breaking news
iconic 3310
-
చర్చి తరలిపోతోందిలా..!
కిరునా: అందమైన ఓ పురాతన చర్చి అలా రోడ్డుపై మెల్లగా ముందుకు వెళ్తుందంటే చూసే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. స్వీడన్ ప్రభుత్వం అటువంటి బృహత్ కార్యక్రమానికి నడుం బిగించింది. కిరునా నగరంలో 113 ఏళ్ల క్రితం కలపతో నిర్మించిన ‘కిరునా కిర్కా’ను ఐదు కిలోమీటర్ల దూరంలో మరో చోట ఏర్పాటు చేయనుంది. నగరంలోని కొన్ని భవనాలతోపాటు ప్రజలకు సైతం పునరావాసం కల్పిస్తోంది. ఇదంతా ఆ నగరం చుట్టుపక్కలున్న ఇనుప ఖనిజం కోసం కావడం గమనార్హం.ఎంతో ఇష్టమైన నిర్మాణంస్వీడన్ ప్రభుత్వ ఎల్‌కేఏబీ కంపెనీ కిరునా చుట్టుపక్కల ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఇనుప ఖనిజం గనిని నిర్వహిస్తోంది. కిరునాలో గని తవ్వకాలు 1910లో మొదలు పెట్టిన ఎల్‌కేఏబీ కంపెనీయే అక్కడి గుట్టపై 1912లో ఈ లూథరన్ చర్చిని పూర్తిగా కలపతో నిర్మించింది. స్వీడన్ వాసులకు ఇది ఎంతో ఇష్టమైంది కిరునా చర్చి. 2001లో ప్రభుత్వం చేపట్టిన ఓ సర్వేలో 1950కి ముందున్న వాటిలో అత్యుత్తమ కలప నిర్మాణంగా స్వీడన్ ప్రజలు కిరునా చర్చికి ఓటేశారు. నగరానికి పునరావాసంలోతులో చేపడుతున్న గని తవ్వకాలతో ఇప్పటికే నగరంలోని కొన్ని ఇళ్లు, నిర్మాణాలు పగుళ్లు వచ్చాయి. ఖనిజం కోసం 1,365 మీటర్ల లోతులో తవ్వకాలు చేపట్టాల్సి ఉన్నందున నివాసాలు, నిర్మాణాలకు ప్రమాదం ఉందని కంపెనీ అంచనా వేసింది. దీంతో, నగరాన్ని తరలించేందుకు 2004 నుంచే 30 ఏళ్ల ప్రణాళికను సిద్ధం చేసింది. నగరంలోని 3వేల ఇళ్లతోపాటు 6 వేల మందికి అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలోని మరో ప్రాంతంలో పునరావాసం కల్పించింది. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ, వాణిజ్య నిర్మాణాలను కూల్చి వేశారు. సుమారు 25 భవనాలను పునాదుల నుంచి పైకి లేపి, ప్రత్యేక వాహనాల్లో కొత్త నగరంలోకి తరలించారు. అందమైన పురాతన కిరునా చర్చి సహా మరో 16 భవనాలను తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.భారీ ట్రాలర్పైన ఎర్రని చర్చిసుమారు 40 మీటర్ల వెడల్పు, 672 మెట్రిక్ టన్నుల బరువైన కిరునా చర్చిని తరలించేందుకు ప్రత్యేకంగా ట్రయిలర్‌ను నిర్మించారు. దీనిపైకి ఎరుపు రంగులో ఉన్న చర్చి నిర్మాణాన్ని తరలించారు. ట్రాలీ ప్రయాణించే మార్గంలోని రోడ్డు వెడల్పును 9 మీటర్ల నుంచి ఏకంగా 24 మీటర్లకు పెంచారు. ఒక వంతెనను సైతం నేలమట్టం చేశారు. 12 గంటలు పట్టే చర్చి ప్రయాణం మంగళవారం మొదలై బుధవారంతో ముగియనుంది. మధ్యలో రెండుసార్లు మాత్రం టీ విరామం కోసం ఆపుతారు. గంటకు అర కిలోమీటర్ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల వేగం వరకు ట్రాలీ ప్రయాణించనుంది. చర్చి తరలింపు సందర్భంగా కిరునాలో భారీ సంగీత కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. స్వీడన్ రాజు కార్ల్ గుస్తావ్ సైతం హాజరుకానున్నారు. కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. కొత్త నగరంలో 2026 చివరి కల్లా ఈ చర్చిని తిరిగి తెరవనున్నారు. చర్చి తరలింపునకు అయ్యే ఖర్చు వివరాలను మాత్రం మైనింగ్ కంపెనీ వెల్లడించలేదు. యూరప్‌లో ఉత్పత్తయ్యే ఇనుప ఖనిజంలో 80 శాతం వరకు కిరునాలోనే ఎల్‌కేఏబీ తవ్వి తీస్తోంది. భవిష్యత్తులో దీనిని మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తోంది. -
కౌంట్ డౌన్: ఐకానిక్ మహిళల అంతరిక్ష యాత్ర
ఆరుగురు ఐకానిక్ మహిళలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్ పైలట్ లేకుండానే పనిచేస్తుంది. సబ్ ఆర్బిటల్ ప్రయాణానికి ఆరుగురు ప్రయాణికులను తీసుకెళ్లగలదు. సుమారు 11 నిమిషాల పాటు పయనించి భూమికి 62 మైళ్ల ఎత్తులో ఉన్న కార్మాన్ రేఖను దాటుతుంది. దీన్ని అంతరిక్షానికి ప్రవేశ ద్వారంగా భావిస్తారు.ఈ ప్రయాణంలో ప్రయాణికులు గాలిలో తేలిపోతున్నట్టుగా అనుభూతిని పొందుతారు. క్యాప్సూల్‌కు సంబంధించిన పెద్ద కిటికీల ద్వారా భూమి విహంగ వీక్షణను ఆస్వాదిస్తారు. ‘న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్’ను చిన్న చిన్న గగన యాత్రల కోసం రూపొందించారు. ఇది బిఇ–3 పిఎమ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఎన్.ఎస్.–31 మిషన్ టెక్నాలజీ ఫీట్ మాత్రమే కాదు ఒక చారిత్రాత్మక ఘట్టం కూడా.‘నా భయాన్ని పోగొట్టుకోవడానికి ధ్యానం చేస్తున్నాను’ అంటోంది గేల్ కింగ్.‘కాస్త భయంగా ఉంది. అయినా చాలా ఉత్సాహంగా ఉంది’ అంటోంది లారెన్ సాంచెజ్.ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా ఆరుగురు ఐకానిక్ మహిళల అంతరిక్షయాత్ర హాట్ టాపిక్‌గా మారింది.అయేషా బోవ్నాసా మాజీ రాకెట్ శాస్త్రవేత్త అయిన అయేషా బోవ్ మిచిగన్ యూనివర్శిటీ నుండి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, స్పేస్ సిస్టమ్స్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేసే ‘స్టెమ్ బోర్డ్’ అనే ఇంజినీరింగ్ కంపెనీకి అయేషా బోవ్ సీఈవో.అమంద గుయెన్హార్వర్డ్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్, ఎంఐటీ, నాసా, ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోనాటికల్ సైన్సెస్‌లో పనిచేసింది అమంద గుయెన్. లైంగిక బాధితులకు అండగా నిలబడి పోరాడిన గుయెన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయింది. టైమ్ మ్యాగజైన్ ‘ఉమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్‌కు ఎంపికైంది. తొలి వియత్నామీస్, ఆగ్నేయాసియా మహిళా వ్యోమగామిగా ఈ అంతరిక్ష యాత్రతో గుయెన్ చరిత్ర సృష్టించనుంది. ‘సేవింగ్ ఫైవ్: ఎ మెమోరియల్ ఆఫ్ హోప్’ అనే పుస్తకాన్ని గత నెలలో విడుదల చేసింది.లారెన్ సాంచెజ్ లారెన్ సాంచెజ్ రచయిత్రి, పాత్రికేయురాలు. ఎన్నో వార్తా సంస్థలలో యాంకర్‌గా పనిచేసింది. లారెన్ హెలికాప్టర్ పైలట్ కూడా. ‘బ్లాక్ ఆప్స్ ఏవియేషన్’ సంస్థను స్థాపించింది. ఇది మహిళా యాజమాన్యంలో నిర్వహితమవుతున్న తొలి ఏరియల్ ఫిల్మ్ అండ్ ప్రొడక్షన్ కంపెనీ. ‘ది ఫ్లై హూ ఫ్లై టు స్పేస్’లాంటి ఎన్నో పిల్లల పుస్తకాలు రాసింది.గేల్ కింగ్మేరీల్యాండ్ యూనివర్శిటీ నుండి సైకాలజీలో పట్టా పొందిన గేల్ కింగ్‌కు రేడియో, టెలివిజన్, ప్రింట్ మీడియాలలో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. ‘గేల్ కింగ్ ఇన్ ది హౌజ్’ అనే రేడియో షోని హోస్ట్ చేసింది. ఉత్తమ రేడియో టాక్ షో కోసం ఇచ్చే ‘అమెరికన్ ఉమెన్ ఇన్ రేడియో అండ్ టెలివిజన్ గ్రేసి అవార్డ్’ను సొంతం చేసుకుంది. టైమ్ మ్యాగజైన్ ‘అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా–2019’లో చోటు సాధించింది.కేటీ పెర్రీఆల్ టైమ్ బెస్ట్ సెల్లింగ్ మ్యూజిక్ ఆర్టిస్ట్‌లలో పాప్ స్టార్ కేటీ పెర్రీ ఒకరు. 2010లో విడుదలైన ఆమె మొదటి ఆల్బమ్ రికార్డ్‌లు బ్రేక్ చేసింది. 13 గ్రామీ అవార్డ్లకు కేటీ నామినేట్ అయింది. బిల్బోర్డ్ ‘విమెన్ ఆఫ్ ది ఇయర్–2012’ అవార్డ్ అందుకుంది. ‘ఫైర్ వర్క్ ఫౌండేషన్’ మొదలుపెట్టి యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా సేవలు అందిస్తోంది.కెరియానే ప్లిన్కెరియానే ప్లిన్ నిర్మాత. డాక్యుమెంటరీలు, చిత్రాలు తీసింది. హాలీవుడ్లో ఆమె తీసిన దిస్ చేంజెస్ ఎవ్రీ థింగ్ (2018), లిల్లీ (2024) చిత్రాలకు మంచి గుర్తింపు వచ్చింది. ఎన్నో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ప్లిన్‌కు అంతరిక్ష ప్రయాణాలపై ఆసక్తి. ‘నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను’ అంటోంది తన అంతరిక్ష ప్రయాణం గురించి. -
నోకియా 3310, మూడు స్మార్ట్ఫోన్లు లాంచ్..ధరలు?
న్యూఢిల్లీ: నోకియా సంస్థ తన ఐకానిక్ 'నోకియా 3310' ఫీచర్ ఫోన్ ను మార్కెట్లో తిరిగి ప్రారంభించింది. ఇతర మూడు స్మార్ట్ ఫోన్లతోపాటు రూ. 4 వేల లోపు ధరలో క్లాసిక్ నోకియా 3310 ఫీచర్ ఫోన్ ను మొబైల్ వర్డ్ కాంగ్రెస్ లో ఆదివారం మార్కెట్లో లాంచ్ చేసింది. హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ సీఈవో ఆర్టో నుమ్మెల దీన్ని లాంచ్ చేశారు. రూపం పాతదే అయినా కొత్త విజువల్ అప్‌గ్రెడేషన్, స్వల్ప మార్పులతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా 22 గంటల టాక్ టైమ్ తోపాటు, నెలరోజుల బ్యాటరీ సామర్థ్యం దీని ప్రత్యేకతలుగా కంపెనీ పేర్కొంది. ప్రీమియం వెర్షన్ తో పోలిస్తే స్లిమ్‌గా అందుబాటులోకి తీసుకొచ్చిన దీని ధర 49 యూరోలని (సుమారు రూ. 3,400) నోకియా తెలిపింది. స్నేక్ గేమ్ తో ఈఫోన్ను అప్ గ్రేడ్ చేసినట్టు తెలిపింది. ఎల్లో, గ్రే, బ్లూ మరియు ఎరుపు రంగుల్లో ఈ హ్యాండ్ సెట్ అందుబాటులోకి రానుంది. పూర్తిగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా, గూగుల్ అసిస్ట్‌తో పనిచేసే నోకియా స్మార్ట్ ఫోన్లను కూడా లాంచ్ చేసింది. నోకియా 3310ను దూసుకుపోనుందని హెచ్ ఎండీ గ్లోబల్ ప్రధాన ఉత్పత్తి అధికారి జుహు సర్వికాష్ తెలిపారు. గత నెలలో చైనాలోలాంచ్ చేసిన నోకియా 6 సహా మరో మూడు స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్ 7.1 నోగట్ ఆధారంగా పనిచేసే నోకియా 5, 6, 3 స్మార్ట్ ఫోన్లను కూడా పరిచయం చేసింది. నోకియా 6 ధర సుమారు రూ.16,100గాను, దీనిలోని స్పెషల్ ఎడిషన్ ధరను సుమారుగా రూ. 21వేలుగాను, నోకియా 5 ధరను సుమారు 13,300గాను, నోకియా 3 ధర సుమారు 9,700 ఉండనున్నట్టు కంపెనీ వెల్లడించింది. నోకియాఫోన్లను సృష్టించడానికి ప్రత్యేక హక్కులు పొందిన హెచ్ఎండీ గ్లోబల్ నోకియా 3310 తో సహా, ఇవి ఈ ఏడాది క్వార్టర్ 2లో( మార్చి) అందుబాటులోకి రానున్నట్టు కంపెనీ తెలిపింది. నోకియా 3310 ప్రధాన ఫీచర్లు 2.4 అంగుళాల క్యూవీజీఏ స్క్రీన్ 2జీ కనెక్టివిటీ, 16 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ డ్యూయల్ సిమ్ 2 ఎంపీ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 1200 ఎంఏహెచ్ బ్యాటరీ