breaking news
Indiramma home
-
ఇందిరమ్మ ఇళ్లపై.. ప్రజావాణిలో పోటెత్తుతున్న దరఖాస్తులు!
సాక్షి, హైదరాబాద్: గవర్నమెంటుఇళ్లు అంటే సాధారణంగా.. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో.. శివారులో.. నిర్మానుష్య ప్రదేశాల్లో ఇస్తారనే అపవాదు ఉంది. ఇవి ఉపాధి కేంద్రాలకు దూరంగా.. సౌకర్యాలకు నోచుకోక లబ్ధిదారులు నివాసానికి ఆసక్తి చూపడం లేదు. దీనికి చెక్ పెట్టేందుకు తాజాగా ప్రభుత్వం స్థానిక ప్రాంతాల్లోనే అనువైన చోట ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు నివాసిత ప్రాంతాల్లోనే చాలా చోట్ల స్థలాలను ఎంపిక చేశారు. దీంతో ఈసారి ఇందిరమ్మ ఇళ్లపై జనంలో ఆసక్తి పెరిగింది. దీంతో ఒక వైపు ఉచిత ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజా భవన్, కలెక్టరేట్ ప్రజావాణిలకు, మరోవైపు ఎల్ఐజీ ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆన్లైన్ దరఖాస్తు కేంద్రాలకు పోటెత్తుతున్నారు.గతంలో ఏం జరిగిందంటే...వాస్తవంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిరి్మస్తామని ప్రకటించింది. ఐదేళ్లలో సుమారు 111 ప్రాంతాల్లో 68,176 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించగా, మిగిలిన మరో 31,824 ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో నిలిచిపోయాయి. అయితే, ఈ ఇళ్లు చాలావరకు నగరం వెలుపల, జీవనోపాధి లభించే ప్రాంతాలకు అత్యంత దూరంలో ఉండటం సమస్యగా తయారైంది. రోజువారి కూలిపనులు, చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకునే లబ్ధిదారులు నిత్యం రాకపోకలు సాగించలేక అక్కడ నివాసం ఉండడం లేదు. వాటిని అద్దెకు ఇవ్వడమో..తాళాలు వేయడమో చేస్తున్నారు.ఇప్పుడు ఇందిరమ్మ మోడల్ కాలనీలురెండున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర సామాజిక, ఆరి్థక సర్వే ద్వారా ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి లబ్ధిదారులకు వారు నివసిస్తున్న ప్రాంతానికి గరిష్టంగా 5 కిలోమీటర్ల సమీపంలోనే ‘ఇందిరమ్మ మోడల్ కాలనీలు’ నిర్మించి ఇళ్లు అందజేస్తామని ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో స్ధలాలను సైతం గుర్తించింది. ఈ పథకం పర్యవేక్షణ బాధ్యతను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రత్యేకంగా హౌసింగ్ డిపార్ట్మెంట్కు బదిలీ చేసింది. స్థానికంగానే సొంత గూడు దక్కుతుందనే నమ్మకంతో నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్ల కోసం భారీగా దరఖాస్తు చేస్తున్నారు.రాయితీతో ఎల్ఐజీ ఇందిరమ్మ ఇళ్లు మరోవైపు, హౌసింగ్ శాఖ పరిధిలోని ‘క్యూర్’ ఎల్ఐజీ, ఎంఐజీ లక్ష ఇళ్ల లక్ష్యంతో పేద, దిగువ, మధ్యతరగతి వర్గాల కోసం స్థానికంగా జీ+10 నివాస గృహాల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవల మొదటి విడత పైలెట్ ప్రాజెక్టుగా 16 ప్రాంతాల్లో సుమారు 7680 ఎల్ఐజీ గృహాల కోసం గృహ నిర్మాణశాఖ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఆన్లైన్లో దరఖాస్తుల వరద పారుతోంది.కలల గూడు కోసం..నగరంలో ఇళ్లు లేని పేదలు తమ గోడు వెళ్లబోసుకునేందుకు కలెక్టరేట్‌కు తరలివస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలంటూ ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటున్నారు. సోమవారం ప్రజావాణికి మొత్తం 2433 దరఖాస్తులు రాగా..వాటిలో 2254 ఇళ్లకు సంబంధించినవే ఉన్నాయి. గత వారం కూడా ఇళ్లకోసం 1462 మంది అర్జీ పెట్టుకున్నారు. -
ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఇదిగో ఇలా దరఖాస్తు చేసుకోండి
-
నివసిస్తున్న చోటే ఇళ్లు
సాక్షి, హైదరాబాద్: బస్తీలు, మురికివాడల్లో ఇరుకు గదుల్లో జీవనం సాగిస్తున్న నిరుపేదలకు అదే ప్రాంతంలో భారీ భవన సముదాయాలు నిర్మించి ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ పథకం కిందనే ఆ ఇళ్లను నిర్మిస్తారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే తరహాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం కింద భారీ ఎత్తున నగరంలో గృహ సముదాయాలు నిర్మించింది. ఇందులో కొన్ని పూర్తి స్థాయిలో సది్వనియోగం అవుతుండగా, కొన్ని దూరంగా ఉన్నాయన్న ఉద్దేశంతో బస్తీ వాసులు వెళ్లేందుకు ఆసక్తి చూపక నిరుపయోగంగా ఉన్నాయి.దీన్ని దృష్టిలో ఉంచుకుని..లబ్ధిదారులు జీవనోపాధి పొందుతూ ఉంటున్న ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద భారీ భవన సముదాయాలు నిర్మించి కేటాయించాలని సర్కారు నిర్ణయించింది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ–క్యూర్)పరిధిలోని మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ కాలనీలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్థలాల సేకరణ, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేయటం, పూర్తయిన రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు తదితర అంశాలపై మంగళవారం రాత్రి సచివాలయంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఇన్చార్జి మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్‌లతో కలిసి గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. 5 నుంచి 10 అంతస్తుల వరకు.. హైదరాబాద్‌లోని బస్తీల్లో జీవనం కొనసాగిస్తున్న పేదల కోసం గతంలో దూరంగా 42 వేల ఇళ్లను నిర్మించగా అందులో సగం మంది మాత్రమే అక్కడ నివసిస్తున్నారని ఇటీవల నిర్వహించిన క్షేత్రస్ధాయి సర్వేలో తేలిందని అధికారులు మంత్రుల దృష్టికి తెచ్చారు. చాలాచోట్ల లబ్దిదారుల ముసుగులో ఇతరులు చేరుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే పేదలు జీవనోపాధి పొందుతున్న చోటనే వారికి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని మంత్రులు నిర్ణయించారు. ఐదు అంతస్తుల నుంచి పది అంతస్తుల మేర భారీ భవన సముదాయాలు నిర్మించి వారికి కేటాయించాలని నిర్ణయించారు. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. 10 రోజుల్లో నివేదికకు ఆదేశం క్యూర్ పరిధిలో ఇలాంటి లబ్ధిదారుల సంఖ్య, వారి ఆవాసానికి ఎన్ని భవనాలు నిర్మించాలి, అందుకు అవసరమయ్యే స్థలం తదితర వివరాలతో పదిరోజుల్లో నివేదిక అందజేయాలని మంత్రులు ఆదేశించారు. మురికివాడల్లో స్ధలం ఉన్నవారు అంగీకరిస్తే ఆ ప్రాంతంలో జీప్లస్ 5 అంతస్తుల్లో ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో నిర్మించిన ఇళ్లు కూలే స్థితికి చేరినందున, వాటిæ స్ధానంలో కూడా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించే అంశాన్ని పరిశీలించారు. 3 కార్పొరేషన్ల పరిధిలో ఇళ్ల స్ధలాలు ఉన్న 28 వేల మంది లబి్ధదారులకు ఈ నెల చివరిలోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. బోగస్ గుర్తింపు..అర్హులకు ఇళ్లు అసంపూర్తిగా ఉన్న, ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి మార్చి చివరి నాటికి లబి్ధదారులను ఎంపిక చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల లబి్ధదారులను గుర్తించి వారే వాటిని పూర్తి చేసుకోవడానికి వీలుగా అంతకుముందు ఖర్చు చేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని మిగిలిన నిధులను మంజూరు చేయాలని నిర్ణయించారు. చాలాచోట్ల ఇళ్లు తీసుకుని అక్కడ నివాసం ఉండని వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని, అలాగే బోగస్ లబ్ధిదారులను కూడా గుర్తించాలని ఆదేశించారు. అనర్హుల స్ధానంలో రాజకీయాలకు అతీతంగా సమీపంలో ఉన్న అర్హులైన పేదలను ఎంపిక చేయాలని కలెక్టర్లకు సూచించారు. డబుల్ బెడ్ రూం నివాస ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. విస్తీర్ణం సవరించుకోండి.. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు పొందిన వారు, గత ప్రభుత్వం అమలులోకి తెచి్చన గృహలక్ష్మి పథకంలో ఇళ్లు పొందిన వారు, వాటిని ప్రారంభించి అసంపూర్తిగా వదిలేసి ఉంటే వాటికి ఇప్పుడు ఇందిరమ్మ పథకం కింద పూర్తి చేసేందుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే 400 చ.అడుగులు–600 చ.అడుగుల మధ్యలోనే వాటి విస్తీర్ణం ఉండాలనే నిబంధన విధించింది. విస్తీర్ణం తక్కువ ఉంటే నిబంధన మేరకు పెంచుకోవాలని, ఎక్కువ ఉంటే, తగ్గించుకోవాలని పేర్కొంటూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ ఇళ్లకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఉంటే, మిగతా కిస్తీల మొత్తాన్ని విడుదల చేయనున్నట్టు పేర్కొంది. బేస్మెంట్ స్థాయిని మించి ఇల్లు నిర్మించి ఉంటే, దానికి బేస్మెంట్ కిస్తీ కాకుండా తదుపరి కిస్తీల మొత్తం విడుదల అవుతుందని తెలిపింది. గృహనిర్మాణ శాఖ కార్యదర్శి గౌతమ్, ఆయా జిల్లాల కలెక్టర్లు, ముగ్గురు మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
పంచాయతీ భవనం చూపించి బిల్లు తీసుకున్నారు!
బషీరాబాద్: తవ్విన కొద్ది ‘ఇందిరమ్మ’ ఇళ్ల బాగోతం బయటపడుతోంది. అక్రమార్కులు ఏకంగా బషీరాబాద్ గ్రామ పంచాయతీ భవనాన్ని చూపించి బిల్లును తీసుకున్నారు. బుధవారం సీబీ సీఐడీ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, ఎస్సై వేణుమాధవ్, ఆర్అండ్బీ అధికారులతో కలిసి బషీరాబాద్‌లో విచారణ జరిపారు. పంచాయతీ భవనంలో రిటైర్ బ్యాంకు ఉద్యోగి కమలమ్మ ఉంటోంది. ఆమె పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినట్లు ఉండటంతో అధికారులు కమలమ్మ ఉండే పంచాయతీ భవనానికి వెళ్లారు. తనకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిన విషయం తెలియదని ఆమె తెలిపింది. దీంతో అధికారులు నివ్వెరపోయారు. గోసాయి కాలనీలో పాతకాలం నాడు నాపరాతి ముక్కలతో నిర్మించిన ఇంటికి బిల్లు చెల్లించారని అధికారుల విచారణలో తేలింది. శిథిలావస్థకు చేరిన ఇం టికి సైతం అధికారులు బిల్లు చెల్లించారు.పంచాయతీ పరిధిలోని నవాంద్గి గ్రామంలో 4 పాత ఇళ్లకు బిల్లులు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. ఓ ఇంటి అడ్రస్ లభించలేదు.బషీరాబాద్ పంచాయతీ పరిధిలోని సీబీ సీఐడీ అధికారుల ఆధ్వర్యంలో ఆర్అండ్బీ అధికారులు 223 ఇళ్లను పరిశీలించేందుకు వచ్చారు. అందులో 10 ఇళ్ల అడ్రస్ దొరకలేదు. ఇప్పటికీ అడ్రస్ లేని ఇళ్ల సంఖ్య 92కు చేరింది. ఆర్అండ్బీ అధికారుల నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని సీఐడీ అధికారులు తెలిపారు. ఇళ్ల అడ్రస్ లేకుండా బిల్లులు తీసుకున్న వారి వివరాలు సేకరించేందుకు తమ సిబ్బంది బషీరాబాద్‌లోనే ఉంటారని తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయని సీబీ సీడీ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి వెల్లడించారు.


