breaking news
Huge Traffic Jam
-
కుంగిన నేషనల్ హైవే.. నిజామాబాద్-హైదరాబాద్ రూట్ బంద్
హైదరాబాద్, సాక్షి: రెండు రోజులపాటు వరుణుడు సృష్టించిన బీభత్సానికి ఉమ్మడి నిజామాబాద్ ఆగమైంది. అడుగుల లోతుల్లో వరద నీరు రావడంతో రహదారులు దెబ్బతిన్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి వద్ద నేషనల్ హైవే 44 కుంగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డు శుక్రవారం ఉదయం బ్లాక్ అయ్యింది. సదాశివనగర్ నుంచి పొందుర్తి వరకు.. 20 కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నేషనల్ హైవే 44 (NH 44) భారతదేశంలోనే అత్యంత పొడవైన జాతీయ రహదారి. శ్రీనగర్ (జమ్మూ & కాశ్మీర్) నుంచి కన్యాకుమారి (తమిళనాడు) వరకు దాదాపు 4,113 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. ఉత్తర-దక్షిణ భారత దేశాన్ని కలిపే ప్రధానమైన మార్గం.. అందునా వాణిజ్య రవాణాకు కీలక మార్గం కావడం గమనార్హం. Many sections of National Highway 44 in Telangana washed away in rain. Just imagine the quality of construction 🤡 pic.twitter.com/8bO4BlSfYo— 🚨Indian Gems (@IndianGems_) August 28, 2025అయితే అధికారులు ఇప్పటికే తాత్కాలిక మరమ్మత్తులను ప్రారంభించినా.. చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. భారీ సంఖ్యలో అది భారీ వాహనాలు ఈ రహదారిలో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఈ రూట్లో ప్రయాణాలు పెట్టుకున్న వాళ్లు.. ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని సూచన చేస్తున్నారు. NH-44 రోడ్ అప్డేట్స్:✅ జిల్లాలో భారీ వర్షాల కారణంగా రోడ్డు డ్యామేజ్✅ నిన్న మరమ్మత్తు చేసిన రోడ్డు కూడా కృంగిపోయింది✅ ఒక్క లైన్ మాత్రమే అత్యవసర వాహనాలకే✅ మేడ్చల్, ఆర్మూర్, నిర్మల్ వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్✅ ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోండి– జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, IPS pic.twitter.com/OXWvgWkl7u— SP Kamareddy (@sp_kamareddy) August 29, 2025రాష్ట్రంలో భారీ వర్షాలకు పలుచోట్ల రహదారులు అతలాకుతులమయ్యాయి. ముఖ్యంగా కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో భారీగా రోడ్లు, వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం, యాదాద్రి భువనగిరి, సిరిసిల్ల, ఖమ్మం జిల్లాల్లోనూ రహదారులు పాడయ్యాయి.కామారెడ్డి జిల్లాలో 20, మెదక్ జిల్లాలో 18 ప్రాంతాల్లో భారీగా రోడ్లు, కల్వర్టులు, వంతెనలు దెబ్బతిన్నాయి. కామారెడ్డి డివిజన్లో 53 ప్రాంతాల్లో 65 కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నాయి. 27 వంతెనలు, కల్వర్టులు పాడయ్యాయి. మెదక్‌లో 33 ప్రాంతాల్లో 53 కిలో మీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. మరో 12 చోట్ల వంతెనలు, కల్వర్టులు పాడయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి డివిజన్లో 45 ప్రాంతాల్లో 85 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ డివిజన్లో 63 ప్రాంతాల్లో, ఆదిలాబాద్‌లో 46 ప్రాంతాల్లో రోడ్లు పాడయ్యాయి.తెలంగాణలో రోడ్లు, భవనాల శాఖకు సంబంధించి 794 ప్రాంతాల్లో మొత్తం 1,039 కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. 305 ప్రాంతాల్లో రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. 206 కల్వర్టులు, కాజ్‌వేలు దెబ్బతిన్నాయి. 31 ప్రాంతాల్లో రోడ్లకు గండ్లు పడ్డాయి. ఈ రహదారి పనులు పూర్తి చేయడం కోసం రూ.1,157.46 కోట్లు అవసరమని ఆర్ అండ్ బీ వర్గాలు తెలిపాయి. తాత్కాలిక మరమ్మతులకు రూ.53.76 కోట్లు అవసరమని పేర్కొన్నాయి. -
Hyderabad Rains: నగరం.. నిలిచిపోయింది!
సాక్షి, హైదరాబాద్: హఠాత్తుగా కురిసిన భారీ వర్షానికి సోమవారం నగరం నిలిచిపోయింది. రోడ్లన్నీ జలమయం కావడంతో పాటు అనేక ప్రాంతాల్లో చెట్లు కూలడంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటరు దూరం దాటడానికి కనీసం అరగంటకు పైగా పట్టింది. ఇంకొన్ని చోట్ల గంటల తరబడి వాహనాలు ముందుకు కదలనే లేదు. వర్షం నేపథ్యంలో ద్విచక్ర వాహనచోదకులు మెట్రోరైల్ స్టేషన్ల కింద ఆగిపోవడంతో ఆ ప్రాంతాలు బాటిల్ నెక్స్‌గా మారి మరిన్ని ఇబ్బందులు తెచ్చాయి.సాధారణంగా మిగిలిన రోజుల కంటే మొదటి పని దినమైన సోమవారం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో పరిస్థితి చేతులు దాటింది. ట్రాఫిక్ పోలీసులతో పాటు హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది శ్రమించినా వాహనచోదకుడిని నరకం తప్పలేదు. నగర వ్యాప్తంగా దాదాపు 140 ప్రాంతాల్లో ఉన్న వాటర్ లాగింగ్ ఏరియాల కారణంగా రోడ్లన్నీ చెరువులుగా మారాయి. వర్షానికి రోడ్లన్నీ నీళ్లు నిండటంతో ఏది గొయ్యే, ఏది రోడ్డో అర్థంకాక వాహనచోదకులు తమంతట తామే వాహన వేగాలను తగ్గించుకున్నారు. దీంతో ఎక్కడికక్కడ రహదారులపై వాహన శ్రేణులు నిలిచిపోయాయి.కీలక మార్గాల్లోనూ అత్యంత నెమ్మదిగా ముందుకు సాగాయి. నాగోల్–మెట్టుగూడ, సికింద్రాబాద్–బేగంపేట్, ఎల్బీనగర్–చాదర్‌ఘాట్, ఎంజే మార్కెట్–నాంపల్లి, పంజగుట్ట–కూకట్పల్లి, పంజగుట్ట–మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్–మెహదీపట్నం ప్రాంతాల్లో వాహనాలు భారీగా ఆగిపోయాయి. రోడ్లన్నీ జామ్ కావడంతో గంటల తరబడి వాహనాలు రోడ్ల పైనే ఉండిపోయాయి. కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వెళ్లే దారిలోనూ ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. స్వయంగా రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్... సోమవారం నాటి పరిస్థితుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగారు. కేవలం గంట వ్యవధిలో ఏకంటా ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం పడే అవకాశం ఉందని రెండు గంటల ముందుగానే సమాచారం అందుకున్న హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో ఉండే అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆయన కూడా స్వయంగా ముంపు ప్రాంతాలకు వెళ్లారు. లక్డీకాపూల్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఎక్కడైనా వరద ముప్పు ఉంటే హైడ్రా కంట్రోల్ రూమ్‌కు (9000113667) ఫిర్యాదు చేయాలని సూచించారు. -
హైవేలకు సంక్రాంతి కళ
చౌటుప్పల్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారితో పాటు హైదరాబాద్–వరంగల్ 163 జాతీయ రహదారిపై శనివారం కూడా వాహనాల రద్దీ కొనసాగింది. తెల్లవారుజామునుంచి అర్ధరాత్రి వరకు వాహనాలు బారులుతీరుతూ వెళ్లాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా 12 టోల్‌బూత్‌లను తెరిచారు. శనివారం 80వేల పైచిలుకు వాహనాలు రాకపోకలు సాగించినట్లు టోల్‌ప్లాజా అధికారులు తెలిపారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద ఉన్న 12 టోల్ కౌంటర్లకు 8 కౌంటర్లను విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు కేటాయించారు. ఈ మార్గంలో శనివారం ఒక్కరోజే దాదాపు 40 వేల వాహనాలు వెళ్లినట్లు జీఎమ్మార్ అధికారులు వెల్లడించారు. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు బారులుతీరాయి. సుమారు 30వేలకు పైగా వాహనాలు ఈ టోల్ గుండా ప్రయాణించాయి. -
ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. మాసబ్ ట్యాంక్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: మాసబ్ ట్యాంక్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మాసబ్‌ట్యాంక్ ఎన్ఎండీసీ వద్ద ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడింది. ట్యాంకర్ రోడ్డు అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇరువైపుల ట్రాఫిక్ స్తంభించడంతో వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్‌లో నిలిచిపోయాయి. మాసబ్ ట్యాంక్, మోహిదీపట్నం, పీవీ ఎక్స్‌ప్రెస్, బంజారాహిల్స్ రోడ్ నెం1, లక్డీకాపూల్, ఖైరతాబాద్‌లో ట్రాఫిక్ నిలిచిపోయింది.ఈ మార్గానికి అనుసంధానమైన దారుల్లోనూ వాహనాలు భారీగా నిలిచిపోయాయి . విషయం తెలుసుకున్న ట్రాఫఙక్ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సాయంతో ట్యాంకర్‌ను పక్కకు తోశారు. ట్రాఫిక్ క్లియన్ చేసేందుకు పోలీసులు కష్టపడుతున్నారు. రోడ్డుపై ఆయిల్ ఉండటంతో వాహనదారులు జారిపడుతున్నారు. మాసబ్ ట్యాంక్ ఫైఓవర్ నుంచి ఆయిల్ కిందకి పడిపోతుంది. మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ కిందా పైన ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. -
టోల్గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
-
నగరంలో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కూరుస్తోంది. పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు వర్షంలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. బంజారాహిల్స్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరింది. -
పల్లెకు పోదాం చలో..చలో..
-
పల్లెకు పోదాం చలో..చలో..
► సొంతూళ్లకు పయనమైన నగరవాసులు ► రైళ్లు, బస్సులు, ప్రైవేట్, సొంత వాహనాల్లో తరలిన జనం ► సంక్రాంతి రద్దీతో కిక్కిరిసిన రైళ్లు, బస్సులు ► తీవ్ర ఇబ్బందుల మధ్యే ప్రయాణం ► 15 లక్షల మందికి పైగా పల్లె బాట ► టోల్‌ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జాం సాక్షి, హైదరాబాద్: మహానగరం పల్లె వైపు పరుగులు తీసింది. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని సంబురాల మధ్య జరుపుకునేందుకు లక్షలాది మంది నగర వాసులు పల్లె తోవ పట్టారు. దీంతో నగరానికి నలువైపులా ఉన్న రహదారులన్నీ పల్లె దారి పట్టాయి. గురువారం స్కూళ్లు, కళాశాలలకు సెలవులు ప్రకటించడం, ప్రభుత్వ కార్యాలయాలకు సైతం వరుసగా సెలవులు రావడంతో నగర ప్రజలు భారీ సంఖ్యలో బయలుదేరారు. గురువారం మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. చాలామంది బస్సులు, కార్లు, సొంత వాహనాల్లో సొంతూళ్లకు బయలుదేరడంతో ఉప్పల్, ఎల్బీనగర్, మెహిదీపట్నం తదితర ప్రధాన కూడళ్లు స్తంభించాయి. ప్రయాణం.. పెనుభారం.. నాలుగైదు రోజులుగా వివిధ మార్గాల్లో సుమారు 15 లక్షల మంది వ్యయప్రయాసల కోర్చి సొంత ఊళ్లకు వెళ్లారు. రిజర్వేషన్లు లభించక పోవడంతో ఎక్కువ మంది ప్యాసిం జర్ రైళ్లు.. జనరల్ బోగీలను ఆశ్రయించారు. రైళ్లపై ఆశలు వదులుకున్న వాళ్లు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులపైనే ఆధారపడ్డారు. ప్రత్యేక బస్సులపై ఆర్టీసీ 50 శాతం అదనపు వసూళ్లకు పాల్ప డితే.. ప్రైవేట్ బస్సులు మరో అడుగు ముందు కేసి డబుల్ చార్జీలతో ఇష్టారాజ్యంగా వసూళ్లకు దిగాయి. దీంతో నగరవాసులకు పండుగ ప్రయాణం పెను భారంగా పరిణమించింది. పిల్లలు, వృద్ధులు, మహిళలు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. విజయవాడ, విశాఖపట్టణం, అమలాపురం, కాకినాడ, తిరుపతి, కర్నూలు, కడప, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ తదితర ప్రాంతాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. నోట్ల రద్దుతో తగ్గిన ప్రయాణాలు.. ఈసారి సంక్రాంతి ప్రయాణాలపైనా నోట్ల రద్దు ప్రభావం స్పష్టంగా కనిపించింది. నగ దు కొరత కారణంగా నగరవాసులు కొంత మంది సొంత ఊరి ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. గతేడాది 20 లక్షల మంది సొంతూళ్లకు తరలివెళ్లగా ఈసారి ఆ సంఖ్య 15 లక్షలకు పరిమితమైంది. ఈ ఏడాది సుమారు 25% ప్రయాణాలు తగ్గినట్లు ఆర్టీ సీ, రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి. టోల్‌ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జాం చౌటుప్పల్/అడ్డాకుల: సంక్రాంతి పండుగకోసం పట్నం వాసులు సొంతూరు బాట పట్టడంతో టోల్‌ప్లాజాలు కిటకిటలాడాయి. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులుదీరడంతో ట్రాఫిక్‌జాం అయ్యింది. గురువారం మధ్యాహ్నం మొదలైన వాహనాల రద్దీ రాత్రి వరకు కొనసాగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా, మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండల శాఖాపూర్ టోల్‌ప్లాజాలు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద విజయవాడ వైపు 10 గేట్లు తెరిచినా రద్దీ తగ్గలేదు. రద్దీని నియంత్రించేందుకు పోలీసులు, జీఎమ్మార్ సిబ్బంది ఎక్కడికక్కడ పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. వాహనాలను ఇతర మార్గాల మీదుగా మళ్లించారు. అలాగే, శాఖాపూర్ టోల్గేట్ వద్ద కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ వైపు నుంచి కర్నూలు వైపు వెళ్లే వాహనాలతో రోడ్లు కిక్కిరిశాయి. నగరం నుంచి ప్రయాణం ఇలా.. ► రోజువారీ బయలుదేరే 80 ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాక, వివిధ ప్రాంతాల మధ్య సంక్రాంతి సందర్భంగా దక్షిణమధ్య రైల్వే మరో 45 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ప్రధాన రైళ్లకు అదనపు బోగీలను అందుబాటులోకి తెచ్చింది. అయినా ప్రయాణికుల డిమాండ్‌ను ఈ రైళ్లు భర్తీ చేయలేకపోయాయి. రైళ్లలో ప్రతి రోజూ 2.5 లక్షల చొప్పున మూడు రోజుల్లో 7.5 లక్షల మంది ప్రయాణికులు బయలుదేరి వెళ్లారు. ► జంట నగరాల నుంచి తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే 3,500 రెగ్యులర్ బస్సులతో పాటు, 3,195 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. మరో 1000కి పైగా ప్రైవేట్ బస్సులు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించాయి. సుమారు 3.5 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో తరలి వెళ్లారు. ► బస్సులు, రైళ్లు కాకుండా హైదరాబాద్ నుంచి అన్ని రూట్లలో వ్యక్తిగత వాహనా లు, ట్రావెల్స్ కార్లు, ద్విచక్ర వాహనా లు, మ్యాక్సీక్యాబ్‌లు, తూఫాన్లు, టాటాఏస్‌లు, ఆటోలు వంటి 1.5 లక్షల వాహనాలు సొంత ఊళ్లకు తరలి వెళ్లా యి. ఈ వాహనాల్లో సుమారు 4 లక్షల మందికిపైగా బయలుదేరి వెళ్లారు.