రోజుకు 1 జీబీ | Data Usage Doubles in Four Years: Wireless Broadband Users Reach 962 Million | Sakshi
Sakshi News home page

రోజుకు 1 జీబీ

Apr 7 2026 5:48 AM | Updated on Apr 7 2026 5:48 AM

Data Usage Doubles in Four Years: Wireless Broadband Users Reach 962 Million

నాలుగేళ్లలో రెండింతలైన డేటా వినియోగం

96.2 కోట్లకు వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లు

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌: భారత్‌లో రెండేళ్లుగా స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు ఏటా 15 కోట్ల యూనిట్లు దాటుతున్నాయి. సామాజిక మాధ్యమాల వినియోగమూ అంతకంతకూ పెరుగుతోంది. ఇంకేముంది ఇంటర్నెట్‌ వాడకం జోరు మీద ఉంది. ఒక్కో మొబైల్‌ యూజర్‌ సగటున రోజుకు 1.02 గిగాబైట్స్‌ (జీబీ) డేటా వినియోగిస్తు న్నాడు. నాలుగేళ్లలో ఇది దాదాపు రెండింతలైందంటే మనవాళ్ల వాడకం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం అవుతోంది. మెట్రోలే కాదు పల్లెల్లోనూ జనం ఎంచక్కా ఇంటర్నెట్‌లో విహరిస్తూ మొబైల్‌కు గంటల తరబడి అతుక్కుపోతున్నారు.

ప్రపంచంలో రెండవ స్థానంలో భారత్‌ 
 5జీ చందాదారుల సంఖ్యలో (40కోట్లు)
5జీ డేటా వినియోగంలో     (నెలకు 12.9 ఎక్సాబైట్స్‌)
5జీ ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్‌ యాక్సెస్‌ చందాదారుల సంఖ్యలో (2026 ఫిబ్రవరికి 1.19 కోట్లు) నివేదిక హైలైట్స్‌..

దేశవ్యాప్తంగా గత ఏడాది 13.7 కోట్ల 5జీ ఫోన్లు అమ్ముడయ్యాయి.
వినియోగంలో ఉన్న 89.2 కోట్ల యూనిట్ల 4జీ ఫోన్లలో 38.3 కోట్ల యూనిట్లు 5జీ సపోర్ట్‌ చేస్తాయి.
 మెట్రో నగరాల్లో మొత్తం ఇంటర్నెట్‌ వాడకంలో 5జీ వాటా 58%.

ఆధారం: నోకియా ఇండియా మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇండెక్స్‌–2026 నివేదిక

Advertisement
 
Advertisement
Advertisement