ఆ సమయంలో సీఎం జగన్‌ చర్యలు ఎంతో ప్రభావితం చేశాయి: ఆర్‌.వీరమణి

Imperial Granite Pvt Ltd Donates One Crore Five Lakhs to CM Relief Fund - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి సహాయనిధికి చెన్నైకి చెందిన ఇంపీరియల్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (జెమ్‌ గ్రానైట్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ) భారీ విరాళాన్ని అందించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం కంపెనీ ప్రతినిధులు కలిసి రూ.కోటి ఐదు లక్షల డీడీని అందించారు.

కోవిడ్‌ సమయంలో సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న సమర్థవంతమైన చర్యలు తమను ఎంతగానో ప్రభావితం చేశాయని ఈ సందర్భంగా జెమ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ ఛైర్మన్‌ ఆర్‌.వీరమణి సీఎంకు వివరించారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో జెమ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ డైరెక్టర్‌ ఆర్‌.గుణశేఖరన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

చదవండి: (3 ఇండస్ట్రియల్‌ కారిడార్లు ఉన్న రాష్ట్రం ఏపీ మాత్రమే: సీఎం జగన్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top