 99 శాతం అమలు చేయడంతో పేదవర్గాల్లో అధికార వైఎస్సార్సీపీకి ఆదరణ మరింత పెరిగింది. దీంతో ఓటర్లు మరోసారి వైఎస్సార్సీపీకి అవకాశం కల్పించారని ఎగ్జిట్‌పోల్ ఫలితాలు చెబుతున్నాయి. -
AP Election Updates May 5th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
Andhra Pradesh Election Updates 5th May...07:50 PM, May 5th, 2024తాడేపల్లి :టీడీపీ వక్రబుద్దిని బట్టబయలు చేసిన వైఎస్సార్సీపీల్యాండ్ టైట్లింగ్ యాక్టు చాలా మంచిదని గతంలో అసెంబ్లీలో చెప్పిన టీడీపీ నేత పయ్యావుల కేశవ్పయ్యావుల వీడియోని బయట పెట్టిన వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిచాలా గొప్ప చట్టాన్ని తెస్తున్నారంటూ జగన్‌ని మెచ్చుకున్న పయ్యావుల2019 జులై 29న అసెంబ్లీ సాక్షిగా గొప్ప చట్టమని ప్రకటించిన పయ్యావులఆ వీడియోని బయట పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి07:20 PM, May 5th, 2024టీడీపీ ఆఫీస్‌కి సీఐడీ టీమ్టీడీపీ ఆఫీస్‌లో ఎవరూ లేకపోవడంతో అక్కడున్న సిబ్బందికి నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు06:57 PM, May 5th, 2024ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి బదిలీడీజీపీని వెంటనే బదిలీ చేయాలని సీఎస్‌కు ఈసీ ఆదేశాలుముగ్గురు డీజీ ర్యాంకు అధికారులు పేర్లు పంపాలని సీఎస్‌కు ఆదేశం04:50 PM, May 5th, 2024ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు ప్రయత్నిస్తున్నారు: సజ్జలచంద్రబాబు, రామోజీరావు వంటివాళ్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు కాకుండా రాక్షస ప్రయత్నం చేస్తున్నారుల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ మాఫియాకు ఊపిరాడకుండా చేస్తుందిప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం కావాలని 95 శాతం మంది కోరుకున్నారుసర్వే చేయించిన తర్వాతే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశఫెట్టాంపోలవరాన్ని సీఎం జగన్ పూర్తిచేసి చూపిస్తారు.. ఆ శక్తి ఉందికేంద్రం నిధులు సరిగ్గా ఇస్తే రెండేళ్ల కంటే ముందే పోలవరం పూర్తవుతుందిసీఎం జగన్ రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 850 కోట్లు సేవ్ చేశారుపోలవరాన్ని చంద్రబాబు తన ఆదాయంగా మార్చుకున్నారని మోదీకి, అమిత్ షాకు తెలుసుకావాలంటే కేంద్ర ప్రభుత్వం లెక్కలు చూసుకోవాలిఏ బ్యాంకు లెక్కలు తీసినా తెలుస్తుందికూటమిలో పార్ట్నర్ కాబట్టి అమిత్ షా ఏదో మాట్లాడారుచంద్రబాబు అవినీతిని చూసి సహించలేకే జనం తిరస్కరించారుపోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబకు ఏటీఎం అని ఆనాడు మోదీ విమర్శించారు 04:30 PM, May 5th, 2024కాకినాడ:అధికారం కోసం ప్రజలను మోసం చేయాలన్న ఆశతో చంద్రబాబు ఉన్నాడు: ఎమ్మెల్యే ద్వారంపూడి పొత్తులో ఉన్న బీజేపీ పార్టీయే చంద్రబాబును నమ్మడం లేదుకాకినాడ పోర్టులో ఏది ఎగుమతి అవుతుందో చంద్రబాబుకు తెలియదా?కాకినాడ పేరుకు దేశంలో మంచి పేరు ఉంది2014 ఎన్నికల కు ముందు అప్పులు పాలైనపోయిన వ్యక్తి..మాజీ ఎమ్మెల్యే కొండబాబు.2019 నాటికి అవినీతితో ఆస్తులు సంపాదించుకున్న వ్యక్తి కొండబాబుక్రికెట్ బుకీలో దిట్ట మీ కూటమీ ఎంపీ అభ్యర్ధి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ఒక సెంటు నేను కాకినాడలో కబ్జా చేశానని నిరూపిస్తే.. నా ఆస్ధి ప్రజలకు రాసిచ్చేస్తానుకొండబాబు అనే వ్యక్తి ఎమ్మెల్యే గా వస్తే మళ్ళీ కాకినాడలో గంజాయి , కబ్జాలు ,అవినీతి పెరిగిపోతుందిరూ.1,000 కోట్లు ఓఎన్జీసి నా ఎకౌంట్ లో నష్టపరిహారం సొమ్ములు వేసిందని మత్స్యకారులకు కొండబాబు మాయ మాటలు చెబుతున్నారు.ఓఎన్జీసి నుండి సమాచార హక్కు క్రింద సమాచారం తీసుకున్నాను. దీనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానుఅలాగే దీనిపై కొండబాబుపై పరువు నష్ట దావా వేస్తున్నాను04:15 PM, May 5th, 2024తాడేపల్లిల్యాండ్ టైటిల్ యాక్ట్‌ని కేంద్ర ప్రభుత్వమే తీసుకువచ్చింది: ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుఏపీలో 6 వేల పంచాయతీలలో భూ సర్వే జరిగింది.చంద్రబాబు,పవన్ కి ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదు.వందల ఎకరాలు రామోజీ రావు ఫిల్మ్ సిటీ కోసం అక్రమంగా దోచుకున్నాడు.31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన నాయకుడు జగన్.ల్యాండ్ టైటిల్ యాక్ట్ వలన భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవుఏపీలో బీజేపీ కేంద్ర నాయకులు పర్యటన చేస్తున్నారుఈ యాక్టును అమలు చేయనివ్వద్దొని కేంద్ర పెద్దలను అడిగే దమ్ము చంద్రబాబు, పవన్ కి ఉందా?పురేందేశ్వరి ఈ యాక్టు కరెక్టే అని అన్నారు.పోలవరం గురించి మాట్లాడటానికి బీజేపీ నాయకులకి సిగ్గు ఉండాలిపోలవరం డబ్బును ఎటిఎంలా చంద్రబాబు వాడుకున్నాడని మోదీనే గతంలో అన్నారు 03:30 PM, May 5th, 2024చిత్తూరు జిల్లా:చిత్తూరులో పోలీసులు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారువిజయానంద రెడ్డి, చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపోస్టల్ బ్యాలెట్ ఓట్లు కొనుగోలుకు నగదు పంచుతున్న ఇద్దరినీ పట్టుకుని వన్ టౌన్ లో లక్షన్నర నగదుతో అప్పగిస్తే వదిలేశారుఅందుకే స్టేషన్ ముందు అర్ధనగ్న నిరసన చేస్తున్నా500 మంది బెంగుళూరు,,అనంతపురం నుంచి వచ్చి ఇక్కడ తిష్ట వేసి మద్యం, నగదు పంపిణీ చేస్తున్నారుపోలీసులు పట్టించుకోవడం లేదు 02:20 PM, May 5th, 2024తాడేపల్లి :,భూ సంస్కరణలను జగన్ తెస్తుంటే చంద్రబాబు, పవన్ భయపడితున్నారు: రావెల కిషోర్ బాబువారు ఆక్రమించుకున్న భూముల చిట్టా ఎక్కడ బయట పడుతుందోనని భయపడుతున్నారుమోదీ తెచ్చిన ఈ చట్టాన్ని కూటమిలోని చంద్రబాబు వద్దంటున్నారుదీనిపై మోదీ మాట్లాడాలి, నోరు విప్పాలిలేదా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి మోదీ తెస్తున్న చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని ప్రకటించాలిజనం ఛీ కొడుతున్నా చంద్రబాబు, పవన్ ఇంకా అసత్యాలు ప్రచారం చేస్తున్నారుప్రజలు తిరుగుబాటు చేస్తున్నా పట్టించుకోవడం లేదుప్రజల్ని తప్పుదారి పట్టించి రాజకీయంగా లబ్ది పొందాలని చంద్రబాబు కుట్ర పన్నారుపేదలకు భూములు పంచే వ్యక్తి సీఎం జగన్ఆసైన్డు ల్యాండ్ మీద హక్కులు కల్పించిన ఘనత జగన్దిచుక్కల భూమి సమస్యలను పరిష్కరించినది జగన్అలాంటి వ్యక్తి గురించి చంద్రబాబు, పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారుటీడీపీ ఐవిఆర్ఎస్ కాల్స్ పై సీఐడీ విచారణ చేస్తోందితప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవు01:42 PM, May 5th, 2024ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్.. టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణచంద్రబాబు ఏ1గా, లోకేష్ ఏ2గా ఎఫ్ఐఆర్ నమోదుల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ఐవీఆర్ఎస్ కాల్స్‌తో టీడీపీ దుష్ప్రచారంటీడీపీ అసత్య ప్రచారంపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదుఈసీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీచంద్రబాబు, లోకేష్‌తో పాటు 10 మందిపై కేసు నమోదుఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీలపైనా కేసు నమోదు12:15 PM, May 5th, 2024చంద్రబాబుపై సీపీఐ రామకృష్ణ సెటైర్లు40 ఏళ్ల సీనియారిటీ అని చెప్పే చంద్రబాబుకి ఉన్న కన్ఫ్యూజన్ ఎవరికి లేదుల్యాండ్ టైటిలింగ్ మాట్లాడుతున్న బాబు.. ఆ చట్టం తీసుకొచ్చింది బీజేపీనే అనే సంగతి మరిచాడా ?సభల్లో వైఎస్సార్సీపీపై మాట్లాడుతున్న బాబు.. బీజేపీ గురించి ఎందుకు మాట్లాడం లేదుబీజేపీతో జోడి కట్టి ముస్లిం రిజర్వేషన్లు కొనసాగిస్తానంటే మోసం కదా?నాడు మోదీని తిట్టిన బాబు నేడు పొగుడుతున్నారు.. 4ఏళ్లలో మోదీ ఏం చేశాడో చెప్పాలిమోదీ రాష్టానికి చేసిన మేలు ఏంటో బాబు చెప్పాలికూటమి మ్యానిఫెస్టో విడుదలలో పురందేశ్వరి ఎందుకు లేదుకూటమి మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ నేతలు చెప్పడం దేనికి సంకేతంఅవకాశవాదం, స్వార్థంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు10:59 AM, May 5th, 2024సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్ వైఎస్ వివేకా హత్య కేసులో ఛార్జ్‌షీట్ తీసుకుని రండి..బహిరంగ చర్చకు సిద్ధమా.. ఎక్కడికైనా వస్తాఈ నెల 11 లోపు తన సవాల్‌పై స్పందించాలిషర్మిల స్పష్టంగా తెలుసుకుని వాస్తవాలు మాట్లాడాలినాడు షర్మిలను పాదయాత్ర చేయమని ఎవరూ అడగలేదువైఎస్ సోదరి విమలమ్మ మీ వెంట ఎందుకు లేరు?వైఎస్ సోదరులు సైతం మీకు మద్దతు ఇవ్వడం లేదువివేకా మృతి తర్వాత ఎన్నిసార్లు ఆయన సమాధి వద్దకు వెళ్లారుషర్మిల దుర్మార్గపు పనులు చేస్తున్నారు కాబట్టే.. కుటుంబం నుంచి కూడా ఆమెకు మద్దతు లేదురూ.వెయ్యి కోట్ల పని చేయనందుకే షర్మిల వ్యతిరేకంగా మారిందివైఎస్ పేరును చెడ్డగొట్టడానికి షర్మిల కుట్రలు చేస్తోందిసీఎం జగన్, పొన్నవోలుపై షర్మిల వ్యాఖ్యలు సరికాదుషర్మిల ప్రచారానికి స్పందన లేక ఫ్రస్ట్రేషన్‌కు గురవుతుంది. బాబు, పవన్ స్క్రిప్ట్ షర్మిల చదువుతుందివైఎస్ విజయమ్మ మాట పెడచెవిన పెట్టినప్పుడే షర్మిల అంశం ముగిసిందిషర్మిల మోసాలు, అక్రమాలు బయట పెట్టడానికి నేను ఒక్కడిని చాలుతెలంగాణలో షర్మిల వందల కుటుంబాలను మోసం చేశారు. జగన్, షర్మిల పెళ్లికి చంద్రబాబును వైఎస్ పిలిచారన్నది అబద్ధంబాబు ఆడుతున్న ఆటలో షర్మిల పాచిక అయిందివైఎస్ జగన్‌కు అద్ధం చూపడం దుర్మార్గంఒకసారి ఇంటికి వెళ్లి ఆ అద్ధంలో మీ ముఖం చూసుకోండి తెలంగాణలో ఏం మాట్లాడారు. ఏపీలో మాట్లాడారో ఒకసారి చూసుకోండిషర్మిలకు పిచ్చి ముదిరి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది10:59 AM, May 5th, 2024ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై బాబు, పవన్ విష ప్రచారం: ఎమ్మెల్యే మల్లాది విష్ణుప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారుఐవీఆర్ఎల్ సర్వేలో తప్పుడు ప్రచారం చేస్తున్నారుమా ఫిర్యాదు పై ఈసీ స్పందించింది చర్యలకు సీఐడీకి సిఫారసు చేసిందిప్రజల భూమికి భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయంసీఎం జగన్‌ను ఎదుర్కోలేక బాబు, పవన్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్పుడు ప్రచారాలు ఆపకపోతే క్రిమినల్ చర్యలు తప్పవుల్యాండ్ టైటిల్ యాక్ట్ మేం తెచ్చింది కాదునీతి ఆయోగ్ ద్వారా కేంద్రమే అన్ని రాష్ట్రాలకు సూచించింది టీడీపీ, జనసేన నేతలు మాట్లాడుతుంటే ఏపీ బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు?కేంద్రం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ బీజేపీ శాఖ ఎందుకు నోరుమూసుకుంది? ఏపీల ప్రచారానికి వస్తున్న మోదీ, అమిత్ షా సభల్లో చెప్పాలి10:51 AM, May 5th, 2024ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలుల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై కొన్ని పార్టీలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయిభూ రికార్డుల డిజిటలైజేషన్‌తో సమస్యల పరిష్కరించడానికి ఈ చట్టాన్ని తీసుకువస్తున్నారు.ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌తో ప్రజల ఆస్తులు లాగేసుకుంటారంటూ కావాలనే కొన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయిల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తెలియకపోతే మమ్మల్ని అడిగితే చెప్పేవాళ్లంఎన్నికల్లో మాతో భాగస్వామ్యం ఉన్న పార్టీలు ఇలా తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదుల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇతర రాష్ట్రాల్లో అమలవుతుందిఎలా అయినా గెలవాలన్న ఆలోచనతో ప్రజలను భయభ్రాంతులను చేయడం మంచిది కాదుఈ దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్ కూడా సీఐడీ దర్యాప్తు వేసిందిజనసేన, తెలుగుదేశం మేనిఫెస్టో మాకు సంబంధం లేదుచంద్రబాబు చెప్తున్నా సూపర్ సిక్స్ కోసం చాలా డబ్బులు కావాలిచంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిఆయన వాటిని అమలు చేయకపోతే ఆ నెపం మా పైకి వస్తుందిఅందుకే.. జనసేన, తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు8:56 AM, May 5th, 2024నేడు ఏపీకి అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ రాకశ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం బత్తలపల్లి రోడ్డులోని సీఎన్బీ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రసంగించనున్న అమిత్షావైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు, కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్న రాజ్‌నాథ్ సింగ్ 8:51 AM, May 5th, 2024అవన్నీ అపోహలేల్యాండ్ టైట్లింగ్ చట్టంతో భూములకు మరింత రక్షణఈ చట్టం అమల్లోకి వస్తే భూములు, ఆస్తులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుందిఅన్ని పత్రాలూ యజమానుల వద్దే ఉంటాయి.. ప్రభుత్వం వద్ద కేవలం రికార్డులేఈ చట్టం కోర్టు ద్వారాలు మూసేయదు.. కోర్టులకు వెళ్లే అవసరమే లేకుండా చేస్తుందిహక్కుల నిరూపణకు ఇప్పుడున్న చట్టాలు అంతిమ సాక్ష్యాలు కావుఅందుకే ఈ చట్టం అవసరమవుతోందిభూచట్టాల నిపుణుడు, నల్సార్ ప్రొఫెసర్ ఎం. సునీల్‌కుమార్7:37 AM, May 5th, 2024జనం.. జనం.. ప్రభంజనంసీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలకు పోటెత్తిన ప్రజానీకంహిందూపురంలో 43 డిగ్రీల ఎండనూ లెక్కచేయని జనంనియోజకవర్గ చరిత్రలో ఏ నాయకుడికి లేని రీతిలో బ్రహ్మరథంఈసారి హిందూపురం వైఎస్సార్సీపీదే అంటున్న రాజకీయ పరిశీలకులుపలమనేరులో వర్షాన్ని కూడా లెక్క చేయని ప్రజలునెల్లూరులో జననీరాజనం 7:25 AM, May 5th, 2024ల్యాండ్ టైట్లింగ్ చట్టం వ్యవహారం.. టీడీపీపై ఈసీ కొరడాదుష్ప్రచారంపై సీఐడీ దర్యాప్తుప్రజలను భయాందోళనలకు గురిచేయడంపై ఈసీ సీరియస్ ఎన్నికల నిబంధనలకు పాతరేస్తున్నారని మండిపాటు వైఎస్సార్సీపీ ఫిర్యాదుతో చర్యలు తీసుకున్న కమిషన్‌తక్షణం దీనిపై దర్యాప్తుచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశం7:16 AM, May 5th, 2024కళ్లు గద్దెపై.. బుద్ధి భూమిలోల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై బరితెగించి అబద్ధాలులేని వ్యక్తులకు అన్యాయం జరిగిందంటూ రామోజీ ఆక్రోశం కల్పిత పాత్రలను సృష్టించి, ఏదో జరిగిపోయిందని ఆక్రందనరిజిస్టరే లేనపుడు అందులో కొందరి పేర్లు లేకపోవటం సాధ్యమా?చట్టం దేవుడెరుగు... చట్టానికి సంబంధించిన రూల్సే రాలేదని తెలీదా?రూల్స్ వచ్చాక.. వాటిపై సమగ్ర చర్చ జరిగిన తరవాతే తుది రూపుపైపెచ్చు రీసర్వే పూర్తయ్యాకే ఈ చట్టాన్ని అమలు చేయటం సాధ్యంఇప్పటికి 4 వేల గ్రామాల్లోనే రీ సర్వే పూర్తి.. ఇంకా 13 వేల గ్రామాల్లో పెండింగ్‌అది పూర్తయి.. రూల్స్ ఖరారయ్యాక కదా చట్టం అమలు గురించి మాట్లాడేది..అయినా అన్ని రాష్ట్రాలనూ అమలు చేయమంటున్నది కేంద్రమే కదా!అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తేనే... ఇక్కడా చేస్తామని చెబుతున్న రాష్ట్రంమోదీ ముందు తల ఊపి.. బయట మాత్రం విష ప్రచారం చేస్తున్న బాబుబాబునెవరూ నమ్మటం లేదని గ్రహించి... మారీచుడి పాత్రలోకి రామోజీజనాన్ని భయపెట్టడానికి అబద్ధాలే అ్రస్తాలుగా మాయా యుద్ధంపోలింగ్ వరకూ ఈ ఒక్క అంశంమీదే మాట్లాడాలని ‘ఎల్లో’ తాఖీదుమిగతావన్నీ పక్కనబెట్టి విస్తృతంగా విష ప్రచారం చేస్తున్న పచ్చ మంద7:14 AM, May 5th, 2024బాబుకు భంగపాటు.. బెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగంబెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగంఓటర్లకు అరచేతిలో వైకుంఠం చూపించేందుకు కుతంత్రంలబ్ధిదారుల నమోదు పేరిట కుట్రఓటర్ల జాబితా వివరాల దుర్వినియోగంతీవ్రంగా స్పందించిన ఎన్నికల కమిషన్‌ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక7:12 AM, May 5th, 2024లాక్కునేవి కాదు..ఇచ్చే చేతులివి..నిషేధిత జాబితా నుంచి 35 లక్షల ఎకరాల తొలగింపుసీఎం జగన్ సంస్కరణలతో ‘రెవెన్యూ’లో సులభమైన పాలన వందల ఏళ్ల నాటి చిక్కుముళ్లకు పరిష్కారంచుక్కల భూములు, సర్విస్ ఈనాం, షరతుల గల పట్టా భూములకు విముక్తి27.41 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులులంక భూములకు అసైన్మెంట్ పట్టాలుకుప్పలు తెప్పలుగా ఉన్న రెవెన్యూ సమస్యలన్నింటికీ పరిష్కారంనిరుపేదలకు 46 వేల ఎకరాల భూముల పంపిణీ శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం 951 ఎకరాలుకొత్త రిజిస్ట్రేషన్ల విధానం.. ఆటో మ్యుటేషన్‌చరిత్ర సృష్టించిన 30.61 లక్షల ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ రెవెన్యూ శాఖ స్వరూపాన్ని మార్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు6:59 AM, May 5th, 2024మళ్లీ దోపిడీకి తెరపైకి..మాజీ ఎమ్మెల్యే అరాచకాలెన్నో!గోబెల్స్ ప్రచారంలో చంద్రబాబుకు తమ్ముడు వక్ఫ్ ఆస్తులు చెరబట్టి దోచేసిన ఘనుడుటిప్పు షాపింగ్ కాంప్లెక్స్ కేటాయింపులో చేతివాటంప్రతి పనికీ రేటుగట్టి వసూలు చేసిన చరిత్ర బెదిరింపులు, దౌర్జన్యాలు షరామామూలేఏకంగా పది క్రిమినల్ కేసులు 6:56 AM, May 5th, 2024మీ భూమికి భద్రత.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై బాబు దుష్ప్రచారం: సీఎం జగన్‌చట్టంపై అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గుచేటుమీ భూములకు ప్రభుత్వం గ్యారంటీ..రిజిస్ట్రేషన్ తర్వాత రైతులకే డాక్యుమెంట్లుఅన్నదాతలు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండదుభూ తగాదాలకు శాశ్వత పరిష్కారంగా వందేళ్ల తర్వాత రీసర్వేపేదలకు భూములిచ్చేది జగన్.. లాక్కునేది చంద్రబాబే -
విజయవాడ వెస్ట్: దేవుడా పవన్ మనసు మార్చు.. జనసైనికుల నిరసన
సాక్షి, విజయవాడ: పశ్చిమలో పోతిన మహేష్ నిరసనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ టికెట్ మహేష్‌కి ఇవ్వాలని, పవన్ మనస్సు మార్చాలని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుడికి జనసేన కార్యకర్తలు 108 కొబ్బరి కాయలు కొట్టి మరి వేడుకొంటున్నారు. 7 రోజులుగా జనసేన కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు మరోవైపు, పశ్చిమ నియోజకవర్గం సీటు కోసం బీజేపీలో కుమ్ములాట మొదలైంది. పొత్తుల్లో పశ్చిమ సీటు బీజేపీకి ఇచ్చేందుకు కూటమి నిర్ణయించింది. ఆశావాహులు ఒక్కొక్కరుగా తెరపైకి వస్తున్నారు. ఆత్మీయ సమావేశాల పేరిట బల ప్రదర్శనలు చేపట్టారు. వెస్ట్ టిక్కెట్ తనదే అంటున్న వక్కలగడ్డ భాస్కర్.. ఇటీవల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. తాజాగా తెరపైకి వచ్చిన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్.. తన మద్దతు దారులతో ఆత్మీయ సమావేశం పెట్టుకున్నారు. ‘‘వెస్ట్ సీటు బీజేపీకి కేటాయించాలని నిర్ణయించారని, ఏడుగురు ఆశావాహుల పేర్లను అధిష్టానానికి పంపించాం. ముగ్గురు పేర్లను అధినాయకత్వం పరిశీలిస్తోంది. టిక్కెట్ తనకు వస్తుందని ఆశిస్తున్నానని శ్రీరామ్ అన్నారు. -
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులకి లక్ష్మి పార్వతి స్ట్రాంగ్ కౌంటర్
-
ఏలూరులో టీడీపీ జనసేన మధ్య మూడో వ్యక్తి చిచ్చు
-
పవన్ కల్యాణ్‌కు ఓయూ విద్యార్థుల వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: పవన్ కల్యాణ్ ఒక బ్రోకర్ అంటూ ఓయూ విద్యార్థులు ఏకిపారేశారు. పవన్ ఓ ఐటమ్ సాంగ్ చేసే వ్యక్తి అని, ప్రజా సమస్యలపై ఏనాడూ పోరాడలేదని మండిపడ్డారు. ‘ప్రజా సమస్యలపై పవన్ ఏనాడూ పోరాడలేదు. పవన్ ఇక్కడ రాజకీయాలు చేస్తే ఊరుకోం. పవన్ కల్యాణ్ణు తరిమికొడతాం’’ అంటూ ఓయూ విద్యార్థులు హెచ్చరించారు. చదవండి: తుస్సుమనిపించిన పవన్.. ఎందుకంత వణుకు? -
ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రం.. ఈ భార్య కాకపోతే మరో భార్య..
-
ఇప్పటంలో ఇళ్ల తొలిగింపు పై జనసేన, టీడీపీ ఓవర్ యాక్షన్
-
‘జనసేన నేతలు మహిళలను ఓట్లు అడగగలారా?.. పవన్‌కు మతి ఉందా?’
సాక్షి, తూర్పుగోదావరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిజంగా ప్యాకేజీ స్లారే. పవన్ ప్యాకేజీ తీసుకోకపోతే గుమ్మడి కాయల దొంగలుగా ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. కాగా, మంత్రి కొట్టు సత్యనారాయణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ నడుస్తున్నారు. చంద్రబాబు చెప్పడం వల్లే పవన్ బస్సు యాత్ర వాయిదా వేసుకున్నారు. విశాఖ గర్జన రోజే జనవాణి ఎందుకు పెట్టారు?. పవన్ వ్యాఖ్యలు తాను రీప్లే చేసి చూసుకుంటే తనకే అసహ్యం వేస్తుంది. అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన పవన్ కల్యాణ్‌కు మతి ఉందా?. జనసేన నేతలు మహిళలను ఓట్లు అడగగలారా?. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబు లాంటి ఔట్‌డేటెడ్ నేత కోసం ఎందుకు ఆరాటం అని ప్రశ్నించారు. -
అమలాపురం ఘటన కేసులో టీడీపీ,జనసేన నేతల అరెస్ట్
-
కోనసీమ దుర్ఘటనలో జనసేన,టీడీపీ కుట్రలు బట్టబయలు
-
బద్వేలు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా దాసరి సుధ: సజ్జల
-
‘అసలు నాగబాబు పోటీయే కాదు’
సాక్షి, పశ్చిమగోదావరి : నరసాపురం వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజుకు జనసేన అభ్యర్థి నాగబాబు పోటీయే కాదన ప్రముఖ సీనీ రచయిత చిన్ని కృష్ణ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 120 సీట్లకు పైగా గెలిచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అభిమాన హీరోల సినిమాలు 10 సార్లు చూడండి కానీ ఓటు మాత్రం వైఎస్సార్ సీపీకే వేయమని ప్రజలను కోరారు. గతంలో చిరంజీవికి లక్షల మంది ఓట్లు వేస్తే ఏం జరిగిందో అందరికి తెలుసన్నారు. అదే కుటుంబం నుంచి మళ్లీ ఇద్దరు వచ్చి ఓట్లు అడిగితే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. భీమవరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓటమి ఖాయమన్నారు. అక్కడ వైఎస్సార్సీసీ అభ్యర్థి శ్రీనివాస్ ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. -
ఏలూరులో జనసేన ధర్నా
ఏలూరు: సినీ హీరో, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చౌదరి వెంటనే క్షమాపణ చెప్పాలంటూ జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సోమవారం మధ్యాహ్నం కార్యకర్తలు ప్లకార్డులతో కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.