breaking news
indus water dispute
-
‘ప్రతీ నీటి బొట్టూ మా రెడ్‌లైన్’.. భారత్‌కు పాక్ హెచ్చరిక!
ఇస్లామాబాద్: భారత్-పాకిస్తాన్ మధ్య నీటి వివాదం మరోసారి రాజకీయ వేడిని పెంచుతోంది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన నేపథ్యంలో.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ‘పాకిస్తాన్ నీటిలో ప్రతి ఒక్క చుక్కా మా రెడ్‌లైన్’ అంటూ భారత్‌ను ఆయన హెచ్చరించారు. భారత్ తన వైఖరిని మార్చుకోకపోతే నేరుగా స్పందిస్తామని వ్యాఖ్యానించారు.శాంతి గురించి మాట్లాడుతూనే.. భారత్‌కు హెచ్చరికలు జారీ చేయడం పాకిస్థాన్ రాజకీయాల్లోని ద్వంద్వ వైఖరిపై మరోసారి చర్చకు దారితీసింది. ఓవైపు శాంతిని కోరుకుంటున్నామని చెబుతూనే.. మరోవైపు నీటి విషయంలో ఎలాంటి చర్యనైనా సహించేది లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.అసలు వివాదం?1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. సింధు నదీ వ్యవస్థలోని నీటిని రెండు దేశాలు ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ఈ ఒప్పందం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సింధు, జీలం, చీనాబ్ నదులను ప్రధానంగా పాకిస్తాన్‌కు, రావి, బియాస్, సట్లెజ్ నదులను భారత్‌కు కేటాయించింది. అయితే ఇరు దేశాలకు కొన్ని పరిమిత వినియోగ హక్కులను కూడా ఒప్పందం కల్పించింది. అయితే 2025 ఏప్రిల్‌లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ దాడికి పాక్ మద్దతున్న ఉగ్రవాదులే కారణమని భారత్ ఆరోపించింది. ఆ తర్వాత పాకిస్తాన్‌పై తీసుకున్న కీలక చర్యల్లో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ‘అబేయన్స్’లో ఉంచింది. ఇక్కడే అసలు రాజకీయ ట్విస్ట్ మొదలైంది.భారత్ ట్విస్ట్.. ఒప్పందం అమలులో ఉన్న సమయంలో భారత్ నుంచి పాకిస్తాన్‌కు నదుల నీటి మట్టాలపై కీలక సమాచార మార్పిడి జరిగేది. ముఖ్యంగా వర్షాకాలంలో నదుల్లో నీటి ప్రవాహం పెరిగితే ముందస్తు హెచ్చరికలు పాకిస్తాన్‌కు ఉపయోగపడేవి. ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత ఈ సమాచారాన్ని పంచుకోవడం కూడా భారత్ ఆపేసింది. దీంతో నీటి అంశం కేవలం రెండు దేశాల మధ్య జల వివాదంగా కాకుండా.. భద్రత, ఉగ్రవాదం, దౌత్యం, రాజకీయ ఒత్తిడి అన్నీ కలిసిన పెద్ద అంశంగా మారింది. ఇప్పుడు షెహ్బాజ్ షరీఫ్ వ్యాఖ్యలు కూడా అదే రాజకీయ నేపథ్యంలో చూడాల్సి ఉంది. “మేము శాంతిని కోరుకుంటున్నాం.. కానీ మా శాంతిని బలహీనతగా భావించొద్దు” అంటూ ఆయన ఒకవైపు చెబుతూనే.. భారత్ తమ నీటి హక్కులను ప్రభావితం చేసే చర్యలు తీసుకుంటే గట్టిగా స్పందిస్తామని హెచ్చరించారు. అంటే.. శాంతి సందేశమా? లేక రాజకీయ హెచ్చరికా? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.పాక్ మాత్రం సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా నిలిపివేసిందని ఆరోపిస్తోంది. తమకు ఒప్పందం ఇప్పటికీ చట్టబద్ధంగానే ఉందని వాదిస్తూ అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ అంశాన్ని పదేపదే లేవనెత్తుతోంది. కానీ, భారత్ మాత్రం ఉగ్రవాదాన్ని ఒకవైపు, నీటి సహకారాన్ని మరోవైపు విడదీసి చూడాలనే పాక్ వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూనే నీటి విషయంలో పాత ఒప్పందం ప్రకారం హక్కులు కావాలనుకోవడం ఎలా? అన్నది భారత రాజకీయ వాదనలో కీలక అంశంగా మారింది. ఇదే ఇప్పుడు పాకిస్తాన్‌కు పెద్ద సవాలుగా మారుతోంది. ఎందుకంటే నీటి అంశాన్ని అంతర్జాతీయ ఒత్తిడి కోసం ఉపయోగించాలనుకుంటున్న ఇస్లామాబాద్‌కు.. భారత్ మాత్రం దీనిని తన భద్రతా ప్రయోజనాలతో ముడిపెడుతోంది. -
భారత్‌తో యుద్ధానికైనా రెడీ.. పాక్ మంత్రి సంచలన ప్రకటన
భారత్–పాకిస్తాన్ మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం (Indus Waters Treaty) అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన తాజా వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య కొత్త రాజకీయ, దౌత్య ఉద్రిక్తతలకు దారితీశాయి. సింధూ జలాల విషయంలో పాకిస్తాన్ హక్కులను దెబ్బతీసే ఏ చర్యనైనా తమ దేశం సహించదని, అవసరమైతే భారత్‌తో యుద్ధానికైనా సిద్ధమని ఆయన హెచ్చరించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.ఇటీవల భారత్ చేపడుతున్న జలవిద్యుత్ ప్రాజెక్టులు, నదీ జలాల నిర్వహణ చర్యలపై స్పందించిన ఖవాజా ఆసిఫ్.. పాకిస్తాన్‌కు వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గించే లేదా అడ్డుకునే ప్రయత్నాలు జరిగితే అది కేవలం జలాల సమస్య కాకుండా జాతీయ భద్రతా సమస్యగా మారుతుందని పేర్కొన్నారు. పాకిస్తాన్ వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ, కోట్లాది ప్రజల జీవనాధారం సింధూ నదీ వ్యవస్థపై ఆధారపడి ఉందన్నారు. అలాంటి పరిస్థితుల్లో నీటి హక్కులను కాపాడుకోవడానికి అన్ని మార్గాలను ఉపయోగిస్తామని చెప్పారు. అవసరమైతే యుద్ధం వరకు వెళ్లడానికి కూడా తమ దేశం వెనుకాడదని ఆయన వ్యాఖ్యానించినట్లు పాకిస్తాన్ మీడియా నివేదించింది.ఇండస్ ఒప్పందం ఏమిటి?1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఇండస్ జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సింధూ నదీ వ్యవస్థలోని ఆరు ప్రధాన నదులను రెండు దేశాల మధ్య విభజించారు. రవి, బియాస్, సట్లెజ్ నదుల జలాలపై భారత్‌కు పూర్తి హక్కులు ఉండగా, ఇండస్, జీలం, చీనాబ్ నదుల జలాలను ప్రధానంగా పాకిస్తాన్ వినియోగించుకునేలా ఒప్పందం రూపొందించబడింది. అయితే పశ్చిమ నదులపై కూడా విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి అవసరాల కోసం కొన్ని పరిమిత హక్కులు భారత్‌కు కల్పించబడ్డాయి. గత ఆరు దశాబ్దాలుగా అనేక యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు ఎదురైనా ఈ ఒప్పందం కొనసాగుతుండటం విశేషం.ఎందుకు మళ్లీ వివాదం?గత కొంతకాలంగా జమ్మూ-కశ్మీర్ ప్రాంతంలో పలు జలవిద్యుత్ ప్రాజెక్టులను భారత్ వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా చీనాబ్, జీలం నదులపై నిర్మిస్తున్న కొన్ని ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇవి ఇండస్ ఒప్పంద నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తోంది. భారత్ మాత్రం ఈ ప్రాజెక్టులన్నీ ఒప్పంద పరిధిలోనే ఉన్నాయని, నీటి ప్రవాహాన్ని మళ్లించడం లేదా అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా, దేశానికి లభించిన హక్కులను పూర్తిగా వినియోగించుకోవడం తమ బాధ్యత అని చెబుతోంది.మారిన పరిస్థితులు..ఇటీవలి కాలంలో భారత్‌లో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో ఇండస్ ఒప్పందంపై భారత్‌లో కూడా చర్చలు పెరిగాయి. "రక్తం, నీరు ఒకేసారి ప్రవహించలేవు" అంటూ గతంలో భారత నాయకత్వం చేసిన వ్యాఖ్యలు మళ్లీ ప్రస్తావనకు వచ్చాయి. పాకిస్తాన్లో ఉగ్రవాదం కొనసాగితే ఇండస్ జలాల ఒప్పందంపై పునఃసమీక్ష అవసరమని భారత రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమైంది. -
ప్రపంచబ్యాంకును ఆశ్రయించిన పాక్
-
ప్రపంచబ్యాంకును ఆశ్రయించిన పాక్
సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారతదేశం రద్దు చేస్తుందని కథనాలు వస్తున్న నేపథ్యంలో.. పాకిస్థాన్ ప్రపంచ బ్యాంకును ఆశ్రయించింది. ఎలాగోలా భారతదేశాన్ని ఈ ఒప్పందం రద్దు చేసుకోనివ్వకుండా చూడాలని కోరింది. పాకిస్థాన్ అటార్నీ జనరల్ అష్తర్ ఔసఫ్ అలీ నేతృత్వంలో కొందరు సీనియర్ అధికారులు కలిసి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని ప్రపంచబ్యాంకు ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అంతర్జాతీయ కోర్టుకు కూడా పాకిస్థాన్ వెళ్లినట్లు జియో న్యూస్ వెల్లడించినా.. దానికి సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు. నీలం, చీనాబ్ నదులపై భారతదేశం కడుతున్న కిషన్‌గంగ, రాటిల్ జలవిద్యుత్ ప్రాజెక్టుల గురించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ ఆగస్టు 19వ తేదీన ఒక లేఖ రాసింది. అంతర్జాతీయ కోర్టులో ప్రపంచ బ్యాంకుకు కూడా ప్రధాన పాత్ర ఉంది. ముగ్గురు జడ్జీలను ప్రపంచబ్యాంకు నియమించుకోవచ్చు. ప్రతి దేశం ఇద్దరు ఆర్బిట్రేటర్లను నియమించుకునే అవకాశం ఉంది. జడ్జీలను త్వరగా నియమిస్తే.. సింధు నదీ జలాల ఒప్పందాన్ని త్వరగా ఆ కోర్టు దృష్టికి తీసుకెళ్తామని ప్రపంచ బ్యాంకు అధికారులకు పాక్ అధికారులు చెప్పినట్లు తెలిసింది. అయితే.. తగిన సమయంలోనే తాము చేయాల్సిన పని చేస్తామని ప్రపంచబ్యాంకు చెప్పినట్లు సమాచారం. అయితే.. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తుండటంతో.. సాధారణంగా జరగాల్సిన వ్యవహారాలన్నీ ఆలస్యం అవుతున్నాయని భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సల్మాన్ హైదర్ చెప్పారు. ఉడీలో జరిగినది చాలా పెద్ద ద్రోహమని, కనీసం ఆ ఘటనను పాకిస్థాన్ ఖండించలేదని ఆయన అన్నారు. అలాంటిది మన కట్టడాలపై వాళ్లు ఇష్టం వచ్చినట్లు కోర్టుకు వెళ్లినంత మాత్రాన ప్రయోజనం ఉండదని చెప్పారు.


