దేవున్ని చేయకండి: ఎన్టీఆర్ | iam not a god: ntr | Sakshi
Sakshi News home page

దేవున్ని చేయకండి: ఎన్టీఆర్

Aug 12 2016 11:06 PM | Updated on Sep 4 2017 9:00 AM

దేవున్ని చేయకండి:  ఎన్టీఆర్

దేవున్ని చేయకండి: ఎన్టీఆర్

జనతా గారేజ్ ఆడియో రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఉద్వేగంగా ప్రసంగించారు. హైదరాబాద్ లో జరిగిన ఆడియో రిలీజ్ కార్యక్రమంలో జూనియర్ మాట్లాడుతూ..

హైదరాబాద్:   జనతా గారేజ్ ఆడియో రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఉద్వేగంగా ప్రసంగించారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగిన ఆడియో రిలీజ్ కార్యక్రమంలో జూనియర్ మాట్లాడుతూ.. అభిమానులు  చూపిస్తున్న ప్రేమకు    జీవితాంతం రుణపడి ఉంటానని  చెప్పారు. తాను ఒక సాధారణ మనిషిని మాత్రమేనని తనను దేవున్ని చేయొద్దని అభిమానులకు సూచించారు. నాన్నకు ప్రేమతో సినిమా విడుదల సందర్భంగా కొంత మంది తన చిత్ర పటాలకు పాలాభిషేకం చేయడం బాధ కలిగించిందన్నారు.

అభిమానుల ప్రేమకు జీవితాంతం రుణపడి ఉంటానని చెబుతూ..   అభిషేకాలు, పూజలు దేవునికి మాత్రమే చేయాలని  తాను దేవున్ని కాదని, నేను మీకు తమ్మున్ని, అన్నను అని అన్నారు.  పాలను  వృధా చేయడం కంటే అనాథ ఆశ్రమంలోని పిల్లలకు, నిరుపేదలకు పంపిణీ చేయాలని  చెప్పారు.  అలాగే సినిమా విడుదల సందర్భంగా థియేటర్లలో జంతువులను బలివ్వడం కంటే అన్నదానం చేస్తే తాను ఎక్కువగా సంతోషిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా జనతా గ్యారేజ్ సినిమాలోని డైలాగులను చెప్పి అలరించారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement