Indian worker
-
భారతీయ కార్మికులపై తైవాన్ నిరసన
వృద్ధాప్య జనాభా, తగ్గుతున్న జనన రేట్ల కారణంగా కార్మిక కొరతను అధిగమించాలని చూస్తున్న తైవాన్‌కు సొంత ప్రజల నుంచే అడ్డంకులు ఎదురవుతున్నాయి. భారతీయ కార్మికులను నియమించుకోవాలనే ప్రభుత్వ నిర్ణయంపై తైవాన్ సమాజంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో 40,000 మందికి పైగా తైవానీయులు ఆన్లైన్ పిటిషన్‌పై సంతకాలు చేస్తూ భారతీయ కార్మికులను తీసుకురావాలనే ప్రణాళికను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.తైవాన్ తన తయారీ రంగం, వృద్ధుల సంరక్షణ విభాగంలో నెలకొన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఫిబ్రవరి 2024లో భారతదేశంతో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది. ప్రస్తుతం ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌ల మీద ఎక్కువగా ఆధారపడుతున్న తైవాన్ తన వలస కార్మిక వనరులను వైవిధ్యపరచాలని భావించింది. ఇందులో భాగంగా కేవలం 1,000 మంది కార్మికులతో ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది.మార్చి 2026 నాటికి, తైవాన్ సుమారు 8 లక్షల మంది చట్టబద్ధమైన వలస కార్మికులకు ఆతిథ్యం ఇస్తోంది. కొత్త కార్మిక వనరులు చేకూరకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ, సామాజిక భద్రత ప్రమాదంలో పడుతుందని కార్మిక మంత్రిత్వ శాఖ పదేపదే హెచ్చరిస్తోంది.ప్రభుత్వ నిర్ణయానికి ప్రజా ప్రతిఘటనతైవాన్ కార్మిక మంత్రి హంగ్ సున్-హాన్ ఈ ఏడాది చివరి నాటికి మొదటి విడత భారతీయ కార్మికులు వస్తారని ప్రకటించిన కొద్ది కాలంలోనే సోషల్ మీడియా వేదికగా, స్థానికంగా అక్కడి వీధుల్లో నిరసనలు భగ్గుమన్నాయి. భారతీయ పురుషులపై నెలకొన్న ప్రతికూల అభిప్రాయం, భద్రత, లింగ హింసకు సంబంధించిన భయాలు ఈ పిటిషన్‌కు దారితీశాయి. ప్రతిపక్ష కుమింటాంగ్ (కేఎంటీ) చట్టసభ సభ్యులు ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. తైవాన్ వాసులు భారతీయుల పట్ల జాత్యహంకార పూరిత వ్యాఖ్యలు చేయడం, సామాజిక మాధ్యమాల్లో భారతీయ పురుషులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు చేయడం ఆందోళనకరంగా మారింది.ప్రభుత్వ వాదన - వాస్తవాలుఈ అంశంపై ప్రజా ఆందోళనలను ఎదుర్కొంటున్నప్పటికీ కార్మిక మంత్రిత్వ శాఖ మాత్రం భారతీయ కార్మికులను లైంగిక నేరాలతో ముడిపెట్టడం నిరాధారమైనదని స్పష్టం చేసింది. గతంలో ఇతర దేశాల నుంచి వచ్చిన వలస కార్మికులతో పోలిస్తే నేరాల రేటు స్థిరంగా ఉంటుందని, పైగా రిక్రూట్ అయ్యే ప్రతి కార్మికుడు భారత ప్రభుత్వం నుంచి మెరుగైన ప్రవర్తన సర్టిఫికేట్ (Good Conduct Certificate) సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తైవాన్ కఠినమైన స్క్రీనింగ్ ప్రక్రియలో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది.దౌత్యం వైపు అడుగులుప్రస్తుతానికి, తైపీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. కఠినమైన పర్యవేక్షణ, భద్రతా హామీలు ఉంటేనే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని సంకేతాలు ఇచ్చింది. అయితే కార్మిక కొరతకు సామాజిక భద్రతకు మధ్య సమతుల్యత సాధించడమే ఇక్కడ అసలైన సమస్య. అంతర్జాతీయంగా ఎంతో మంది భారతీయులు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నప్పటికీ ఒక దేశంపై ఏర్పడిన ప్రతికూల ముద్ర దౌత్యపరమైన సంబంధాలతోపాటు అవసరమైన ఆర్థిక అవసరాలకు కూడా ఆటంకం కలిగిస్తుందని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.ఇదీ చదవండి: ఏఐలో ఎందుకో వెనకబడ్డాం! -
భారతీయుడి అసాధారణ పోరాటం
దుబాయ్: స్వదేశంలో తల్లి మరణించినా తిరిగి రావడానికి అనుమతి రాలేదు. భారత్ తిరిగొచ్చేందుకు న్యాయపోరాటం ప్రారంభిస్తే విచారణ రెండేళ్లుగా కొననసాగుతోంది. కోర్టుకు హాజరవడానికి దుబాయ్‌లో ఒకటి కాదు రెండు కాదు దాదాపు వేయి కిలోమీటర్లు పైగానే నడిచాడు అక్కడ కార్మికుడిగా పనిచేస్తున్న ప్రవాస భారతీయుడు జగన్నాథన్ సెల్వరాజ్(48). ఆయన స్వస్థలం తమిళనాడులోని తిరుచిరాపల్లి. ప్రయాణ ఖర్చులకు డబ్బు లేకపోవడంతో దుబాయ్‌లో తాను ఉంటున్న సోనాపూర్ నుంచి విచారణ జరుగుతున్న కరామా జిల్లాలోని లేబర్ కోర్టుకు రానుపోను కలిపి నాలుగు గంటల్లో 50 కిలోమీటర్ల చొప్పున 20 సార్లు నడిచాడు. ఈ క్రమంలో ట్రాఫిక్, ఎండ, తుపానులు, అలసట వంటి వాటిని లెక్కచేయలేదు. ‘నా కేసు సంఖ్య 826. కోర్టుకు చేరుకోవాలంటే ఉదయం రెండు గంటలు, తిరిగి వెళ్లాలంటే మరో రెండు గంటలు పడుతుంది. కోర్టు హియరింగ్ ఉన్న రోజు ఉదయం 4 గంటలకే లేవాలి. ఇలా ప్రతి 15 రోజులకోసారి వెళ్లాలి. విచారణ పూర్తయిన తరువాత సాయంత్రం వరకు అక్కడే విశ్రాంతి తీసుకుని బయలుదేరుతా. సాయం చేయడానికి ఎవరూ లేరు. ఎండాకాలంలో నడక కష్టమే అయినా మరో మార్గం లేదు’ అని సెల్వరాజ్ ఖలీజ్ టైమ్స్‌కు చెప్పాడు. తన తల్లి మరణించిన తరువాత అంత్యక్రియలకు హాజరవయ్యేందుకు భారత్ రావడానికి అనుమతి దొరక్కపోపడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. గత కొన్నాళ్లుగా ఓ పార్కులో ఉంటున్నానని, ఆరోగ్యం క్షీణించిందని, భారత్‌కు తిరిగి రావడమే తన ఏకైక కోరిక అని సెల్వరాజ్ అన్నాడు. -
మలేసియాలో భారత కార్మికుడు మృతి
బతుకుదెరువు కోసం మలేసియా వెళ్లిన తెలంగాణ యువకుడు కలవ బాలకృష్ణ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలియని అతని కుటుంబసభ్యులు కలవ బాలకృష్ణ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో మలేషియా తెలుగు ప్రవాసితుల సంఘం(టీమ్)కి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో చర్యలు చేపట్టిన టీమ్ కౌలాంలంపూర్ కు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోట తిగ్గిమ్ ఆసుపత్రిలో ఉన్న బాలకృష్ణ మృత దేహాన్ని మలేసియా, భారతీయ ఎంబసీల సాయంతో హైదరాబాద్ కు పంపించే ఏర్పాట్లు చేశారు. బాలకృష్ణ సొంత ఊరు తెలంగాణలోని నిజామాబాద్ అని తెలిపారు. శవాన్ని దేశానికి పంపేందుకు అయ్యే ఖర్చులను సంఘం సభ్యులు భరిస్తున్నట్లు వివరించారు. -
సౌదీలో ఓ భారతీయుడి కష్టాలు..
బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయులకు ఎన్నో కష్టాలు, వేధింపులు ఎదురవుతుంటాయి. రెండేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లిన అబ్దుల్ సత్తార్ మకందర్ (35) అనే భారతీయుడు తన బాధలను చెప్పుకోవడం కూడా నేరమైంది. డ్రైవర్‌గా పనిచేస్తున్న మకందర్‌కు ఆయన యజమాని తగిన జీతం ఇవ్వకపోగా, భోజనం చేసేందుకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. అంతేగాక భారత్‌కు తిరిగి రాకుండా మకందర్ను అడ్డుకున్నాడు. మకందర్ తన కష్టాలను చెప్పుకుంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఢిల్లీకి చెందిన కుందన్ శ్రీవాత్సవ అనే ఉద్యమకర్త ఈ వీడియోను ఫేస్బుక్లో పోస్ట్‌చేశారు. దీనివల్ల మకందర్ కష్టాలు తీరకపోగా, మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. మకందర్ తప్పుడు సమాచారం అందించారనే నేరం కింద సౌదీ అధికారులు అరెస్ట్ చేశారు. ఫేస్ బుక్ నుంచి ఈ వీడియో నుంచి తొలగించి, క్షమాపణలు చెబుతూ మరో వీడియో పోస్ట్ చేయాలని శ్రీవాత్సవను మకందర్ తోటి ఉద్యోగి కోరాడు. శ్రీవాత్సవ ఈ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించడంతో మకందర్ను విడుదల చేశారు. అయితే వేరే అభియోగాలతో మకందర్ను వెంటనే అరెస్ట్ చేశారు. మకందర్తో మాట్లాడేందుకు ఆయన తల్లి ప్రయత్నించినా వీలు కాలేదు. తాను భారత్‌కు తిరిగి వచ్చేందుకు సాయం చేయాల్సిందిగా మకందర్.. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు విన్నవించాడు. సౌదీలో దాదాపు 28 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. ఆ దేశంలో భారతీయులు పడుతున్న బాధల గురించి చాలా కేసులు వెలుగుచూశాయి. పనిమనిషిగా వెళ్లిన ఓ భారతీయురాలి చేతిని గతేడాది నరికివేశారు. -
కిందపడేసి కొడుతూ కాలితో తన్ని.. ఉమ్మేశాడు
రియాద్: సౌదీ అరేబియాలో ఓ భారతీయుడిపై దాడి జరిగింది. విచక్షణ రహితంగా ఓ అరబ్ ఇంజినీర్ చేసిన ఈ దాడిని పలువురు ఖండించగా అతడిపై కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో బయటకు వచ్చి పలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. మక్కా మసీదు ప్రాంతంలో ఓ నిర్మాణం విస్తరణకు సంబంధించిన పనులను అరబ్ దేశానికి చెందిన ఇంజినీర్ భారతీయుడికి అప్పగించాడు. అయితే, తాను నిర్ణయించిన సమయానికి పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఇంజినీర్ ఏమాత్రం కనికరం లేకుండా విచక్షణ రహితంగా భారతీయ యువకుడిపై దాడి చేశాడు. కిందపడేసి కొడుతూ కాలితో తన్ని ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించాడు. అంతేకాకుండా అతడిపై ఉమ్మి కూడా వేశాడు. రెండు నిమిషాలపాటు రికార్డయిన ఈ వీడియోను ఓ కెనడా జర్నలిస్టు తారేక్ ఫతా తన ఫేస్బుక్ పేజీలో పెట్టాడు. దీంతో ఆ వీడియో బయటకు వచ్చి ఆ ఇంజినీర్ నిర్వాకంపట్ల విమర్శలు వచ్చాయి. సౌదీకి చెందిన కార్మిక శాఖ డైరెక్టర్ జనరల్ ఘటన స్థలికి వెళ్లి వివరాలు సేకరించి దర్యాప్తుకు ఆదేశించారు. అయితే, ఆ ఇంజినీర్ మాత్రం బాధితుడికి క్షమాపణలు చెప్పాడని, దర్యాప్తు మాత్రం చట్ట ప్రకారం జరుగుతుందని చెప్పారు.


