breaking news
Housing complex
-
నిలువెత్తు నిప్పుకణిక
హాంకాంగ్/బీజింగ్: హాంకాంగ్‌లో గత 100 సంవత్సరాల చరిత్రలో అతిపెద్ద అగ్నిప్రమాదంగా పరిణమించిన వాంగ్ ఫుక్ కోర్ట్ హౌసింగ్ కాంప్లెక్స్ ఘటనలో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిలువెత్తు నిప్పుకణికగా తయారైన బహుళఅంతస్తుల భవనాల్లో ఇంకా మంటలు చెలరేగడంతో మరికొందరు అపార్ట్‌మెంట్‌వాసులు అగ్నికి ఆహుతయ్యారు. గురువారంనాటికి మరణాల సంఖ్య 83కు పెరిగింది. వీరిలో ఇండోనేసియా వలసకార్మికులు సైతం ఉన్నారు. 76 మంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. వీరిలో 15 మంది ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. భవనాల్లో చిక్కుకుపోయిన దాదాపు 300 మంది జాడ తెలియాల్సి ఉందని హాంకాంగ్ స్థానిక యంత్రాంగం గురువారం ప్రకటించింది. పైఅంతస్తుల్లోకి మంటలు ఇంకా విస్తరిస్తూ, అగ్ని కీలలు ఎగసిపడుతుండటంతో వాటిని అదుపుచేయడం అగ్నిమాపక దళాలకు చాలా కష్టంగా మారింది. ఎనిమిది భవనాల సమాహారంగా నిర్మితమైన వాంగ్ ఫుక్ కోర్ట్‌లో ఏడింటికి నిప్పు అంటుకోగా నాలుగు భవనాల్లో మంటలను అదుపులోకి తెచ్చారు. మిగతా మూడు భవనాల్లో పరిస్థితి అదుపులోలేదు. ఒక్కోటి 32 అంతస్తుల ఎత్తుండటంతో ఆ ఎత్తులోకి వెళ్లి మంటల్ని ఆర్పడం అసాధ్యంగా మారింది. 304 ఫైర్‌ఇంజిన్లు, వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, పారామెడికల్ సిబ్బంది, వలంటీర్లు అన్వేషణ, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. మసిబొగ్గులా మారిన ఒక్కో అపార్ట్మెంట్లోకి అగ్నిమాపక సిబ్బంది టార్చ్లైట్లు పట్టుకుని వెళ్లి మృతదేహాల కోసం వెతుకుతున్నారు. భవనాల ఆధునీకరణ బాధ్యతలు చూస్తున్న ఒక కాంట్రాక్టర్‌కు చెందిన ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌ను, ఇద్దరు డైరెక్టర్లను నిర్లక్ష్యానికి కారకులంటూ పోలీసులు గురువారం అరెస్ట్‌చేశారు. ‘‘ మంటలు ఎగసినప్పుడు నేను భవనంలో లేను. వెంటనే భార్యకు ఫోన్‌చేసి తప్పించుకో అని హెచ్చరించా. ఫ్లాట్ నుంచి బయటికొస్తే మెట్ల వద్ద, కారిడార్‌లో మొత్తం మంటలే ఉన్నాయి. దీంతో మళ్లీ ఆమె ఫ్లాట్‌లోకి పరుగులుతీసింది. తర్వాత ఆమె ఏమైందో తెలీడం లేదు’’ అని అపార్ట్‌మెంట్‌వాసి లారెన్స్లీ బోరున విలపించారు. ‘‘మంటలంటుకోగానే ఇంట్లోంచి బయటికొచ్చాం. ఇప్పుడు మా ఫ్లాట్ ఎలాగుందో. నిద్రలేని రాత్రిని గడిపాం’’ అని 75 ఏళ్ల వృద్ధదంపతులు వింటర్, శాండీ చంగ్ కన్నీరుమున్నీరయ్యారు. అగ్గిరాజేసిన స్టీరోఫోమ్ కిటికీలు భవనాలకు ఆవలివైపు నుంచి దాదాపు రూ.379 కోట్లతో గత కొన్ని నెలలుగా మరమ్మత్తులు, ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. దుమ్ము, ధూళి, నిర్మాణసంబంధ పరికరాలు, శబ్దాల నుంచి రక్షణ కోసం దాదాపు ప్రతి అపార్ట్మెంట్ కిటికీలకు రక్షణగా స్టీరోఫోమ్తో చేసిన ఫ్రేమ్‌లను బిగించారు. అయితే వీటికి అత్యంత వేగంగా మండే స్వభావం ఉంది. వెదురుకర్రల చుట్టూతా కప్పిన ఆకుపచ్చ మెష్‌కు తొలుత మంటలు అంటుకుని, అవి వెనువెంటనే వెదురు కర్రలకు అంటుకున్నాయి. బహిరంగంగా ఉండటంతోపాటు ఎత్తయిన ప్రదేశంకావడంతో గాలులు తోడై ఆ మంటలు వెంటనే స్టీరోఫోమ్ కిటికీ ఫ్రేమ్లకు అంటుకోవడంతో అగ్నికీలలు అమాంతం ఎగసిపడి భారీ అగ్నిప్రమాదం సంభవించిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. 40 శాతం మంది వృద్ధులే.. బాధితులకు తక్షణ సాయం అందించేందుకు హాంకాంగ్ ప్రభుత్వం రూ.385 కోట్లతో సహాయక నిధిని ఏర్పాటుచేసింది. వందలాది మంది అపార్ట్‌మెంట్‌వాసులను అధికారులు హుటాహుటిన తాత్కాలిక శిబిరాలకు తరలించి నిత్యావసర సరకులు అందిస్తున్నారు. ఈ హౌసింగ్ కాంప్లెక్స్‌ను 1,984 ఫ్లాట్లతో 1983 సంవత్సరంలో నిర్మించారు. 2021 జనాభా లెక్కల ప్రకారం వీటిల్లో దాదాపు 4,600 మంది నివసిస్తున్నారు. అపార్ట్మెంట్ జనాభాలో దాదాపు 40 శాతం మంది 65ఏళ్లు పైబడిన వృద్ధులేనని స్పష్టమవుతోంది.పనిచేయని అలారమ్వ్యవస్థ భవనాలు రిపేర్‌లో ఉండటంతో అలారమ్ వ్యవస్థలను పనిచేయకుండాచేశారని, అందుకే అగ్నిప్రమాదం వేళ ఎలాంటి అలారమ్ శబ్దాలు రాలేదని అపార్ట్‌మెంట్‌వాసులు చెప్పారు. తోటి అపార్ట్మెంట్ వాసుల ఇళ్లకు వెళ్లి బెల్ కొట్టడం, డబడబ అంటూ తలుపుతట్టడం, వాళ్లను అప్రమత్తంచేయడం, మళ్లీ మరో ఇంటికి వెళ్లడం ఇవే దృశ్యాలు అక్కడ కనిపించాయని మరో స్థానికుడు చెప్పారు. ప్రభావిత ఒక్కో అపార్ట్‌మెంట్‌వాసులకు తక్షణ సాయంగా రూ.1,14,000 ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. మృతులకు నివాళులర్పిస్తూ పోప్ లియో గురువారం హాంకాంగ్ బిషప్కు సంతాప సందేశలేఖను పంపించారు. మృతులకు అమెరికా, బ్రిటన్‌సహా పలు దేశాలు సంతాపసందేశాలు పంపాయి. ఘటనపై నేరం కోణం పోలీసులు, నిర్లక్ష్యం కోణంలో హౌసింగ్ బ్యూరో, అవినీతి కోణంలో అవినీతినిరోధక శాఖలు వేర్వేరుగా దర్యాప్తు ప్రారంభించాయి. -
‘ఆమెను ఇక్కడ ఉండనిస్తే.. మేం ప్రశాంతంగా ఉండలేం’!
ఆమె పేరు ఫాతిమా(పేరుమార్చాం). గుజరాత్‌లోని ఓ మంత్రిత్వ శాఖకు చెందిన విభాగంలో పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వడోదర హార్నీ ఏరియాలో నిర్మించిన మోట్‌నాథ్ హౌజింగ్ క్లాంపెక్స్‌లో ఏడేళ్ల కిందట ఆమెకు ఫ్లాట్ కేటాయించారు. అయితే ఇన్నేళ్లు అయినా ఆమె అక్కడ అడుగుపెట్టలేకపోయింది. అధికారులు కారణం కాదు.. ఆమెతో పాటు ప్లాట్ పొంది హాయిగా అక్కడ నివసిస్తున్నవాళ్లలో కొందరు ఆమెను అడ్డుకుంటున్నారు.వడోదర మున్సిపల్ కార్పొరేషన్‌లోని కాంప్లెక్స్‌లో 462 ఇళ్లు ఉన్నాయి. అర్హత జాబితా ప్రకారం.. 2017లో ఫాతిమాకు అందులో ఇంటిని కేటాయించారు. అయితే ఆ హౌజింగ్ కాంప్లెక్స్‌లో ఉండే 33 మంది ఓనర్లు ఆమెకు ఇంటికి కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆమె ముస్లిం అని, ఆమె గనుక అక్కడ ఉంటే.. గొడవలు జరిగే అవకాశం ఉందంటూ 2020లో ముఖ్యమంత్రి కార్యాలయానికి, కలెక్టర్‌కు, స్థానిక అధికారులకు లేఖలు రాశారు. అంతటితో ఆగకుండా ధర్నాకు సైతం దిగారు. దీంతో.. ఆమె అక్కడికి వెళ్లకుండా ఆగిపోయారు.భర్తను కోల్పోయిన ఆమె.. ఇంతకాలం ఆమె పుట్టింట్లోనే ఉండిపోయింది. కొడుకు అదే ఏరియాలో మరో ఇంట్లో ఉంటున్నాడు. ఇన్నేళ్లు గడిచాయి కదా.. పరిస్థితులు శాంతించి ఉంటాయని, తాను తన కొడుకుతో అక్కడికి షిఫ్ట్ అయ్యిందని అనుకుంది. అయితే ఈ విషయం తెలిసి మళ్లీ ఆ 32 మంది ఓనర్లు ధర్నాకు దిగారు. ప్రశాంతంగా ఉంటున్న తమ సమముదాయంలో ఆమె వల్ల అలజడి చెలరేగడం తమకు ఇష్టం లేదని, అందుకే ఆమెను ఇక్కడ ఉండనివ్వబోమని నిరసన చేపట్టారు. దీనిపై స్పందించేందుకు అధికారులెవరూ ఇష్టపడడం లేదు. ఇది ఆ కాంప్లెక్స్‌లో ఉంటున్న నివాసితుల సమస్య గనుక వాళ్లే న్యాయస్థానాల్లో తేల్చుకోవాలంటూ చేతులెత్తేశారు.One flat was allotted under CM scheme to a #Muslim woman out of 461 flats in a residential building in #Vadodara, #Gujarat.The #Hindu residents started a protest demanding that no #Muslims should live there with them.Where our country is heading? 😞 pic.twitter.com/hQY7QA9Gae— Hate Detector 🔍 (@HateDetectors) June 14, 2024 -
ఇల్లు..గొల్లు
► వివాదాస్పద స్థలంలో జీ ప్లస్– 3 గృహ సముదాయానికి శంకుస్థాపన ► దీనిపై తలోమాట చెబుతున్న హౌసింగ్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ► లబ్ధిదారుల జాబితాను ప్రకటించని నగరపాలక సంస్థ దేవుడు కరుణించినా పూజారి వరమివ్వలేదన్నట్లుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ తీరు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద హౌస్ ఫర్ ఆల్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఒక్కో ఇంటికి రూ. 1.50 లక్షల రుణం ప్రకటించింది. ఇదే సమయంలో టీడీపీ నేతలు దరఖాస్తులంటూ హడావుడి చేయడంతో తమకు ఇల్లు సమకూరినట్టేనని ప్రతి పేద గుండె సంబరపడింది. అయితే ఈ సంబరం ఎక్కువ రోజులు నిలవలేదు. మూడేళ్లుగా ముచ్చట్లతోనే కాలం గడుపుతున్న ప్రభుత్వం తాజాగా ఇళ్ల నిర్మాణానికి ఓ వివాదాస్పద స్థలంలో భూమి పూజ చేసి లబ్ధిదారుల ఆకాంక్షలతో ఆటలాడుతోంది. సాక్షి, గుంటూరు: కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద హౌస్ ఫర్ ఆల్ ద్వారా నగరంలో 11,800 గృహాలను మంజూరు చేసింది. ఇందు కోసం ప్రతి ఇంటికీ రూ. 1.50 లక్షల సబ్సిడీ అందించింది. పథకం ప్రవేశపెట్టి ఏడాది దాటుతున్నా ఇంత వరకు గుంటూరు నగరపాలక సంస్థ, ట్రిడ్కో అధికారులు లబ్ధిదారుల జాబితా తయారు చేయలేదు. కనీసం నగరపాలక సంస్థ నుంచి హౌస్ ఫర్ ఆల్ పథకంపై ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయకుండా లబ్ధిదారుల ఎంపిక మొత్తం టీడీపీ నేతల చేతుల్లో పెట్టేశారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ ఫర్ ఆల్ పథకంలో జీ ప్లస్ 3 గృహ సముదాయాల నిర్మాణానికి గుంటూరు రూరల్ మండల పరిధిలోని అడవితక్కెళ్లపాడు గ్రామ శివారులో 47 ఎకరాల భూమిలో ఈ నెల 19న మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో భూమి పూజ నిర్వహించారు. ఈ భూమిలో సగానికిపైగా కోర్టు వివాదంలో ఉందనే విషయం కూడా అధికారులు పట్టించుకోకపోవడం దారుణం. నిరుపేదలకు వివాదాస్పద భూమిలో ఇళ్ల నిర్మాణం ఏ విధంగా చేపడతారో వారికే తెలియాలి. తెలుగు తమ్ముళ్లదే రాజ్యం టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటుతున్నా జిల్లాలో ఇంత వరకు ఒక్క ఇల్లు నిర్మించ లేదు. హౌస్ ఫర్ ఆల్ పథకానికి అర్హులు కావాలంటే సొంత స్థలం లేదా బీ ఫారం పట్టాలు ఉండాలన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 1.50 లక్షల సబ్సిడీకి తోడు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 1.50 లక్షల సబ్సిడీ ఇస్తూ ట్రిడ్కో ద్వారా హౌస్ ఫర్ ఆల్ పథకంలో జీ ప్లస్ 3 గృహ సముదాయాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది. దీని లబ్ధిదారుల ఎంపికను జీవో ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్లు చూడాలి. కానీ ఈ పెత్తనం కూడా తెలుగు తమ్ముళ్లే తీసుకొన్నారు. వివాదాస్పద భూమిలో నిర్మాణాలట..! 47 ఎకరాల స్థలంలో జీ ప్లస్ 3 గృహ సముదాయాలు నిర్మించేందుకు వివాదాస్పద భూమిలో పూజ నిర్వహించారు. ఇళ్లు నిర్మించే స్థలానికి మార్కింగ్ వేసి అందులో డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేయాల్సి ఉండగా, అవేమీ పట్టించుకోకుండా హడావుడిగా శంకుస్థాపన చేసేశారు. శంకుస్థాపనకు జనాలను తరలించేందుకు టీడీపీ నేతలు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి మీకు ఇల్లు మంజూరైందని, శంకుస్థాపనకు హాజరు కావాలంటూ సెల్‌ఫోన్ మెసేజ్‌లు పంపారు. మరుసటి రోజే లబ్ధిదారుల ఎంపిక జరగలేదని తెలుసుకుని నిర్ఘాంతపోయారు. మేళాను రద్దు చేసిన అధికారులు తూర్పు నియోజకవర్గ పరిధిలో లబ్ధిదారుల నుంచి డిపాజిట్ సేకరణ కోసం గురువారం బీఆర్ స్టేడియంలో మేళా నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ ప్రకటించింది. స్థల వివాదం కొలిక్కి రాకపోవడం, దీనిపై రెవెన్యూ అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో మేళాను వాయిదా వేశారు. కనీసం ఎప్పుడు నిర్వహిస్తారో కనీసం తేదీ కూడా ప్రకటించలేదు. అయితే డివిజన్ స్థాయి టీడీపీ నేతలు మాత్రం లబ్ధిదారుల జాబితాలో ఉన్నారని, వెంటనే రూ. 25 వేలు డీడీలు తమకు అందించాలంటూ హడావుడి చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా నగరపాలక సంస్థ అధికారులు నోరు మెదపడం లేదు. కేవలం టీడీపీ మద్దతుదారులను మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో మాట వివాదాస్పద భూమిపై ‘సాక్షి’ గుంటూరు తహసీల్దారు వెంకటేశ్వర్లును ఫోన్లో వివరణ కోరగా 23 ఎకరాలు మినహా మిగతా భూమి అంతా కోర్టు వివాదంలో ఉన్నట్లుగా తెలిసిందని, పూర్తి సమాచారం తన వద్ద లేదని చెప్పారు. నగరపాలక సంస్థ అధికారులు మాత్రం 4.8 ఎకరాల భూమి మాత్రమే కోర్టు వివాదంలో ఉందంటున్నారు. ఇలాంటి స్థలంలో ఇళ్ల నిర్మాణానికి నగరపాలక సంస్థ, రెవెన్యూ, హౌసింగ్ అధికారులు ఎలా అనుమతిచ్చారనేది ప్రశ్నార్థకం. -
ఈ ఇళ్లు ఏమూలకు..
లక్షల్లో దెబ్బతిన్న గృహాలు అయినా ఆరు వేల ఇళ్ల నిర్మాణానికే సర్కారు సంకల్పం ఈ ప్రాజెక్టుకు నేడు సీఎం శంకుస్థాపన విశాఖపట్నం: హుద్‌హుద్ తుఫాన్ బాధితుల కోసం ఉత్తరాంధ్ర పరిధిలోని జిల్లాల్లో నిర్మించతలపెట్టిన గృహ నిర్మా ణ సముదాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం శ్రీకారం చుట్టనున్నారు. గతేడాది హుద్‌హుద్ పెనుతుఫాన్ ఉత్తరాంధ్రను కకావికలం చేసింది. ఒక్క విశాఖలోనే లక్షా 20వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. విజయనగరం, శ్రీకాకుళంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో మరో లక్ష ఇళ్ల వరకు రూపురేఖలు లేకుండా పునాదులు కదిలిపోయాయి. ఇంటికి తీవ్రతను బట్టి రూ.5వేలను రూ.50వేల వరకు ఆర్ధిక సహాయం చేశారు. చిరునామాలు దొరక్క,అకౌంట్లు, ఆధార్ నెంబర్లు సరిపోకపోవడంతో సుమారు 50వేల మంది వరకు ఇంకా పరిహారం అందని పరిస్థితి నెలకొంది. ఇళ్లు దెబ్బతిన్న 2లక్షల మందిలో మూడో వంతు మంది ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వ సహాయం కోసం ఎనిమిది నెలలుగా ఆశగా ఎదురు చూస్తున్నారు. తుపాను సమయంలో కేంద్రప్రభుత్వం వెయ్యికోట్లు ప్రకటించి రూ.650 కోట్ల వరకు సాయం అందజేసింది. దేశవిదేశాల నుంచి విరాళాల పేరుతో ప్రభుత్వానికి వందల కోట్లు సమకూరాయి. మరో పక్క ప్రపంచ బ్యాంకు రూ.2350 కోట్ల ఆర్ధిక సహాయం చేసేందుకు అంగీకరించింది. ఇంత పెద్ద ఎత్తున నిధులు సమకూరినా తుఫాన్ పునర్నిర్మాణ చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు.8 నెలల తర్వాత అదీ దాతల సహకారంతో కేవలం 10వేల ఇళ్ల నిర్మాణానికి సంకల్పించారు. రూ.560 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన ఈ భారీ ప్రాజెక్టుకు టెండర్లు కొలిక్కిరాలేదు. ఈ ప్రాజెక్టుకు బుధవారం సీఎం శ్రీకారం చుట్ట బోతున్నారు. ఇన్ఫోసిస్, బీహెచ్ఈఎల్,సీసీఎల్ హెచ్‌పీసీఎల్ వంటి సంస్థలు అందజేసిన రూ.170కోట్లకు మ్యాచింగ్ గ్రాంట్‌గా రాష్ర్ట ప్రభుత్వం మరో రూ.170కోట్లు సమకూర్చ నుండగా రూ.10కోట్ల వరకు లబ్దిదారులు వాటాగా భరించనున్నారు. మిగిలిన మొత్తాన్ని స్వచ్చ భారత్ మిషన్ నుంచి సమకూర్చనున్నారు. ఈ ప్రాజెక్టులో ఇళ్లు విశాఖలో 6వేలు, శ్రీకాకుళం జిల్లాలో 2,500, విజయనగరం జిల్లాలో 1500 ఇళ్లు నిర్మించ నున్నారు. ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించనున్నారు. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం పేరుతో తలపెట్టిన ఈ ప్రాజెక్టు శంకుస్థాపన కోసం వుడా పార్కులో ప్రత్యేకంగా ఫైలాన్‌ను ఏర్పాటు చేశారు. ఉదయం 9.40 గంటలకు ముఖ్యమంత్రి శంకుస్ధాపన చేయనున్నారు. ఈ ఇళ్లు ఎక్కడ నిర్మిస్తున్నారు, ఎందరికి కేటాయి స్తున్నారు అన్న దానిపై స్పష్టత లేకపోవడం విశే షం. అనంతరం నోవాటెల్‌లో ఇం డస్ట్రీమిషన్ను ప్రారంభించి ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని ప్రకటించనున్నారు.


