house hunt
-
ఐటీ సిటీలో ఇల్లు.. ఇంత కష్టమా?
దేశ ఐటీ రాజధానిగా పిలిచే బెంగళూరులో నివసించే సగటు ఉద్యోగికి ఇప్పుడు 'సొంత ఇల్లు' అనేది ఒక తీరని కలగా మారుతోంది. నగరంలో ఇళ్ల ధరలు, అద్దెలు ఆకాశాన్ని తాకుతుండటంతో నివాసితులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి 'రెడ్డిట్' (Reddit) వేదికగా పంచుకున్న తన చేదు అనుభవాలు నగరంలోని భయానక రియల్ ఎస్టేట్ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.పీడకలగా మారిన ఇంటి వేటబెంగళూరు నగరంలో ఒక రెండు పడక గదుల (2BHK) ఇంటి కోసం తాను చేస్తున్న అన్వేషణ ఒక "పీడకల"గా మారిందని సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. "బెంగళూరు రియల్ ఎస్టేట్ ఎటు వెళ్తోంది?" అనే శీర్షికతో ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.మూడేళ్ల క్రితం రూ. 1.4 కోట్లుగా ఉన్న ఒక ఫ్లాట్ ధర, ప్రస్తుతం ఏకంగా రూ. 2 కోట్లకు చేరింది. సదరు అపార్ట్మెంట్ ఒక పెద్ద మురికి కాలువ సమీపంలో ఉండటమే కాకుండా, అనేక లోపాలు, అసౌకర్యాలు ఉన్నాయి. అయినా కేవలం ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీ కంపెనీలకు దగ్గరగా ఉందనే సాకుతో ధరలను అడ్డగోలుగా పెంచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.అద్దెలు కూడా భారమే..కేవలం కొనుగోలు ధరలే కాకుండా, అద్దెలు కూడా సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. గతంలో తక్కువ ధరకే లభించిన ఫ్లాట్లకు ఇప్పుడు నెలకు రూ. 70,000 పైగా అద్దె చెల్లించాల్సి వస్తోందని, ఇది నమ్మశక్యంగా లేదని నివాసితులు వాపోతున్నారు. మూడు, నాలుగేళ్లలో డబ్బు ఆదా చేసి ఇల్లు కొందామనుకునే లోపే, ధరలు అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి.పరిస్థితి తీవ్రతకొన్ని ప్రాంతాల్లో 2BHK ఫ్లాట్లు ఏకంగా రూ. 2.5 కోట్లకు అమ్ముడవుతుండటం గమనార్హం. ఇంత ధర పెట్టినా డిమాండ్ తగ్గకపోవడం, సామాన్య, మధ్యతరగతి ప్రజలను గృహ కొనుగోలుకు దూరం చేస్తోంది. పెరుగుతున్న ధరలు, క్షేత్రస్థాయిలోని సమస్యల మధ్య ఉన్న భారీ వ్యత్యాసం బెంగళూరు వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. -
ఇల్లు చూసేందుకు రూ. 2,500.. ఇదెక్కడి అరాచకం!
ఎక్కడైనా మీకు ఇల్లు అద్దెకు కావాలంటే ఏం చేస్తారు.. మొదట ఇల్లు చూసి అంతా నచ్చితే అడ్వాన్స్ ఇచ్చి ఇంట్లో చేరుతారు. కానీ అక్కడ మాత్రం మొదట ఇల్లు చూసేందుకే రూ.2,500 కట్టాలట. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వ్యవహారం గురించి విన్న నెటిజన్లు ఇదెక్కడి అరాచకంరా నాయనా.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఇల్లు అద్దెకు దొరకడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. అత్యంత జనాభా ఉండే మెట్రో నగరాల్లో ఢిల్లీ కూడా ఒకటి. ఈ నగరంలో అద్దె ఇంటి కోసం వెతుకుతున్న ఓ వ్యక్తికి అసాధారణమైన పరిస్థితి ఎదురైంది. ఇంటి వేటలో భాగంగా ఒక బ్రోకర్‌ను సంప్రదించగా 'సొసైటీ విజిటింగ్ కార్డ్' పేరుతో అద్దె ఇంటిని చూసేందుకు రూ. 2,500 కట్టాల్సి ఉంటుందని సూచించాడు. సదరు వ్యక్తి తనకు ఎదురైన ఈ పరిస్థితి గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్ (Reddit)లో షేర్ చేశారు. ఇది చట్టబద్ధమైనదేనా లేదా స్కామా అని యూజర్లతో అనుమానం వ్యక్తం చేశారు. బ్రోకర్‌తో జరిగిన వాట్సాప్ సంభాషణ స్క్రీన్‌షాట్‌ను కూడా జత చేశారు. దీంట్లో బ్రోకర్ చెప్పినదాని ప్రకారం.. “ఇల్లు చూసేందుకు విజిటింగ్ ఫీజు రూ. 2500. మీకు ఫ్లాట్ నచ్చితే, అద్దె మొత్తంలో రూ. 2500 మినహాయిస్తారు. ఒకవేళ ఫ్లాట్ నచ్చకపోతే రూ. 2500 తిరిగిస్తారు.” జనవరి 13న చేసిన ఈ పోస్టుకు యూజర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. చాలా మంది యూజర్లు దీన్ని స్కామ్‌గా అభిప్రాయపడ్డారు. బెంగుళూరు వంటి నగరాల్లో కనింపించే స్కామ్ ఇప్పుడు ఢిల్లీలోనూ జరగుతోందంటూ ఓ యూజర్ బదులిచ్చారు. ఇల్లు చూసేందుకు విజిటింగ్ కార్డ్ ఎందుకు.. అదేమైనా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఇల్లా అంటూ మరో యూజర్ వ్యాఖ్యానించారు. -
ఇంటి కోసం పారిస్ హిల్టన్
న్యూయార్క్: అమెరికన్ నటి పారిస్ హిల్టన్ విలాసవంతమైన పెంట్ హౌస్ అపార్ట్మెంట్ కోసం వెదుకుతోంది. లాస్ ఏంజిల్స్‌లో ఉంటున్న హిల్టన్ తన సోదరి, సోదరుడికి దగ్గరగా ఉండేందుకోసం న్యూయార్క్ల్ స్థిర పడాలని భావిస్తోంది. ఈ నెల 12న న్యూయార్క్ వచ్చిన హిల్టన్ కొన్ని గంటల్లోనే చాలా ఇళ్లను పరిశీలించింది. హిల్టన్ తన సోదరి నిక్కీకి దగ్గరగా ఉండేలా ఇల్లు కొనాలని చూస్తోంది. త్వరలో వివాహం చేసుకుంటున్న నిక్కీకి పెళ్లి పనుల్లో సాయంగా ఉండాలని హిల్టన్ భావిస్తోంది.


