breaking news
Imperial
-
'ప్రమాదపుటంచున' సోషలిస్ట్ క్యూబా
1823లో అమెరికా 5వ అధ్యక్షుడు మన్రో సిద్ధాంతం ప్రకారం లాటిన్ అమెరికా అంతా అమెరికాకు చెందుతుంది; పశ్చిమ భూగోళంలోకి యూరపు దేశాలు వలస రాకూడదు; తూర్పు భూగోళంలో అమెరికా జోక్యం చేసుకోదు. దక్షిణ అమెరికా దేశాలు అమెరికాకు చెందినవని (బ్యాక్ యార్డ్) అర్థం. ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ ఈ సిద్ధాంతాన్ని నిస్సిగ్గుగా అమలు చేయటానికి ప్రయత్నిస్తున్నారు.స్పానిష్–అమెరికన్ యుద్ధం ముగిసిన తర్వాత 1902 మే 20న క్యూబన్ రిపబ్లిక్ ఏర్పడింది. ఈ యుద్ధంలో స్పానిష్ వలస ప్రాంతా లైన క్యూబా, ప్యూర్టోరికో, గ్వామ్, ఫిలిప్పైన్స్లను అమెరికా స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత 1917 నుండి 1923 వరకూ అమె రికా మెరైన్లు క్యూబా ద్వీపాన్ని ఆక్రమించి సమ్మెలను అణిచివేస్తూ అమెరికా కార్పొరేట్ ప్రయోజనాల భుజం కాశారు. అమెరికా సైనిక ఆక్రమణ అధికారికంగా ముగిసినప్పటికీ, క్యూబాపై అజమాయిషీ కోసం ‘ప్లాట్’ సవరణను విధించింది. 1917లో పాలస్తీనా ఏర్పాటు చేసి 1948 వరకూ బ్రిటిష్‌వాళ్ళు కంట్రోల్ కోసం తీసుకొన్న మాండేట్ (అజమాయిషీ) లాంటిది ఇది. దీనితో వాషింగ్టన్కు సము చితమని భావించినప్పుడల్లా క్యూబా వ్యవహారాల్లో సైనిక జోక్యం చేసుకునే ‘అనియంత్రిత’ హక్కును పొందింది. కానీ సోషలిస్టు క్యూబా దీన్ని తిరస్కరించింది. ప్రపంచ మద్దతు అవసరం!క్యూబాపై గత 66 ఏళ్లుగా అమెరికా సాగించిన భయోత్పాతం, అలాగే ప్రస్తుతం తీవ్రతరమవుతున్న పాలన మార్పు ప్రయత్నాలన్నీ 1959 విప్లవానికి ముందు ఉన్న ప్లాట్ సవరణకూ, పుల్జెన్సియో బాటిస్టా ప్రభుత్వ నియంతృత్వంలోని సంబంధాలను పునరుద్ధరించటానికి ఉన్న అడ్డంకులను తొలగించటానికీ ఉద్దేశించినవి. సోష లిస్టు ప్రణాళిక ఆర్థిక విధానానికి బదులుగా... స్వేచ్ఛా విపణి పెట్టు బడిదారీ విధానం వైపు, సాంఘిక కోతల వైపు క్యూబా ప్రస్తుతం నడవబోతున్నది. ఫలితంగా క్యూబాలో ప్రభుత్వ ఆధీనంలోని నియంత్రిత ఆర్థిక వ్యవస్థ కూలిపోనుంది. ‘యుద్ధ ఆర్థిక వ్యవస్థ’ పేరిట ప్రవేశపెట్టనున్న ప్రభుత్వ పొదుపు చర్యలు, సాంఘిక కోతల ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పడిపోయే ప్రమాదం ఉంది.సామ్రాజ్యవాద ఆంక్షలను క్యూబా ఎదుర్కోలేకపోయింది. చైనా, రష్యాల సహాయం అంతంతమాత్రంగా ఉంది. ట్రంప్ జన వరి నెలలో క్యూబాకు ఇంధన దిగుమతుల్ని నిషేధించాడు. ముడి చమురు ఎగుమతి దేశాలపై తీవ్ర ఆంక్షలుంటాయని హెచ్చరించారు. వెనెజులా, అమెరికా కబంధహస్తాల్లోకి వెళ్లిపోయింది. మెక్సికో వంటి దేశాలు సహాయాన్ని ఆపాయి. ఇంధన కొరతతో గంటలకొద్దీ క్యూబా అంధకారంలోకి వెళ్లాల్సిన పరిస్థితులేర్పడ్డాయి. క్యూబాలో 1959 విప్లవ సమానత్వ లక్ష్యాలు దూరం కాబోతు న్నాయి. ఒకప్పటి సోవియట్ యూనియన్ 1990వ దశకంలో కుప్ప కూలిన తర్వాత క్యూబాకు సంపూర్ణంగా ఆపన్నహస్తం అందించే వారే లేకపోయారు.క్యూబాకు వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న ఆంక్షల దాడి... ప్రపంచ ఆధిపత్యానికి ఎదురయ్యే ప్రతీ సవాలునూ నాశనం చేయాలనే దాని ప్రయత్నానికి ఒక కేంద్రీకృత రూపం మాత్రమే. ఇటువంటి ప్రయత్నాలు ఇరాక్, అఫ్గా నిస్తాన్, లిబియా, సిరియాల విధ్వంసానికి, గాజాలో మారణ హోమానికి, ఇరాన్ పై యుద్ధానికి, వెనెజులా అధ్యక్షుడు మధురోను అపహరించి, ముడిచమురు స్వాధీనం చేసుకోవటానికి కారణ మయ్యాయి. మే 14న సి.ఐ.ఎ. డైరెక్టరు జాన్ రాట్ క్లిఫ్ హవానాకు వచ్చి పెట్టుబడిదారీ ఆర్థిక విధాన దిశగా సంస్కరించకపోతే క్యూబాను సర్వనాశనం చేస్తామని ఒత్తిడి ప్రకటించాడు. పెట్టుబడీ దారీ ఆర్థిక వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా వచ్చిన సోషలిస్టు విప్లవాలు మనుగడ సాధించాలంటే ప్రపంచ కార్మికుల సంఘీభావం, మద్దతు అవసరం.సోషలిస్టు ప్రణాళిక ఆర్థిక విధానానికి బదులుగా... స్వేచ్ఛా విపణి పెట్టుబడిదారీ విధానం వైపు, సాంఘిక కోతల వైపు క్యూబా ప్రస్తుతం నడవబోతున్నది. - బుడ్డిగ జమిందార్, వ్యాసకర్త, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యవర్గ సభ్యులు -
తిలక్‌నగర్ చేతికి ఇంపీరియల్ బ్లూ
ముంబై: దేశీ లిక్కర్ కంపెనీ తిలక్‌నగర్ ఇండస్ట్రీస్ తాజాగా సుప్రసిద్ధ విస్కీ బ్రాండ్ ఇంపీరియల్ బ్లూను సొంతం చేసుకోనుంది. ఇందుకు ఫ్రెంచ్ లిక్కర్ దిగ్గజం దేశీ యూనిట్ పెర్నాడ్ రికార్డ్ ఇండియాతో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డీల్ ప్రకారం రూ. 4,150 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో కొనుగోలు చేయనుంది. దీనిలో రూ. 282 కోట్లు లావాదేవీ ముగిసిన నాలుగేళ్ల తదుపరి చెల్లించేందుకు వీలుంది. డీల్ వివరాలను రెండు సంస్థలూ వెల్లడించాయి. కాగా.. ఈ డీల్ ద్వారా పాప్యులర్ బ్రాందీ బ్రాండ్ మ్యాన్షన్ హౌస్‌ను ఉత్పత్తి చేసే తిలక్‌నగర్ విస్కీ విభాగంలోనూ సుప్రసిద్ధ బ్రాండ్‌ను సొంతం చేసుకోనుంది. వెరసి దేశీ తయారీ విదేశీ మద్యం(ఐఎంఎఫ్ఎల్) విభాగంలో రెండు భారీ బ్రాండ్లను విక్రయించేందుకు వీలు చిక్కనుంది. అమ్మకాల పరిమాణంరీత్యా ఇంపీరియల్ బ్లూ దేశీయంగా మూడో పెద్ద విస్కీ బ్రాండ్‌గా నిలుస్తోంది. గతేడాది(2024–25) రూ. 3,067 కోట్ల అమ్మకాలు సాధించింది. రెండు సొంత యూనిట్లు, బాట్లింగ్ సహతయారీ సర్వీసులు డీల్‌లో భాగంకానున్నాయి. షేరు పరుగు..కొనుగోలు వార్తల నేపథ్యంలో తిలక్‌నగర్ ఇండస్ట్రీస్ షేరు గత కొద్ది రోజులుగా బలపడుతూ వస్తోంది. తాజాగా బీఎస్ఈలో 0.7 శాతం లాభపడి రూ. 473 వద్ద ముగిసింది. గత నెల రోజుల్లో 30 శాతంపైగా లాభపడటం గమనార్హం! ఈ ఏప్రిల్ 7న రూ. 205 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకిన షేరు మంగళవారానికల్లా(22న) రూ. 488 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది!! -
సీఎం జగన్‌ను కలిసిన జెమ్ గ్రానైట్స్ గ్రూప్ ప్రతినిధులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి సహాయనిధికి చెన్నైకి చెందిన ఇంపీరియల్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (జెమ్ గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ) భారీ విరాళాన్ని అందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం కంపెనీ ప్రతినిధులు కలిసి రూ.కోటి ఐదు లక్షల డీడీని అందించారు. కోవిడ్ సమయంలో సీఎం వైఎస్ జగన్ తీసుకున్న సమర్థవంతమైన చర్యలు తమను ఎంతగానో ప్రభావితం చేశాయని ఈ సందర్భంగా జెమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఛైర్మన్ ఆర్.వీరమణి సీఎంకు వివరించారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో జెమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ ఆర్.గుణశేఖరన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి చెన్నైకి చెందిన ఇంపీరియల్ గ్రానైట్స్ ప్రెవేట్ లిమిటెడ్ (జెమ్ గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ) రూ. 1,05,00,000 విరాళం. కోవిడ్ – 19 నివారణకు తీసుకున్న సమర్ధవంతమైన చర్యలు తమను ఎంతగానో ప్రభావితం చేశాయని సీఎంకి వివరించిన కంపెనీ చైర్మన్ ఆర్. వీరమణి. pic.twitter.com/V5kW0YADcc — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 16, 2022 చదవండి: (3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్న రాష్ట్రం ఏపీ మాత్రమే: సీఎం జగన్) -
గృహ ప్రవేశానికి 1,760 ఫ్లాట్లు రెడీ!
ఈ నెలాఖరులో 400.. సెప్టెంబర్‌లో 450 ఫ్లాట్ల అప్పగింత ♦ ఎంప్రస్, ఇంపీరియల్‌లోని మిగిలిన ఫ్లాట్లు ఈ ఏడాది ముగింపు నాటికి.. ♦ సెప్టెంబర్‌లో వైజాగ్, గుంటూరు, కాకినాడల్లో ప్రాజెక్ట్‌ల ప్రారంభం ♦ ‘సాక్షి రియల్టీ’తో ఆదిత్యా కన్స్ట్రక్షన్స్ ఈడీ సత్యనారాయణ సాక్షి, హైదరాబాద్ : గత పదేళ్లుగా 60.5 లక్షల చ.అ.ల్లో 27 ప్రాజెక్ట్‌లు దిగ్విజయంగా పూర్తి చేసి.. ఆర్థిక మాంద్యం, స్థానిక రాజకీయాంశం వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ అమ్మకాలు జరిపి.. కొనుగోలుదారులకు ఫ్లాట్లను అప్పగించిన ఆదిత్యా కన్స్ట్రక్షన్స్.. ఈ ఏడాది ముగింపులోగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు చోట్లా భారీ ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టనుంది. ఈ నెలాఖరున షేక్‌పేటలోని ఎంప్రస్ టవర్స్‌లో 400 ఫ్లాట్లు, సెప్టెంబర్‌లో హఫీజ్‌పేట్‌లోని ఇంపీరియల్ హైట్స్ లో 450 ఫ్లాట్లు కస్టమర్లకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నామని సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సత్యనారాయణ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే.. ♦ షేక్‌పేట్‌లో ఎంప్రస్ టవర్స్‌లో 5 టవర్‌లో మొత్తం 780 ఫ్లాట్లు. ఇందులో మూడు బ్లాకుల్లోని 400 ఫ్లాట్లు ఈ నెలాఖరున అందించనున్నాం. మిగిలిన రెండు బ్లాకులను అక్టోబర్‌లో అందిస్తాం. అలాగే హఫీజ్‌పేట్‌లో ఇంపీరియల్ హైట్స్‌లో మొత్తం 980 ఫ్లాట్లు. ఇందులో ఆగస్టు 21 నుంచి రిజిస్ట్రేషన్లు, సెప్టెంబర్ 1 నుంచి 4 బ్లాకుల్లో కలిపి మొత్తం 450 ఫ్లాట్లు అందిస్తాం. మిగిలినవి నవంబర్‌లో అందిస్తాం. మొత్తం మీద ఈ ఏడాది ముగింపు నాటికి 40.5 లక్షల చ.అ.ల్లో సుమారు 1,760 ఫ్లాట్లు అందించాలనేది లక్ష్యం. ♦ ఆగస్టు ప్రారంభంలో షేక్పేట్లోనే బ్యూ మౌంట్‌ను ప్రారంభించాం. 25 అంతస్తుల టవర్లోమొత్తం 176 ఫ్లాట్లు. ధర చ.అ.కు రూ.6 వేలు. 1,700 నుంచి 2,100 మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలున్నాయి. ♦ ఇటీవలే హైటెక్‌సిటీలో క్యాపిటల్ హైట్స్నూ ప్రారంభించాం. 19 అంతస్తుల్లో మొత్తం 192 ఫ్లాట్లు. ధర చ.అ.కు రూ.4,500గా నిర్ణయించాం. 1,650-2,100 మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. మూడంతస్తుల్లో క్లబ్‌హౌజ్, స్విమ్మింగ్ పూల్, ఏసీ జిమ్, ప్లే ఏరియా వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. బ్యూమౌంట్, క్యాపిటల్ హైట్స్ రెండింటినీ నాలుగేళ్లలో పూర్తి చేస్తాం. ♦ సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో మూడు లగ్జరీ ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నాం. విశాఖపట్నంలోని మధురవాడలో 8 ఎకరాల్లో ఐకానికా టవర్స్ రానుంది. ఇందులో 10 అంతస్తుల్లో 9 టవర్లుంటాయి. మొత్తం 700 ఫ్లాట్లు. 1,500-2,000 మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ధర చ.అ.కు రూ.3,400. ♦ గుంటూరు కలెక్టర్ ఆఫీసు పక్కనే 7 ఎకరాల్లో క్యాపిటల్ టవర్స్‌ను ప్రారంభించనున్నాం. 16 అంతస్తుల్లో 5 టవర్లుంటాయి. మొత్తం 600 ఫ్లాట్లు.. ప్రీలాంచింగ్ ఆఫర్ ధర చ.అ.కు రూ.4,500. కాకినాడలో 6 ఎకరాల్లో మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాం. ఇందులో 5 అంతస్తుల్లో మొత్తం 261 ఫ్లాట్లు. ధర చ.అ.కు రూ.3,500. ♦ మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో గత ఐదేళ్లుగా కమర్షియల్ ప్రాజెక్ట్‌లను నిలిపివేశాం. ఈ ఏడాది ముగింపు నాటికి గుంటూరు, హైటెక్‌సిటీలో రెండు కమర్షియల్ ప్రాజెక్ట్‌లను చేయాలని నిర్ణయించాం. గుంటూరులోని సంస్థకున్న 10 ఎకరాల స్థలంలో కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాం. ఆ తర్వాత హైటెక్‌సిటీలోనూ నిర్మిస్తాం. ♦ నిర్మాణంలో నాణ్యత, మెరుగైన నిర్వహణకు ఆదిత్యా ప్రాజెక్ట్‌లు పెట్టింది పేరు. అందుకే ప్రతి ఏటా ఎకనామిక్ టైమ్స్ అందించే ‘బెస్ట్ రియాలిటీ బ్రాండ్’ అవార్డు ఈ ఏడాది మాకు దక్కింది. నేటికీ మా ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో రెడ్బ్రిక్స్నే వినియోగిస్తున్నాం. దీంతో నిర్మాణం ఎక్కువ కాలం పటిష్టంగా ఉండటంతో పాటూ ఇంట్లోకి వేడి రాదు. ప్రత్యేకించి ఎలివేషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఎందుకంటే ప్రాజెక్ట్‌ను అందం, ఆకర్షణ తెచ్చేదే ఎలివేషన్. అందుకే ప్రాజెక్ట్ కొంత ఆలస్యమైనా కస్టమర్లకు జీవితకాలం గుర్తుండిపోయే గృహాలను అందిస్తాం. ♦ అందుకే కస్టమర్లు పెట్టిన పెట్టుబడికి వంద శాతం లాభం పొందుతారు. ఎంప్రస్ టవర్స్ ప్రారంభంలో చ.అ.కు రూ.3,600కు విక్రయించాం. ఇప్పుడక్కడ ధర రూ.6,600ల వరకుంది. అలాగే ఇంపీరియల్ హైట్స్‌లో చ.అ.కు రూ.2,600లకు విక్రయిస్తే.. ఇప్పుడక్కడ రూ.4,500లకు పైగానే ఉంది. రుణం మీది.. వడ్డీ మాది! కొత్త నిర్మాణాల్లో ఫ్లాట్ తీసుకుంటే గృహప్రవేశానికి కనీసం నాలుగేళ్లయినా వేచి చూడాలి. మరి అప్పటి వరకు అటు బ్యాంకు వాయిదా.. ఇటు నెలసరి అద్దె రెండూ కట్టాలంటే ఎవరికైనా ఇబ్బందే. ఇలాంటి ఇబ్బందులు ఆదిత్యా కస్టమర్లకు కలిగించొద్దనే ఉద్దేశంతో ప్రీ ఈఎంఐ ఆఫర్‌ను తీసుకొచ్చాం. షేక్‌పేట్‌లోని బ్యూమౌంట్ ప్రాజెక్ట్‌కు ప్రీ ఈఎంఐ ఆఫర్‌ను ప్రకటించాం. ఇదేంటంటే.. 10 శాతం సొమ్ము చాలు.. ఫ్లాట్ బుకింగ్ రోజున మార్జిన్ మనీగా 10 శాతం సొమ్మును, గృహ ప్రవేశం రోజు మరో 10 శాతం సొమ్మును చెల్లిస్తే చాలు. మిగిలిన 80 శాతాన్ని బ్యాంకు రుణం ద్వారా నిర్మాణ దశను బట్టి బ్యాంకు విడుదల చేస్తుంటుంది. ప్రాజెక్ట్ పూర్తయ్యే నాలుగేళ్ల వరకూ ఈ బ్యాంకు వడ్డీ సంస్థే కడుతుంది. ఈ స్కీంతో నిర్మాణం ఆలస్యమయ్యే చాన్సే ఉండదు. ఎందుకంటే ఒకవేళ ఆలస్యమైతే ప్రీ ఈఎంఐ భారం పడేది బిల్డర్ మీదే కదా. నెలసరి వడ్డీ చెల్లించేది అతనే కాబట్టి, ఈ భారాన్ని తట్టుకోవడం కష్టం. కాబట్టి నిర్ణీత గడువులోపే నిర్మాణాలు పూర్తి చేసే అవకాశమూ ఉంటుంది.


