breaking news
India Internet Users
-
రోజుకు 1 జీబీ
సాక్షి, స్పెషల్ డెస్క్: భారత్‌లో రెండేళ్లుగా స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఏటా 15 కోట్ల యూనిట్లు దాటుతున్నాయి. సామాజిక మాధ్యమాల వినియోగమూ అంతకంతకూ పెరుగుతోంది. ఇంకేముంది ఇంటర్నెట్ వాడకం జోరు మీద ఉంది. ఒక్కో మొబైల్ యూజర్ సగటున రోజుకు 1.02 గిగాబైట్స్ (జీబీ) డేటా వినియోగిస్తు న్నాడు. నాలుగేళ్లలో ఇది దాదాపు రెండింతలైందంటే మనవాళ్ల వాడకం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం అవుతోంది. మెట్రోలే కాదు పల్లెల్లోనూ జనం ఎంచక్కా ఇంటర్నెట్లో విహరిస్తూ మొబైల్‌కు గంటల తరబడి అతుక్కుపోతున్నారు.ప్రపంచంలో రెండవ స్థానంలో భారత్ ⇒ 5జీ చందాదారుల సంఖ్యలో (40కోట్లు)⇒ 5జీ డేటా వినియోగంలో (నెలకు 12.9 ఎక్సాబైట్స్)⇒ 5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ చందాదారుల సంఖ్యలో (2026 ఫిబ్రవరికి 1.19 కోట్లు) నివేదిక హైలైట్స్..⇒ దేశవ్యాప్తంగా గత ఏడాది 13.7 కోట్ల 5జీ ఫోన్లు అమ్ముడయ్యాయి.⇒ వినియోగంలో ఉన్న 89.2 కోట్ల యూనిట్ల 4జీ ఫోన్లలో 38.3 కోట్ల యూనిట్లు 5జీ సపోర్ట్ చేస్తాయి.⇒ మెట్రో నగరాల్లో మొత్తం ఇంటర్నెట్ వాడకంలో 5జీ వాటా 58%.ఆధారం: నోకియా ఇండియా మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండెక్స్–2026 నివేదిక -
భారత్‌లో మొబైల్ యూజర్లు 55.4 కోట్లే!
న్యూఢిల్లీ: భారత్‌లో వాస్తవ మొబైల్ వినియోగదారులు 55.48 కోట్ల మందేనని జక్స్ట్ రీసెర్చ్ సంస్థ రూపొందించిన ఇండియా మొబైల్ ల్యాండ్‌స్కేప్ నివేదిక తెలిపింది. అలాగే ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 14.32 కోట్లుగా ఉందని వివరించింది. అయితే టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) గణాంకాల ప్రకారం దేశంలో 87.33 కోట్ల మంది మొబైల్ వినియోగదారులున్నారు. మొత్తం 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 109 పట్టణ ప్రాంతాలు, 196 గ్రామాల్లో ఈ ఏడాది మే-జూలై కాలంలో నిర్వహించిన సర్వే ఆధారంగా జక్స్ట్ సంస్థ ఇండియా మొబైల్ ల్యాండ్‌స్కేప్ నివేదికను రూపొందించింది. గణాంకాలు, ప్రణాళికల అమలు మంత్రిత్వ శాఖ అధీనంలో నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ నిర్వహించే 88 ప్రాంతాల్లో 80 ప్రాంతాలు ఈ సర్వే కిందకు వచ్చాయి. ఈ సర్వే 94.8 శాతం భారత జనాభాను 96.1 శాతం భారత కుటుంబాలకు ప్రాతినిధ్యం విహ స్తోంది. నివేదిక ముఖ్యాంశాలు..., మొత్తం 55.48 కోట్ల మొబైల్ వినియోగదారుల్లో 29.8 కోట్ల(54 శాతం) మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. కాగా పట్టణాల్లోని మొబైల్ వినియోగదారుల సంఖ్య 25.6 కోట్లుగా ఉంది. దేశంలో మొత్తం 77.39 కోట్ల సిమ్ కార్డులు పనిచేస్తున్నప్పటికీ, 55.48 కోట్ల మంది 64.34 కోట్ల సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఇక యూనిక్ ఇంటర్నెట్ యూజర్ల(డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌టీవీ, మొబైల్ల ద్వారా ఇంటర్నెట్ను యాక్సెస్ చేసేవాళ్లు) సంఖ్య 9.47 కోట్లుగా ఉంది. ఎయిర్టెల్ లైవ్, రిలయన్స్ ఆర్ వరల్డ్ వంటి ఆపరేటర్ల పోర్టల్స్ ద్వారా ఇంటర్నెట్ను వినియోగించుకునే వారి సంఖ్యను కూడా కలిపితే మొత్తం 14.32 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లున్నారు. జీపీఆర్ఎస్, 3జీ కనెక్షన్ల ద్వారా ఇంటర్నెట్ను యాక్సెస్ చేసే వారి సంఖ్య 2.38 కోట్లుగా ఉంది. వీటిల్లో 93 లక్షల మంది మొబైల్ ద్వారా ఇంటర్నెట్ను యాక్సెస్ చేస్తున్నారు. వీరిలో 77 శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారే.


