breaking news
Jandhyala Purnima
-
రాఖీ కడితే దుష్టశక్తులు దూరమవుతాయా?
భారతావని మొత్తం శ్రావణ మాసంలో ఎంతో పవిత్రంగా భావించే రోజు. ఏడాదికి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లోనూ శ్రావణ పూర్ణిమకు చాలా విశిష్టత ఉంది. శివకేశవులను స్మరిస్తూ వారి శక్తి అందరినీ రక్షిస్తోందని భావించుకుంటూ ఈ పర్వదినాన్ని పాటించడం, సంప్రదాయాలను ఆచరించడం అవసరం. అయితే శ్రావణ పూర్ణిమ పేరు చెప్పగానే అన్నింటికన్నా ముందుగా గుర్తుకొచ్చేది రక్షాబంధన పర్వమే.భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, భూత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు.పూర్వం దేవతలకు, రాక్షసులకు తరచు యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. దేవేంద్రుడు, శచీదేవి వృత్తాంతం ఇలా ప్రాచీనంగా ఉన్న కథలో కనిపిస్తుంటే చరిత్ర గతిలో మొగలాయి చక్రవర్తుల ఏలుబడిలో ఈ రక్షాబంధనానికి మరికొంత కొత్త విశిష్టత సమకూరింది.రాఖీ కట్టే ఆచారం తమ స్త్రీల రక్షణకోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. చిత్తోడ్ గఢ్ మహారాణి కర్ణావతి గుజరాత్ నవాబైన బహదూర్షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమాయూన్కు రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించిందట. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమయూన్ ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్‌షాను తరిమి వేశాడని ఆనాటి నుంచి సోదరీ సోదర బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి వచ్చిందని పండితులు పేర్కొంటున్నారు.నారీపూర్ణిమ:మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో శ్రావణ పూర్ణిమను నారీ పూర్ణిమ అని అంటారు. ఆ రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి సముద్రంలోకి నారికేళాలను అంటే కొబ్బరికాయలను వదులుతారు. అందుకే ఇది నారికేళ పూర్ణిమగా (నారియల్ పూర్ణిమగా) వ్యవహారంలోకి వచ్చింది.జంధ్యాల పున్నమి పాల్కురికి సోమనాథకవి తన పండితారాధ్య చరిత్రలో ఈ పండుగను నూలిపున్నమి అని వర్ణించాడు. నూల్ అంటే యజ్ఞోపవీతం అని అర్థం. శ్రావణ పూర్ణిమనాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్ననుసరించి ఇలా ఈ పండుగ పేరు వ్యవహారంలోకి వచ్చింది.హయగ్రీవ జయంతి:ఇక శ్రీ మహావిష్ణువు విజయగాధాపరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది సాధ్యపడదని, మరేదైనా వరం కోరుకోవలసిందని అమ్మవారు చెప్పింది. అప్పుడు హయగ్రీవుడు తనలాగే గుర్రపు తల ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది.ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి ధనుస్సు అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది.దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి ఆ దుష్ట రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీశక్తి మహిమ ను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని, శివశక్తిని ఈ కథ తెలియజెబుతుంది. అందుకే శ్రావణ పూర్ణిమనాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది.జంధ్యాల పౌర్ణమి: సాధారణంగా జంధ్యాన్ని ధరించే వారందరూ శ్రావణ పూర్ణిమనాడు పాత జంధ్యాన్ని వదిలి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. అందుకే ఈ పౌర్ణమిని జంధ్యాల పూర్ణిమ అనీ, జంధ్యాల పండుగగా జరుపుకోవడం ఆచారం. జంధ్యాన్నే ’యజ్ఞోపవీతం’ అని అంటారు. అంటే యాగ కర్మ చేత పునీతమైన దారం అని అర్థం.ఇలా శ్రావణపూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది. ఈ రోజున పరమేశ్వరుడిని పంచామృతాలతో లేదా ఆవునేతితో లేదా ఆవుపాలతో అభిషేకించి, రుద్రనమక చమకాలతో ఆరాధించడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహంతో అపమృత్యు దోషాలు, భయాలు తొలగి, చక్కటి ఆరోగ్యం, తేజస్సు కలుగుతాయి.ఉపాకర్మఉపనయనం చేసిన సందర్భంలో యజ్ఞోపవీతానికి జింక చర్మం కడతారు. దీనినే ముంజ అంటారు. ఈ ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి నాడు ఈ మంజను తీసి వేస్తారు. అందుకే ముంజ విడుపు అని కూడా ఈ కార్యక్రమానికి పేరు. పరిపక్వతకు, పరిశుద్ధతకు యజ్ఞోపవీతమే దివ్యౌషధం. ఈ’జంధ్యాల పూర్ణిమ’ కేవలం ఉపనయన సంస్కారం ఉన్న వారికే పరిమితమైనప్పటికీ మిగతా వారు కూడా ఈ రోజు గాయత్రీ దేవిని పూజిస్తే సకల శుభాలు తథ్యం. – డి.వరలక్ష్మిఇవి కూడా చదవండి: శివుడు శరభుడిగా ఎందుకు మారాడు? -
ఘనంగా జంద్యాలధారణ
సాక్షి, ముంబై: నగరం, శివారు ప్రాంతాల్లోని వివిధ తెలుగు సంఘాలలో మంగళవారం రక్షాబంధన్ జంద్యాలధారణ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. శ్రీ రామ బాలసంఘం ఆధ్వర్యంలో.. వర్లీ బీడీడీ చాల్ 106/45 సంఘం ఆధ్వర్యంలో జంద్యాల వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు ఇట్టె మురళి, ఉపాధ్యక్షులు తాటిపాముల గంగాధర్, ప్రధాన కార్యదర్శి సామల్ల శ్రీహరి, ఉపకార్యదర్శి అనుమల్ల శ్రీనివాస్, కోశాధికారి చింతకింది శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ పద్మశాలి తెలుగు సంఘం ఆధ్వర్యంలో.. గాయత్రిధారణ మహోత్సవ సందర్భంగా సైన్-కోలివాడలోని శ్రీ పద్మశాలి తెలుగు సంఘం నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా కుడిక్యాల్ బాలకిషన్, ఉపాధ్యక్షుడిగా దుస్స శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా జోరీగల సింద్రాంలు, సహాయ కార్యదర్శిగా చిలివేరి మహేంద్ర, కోశాధికారిగా పారెల్లి రాజ్మహేంద్ర, సహాయ కోశాధికారిగా కస్తూరి గణేష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పద్మశాలి యువక సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీ అనుమల్ల సుభాష్, దోమల శంకర్ తదితరులు నూతన కార్యవర్గ సభ్యులను సత్కరించారు. భివండీలో ... భివండీ, న్యూస్‌లైన్: భివండీలో తెలుగు ప్రజలు జంద్యాల పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా అఖిల పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో సాయంత్రం వివిధ ప్రాంతాల్లో మార్కండేయ పల్లకి శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొనడంతో తెలుగుతనం ఉట్టిపడింది. రాత్రి వరకు సాగిన పల్లకి యాత్ర ఉత్సవాలు పండుగ శోభను తెచ్చాయి. స్థానిక పోలీసుశాఖ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించింది. పద్మనగర్‌లో అఖిల పద్మశాలి సమాజ మంగళ కార్యాలయంలో సమాజ పెద్దలు జంద్యాల పండుగను ఘనంగా నిర్వహించారు. పద్మనగర్‌లోని నీలకంఠేశ్వర్ మందిరం నుంచి మగ్గం ద్వారా నూలు బట్ట నేస్తూ పల్లకి శోభాయాత్ర నిర్వహించారు. బాజీ మార్కెట్, కన్నేరి, కుంబార్‌వాడ, తీన్ బత్తి ప్రాంతాల మీదుగా కాసర్ అలీలోని మార్కండేయ మహాముని మందిరానికి చేరుకుంది. యాత్రకు కన్నేరిలో తెలుగు యువక్ మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. నేసిన వస్త్రాన్ని మార్కండేయుడికి సమర్పించిన తర్వాత దానిని వేలం వేశారు. ఈ ఏడాది కామత్‌ఘర్ చందన్భాగ్ ప్రాంతానికి చెందిన భివండీ తెలుగు సమాజ్ అధ్యక్షుడు తుమ్మ రమేశ్ దాన్ని రూ.2.05 లక్షలకు పొందారు. సమాజం పెద్దలు దాసి అంబాదాస్, వేముల నర్సయ్య, పాశికంటి లచ్చయ్య, వంగ పురుషోత్తంలు రమేశ్‌కు వస్త్రాన్ని అందజేశారు. కాసర్ అలీలోని మార్కండేయ మందిరాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉదయం నుంచి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మశాలి సమాజ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు లక్ష్మణ్ గోస్కే ఇతర సభ్యులు సాయంత్రం మందిరం నుంచి పల్లకి యాత్ర నిర్వహించారు. కామత్‌ఘర్‌లో శ్రీ శివభక్త మార్కండేయ మందిరంలో ప్రతి యేడాది మాదిరిగానే సుప్రభాత, నిత్య పూజలు, ద్వజారోహణ, గాయత్రి మహా యజ్ఞం, అభిషేఖాలు, అర్చనలు, యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం మగ్గం ద్వారా నూలు బట్టను నేస్తూ కామత్‌ఘర్ పుర:వీధుల మీదుగా ఊరేగింపు నిర్వహిం చారు. ఆ నూలు బట్టను స్వామి వారికి సమర్పిం చారు. అనంతరం దానిని వేలం వేయగా మంగళంపల్లి రవి రూ.11,100 లు చెల్లించి సొంతం చేసుకున్నారు. తడాలిలో...అఖిల పద్మశాలి సమాజ్ కామత్‌ఘర్ శాఖ ఆధ్వర్యంలో హనుమాన్ మందిరం నుంచి వేషధారణలతో భక్తులు ఊరేగింపును నిర్వహించారు. పాంజలాపూర్, కోంబడ్పాడ, సంగమ్ పాడా, పద్మశాలి యువక మండలి శాఖలు కూడా పల్లకి ఊరేగింపు నిర్వహించాయి. కార్పొరేటర్ మచ్చ మురళి కార్యాలయంలో మార్కండేయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉండగా వరాలదేవి రోడ్డులోని శ్రీ మార్కండేయ మహాముని వాచనాలయ సమితి ఆధ్వర్యంలో మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతిథులుగా కార్పొరేటర్లు సంతోష్ శెట్టి, శశిలత శెట్టి హాజరయ్యారు. సాయంత్రం పల్లకి యాత్ర నిర్వహించినట్లు సమితి అధ్యక్షుడు సిరిపురం తిరుపతి, కార్యదర్శి శంకర్ వడిగొప్పుల తెలిపారు. -
ఘనంగా జంద్యాలధారణ
సాక్షి, ముంబై: నగరం, శివారు ప్రాంతాల్లోని వివిధ తెలుగు సంఘాలలో మంగళవారం రక్షాబంధన్ జంద్యాలధారణ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. శ్రీ రామ బాలసంఘం ఆధ్వర్యంలో.. వర్లీ బీడీడీ చాల్ 106/45 సంఘం ఆధ్వర్యంలో జంద్యాల వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు ఇట్టె మురళి, ఉపాధ్యక్షులు తాటిపాముల గంగాధర్, ప్రధాన కార్యదర్శి సామల్ల శ్రీహరి, ఉపకార్యదర్శి అనుమల్ల శ్రీనివాస్, కోశాధికారి చింతకింది శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ పద్మశాలి తెలుగు సంఘం ఆధ్వర్యంలో.. గాయత్రిధారణ మహోత్సవ సందర్భంగా సైన్-కోలివాడలోని శ్రీ పద్మశాలి తెలుగు సంఘం నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా కుడిక్యాల్ బాలకిషన్, ఉపాధ్యక్షుడిగా దుస్స శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా జోరీగల సింద్రాంలు, సహాయ కార్యదర్శిగా చిలివేరి మహేంద్ర, కోశాధికారిగా పారెల్లి రాజ్మహేంద్ర, సహాయ కోశాధికారిగా కస్తూరి గణేష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పద్మశాలి యువక సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీ అనుమల్ల సుభాష్, దోమల శంకర్ తదితరులు నూతన కార్యవర్గ సభ్యులను సత్కరించారు. భివండీలో ... భివండీ, న్యూస్‌లైన్: భివండీలో తెలుగు ప్రజలు జంద్యాల పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా అఖిల పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో సాయంత్రం వివిధ ప్రాంతాల్లో మార్కండేయ పల్లకి శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొనడంతో తెలుగుతనం ఉట్టిపడింది. రాత్రి వరకు సాగిన పల్లకి యాత్ర ఉత్సవాలు పండుగ శోభను తెచ్చాయి. స్థానిక పోలీసుశాఖ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించింది. పద్మనగర్‌లో అఖిల పద్మశాలి సమాజ మంగళ కార్యాలయంలో సమాజ పెద్దలు జంద్యాల పండుగను ఘనంగా నిర్వహించారు. పద్మనగర్‌లోని నీలకంఠేశ్వర్ మందిరం నుంచి మగ్గం ద్వారా నూలు బట్ట నేస్తూ పల్లకి శోభాయాత్ర నిర్వహించారు. బాజీ మార్కెట్, కన్నేరి, కుంబార్‌వాడ, తీన్ బత్తి ప్రాంతాల మీదుగా కాసర్ అలీలోని మార్కండేయ మహాముని మందిరానికి చేరుకుంది. యాత్రకు కన్నేరిలో తెలుగు యువక్ మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. నేసిన వస్త్రాన్ని మార్కండేయుడికి సమర్పించిన తర్వాత దానిని వేలం వేశారు. ఈ ఏడాది కామత్‌ఘర్ చందన్భాగ్ ప్రాంతానికి చెందిన భివండీ తెలుగు సమాజ్ అధ్యక్షుడు తుమ్మ రమేశ్ దాన్ని రూ.2.05 లక్షలకు పొందారు. సమాజం పెద్దలు దాసి అంబాదాస్, వేముల నర్సయ్య, పాశికంటి లచ్చయ్య, వంగ పురుషోత్తంలు రమేశ్‌కు వస్త్రాన్ని అందజేశారు. కాసర్ అలీలోని మార్కండేయ మందిరాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉదయం నుంచి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మశాలి సమాజ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు లక్ష్మణ్ గోస్కే ఇతర సభ్యులు సాయంత్రం మందిరం నుంచి పల్లకి యాత్ర నిర్వహించారు. కామత్‌ఘర్‌లో శ్రీ శివభక్త మార్కండేయ మందిరంలో ప్రతి యేడాది మాదిరిగానే సుప్రభాత, నిత్య పూజలు, ద్వజారోహణ, గాయత్రి మహా యజ్ఞం, అభిషేఖాలు, అర్చనలు, యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం మగ్గం ద్వారా నూలు బట్టను నేస్తూ కామత్‌ఘర్ పుర:వీధుల మీదుగా ఊరేగింపు నిర్వహిం చారు. ఆ నూలు బట్టను స్వామి వారికి సమర్పిం చారు. అనంతరం దానిని వేలం వేయగా మంగళంపల్లి రవి రూ.11,100 లు చెల్లించి సొంతం చేసుకున్నారు. తడాలిలో...అఖిల పద్మశాలి సమాజ్ కామత్‌ఘర్ శాఖ ఆధ్వర్యంలో హనుమాన్ మందిరం నుంచి వేషధారణలతో భక్తులు ఊరేగింపును నిర్వహించారు. పాంజలాపూర్, కోంబడ్పాడ, సంగమ్ పాడా, పద్మశాలి యువక మండలి శాఖలు కూడా పల్లకి ఊరేగింపు నిర్వహించాయి. కార్పొరేటర్ మచ్చ మురళి కార్యాలయంలో మార్కండేయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉండగా వరాలదేవి రోడ్డులోని శ్రీ మార్కండేయ మహాముని వాచనాలయ సమితి ఆధ్వర్యంలో మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతిథులుగా కార్పొరేటర్లు సంతోష్ శెట్టి, శశిలత శెట్టి హాజరయ్యారు. సాయంత్రం పల్లకి యాత్ర నిర్వహించినట్లు సమితి అధ్యక్షుడు సిరిపురం తిరుపతి, కార్యదర్శి శంకర్ వడిగొప్పుల తెలిపారు.


