breaking news
JAGAN 2.0 SUPER APP
-
జగన్ 2.0 సూపర్ యాప్ సంచలనం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించిన ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఏపీ రాజకీయాల్లో సంచలనానికి తెర తీసింది. పార్టీ శ్రేణుల నుంచి ఈ యాప్ పట్ల భారీ స్పందన వస్తోంది. పార్టీ కార్యకర్తలు, నాయకులను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ యాప్‌ను పెద్ద ఎత్తున డౌన్లోడ్ చేసుకుంటున్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న(జులై 16, గురువారం) సాయంత్రం వైఎస్ జగన్ ఈ యాప్‌ను ప్రారంభించారు. ప్రారంభించిన గంటలోనే 25 వేలకుపైగా డౌన్లోడ్లు నమోదయ్యాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలాగే ఈ ఉదయం కల్లా లక్షకు పైగా కార్యకర్తలు యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని.. కాసేపటికే ఆ వేగం మరింత పెరిగింది. కార్యకర్త టు అధినేత.. అనుసంధానంపార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య నేరుగా సంబంధాలు కొనసాగించేలా ఈ యాప్‌ను రూపొందించారు. గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్రస్థాయి నాయకత్వం వరకు అందరూ ఒకే వేదికపై అనుసంధానమయ్యేలా ప్రత్యేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.యాప్ ప్రారంభోత్సవంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా వేదికల్లో తమ పార్టీకి సంబంధించిన కంటెంట్‌పై జరుగుతున్న పరిణామాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి సొంత డిజిటల్ వేదిక అవసరమైందని తెలిపారు. "ప్రతి కార్యకర్త తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పేందుకు ఈ యాప్ ఒక వేదికగా ఉంటుంది. పార్టీతో ప్రతి ఒక్కరూ నిరంతరం అనుసంధానమై ఉంటారు" అని జగన్ పేర్కొన్నారు.డౌన్ లోడ్ కోసం క్లిక్ చేయండి 👉: జగన్ 2.0 సూపర్ యాప్నేరుగా ఫిర్యాదు చేసే అవకాశంక్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను నేరుగా పార్టీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఈ యాప్ ద్వారా కల్పించారు. రాజకీయ వేధింపులు, ఇతర సమస్యలపై కార్యకర్తలు వివరాలను నమోదు చేసుకునేలా డిజిటల్ డైరీ సదుపాయాన్ని కూడా అనుసంధానం చేశారు. కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను నమోదు చేస్తే.. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ, రాష్ట్రస్థాయి నాయకత్వం వరకు వాటిపై స్పందించే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.పార్టీ కార్యక్రమాలు.. లైవ్ అప్డేట్స్పార్టీ సమావేశాలు, ప్రెస్మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రకటనలు వంటి సమాచారం యాప్‌లోని లైవ్ ఫీడ్ ద్వారా కార్యకర్తలకు అందుబాటులోకి వస్తుందని జగన్ తెలిపారు. భవిష్యత్తులో యాప్‌ను మరింత అభివృద్ధి చేస్తామని, కార్యకర్తలకు మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు.డిజిటల్ పోరాటానికి కొత్త వేదికఇతర సోషల్ మీడియా వేదికల్లో పార్టీకి వ్యతిరేకంగా వస్తున్న పోస్టులు, వీడియోలు, వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసే అవకాశం కూడా జగన్ 2.0 సూపర్ యాప్‌లో ఉండనుంది. అదే సమయంలో కార్యకర్తలంతా పార్టీ నాయకత్వంతో నిత్యం టచ్‌లో ఉండేందుకు ఈ సూపర్ యాప్ ఉపయోగపడుతుంది.మొత్తంగా.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను డిజిటల్‌గా ఏకం చేయడం, పార్టీ కార్యక్రమాలను వేగంగా చేరవేయడం, క్షేత్రస్థాయి సమస్యలను నేరుగా తెలుసుకోవడం లక్ష్యంగా తీసుకొచ్చిన ‘జగన్ 2.0 సూపర్ యాప్’పై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి పెరుగుతోందన్నది లభిస్తున్న స్పందన బట్టి స్పష్టమవుతోంది. -
‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
సాక్షి, తాడేపల్లి: పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘జగన్ 2.0 సూపర్ యాప్’ను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తలు కోసం యాప్ డిజైన్ చేశారు. పార్టీ నేతలంతా నేరుగా కార్యకర్తలతో టచ్‌లో ఉండేలా ఈ యాప్‌ను రూపొందించారు. సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నుంచి ఇవాళ అధికారిక ‘జగన్ 2.0 సూపర్ యాప్’ను ఆవిష్కరిస్తున్నామన్నారు.‘‘ఈ రోజు ఏం జరుగుతోంది అంటే.. సోషల్ మీడియాలో మన వాళ్లు పోస్ట్ చేసిన కంటెంట్‌ను ఇష్టం వచ్చినట్లుగా డిలీట్ చేయడం, అందుకోసం ఇష్టానుసారం కుట్రలు పన్నడం.. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొచ్చి ఒక ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. అదే జగన్ 2.0 సూపర్ యాప్. దీంట్లో ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయం చెప్పొచ్చు...అంతే కాకుండా దీని ద్వారా ప్రతి కార్యకర్త పార్టీతో అనుసంధానమై ఉంటాడు. ఇది మన యాప్ కాబట్టి, మన వాళ్లే ఇందులోకి వస్తారు కాబట్టి, ఎవరు పడితే వారు డిలీట్ చేసే హక్కు కూడా వారికి ఉండదు. ఇది ఒక మంచి పరిణామం. ఇష్టం వచ్చినట్లు చేసే కుట్రలు కూడా దీనివల్ల తిప్పి కొట్టొచ్చు.’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ఇంకా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త మొదలు, పార్టీ కేంద్ర కార్యాలయం వరకు.. నియోజకవర్గస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడితో, ప్రతి కార్యకర్త అనుసంధానమై ఉంటాడు. ఎందుకంటే పార్టీలో ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, పోలీసుల వేధింపుల వల్ల కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు కానీ, పార్టీకి సంబంధించిన ఏ అంశంపై కానీ, ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరు అనుసంధానమై టచ్‌లో ఉండే అవకాశం ఉంటుంది.👉 Click here to download the Jagan 2.0 Super App.ఈ యాప్‌లో మరో మంచి అంశం ఏమిటంటే, పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశం, ప్రెస్మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రకటనలు.. అన్నీ కూడా ఈ యాప్‌లో లైవ్ ఫీడ్ ద్వారా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో ఈ యాప్‌ను ఇంకా అభివృద్ధి చేయడం జరుగుతుంది. కార్యకర్తలు ఎక్కడైనా, ఏమైనా ఇబ్బంది పడుతుంటే వాటిని ఈ యాప్‌లో పోస్ట్ చేయడం, ఆ తర్వాత పార్టీ వాటిపై స్పందించడం, నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఆ కార్యకర్తకు అండగా నిలబడే అవకాశం కూడా ఉంటుంది...పోలీసుల వేధింపులతో ఇబ్బంది పడుతున్న మన పార్టీ వారు, ఇంకా రాజకీయ వేధింపులకు కూడా గురవుతున్న వారు ఇప్పుడు డిజిటల్ డైరీలో నమోదు చేస్తున్న వివరాలు.. ఆ డైరీ కూడా ఈ యాప్‌తో అనుసంధానం అవుతుంది. అంటే ఈ యాప్‌లో ఆ డిజిటల్ డైరీ కూడా అందుబాటులోకి వస్తుంది. దాని వల్ల వేధింపుల, సమస్యలు ఎదుర్కొంటున్న వారు నేరుగా ఈ యాప్ ద్వారా డిజిటల్ డైరీలో వాటిని ఫిర్యాదు చేయొచ్చు. ఆ వివరాలు నమోదు చేయొచ్చు...ఇతర సోషల్ మీడియా వేదికల్లో మనపై చేస్తున్న అనుచిత విమర్శలు, వీడియోలు, వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసి, వాటిని తొలగింపచేసే ప్రయత్నం ఒకవైపు చేస్తూనే, మరోవైపు ఈ సూపర్‌యాప్‌ను ఎవరూ ఆపలేని విధంగా మనకు మనం సొంతంగా రూపొందించుకోవడం జరిగింది. ఈ యాప్ వల్ల ప్రతి కార్యకర్త నిత్యం, పార్టీ నాయకత్వంతో అనుసంధానమై ఉంటాడు’’ అని వైఎస్ జగన్ వివరించారు.


