breaking news
Intellectually honest Mobile brand logo
-
టీమిండియా కొత్త స్పాన్సరర్‌గా ఒప్పో
-
టీమిండియా కొత్త స్పాన్సరర్‌గా ఒప్పో
రూ.1,079 కోట్లతో భారీ ఒప్పందం న్యూఢిల్లీ: భారత క్రికెట్ ఆటగాళ్ల జెర్సీలపై ఇక ఒప్పో మొబైల్ బ్రాండ్ లోగో కనిపించనుంది. ఇప్పటిదాకా కొనసాగిన స్టార్ ఇండియా గ్రూప్ తమ ఒప్పందాన్ని కొనసాగించేందుకు ఆసక్తి చూపలేదు.దీంతో ప్రముఖ మొబైల్ ఉత్పత్తిదారు ఒప్పో కంపెనీతో బీసీసీఐ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వచ్చే నెల 1 నుంచి అమలయ్యే ఐదేళ్ల ఈ ఒప్పందానికి ఒప్పో కంపెనీ ఏకంగా రూ.1,079 కోట్లు చెల్లించనుంది. ఇది స్టార్ ఇండియా గ్రూప్ చెల్లించినదానికి ఐదు రెట్లు ఎక్కువ. జూన్ 1 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో తొలిసారిగా భారత ఆటగాళ్లు తమ జెర్సీలపై ఒప్పో లోగోలతో కనిపించనున్నారు.