breaking news
the ISI
-
పాకిస్థాన్ టూ ఆంధ్రా నోటు.. చేటు
నకిలీ నోట్ల చెలామణిలో ఐఎస్ఐ పాత్ర కర్నూలు: రాష్ట్రంలో నకిలీ నోట్ల చెలామణి వెనుక పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ నుంచి పశ్చిమబెంగాల్, జార్ఖండ్ మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు నకిలీ నోట్లు చేరుతున్నాయనే విషయం ఇప్పటికే పోలీసుల విచారణలో వెల్లడైంది. నకిలీ నోట్ల రవాణా మొత్తం రైలు మార్గంలోనే సాగుతున్నట్లు గుర్తించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ కేంద్రం కావడం ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా సూగూరు గ్రామానికి చెందిన ఇందవాసి వీరేష్ దొంగనోట్ల రవాణా చేస్తూ మంగళవారం రాత్రి పోలీసులకు చిక్కడంతో ఆసక్తికర విషయాలో వెలుగులోకి వస్తున్నాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఖలేచౌక్ గ్రామంలో సుల్తాన్ అనే వ్యక్తి ద్వారా రూ.3 లక్షల దొంగనోట్లను మహబూబ్ నగర్‌కు రవాణా చేస్తుండగా జిల్లా పోలీసులు ఇతన్ని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లు కూడా పాకిస్థాన్ నుంచే వచ్చినవలేనని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నకిలీ వ్యవహారంలో ఒక్కో లావాదేవీకి ఒక్కో బ్యాంకు అకౌంట్, ఫోన్ నెంబర్ వినియోగిస్తుండటం గమనార్హం. రూపాయికి రెండు రూపాయలు నకిలీ నోట్ల కుంభకోణంలో సరికొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. రూ.50 వేల ఒరిజినల్ నోట్లు ఇస్తే... లక్ష రూపాయల నకిలీ నోట్లు ఇస్తున్నారు. ఈ వ్యవహారమంతా పకడ్బందీగా బ్యాంకుల ద్వారానే జరుగుతోంది. అయితే ఒకసారి ఇచ్చే బ్యాంకు అకౌంట్‌ను మరోసారి ఇవ్వకపోవడం ఒక ఎత్తయితే... ఒకసారి ఇచ్చిన బ్యాంకు అకౌంట్ తర్వాత పనిచేయడం లేదని విచారణలో తేలింది. అంటే ప్రతి లావాదేవీకి సరికొత్త బ్యాంకు అకౌంటన్న మాట. ఫోన్ నెంబర్లు కూడా ఒక లావాదేవీకి ఒక్కోటి వినియోగిస్తుండటం గమనార్హం. ఆర్థిక మూలాలే లక్షంగా... హైదరాబాద్ కేంద్రంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఇప్పటి వరకు భౌతిక దాడులకు దిగడం తెలిసిందే. లుంబిని పార్కు, గోకుల్‌ఛాట్ ఘటనలు ఈ కోవకు చెందినవే. అయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా ఐఎస్ఐ దృష్టి సారించినట్లు నకిలీ నోట్లను రవాణా చేస్తూ పట్టుబడిన వారి ద్వారా సమాచారం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వరకూ రైళ్ల ద్వారా ఈ నకిలీ నోట్ల రవాణాదారులు ప్రవేశిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. నకిలీ నోట్ల ప్రధాన సూత్రధారి అజ్ఞాతంలో ఉండి గుమస్తాల ద్వారా పశ్చిమ బెంగాల్ మీదుగా ట్రైన్లో విశాఖపట్నంకు చేర్చి అక్కడి నుంచి దళారులకు నకిలీ నోట్లు చేరవేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. సుల్తాన్ అనే ప్రధాన ఏజెంట్ ద్వారా ఈ దందా కొనసాగుతుంది. కర్నూలు, గుంతకల్లు, పెబ్బేరు కేంద్రాలుగా నకిలీ నోట్ల చెలామణి ముమ్మరమైంది. రెండు వారాల క్రితం గుంతకల్లులో భారీ మొత్తంలో నకిలీ నోట్లు రవాణా చేస్తూ కొందరు వ్యక్తులు పోలీసుల వలకు చిక్కారు. గతంలో బనగానపల్లె, ఇటీవల ఉరవకొండలోనూ నకిలీ నోట్ల చెలామణిదారులు పట్టుబడ్డారు. ధాన్యం కొనుగోలు చేసి క్రయ విక్రయాలు చేసే వ్యాపారులే లక్ష్యంగా నకిలీ నోట్ల చలామణి సాగుతోంది. -
వఖాస్‌ను పట్టించిన ‘స్టాంప్’
పాస్‌పోర్ట్‌పై ఎంట్రీ ముద్ర మరిచిన ఐఎస్ఐ ఢాకా విమానాశ్రయంలో ఆపిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ‘విలక్షణం’తో గుర్తించిన భారత గూఢచారి అక్కడ నుంచి చాకచక్యంగా తప్పించిన వైనం సరిహద్దులు దాటాక నీడలా వెంటాడి అరెస్టు సాక్షి, హైదరాబాద్: అతడి పేరు జఖీ ఉర్ రెహ్మాన్. పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రొద్బలంతో 2010లో భారత్‌లో అడుగుపెట్టాడు. బాంబుల తయారీలో దిట్ట కావడం తో దేశ వ్యాప్తంగా అనేక పేలుళ్లలో పాత్రధారిగా ఉన్నాడు. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లలోనూ కీలక పాత్ర పోషించాడు. పోలీసు, నిఘా వర్గాల వేట ముమ్మరం కావడంతో తిరిగి పాక్‌కు పారిపోయేం దుకు ప్రయత్నించాడు. దీనికి సహకరించిన ఐఎస్ఐ అధికారి ‘స్టాంప్’ విషయంలో చేసిన చిన్న పొరపాటుతో చిక్కి జైలుకు చేరాడు. ఈ ఉగ్రవాదిని ఈ నెల 9న నాంపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కసరత్తు చేస్తోంది. ఎల్ఈటీ ద్వారా ఐఎంలోకి... పాకిస్తాన్‌కు చెందిన వఖాస్ అసలు పేరు జఖీ ఉర్ రె హ్మాన్. ఫుడ్ టెక్నాలజీలో డిప్లొమా పూర్తి చేసిన ఇతడు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా (ఎల్ఈటీ) ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లాడు. ఆ సంస్థలో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు ఆ సంస్థ కో-ఫౌండర్ యాసీన్ భత్కల్‌కు (దిల్సుఖ్నగర్ కేసులో నిందితుడు) ప్రధాన అనుచరుడిగా మారాడు. 2010లో నేపాల్‌లోని ఖాట్మండు మీదుగా భారత్‌లోకి ప్రవేశించి, తెహసీన్ అక్తర్‌తో జట్టుకట్టాడు. ఢిల్లీ, ముంబై, రాజ స్తాన్, గుజరాత్‌లలో జరిగిన పేలుళ్లలో కీలక పా త్ర పోషించిన వఖాస్ గత ఏడాది యాసీన్, అసదుల్లా అక్తర్, తెహసీన్ అక్తర్‌లతో కలిసి దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లలో పాలుపంచుకున్నాడు. ఈ కేసులో మూడో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దొరికితే ఇబ్బందనుకున్న ఐఎస్ఐ... దేశవ్యాప్తంగా జరిగిన పేలుళ్లలో వఖాస్ పాత్ర నిర్థారణకావడం, అప్పటికే యాసీన్, అసదుల్లా వంటి వారు అరెస్టు కావడంతో ఐఎస్ఐలో గుబులు రేగింది. అప్పటికే ముంబై దాడు (26/11 ఎటాక్స్)ల్లో ప్రత్యక్ష ప్రమేయానికి సంబంధించి భారత్ ఆధారాలతో సహా అంతర్జాతీయ సమాజంలో పాక్‌ను దోషిగా చూపుతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో భారత పోలీసు, నిఘా వర్గాలు వఖాస్‌ను పట్టుకుంటే అంతర్జాతీయంగా మరిన్ని చిక్కుల్లో పడతామని భావించిన ఐఎస్ఐ ఎట్టిపరిస్థితుల్లోనూ వఖాస్‌ను సురక్షితంగా వెనక్కు రప్పించాలని భావించింది. దీనికోసం పక్కా స్కెచ్ వేసిన ఐఎస్ఐ ఆ బాధ్యతల్ని ఓ ఉన్నతాధికారికే అప్పగించింది. పాక్‌కు పారిపోవాలని బంగ్లాదేశ్‌కు... వఖాస్‌ను తమ వేగులతో పాటు ఇంటర్నెట్ చాటింగ్ ద్వారా సంప్రదించిన సదరు ఐఎస్ఐ అధికారి నేపాల్ మీదుగా బంగ్లాదేశ్ చేరుకోమని సూచించాడు. అప్పటికే నిఘా, దర్యాప్తు అధికారుల కళ్లుగప్పడం కోసం దేశంలోని కర్నాటక, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్రల్లో సంచరించిన వఖాస్... ఐఎస్ఐ అధికారి సూచించిన ప్రకారం బంగ్లాదేశ్ చేరుకున్నాడు. అక్కడి స్లీపర్‌సెల్స్ ద్వారా ఇతడికి ఐఎస్ఐ అధికారులు రూపొందించిన బోగస్ పాస్‌పోర్ట్ అందిం ది. దీని సహకారంతో ఢాకా నుంచి విమానంలో నేరుగా పాకిస్తాన్ వెళ్లిపోయేందుకు వఖాస్ అన్నీ సిద్ధం చేసుకున్నాడు. సాంకేతిక ఆధారాలను బట్టీ వఖాస్ బంగ్లాదేశ్‌లో ఉన్నట్లు గుర్తించిన భారత నిఘా విభాగం ‘రా’ కూడా అక్కడ కాపుకాసింది. తొందరలో స్టాంప్ మరిచిన అధికారి... వఖాస్ పేరుతో పక్కాగా బోగస్ పాస్‌పోర్ట్ తయారు చేసిన ఐఎస్ఐ అధికారులు దానిపై ఎంట్రీ స్టాంప్ వేయాలన్న చిన్న అంశాన్ని విస్మరించారు. విదేశీయులు ఏదైనా దేశంలో అడుగుపెట్టినప్పుడు విమానాశ్రయంలో ఉండే ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడి పాస్‌పోర్ట్‌పై ఎంట్రీ స్టాంప్ వేస్తారు. సదరు వ్యక్తి దేశం వదిలి వెళ్లిపోయేటప్పుడూ ఎగ్జిట్ స్టాంప్ వేస్తారు. అయితే బోగస్ పాస్‌పోర్ట్ తయారీలో అనేక జాగ్రత్తలు తీసుకున్న ఐఎస్ఐ అధికారి... ఎంట్రీ స్టాంప్ విషయం మర్చిపోయాడు. ఆ పాస్‌పోర్ట్‌ను తీసుకుని ఢాకా విమానాశ్రయానికి వెళ్లిన వఖాస్ పాక్ వెళ్లే విమానం ఎక్కేందుకు యత్నించగా... అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఎంట్రీ స్టాంప్ లేకుండా బంగ్లాదేశ్ సహా ఏ దేశంలోకైనా ఎలా అడుగు పెట్టాడనే అనుమానంతో ఆపేశారు. దీంతో పాక్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని ఢాకా విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆపారనే విషయం అక్కడే మాటు వేసి ఉన్న ‘రా’ అధికారికి తెలిసింది. ‘కదలని’ లక్షణంతోనే గుర్తింపు... హుటాహుటిన ఢాకా విమానాశ్రయానికి చేరుకున్న సదరు అధికారి తమ వద్ద ఉన్న వఖాస్ పాత ఫొటో సహకారంతో అతడిని గుర్తించేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. అయితే గత ఏడాది అరెస్టు అయిన యాసీన్ భత్కల్, అసదుల్లా అక్తర్‌లు వఖాస్‌కు సంబంధించిన ఓ కీలక విషయం బయటపడింది. దాదాపు 100 కేజీల బరువు, గుం డ్రని ముఖంతో పాటు అసాధారణమైన లక్షణం ఇతడికి ఉంటుందని వారు వెల్లడించారు. సాధారణంగా ఓ వ్యక్తి నడుస్తున్నప్పుడు అతడు తన రెండు చేతుల్నీ ఊపుతాడు. వఖాస్ మాత్రం నడిచేప్పుడు ఒక్క చేయి కూడా ఊపడని యాసీన్ ద్వయం బయటపెట్టింది. దీని ఆధారంగానే వఖాస్‌ను గుర్తించిన ‘రా’ అధికారి చాకచక్యంగా విమానాశ్రయం నుంచి బయటకు తప్పించడంతో పా టు ఇప్పుడు దేశం దాటడం భద్రం కాదని ట్రాప్ చేస్తూ తిరిగి భారత్‌లో అడుగుపెట్టేలా చేశాడు. నీడలా వెంటాడి అజ్మీర్‌లో అరెస్టు చేసి.. ఈ విషయాన్ని వెంటనే భారత్‌లో ఉన్న నిఘా వర్గాలకు ‘రా’ అధికారి చేరవేశాడు. ఇతడిని సరిహద్దుల్లోనే అరెస్టు చేస్తే వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనేది వెల్లడి కాదనే ఉద్దేశంతో నిఘా వర్గాలు ఆ పని చేయలేదు. అక్కడ నుంచి నీడలా వెంటాడుతూ కొన్ని రోజుల పాటు కన్నేసి ఉంచారు. ఫలితంగానే ఇతడితో కలిసి ఎన్నికల్లో విధ్వంసాలకు కుట్ర చేస్తున్న మరో ముగ్గురు అనుచరుల వివరాలూ వెలుగులోకి వచ్చాయి. దీంతో తక్షణం స్పందించిన నిఘా వర్గా ఢిల్లీ స్పెషల్ సెల్ ద్వారా రెండు నెలల క్రితం ముంబై నుంచి రైలులో రాజస్తాన్‌లోని అజ్మీర్‌కు చేరుకున్న వఖాస్‌ను అక్కడి రైల్వేస్టేషన్లో పట్టుకున్నారు. ఆ వెంటనే జైపూర్, జోథ్‌పూర్‌లలో మరో ముగ్గురిని అరెస్టు చేశారు. దిల్సుఖ్నగర్ కేసులో బాంబుల తయారీతో పాటు, 107 బస్టాప్‌లో బాంబున్న సైకిల్‌ను పెట్టినట్లు వఖాస్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.


