breaking news
Jaggery production
-
సూపర్‌ఫుడ్ స్వీటెనర్‌గా బెల్లం
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ వంటింట్లో శతాబ్దాలుగా భాగమైన బెల్లం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘సూపర్‌ఫుడ్ స్వీటెనర్’గా గుర్తింపు పొందుతోంది. సహజ పద్ధతుల్లో తయారయ్యే ఈ సంప్రదాయ తీపి పదార్థం ఆరోగ్య ప్రయోజనాల కారణంగా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో భారీ డిమాండ్‌ను సాధిస్తోంది. ప్రపంచ బెల్లం ఉత్పత్తిలో 70 శాతానికి మించిన వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో ఉత్పత్తయ్యే చెరకు పంటలో 20 నుంచి 30 శాతం బెల్లం తయారీకే వినియోగమవుతున్నట్లు కేంద్రం శనివారం పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న స్థాయి పరిశ్రమలు, కుటీర పరిశ్రమల రూపంలో కొనసాగుతున్న బెల్లం తయారీ రంగం సుమారు 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ విలువను అందించే వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తోందని వివరించింది.ఎగుమతుల్లో తీపిభారత్ బెల్లం, సంప్రదాయ మిఠాయి ఉత్పత్తుల ఎగుమతుల్లో గణనీయమైన పురోగతి సాధించింది. 2015–16లో 197 మిలియన్ డాలర్ల విలువైన బెల్లం ఎగుమతులు నమోదు కాగా, 2024–25 నాటికి 406.8 మిలియన్ డాలర్లకు చేరింది. దాదాపు 106 శాతం వృద్ధి నమోదైంది. అదే సమయంలో ఎగుమతి పరిమాణం కూడా 292.8 మెట్రిక్ టన్నుల నుంచి 471.9 మెట్రిక్ టన్నులకు పెరిగినట్లు కేంద్రం పేర్కొంది. ఇండోనేసియా, అమెరికా, యూఏఈ, నైజీరియా, నేపాల్ వంటి దేశాలు భారత బెల్లానికి ప్రధాన మార్కెట్లుగా మారాయి. సహజ స్వీటెనర్లకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ భారత్‌కు కొత్త అవకాశాలను తెరుస్తోంది. రైతులకు లాభదాయకంతమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాకు చెందిన రైతు ఆంతోని సామి సేంద్రియ బెల్లం పొడి తయారీలో విజయం సాధించి ఆదర్శంగా నిలిచారు. సాధారణ బెల్లం కిలో రూ.50కు అమ్ముడవుతుండగా, సేంద్రియ బెల్లం పొడిని రూ.75 వరకు విక్రయిస్తున్నారు. ఉత్పత్తి వ్యయం మాత్రం రెండింటికీ దాదాపు సమానమే. ఇప్పుడు బెల్లం చాక్లెట్లు, కొబ్బరి రుచుల బెల్లం వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు కూడా మార్కెట్లోకి రావడం రైతులకు మరింత ఆదాయాన్ని తెస్తోంది.కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంబెల్లం తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన, పీఎం–ఎఫ్ఎంఈ, ఓడీఓపీ వంటి పథకాల ద్వారా చిన్న ఆహార ప్రాసెసింగ్ యూనిట్లకు ఆర్థిక సాయం అందిస్తోంది. పీఎం–ఎఫ్ఎంఈ పథకం కింద దేశవ్యాప్తంగా 3,528 బెల్లం ఆధారిత సూక్ష్మ ఆహార పరిశ్రమలకు రూ.102 కోట్లకు పైగా సబ్సిడీలు మంజూరు చేసింది. బెల్లం, అనుబంధ ఉత్పత్తులను 19 జిల్లాల్లో ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్’గా గుర్తింపుపొందింది.జీఐ ట్యాగ్‌తో ప్రత్యేక గుర్తింపుభారత్లో పలు ప్రాంతీయ బెల్లం రకాలకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) లభించింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ బెల్లం, ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ గుర్, కేరళలోని మరయూర్ బెల్లం ప్రత్యేకతతో గుర్తింపు పొందాయి. ఇవి ప్రాంతీయ సంప్రదాయ తయారీ విధానాలకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. -
మంచి రుచితో పాటు పోషకాలు అధికం..!
-
బెల్లం అల్లమే!
కామారెడ్డి: బెల్లం ఉత్పత్తిలో కామారెడ్డి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. విశాఖ జిల్లా అనకాపల్లి తరువాతి స్థానంలో కామారెడ్డి ప్రాంతం నిలిచేది. అప్పట్లో ఏటా కామారెడ్డి డివిజన్లో 60 వేల ఎకరాల నుంచి 70 వేల ఎకరాల వరకు చెరకు పంట సాగయ్యేది. వందలాది లారీలలో బెల్లం గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలకు తరలిపోయేది. చెరకు పంట నరికివేతకు ముందే రైతులు క్రషర్లను, పొయ్యిలను రెడీ చేసుకునేవారు. ఏ ఊరికి వెళ్లినా వందలాది క్రషర్లు నడిచేవి. రాత్రి, పగలు తేడా లే కుండా రైతులు క్రషర్ల వద్ద పనుల్లో నిమగ్నమయ్యేవారు. బెల్లం తయారు చేసిన రైతులే గాక బెల్లం వ్యాపారులు కూ డా ఎన్నో లాభాలు ఆర్జించేవారు. ఇ దంతా గతం. ఇప్పుడు బెల్లం పేరెత్తితే చాలు పెదవి విరుస్తున్నారు. చెరకు సాగు నుంచి మొదలుకొంటే బెల్లం త యారీదాకా అన్ని రకాల పెట్టుబడు లు భారీగా పెరిగాయి. దానికనుగు ణంగా ధరలు పెరుగకపోవడంతో రై తులు బెల్లం తయారీపై ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా కరెంటు, కూలీల కొరత వంటి సమస్యలతో రైతులు బెల్లం తయారీకి దూరమయ్యారు. ఏటా దీపావళి వరకు బెల్లం ముద్దలు మార్కెట్‌కు చేరేవి. ఈసారి ఇప్పటిదాకా ఒక్క ముద్ద కూడా మార్కెట్‌కు వచ్చిన దాఖలాలు లేవు. ఏం జరిగిందంటే కామారెడ్డి ప్రాంతంలో గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ వచ్చిన తరువాత బెల్లం తయారీకన్నా చెరకును ఫ్యాక్టరీకి పంపడానికే రైతులు ఆసక్తి చూపారు. అయితే ఫ్యాక్టరీలో సమయానికి పర్మిట్లు దొరక్క, కూలీల కొరతలు ఏర్పడడం వంటి కారణాలతో రైతులు బెల్లం తయారుకు మొగ్గుచూపినా, మార్కెట్లో బెల్లానికి సరైన ధరలు లభించడం లేదు. కామారెడ్డి ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే నల్లబెల్లంపై 2000 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం విధించిన ఆంక్షల ప్రభావంతో బెల్లం ధరలు పడిపోయి తయారీకి బ్రేకులు పడ్డాయి. ఆంక్షలపై బెల్లం రైతులు ఎన్నో పోరాటాలు చేశారు. 2001లో భిక్కనూరులో బెల్లం రైతుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చి పోలీసు లాఠీ చార్జి చేయడంతో, కోపోద్రిక్తులైన రైతులు పోలీసు వాహనాలను, బస్సులను ధ్వంసం చేశారు. ఈ సంఘటన అప్పట్లో సంచలనం రేపింది. 40 మంది వరకు రైతులను జైలుకు పంపించారు. వైఎస్ఆర్ వచ్చాక ఆంక్షల ఎత్తివేత 2004లో డాక్టర్ రాజశేఖరరెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన తరువాత బెల్లంపై ఆంక్షలను ఎత్తివేశారు. మళ్లీ గత రెండుమూడేళ్ల నుంచి బెల్లంపై అనధికార ఆంక్షలు కొనసాగుతున్నాయి. వరంగల్, కరీంనగర్ జిల్లాలలో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు బె ల్లం లారీలను సీజ్ చేసిన సంఘటనలతో బెల్లం ధర లు పడిపోయాయి. ఇటీవల కూడా బెల్లం లారీలను పట్టుకోవడంతో వ్యాపారులు, రైతులు సీఎం కేసీఆర్ ను కలిసి విన్నవించారు. ఆంక్షలు లేకుండా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. అయితే ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితులలో వ్యాపారులు కూడా ధైర్యం చేయడం లేదు. ఇదే సమయంలో పగ లు, రాత్రీ తేడా లేకుండా కష్టపడి ఇబ్బందులపాల య్యేకన్నా బెల్లం తయారీకి దూరం కావడమే నయమన్నట్టు రైతులు చెరకును ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. ఇప్పుడు కామారెడ్డి డివిజన్లో 20 వేల ఎకరాలకు మించి చెరకు పంట సాగు కావడం లేదు. భారీగా పెరిగిన ఖర్చు ఏడాది పంటైన చెరకు సాగుకు అయ్యే ఖర్చులతో పాటు బెల్లం తయారీలోనూ ఖర్చులు భారీగా పెరి గాయి. చెరకు పంట సాగుకు ఎకరానికి రూ. 45 వేల నుంచి రూ. 50 వేల వరకు ఖర్చవుతుంది. బెల్లం తయారీకి ఎకరాకు రూ. 25వేల వరకు ఖర్చవుతుం ది. మొత్తంగా ఎకరాకు రూ. 70 వేల నుంచి రూ. 80 వేల వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో బెల్లం క్వింటాలుకు రూ. 2,550 ధర పలుకుతోంది. ఎకరాకు 250 ముద్దల బెల్లం తయారవుతుంది. ఒక్కో ముద్ద తయారీకి రూ. వంద ఖర్చ వుతుంది. బెల్లం 35 క్వింటాళ్ల వరకు అవుతోంది. అమ్మడం ద్వారా రూ.90 వేల ఆదాయం వస్తోంది. ఖర్చులకు రూ. 80 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం కష్టపడితే ఎకరాకు రూ. 10 వేలకు మించి మిగలడం లేదు. ఒకవేళ ఆంక్షల ప్రభావంతో ధర పడిపోతే అసలుకే నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఆదాయం, ఖర్చులను లెక్కలేసుకుంటున్న రైతులు బెల్లం తయారీ కన్నా చెరకును ఫ్యాక్టరీకి తరలించడమే ఉత్తమమని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీలో టన్నుకు రూ. 2,600 ఇస్తున్నారు. చెరకు నరకడం, రవాణా ఖర్చులకు టన్నుకు రూ. 600 పోయినా రూ. 2 వేలు మిగులుతుంది. ఎకరాకు 30 టన్నుల నుంచి 35 టన్నుల వరకు దిగుబడి వస్తే రూ. 80 వేలు వస్తుంది. అందులో నరకడం, రవాణా ఖర్చులు, పెట్టుబడులవి మొత్తంగా కలిపితే రూ. 60 వేల పెట్టుబడి అవుతుంది. తద్వారా ఎకరాకు ఎలాం టి రిస్కు లేకుండా రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు అంటున్నారు. అదే బెల్లం తయారీ చేస్తే మిగులు ఏమోగాని నష్టా లు తప్పవని, అందుకే బెల్లం తయారీకి దూరమయ్యామని రైతులు అంటున్నారు. చెరకు పంట సాగు చేసే రైతులకు ప్రభుత ్వం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. బెల్లం తయారీపై ఉన్న ఆంక్షలు ఎత్తివేసి, మద్దతు ధర కల్పించినపుడు రైతులు కొంత ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వాలు ఆ దిశగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


