breaking news
iam
-
మంచి మాట.. నేను ఎవరు?
ప్రతి ఒక్కరూ నేను నేను అంటుంటారు. అసలు ఈ నేను ఎవరు? నేనులు ఎన్ని ఉన్నాయి. ఈ నేను లు అన్నీ ఒకటేనా? ఇల్లు నాది అన్నాం.. నేను ఇల్లా..? కాదు గదా..! నా వాహనం, నా భూమి, నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య అన్నాం.. మరి ఇవన్నీ నేను కాదు గదా..! అలాగే నా శరీరం అన్నప్పుడు శరీరం నేనెలా అవుతాను..? నా మనస్సు అన్నప్పుడు నేను మనస్సునెలా అవుతాను.. శరీరం కన్నా, మనస్సు కన్నా నేను వేరుగా ఉండి ఉండాలి గదా..! ఎవరా నేను..? నిజానికి అన్ని నేనులు కలిసి నేనైన నేనే నేను. అదే ఆత్మ... అంటే నేను ఆత్మను అని తెలుసుకోవాలి. ఈ హోదాలు వారి వత్తిని చూపిస్తాయి. అది అంతవరకే ఉండాలి. ‘అహంభావము’ ‘అహంకారం’ అని రెండు రకాల పదాలు సాధారణంగా వాడుతూ వుంటాము. ఈ రెండూ ఒకే అర్థం కలిగినవి కావు. నేను కాని దాన్ని నేననుకోవడం అహంకారం.. ఇది నాది అనుకుంటే హక్కు ఉనట్టు, నాకు మటుకే సొంతం అనుకుంటే స్వార్ధం ఉన్నట్టు, నేను చేయగలను అనుకుంటే ఆత్మ విశ్వాసం, నేనే చేస్తున్నాను నేను మటుకే చేయగలను అనుకుంటే అహంకారం, ఈ నేను అనేది దైవం చేతనే నడిచేది నడిపించేది కూడా ఆ శక్తే, అయితే ఆలోచనాశక్తి ని బుద్దిని మానవునికే అప్పగించింది దైవం. ఎందుకంటే ఆ ఆలోచన విధానమే నీ స్థాయిని ఇహపర లోకాలలో నిర్ణయిస్తుంది.. నీ ఆలోచనా విధానంలో సత్యం న్యాయం ధర్మం ఉంటే నీ బుద్ధికి తగట్టు ఆ దైవం నీకు తోడు గా నడుస్తుంది, అదే బుద్ధి అహంకారంతో నిండిపోయి నేను రాక్షసుడిగా జీవిస్తానా, లేక మానవుని గానా లేక దేవుని గా జీవిస్తానా అనేది ఈ నేను అనే నేను నిర్ణయించుకోవాలి. రాక్షసుడు, దేవుడు అనే వారు ఎక్కడో లేరు మన జీవన విధానం లోనే ఉన్నారు. మానవుడు తన స్థాయి తగ్గించుకుని జీవిస్తే అదే రాక్షసుడు. మానవుడు తన కంటే ఉన్నతమైన లక్ష్యాలతో జీవిస్తే అతనే భగవంతుడు. చివరికి మానవుడు మన జీవన విధానంలోనే ఉన్న దేవుని వదిలి ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు ఈ జీవితం ఎన్నో జన్మల పుణ్యం జీవితం అంటే జీవించడానికే. జీవించడమే గొప్ప సాధన. సరిగ్గా జీవిస్తే మానవత్వం వెల్లివిరుస్తుంది. గొప్పగా జీవిస్తే దివ్యత్వం కనిపిస్తుంది. జీవించడంలో ఉండే మాధుర్యాన్ని ముందుగా తెలుసుకోవాలి. జీవన సౌందర్యంలో ఉండే తాత్వికతను గుర్తించాలి. ఆటుపోట్లతో, హెచ్చు తగ్గులతో, సుఖ దుఃఖాలతో ఎలాంటి జీవితం వచ్చినా తలవంచుకుని అనుభవించాలి. నేల విడిచి సాము చేసినట్లు జీవితాన్ని గాలికి వదిలెయ్యకూడదు. జీవితంతో చక్కటి ప్రయాణం చేస్తే సాధన శిఖరాలకు చేరినట్లే. ‘ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్లు పదిమంది జీవితాల్లో కాంతిని నింపాలి. అంతకంటే మనిషికి సార్థకత లేదు’ ఈ సత్యం తెలుసుకున్న మానవుడు చివరికి ఇలాంటి పనులకే పూనుకొంటాడు.. పూనుకోవాలి. ఆధ్యాత్మిక జీవితం అనేటప్పటికి సాధనలమయం అనే భావన ఉంది. పుట్టుక నుంచి మరణం వరకు మంచి పనులే సాధన. ఏం చేస్తున్నామో ఎరుకతో చేస్తే అంతా అద్భుతమైన సాధన. లేకపోతే బతుకే అయోమయం. జంతువు, పురుగు, పక్షి, పాము, చెట్టు... అన్నీ స్వార్థం లేక జీవిస్తున్నాయి. మరి మనమెందుకిలా? నేను అనేది లేకుండా హాయిగా జీవించలేకపోతున్నాం..? బుద్ధి కలిగి ఉండటం మనిషికి వరం, శాపం కూడా. చిన్న ‘నేను’ నుంచి పెద్ద ‘నేను’ వరకు సాగే అతిపెద్ద జీవనమే అత్యంత అద్భుతమైన సాధన. చిన్న నేను అర్జునుడు. పెద్ద నేను శ్రీ కష్ణుడు. అతి పెద్ద జీవనం కురుక్షేత్ర యుద్ధం. ఇది అర్థమైతే అదే అత్యంత అద్భుతమైన సాధన. శ్రీరాముడు మనిషిగా జీవించి తన కర్తవ్యం నిర్వహించి, దేవుడిగా పేరు తెచ్చుకున్నాడు. జీవితం అవకాశం ఇస్తుంది. దాన్ని సద్వినియోగ పరుచుకోవాలి. కారణజన్ముడికైనా, సాదారణ జన్ముడికైనా బాధలు, కష్టాలు ఒకటే. విధిరాత మారదు. జీవితాన్ని భయపెట్టేవాడికి జీవితమే భయపడుతుంది. మనలో ఉండే అద్భుతమైన, అసాధారణమైన, అసామాన్యమైన గుణగణాలు చూసి లోకం మోకరిల్లుతుంది. అసలు ఈ శరీరం నాదని, మనస్సు నాదని, బుద్ధి నాదని, ఎలా తెలుసుకుంటున్నాం? ఆత్మవల్లనే తెలుసుకుంటున్నాం. నాది అనే వస్తువుకు, నాకు మధ్య సంబంధం ఏమిటి? హక్కుదారుకు, వస్తువుకు మధ్య ఉండే సంబంధం. ఇది నా ఇల్లు అంటే నేను ఇల్లు కాదు. ఇంటి హక్కుదారును. నావి అంటే అవన్నీ నేను కాదు. వాటి హక్కుదారును మాత్రమే. మరి హక్కుదారైన నేనెవరిని..? ఈ నేను కాస్త నాది, నాకు అనే స్వార్థంతో ఉంది. హోదాలతో కూడిన పేర్లన్నీ అహంకారంతో కూడుకున్నవే. – భువనగిరి కిషన్ యోగి -
‘నేను పక్కా లోకల్’..
-
‘నేనెవ్వరికీ భయపడను.. ప్రజలకు తప్ప’
రాష్ట్ర ప్రజలే నా హైకమాండ్ తెల్సుకోకుండా మాట్లాడితే ఎలా? 2018లోగా పూర్తి చేస్తామంటే పోలవరాన్ని కేంద్రానికి ఇస్తాం అనంత, చిత్తూరు జిల్లాల్లో 24 గంటలూ వ్యవసాయానికి విద్యుత్తు ఒక్క ఎకరం ఎండనివ్వం.. నియోజకవర్గానికో ఐఏఎస్ అధికారి వీ. కోట బహిరంగ సభలో సీఎం చంద్రబాబు సాక్షి ప్రతినిధి, తిరుపతి/ వీ. కోట : ‘నేనెవ్వరికీ భయపడను.. ప్రజలకు తప్ప. రాష్ట్ర ప్రజలే నా హైకమాండ్. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానికి భయపడే ప్రసక్తే లేదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. ఆదివారం సాయంత్రం చిత్తూరు జిల్లా వీ.కోట మండలంలో పర్యటించిన ఆయన రెయిన్ గన్స్‌తో సాగులో ఉన్న వివిధ రకాల పంటలను పరిశీలించారు. అనంతరం వీ.కోట బస్టాండ్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. తాను ఇప్పటికి 23సార్లు ఢిల్లీ వెళ్లి హోదా గురించి అడిగానన్నారు. తాను ప్రయత్నం చేయడం లేదనీ, భయంతో వెనుకంజ వేస్తున్నాననడం తప్పన్నారు. నా గురించి సరిగ్గా తెల్సుకోవాలని పరోక్షంగా పవన్ కల్యాణ్‌కు సూచించారు. తనకు వీపీ సింగ్ హయాంలో కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేపథ్యం ఉందన్నారు. 2018లోగా పూర్తి చేస్తామంటే పోలవరాన్ని కేంద్రానికి ఇస్తామన్నారు. వచ్చే డిసెంబరులోగా హంద్రీ–నీవా పనులుపూర్తి చేసి కుప్పం, పలమనేరు ప్రాంతాలకు నీరందిస్తామన్నారు. అనంతపురం జిల్లాలో 6 లక్షలు, చిత్తూరు జిల్లాలో 1.30 లక్షల ఎకరాల వేరు శెనగ ఎండుముఖం పట్టిందనీ, దీన్ని నివారించేందుకు రెయిన్ గన్ల వాడకాన్ని పోత్సహిస్తున్నామన్నారు. రాయలసీమను రతనాల సీమగా చేస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఒక్క ఎకరం పంట కూడా ఎండనీయమన్నారు. అవసరమైతే కరువు తాండవిస్తోన్న నియోజకవర్గాలకు ఒక్కో ఐఏఎస్, రెండేసి మండలాలకు ఒక్కో గ్రూప్–1 అధికారులను ఇన్చార్జులుగా నియమించి పంటలను పర్యవేక్షిస్తామన్నారు. ఈ రెండు జిల్లాల్లోనూ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. చిత్తూరు ప్రాంతంలో పండించే కూరగాయలు, పండ్లను నేరుగా విదేశాలకు ఎగుమతి చేసేలా ఫార్మర్స్ ప్రొడక్షన్ సంస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో వినియోగించే ఎల్ఈడీ సిస్టమ్ పర్యవేక్షణ కోసం విజయవాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రి నారాయణ, ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. -
దేవున్ని చేయకండి: ఎన్టీఆర్
హైదరాబాద్: జనతా గారేజ్ ఆడియో రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఉద్వేగంగా ప్రసంగించారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగిన ఆడియో రిలీజ్ కార్యక్రమంలో జూనియర్ మాట్లాడుతూ.. అభిమానులు చూపిస్తున్న ప్రేమకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. తాను ఒక సాధారణ మనిషిని మాత్రమేనని తనను దేవున్ని చేయొద్దని అభిమానులకు సూచించారు. నాన్నకు ప్రేమతో సినిమా విడుదల సందర్భంగా కొంత మంది తన చిత్ర పటాలకు పాలాభిషేకం చేయడం బాధ కలిగించిందన్నారు. అభిమానుల ప్రేమకు జీవితాంతం రుణపడి ఉంటానని చెబుతూ.. అభిషేకాలు, పూజలు దేవునికి మాత్రమే చేయాలని తాను దేవున్ని కాదని, నేను మీకు తమ్మున్ని, అన్నను అని అన్నారు. పాలను వృధా చేయడం కంటే అనాథ ఆశ్రమంలోని పిల్లలకు, నిరుపేదలకు పంపిణీ చేయాలని చెప్పారు. అలాగే సినిమా విడుదల సందర్భంగా థియేటర్లలో జంతువులను బలివ్వడం కంటే అన్నదానం చేస్తే తాను ఎక్కువగా సంతోషిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా జనతా గ్యారేజ్ సినిమాలోని డైలాగులను చెప్పి అలరించారు.