‘అసలు నాగబాబు పోటీయే కాదు’

Film Writer Chinni Krishna Say YSRCP Is Going To Win - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : నరసాపురం వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజుకు జనసేన అభ్యర్థి నాగబాబు పోటీయే కాదన ప్రముఖ సీనీ రచయిత చిన్ని కృష్ణ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 120 సీట్లకు పైగా గెలిచి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అభిమాన హీరోల సినిమాలు 10 సార్లు చూడండి కానీ ఓటు మాత్రం  వైఎస్సార్‌ సీపీకే వేయమని ప్రజలను కోరారు. గతంలో చిరంజీవికి లక్షల మంది ఓట్లు వేస్తే ఏం జరిగిందో అందరికి తెలుసన్నారు. అదే కుటుంబం నుంచి మళ్లీ ఇద్దరు వచ్చి ఓట్లు అడిగితే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. భీమవరంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఓటమి ఖాయమన్నారు. అక్కడ వైఎస్సార్‌సీసీ అభ్యర్థి శ్రీనివాస్‌ ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top