breaking news
hologram
-
హాలోగ్రామ్.. సోలో పెత్తనం
సాక్షి, హైదరాబాద్: నామినేషన్..ఒకటీ రెండుసార్లు కాదు..ఏకంగా 8 సార్లు. ఇదే పద్ధతిలో ఒకే సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టారు. ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన టెండర్ ఒప్పందమే ఇప్పటికీ కొనసాగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా, ప్రభుత్వాలు మారినా సంస్థ (కన్సార్షియం) మాత్రం మారలేదు. రాష్ట్రంలో మద్యం బాటిళ్లపై అతికించే లేబుళ్ల సరఫరా కాంట్రాక్టును అప్పటి నుంచి ఇప్పటివరకు ఒకే సంస్థకు నామినేషన్ పద్ధతిపై కట్టబెడుతున్నారు. హాలోగ్రామ్లుగా పిలిచే ఈ లేబుళ్ల సరఫరా బాధ్యతను కొత్త సంస్థకు కట్టబెట్టేందుకు గతంలో ప్రయత్నాలు జరిగినా, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రయత్నాలు జరుగుతున్నా..అవి పేరుకు మాత్రమేనని, లోలోపల ఎప్పటికప్పుడు ‘సర్దుబాట్లు’ కొనసాగుతున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నిసార్లు సంబంధిత ఫైలు కదిలినా అది కార్యరూపం దాల్చక పోవడం, తాజాగా ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ జారీ చేసి రెండేళ్లవుతున్నా పాత సంస్థకే టెండర్ కొనసాగుతుండటం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. కాగా ఇదే సంస్థ కొత్తగా మరో ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడానికి కూడా ఈ ‘సర్దుబాటే’ కారణమని, పాత సంస్థను మార్చే హడావుడి కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమవుతోందని, ఈ లేబుళ్లకు సంబంధించిన ఏ ఫైలూ ముందుకు కదలడం లేదని ఎక్సైజ్ వర్గాలే అంటుండటం గమనార్హం. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు, సదరు సంస్థ ఇచ్చే ఆమ్యామ్యాలు..వెరసి ఈ నామినేషన్ తంతు ఏళ్ల తరబడి కొనసాగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సదరు సంస్థకు ప్రతి నెలా 15 కోట్ల లేబుళ్లకు గాను రూ.5 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లిస్తుండటం గమనార్హం. టెండర్ గడువు ఎప్పుడో ముగిసినా.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2013లో యూఫ్లెక్స్, శ్రీటెక్, సీ–టెల్ అనే మూడు సంస్థల కన్సార్షియంకు హాలోగ్రామ్ల టెండర్ ఖరారయ్యింది. 2018లోనే ఈ టెండర్ గడువు ముగిసింది. 2013 నుంచి 2018 వరకు ఐదేళ్ల పాటు టెండర్ ప్రకారం లేబుళ్ల సరఫరా జరగ్గా, ఆ తర్వాత నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టు గడువును పొడిగిస్తూ వస్తున్నారు. 2018 నుంచి గడువు ముగిసినప్పుడల్లా కొత్త టెండర్ నోటిఫికేషన్ కోసం ఫైలు కదలడం, ప్రభుత్వ పెద్దలతో సదరు కన్సార్షియం ‘అవగాహన’కు రావడం, ఫైలు వెనక్కి తిరిగి రావడం, మళ్లీ అదే సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టడం పరిపాటిగా మారిపోయింది. అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న ఓ వ్యక్తి మధ్యవర్తిత్వం వహించగా, మాజీ ఎంపీ వ్యవహారం నడిపారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడూ అదే తీరు.. ‘సర్దుబాటు’ తంతు కొనసాగిందనే విషయం తెలుసుకున్న ప్రస్తుత కీలక మంత్రి అగ్గిమీద గుగ్గిలం అయి వెంటనే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే అది తాజా ‘సర్దుబాటు’ జరిగే వరకు మాత్రమేనని, ఆ తర్వాత మళ్లీ పరిస్థితి యధాతథమేనని ఎక్సైజ్ వర్గాల సమాచారం. అయితే హాలోగ్రామ్ల సరఫరా కోసం తూతూ మంత్రంగా 2024లో ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌కు హాలోగ్రామ్‌లు సరఫరా చేసే ఆసక్తి ఉన్న సంస్థలు తమను సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ మేరకు 23 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఈ బిడ్లు దాఖలై దాదాపు రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు అది ఫైనల్ కాలేదు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటన్నది బహిరంగ రహస్యమేనని అంటున్నారు. ఇదే సమయంలో ఈ మద్యం లేబుళ్ల సరఫరా టెండర్ దక్కించుకునేందుకు తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న ఓ మీడియా అధిపతి ప్రయత్నం చేశాడని సమాచారం. కాగా ప్రస్తుత ప్రభుత్వంలో ఓ కీలక నేత సహకారంతో హాలోగ్రామ్ల సరఫరా టెండర్ కోసం ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న సంస్థతోనే ‘సర్దుబాటు’ జరగడంతో ఆ మీడియా అధిపతి తన ప్రయత్నాల నుంచి తప్పుకున్నారనే చర్చ ఎక్సైజ్ వర్గాల్లో జరుగుతోంది. రిజ్వీ విఫల యత్నాలు ఇదంతా జరుగుతుండగానే అప్పట్లో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన రిజ్వీ..ఈ లేబుళ్ల కాంట్రాక్టు ప్రభుత్వ రంగ సంస్థకు కట్టబెట్టాలని యోచించారు. ఈ మేరకు సెక్యూరిటీ సర్టిఫికెట్లు ముద్రించే నాసిక్‌లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌ను సంప్రదించారు. ఆ సంస్థకు ఉన్న సాంకేతిక నైపుణ్యం, ఎంత ధరకు హాలోగ్రామ్‌లు సరఫరా చేయగలరనే వివరాలను సేకరించారు. ఈ మేరకు నాసిక్ ముద్రణాలయానికి టెండర్‌ను ఇచ్చే ఫైలును కదిలించారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఆ ఫైలుకు మోక్షం కలగలేదు. పాత సంస్థ ఆధ్వర్యంలోనే ఇప్పటికీ హాలోగ్రామ్‌లు సరఫరా అవుతున్నాయి. కొసమెరుపు ఏమిటంటే.. ప్రస్తుతం లిక్కర్ (ఐఎంఎల్) బాటిళ్లకు మాత్రమే హాలోగ్రామ్‌లు సరఫరా చేస్తున్న సదరు పాత సంస్థ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది. మద్యం సీసాలతో పాటు బీర్ బాటిళ్లకు కూడా తామే హాలోగ్రామ్‌లు ఇస్తామని, అది కూడా నామినేషన్ పద్ధతిలోనే ఇవ్వాలని ప్రభుత్వంపై ‘అన్ని రకాలుగా’ ఒత్తిడి పెంచుతున్నట్టు సమాచారం. కాగా ఇందుకు సంబంధించి రేపోమాపో ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తొలినాళ్లలోనే అవినీతి మరకలు! మద్యం సీసా మూతపై అడ్డంగా అతికించి ఉండే లేబుల్‌నే హాలోగ్రామ్ అంటారు. దీన్ని హాలోగ్రాఫిక్ ఎక్సైజ్ అధెసివ్ లేబుల్ (హెచ్ఈఏల్ లేబుల్) అని కూడా పిలుస్తారు. తెలంగాణలో ఈ హాలోగ్రామ్‌లను హెడోనిక్ పాత్ ఫైండర్ సిస్టమ్ (హెచ్‌పీఎఫ్‌ఎస్) విధానంలో తయారు చేస్తున్నారు. అంటే ఒక మద్యం బాటిల్‌ను ఏ కంపెనీ తయారు చేసింది? తయారైన బాటిల్ ఏ డిపోకు వచ్చింది? అక్కడి నుంచి ఏ షాప్‌కు వెళ్లింది? ఏ సైజ్‌లో ఉందనే వివరాలు ఈ లేబుల్‌పై ఉంటాయి. ఈ విధానం ద్వారా ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయంలో కూర్చుని రాష్ట్రంలో సరఫరా అయ్యే ప్రతి మద్యం బాటిల్ పంపిణీ వ్యవస్థను ట్రాక్ చేయవచ్చు. ఈ లేబుల్స్‌ను సరఫరా చేసేందుకు 2013లో (ఉమ్మడి రాష్ట్రంలో) టెండర్ ఖరారు చేశారు. మూడు సంస్థల కన్సార్షియం ఈ టెండర్‌ను దక్కించుకుంది. వాస్తవానికి అప్పట్లోనే ఈ టెండర్ ఖరారు ప్రక్రియకు అవినీతి మరకలు అంటాయి. ఆ అవినీతి మరకలు తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా కొనసాగుతూనే ఉన్నాయని, పాత సంస్థకే గత ఎనిమిదేళ్లుగా నామినేషన్ పద్ధతిలో టెండర్ కొనసాగిస్తున్నారంటే ఆమ్యామ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఉమ్మడి రాష్ట్రంలో కుదుర్చుకున్న టెండర్ అగ్రిమెంట్ ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ టెండర్ దక్కించుకున్న కన్సార్షియంలోని మూడు సంస్థలు రెండు రాష్ట్రాల బాధ్యతలను అనధికారికంగా పంచుకున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో లేబుళ్ల సరఫరా బాధ్యతలు యూఫ్లెక్స్ చూస్తుండగా, ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారం, సాఫ్ట్వేర్ నిర్వహణను సీ–టెల్ అనే సంస్థ చూస్తున్నట్టు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 33 పైసలకు పెరిగిన ఒక లేబుల్ రేటు ప్రస్తుతం ప్రతి నెలా 15 కోట్ల లేబుళ్లను సదరు సంస్థ బేవరేజెస్ కార్పొరేషన్‌కు అందిస్తోంది. టెండర్ దక్కించుకున్న సమయంలో ఒక లేబుల్‌ను 22 పైసలకు సరఫరా చేస్తామని ఒప్పందం కుదరగా, అది క్రమంగా పెరుగుతూ ఇప్పుడు ప్రతి లేబుల్ సరఫరా రేటు 33 పైసలకు చేరింది. అంటే ప్రతినెలా రూ.5 కోట్లు, సంవత్సరానికి సుమారు రూ.60 కోట్ల విలువైన లేబుళ్లను ఈ సంస్థ సరఫరా చేస్తోందన్నమాట. మరి ఇందులో అసలు ఖర్చయ్యేది ఎంతో.. ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు, అధికారులకు సమర్పించే ఆమ్యామ్యాలు ఎన్నో అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అసలీ కాంట్రాక్టును ఇలా నామినేషన్ పద్ధతిన ఇంకెన్ని సంవత్సరాలు పొడిగిస్తారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. -
దళపతి ‘మాయ’.. షాకిస్తున్న ‘హోలోగ్రామ్ విజయ్’
చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. అయితే ఈసారి ఎన్నికల ప్రచారంలో దళపతి విజయ్ సరికొత్త ట్రెండ్ సృష్టించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో స్వయంగా పర్యటించడం అసాధ్యం కావడంతో, ఆయన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ఒక అద్భుతమైన ఐడియాతో ముందుకొచ్చింది. ఏఐ సాంకేతికతతో సృష్టించిన విజయ్ 3డీ హోలోగ్రామ్‌లు ఇప్పుడు వీధుల్లో అదరగొడుతున్నాయి. ప్రజలను ఈ హైటెక్ ప్రచారం ఎంతగానో ఆకర్షిస్తోంది.ప్రచార బరిలో ‘3డీ విజయ్’ హవాకుంభకోణం టీవీకే అభ్యర్థి వినోద్ రవి ఈ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రచార రథంపై అభ్యర్థితో పాటు నిల్చున్న విజయ్ 3డీ హోలోగ్రామ్.. అచ్చం ఆయన లాగే కనిపిస్తూ, ఆయన గొంతుతోనే ప్రసంగిస్తోంది. ‘విజిల్ వేయడానికి సిద్ధమా? ఓటు మన హక్కు, దాన్ని ఎవరూ తీసుకోలేరు. మన ఓటు విజిల్ (టీవీకే గుర్తు)కే వేయాలి. మనం ఎవరి మాటలకూ మోసపోం’ అని హోలోగ్రామ్ విజయ్ చెబుతుంటే.. అభిమానులు, ఓటర్లు ఆశ్చర్యంతో చూస్తూ అక్కడే ఉండిపోతున్నారు. ఈ డిజిటల్ దళపతి భౌతికంగా ఆయన అక్కడే ఉన్నారన్న భ్రమను కల్పిస్తూ విశేషంగా ఆకట్టుకుంటోంది. TVK candidate in Kumbakonam uses a full hologram of Vijay…. pic.twitter.com/eWooTr2EKk— Vasudha Venugopal (@Vasudha156) April 13, 2026విద్యార్థి మేధస్సుకు ప్రతిరూపంమొత్తం 234 స్థానాల్లో పోటీ చేస్తున్న పార్టీ.. అన్ని చోట్లా విజయ్ సందేశాన్ని చేర్చాలనే ఉద్దేశంతో ఈ వ్యూహం అమలు చేసింది. తంజావూరు జిల్లా టీవీకే కోశాధికారి విజయ్ చంద్రన్ ఆలోచన మేరకు, ప్రవీణ్ అనే 20 ఏళ్ల ఏఐ, డేటా సైన్స్ విద్యార్థి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశాడు. కేవలం మూడు రోజుల్లోనే ఏఐ సాయంతో విజయ్ ప్రసంగాన్ని 50 సెకన్ల వీడియోగా మార్చి, దానిని హోలోగ్రామ్ ద్వారా ప్రదర్శించారు. ఈ ప్రయోగం ఆన్లైన్లో వైరల్ కావడంతో పాటు, క్షేత్రస్థాయిలో విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దీనిని విస్తరించే పనిలో పార్టీ బిజీగా ఉంది.డూప్‌ల నుంచి డిజిటల్ దాకా..ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం టీవీకే శ్రేణులు చేయని ప్రయత్నం లేదు. హోలోగ్రామ్ల కంటే ముందు తిరువెరుంబూర్ అభ్యర్థి నావల్పట్టు విజి.. విజయ్ మైనపు బొమ్మను (మ్యాన్విన్) ప్రచారానికి వాడారు. అలాగే సీఎం స్టాలిన్‌పై పోటీ చేస్తున్న కొలత్తూరు అభ్యర్థి వీఎస్ బాబు సైతం, అచ్చం విజయ్‌లా ఉన్న డూప్లతో ప్రచారం చేయించారు. చెన్నై ఆఫీసులో వందల కొద్దీ విజయ్ బొమ్మలు ఉన్నాయన్న వార్తలు కూడా వచ్చాయి. ఇలా డూప్‌లు, బొమ్మలతో మొదలైన వారి ప్రచారం.. ఇప్పుడు ఏఐ, 3డీ హోలోగ్రామ్ల స్థాయికి చేరి, రాజకీయ ప్రచార రూపురేఖలనే మార్చేస్తోంది.ఇది కూడా చదవండి: నేడు అంబేద్కర్ జయంతి: ఏవి ఓపెన్? ఏవి క్లోజ్? -
ప్రపంచంలోనే తొలి AI మ్యారేజ్!!
ఏఐ సాంకేతికత ప్రస్తుతం ఓ ప్రభంజనంలా దూసుకుపోతోంది. రోజుకో కొత్త సాంకేతికతను పరిచయం చేస్తూ..అన్నింటిని ఏఐతో చక్కపెట్టేసుకోవచ్చు అనేంతగా శరవేగంగా వెళ్లిపోతుంది. మొన్నటి వరకు ఎంప్లాయిస్ లేకుండా జస్ట్ ఏఐ సాంకేతికతో ఎంప్లాయిస్‌ని సృష్టించి వర్క్ పూర్తి చెయ్యొచ్చు అన్నారు. అసలే నిరుద్యోగ సమస్యతో సతమతమవుతుంటే మళ్లీ ఇదా! అని అంతా బెంబేలెత్తిపోయారు. ఇప్పడూ ఏకంగా ప్రేమ, సాన్నిహిత్యం, ఓ కంపెనీ వంటివి కూడా ఏఐ సాంకేతికతోనా!. ఔను! మీరు వింటుంది నిజమే..! ఓ మహిళ ఏఐతో రూపొందించిన హోలోగ్రామ్‌ని వివాహం చేసుకుంటుందట. ఈ షాకింగ్ ఘటన స్పెయిన్‌లో చోటు చేసుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా స్పెయిన్‌కి చెందిన పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ అలీసియా ఫ్రామిస్ అనే మహిళ కృత్రిమ మేధతో రూపొందించిన హోలోగ్రామ్‌ని పెళ్లి చేసుకోనుంది. డిజిటల్ సంస్థ మెషిన్ లెర్నింగ్ అండ్ హోలోగ్రామ్ సాంకేతికతో కూడిన మనిషిని రూపొదించినట్లు తెలిపింది. అంతేగాదు తమ వివాహం కోసం పెళ్లిమండపాన్ని కూడా బుక్ చేసుకుందట. ఈ ఏడాది రోటర్‌డామ్‌లోని మ్యూజియంలో ఆమె వివాహం జరగనుంది. ఇక ఆమె పెళ్లి చేసుకోనున్న ఏఐ హోలోగ్రామ్ పేరు అలెక్స్. తన భావోద్యేగాలన్నింటిని పంచుకునేలా ఈ హోలోగ్రామ్‌ని రూపొందించినట్లు తెలిపింది. తన వర్చువల్ భాగస్వామి మద్య వయస్కుడైన వ్యక్తిగా ఉన్నాడని చెబుతోంది. 'హైబ్రిడ్ కపుల్' అనే కొత్ర ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ హోలోగ్రామ్‌ని డిజైన్ చేసినట్లు అలీసియా పేర్కొంది. ఇప్పుడూ ఏఐ సాంకేతికతను ప్రేమ, సాన్నిహిత్యం, వంటి సరిహద్దులను అందుకునేలా ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపింది.. ఇంతవరకు ఐఏ సాంకేతికతను కవిత్వం కళల దిశగా ప్రయోగాలు చేయలేదని పేర్కొంది. తన భాగస్వామితో కొనసాగనున్న కొత్త జీవితం గురించి ఓ డాక్యుమెంటరీని కూడా రూపొందించనుందని అలీసియా తెలిపింది. అలాగే తన వర్చువల్ భాగస్వామిని జీవితంలోకి ఎలా ఆహ్వానించాలి, అతనితో మసులకోవాలో అనే వాటి గురించి కలలు కంటున్నట్లు వెల్లడించింది. అంతేగాదు తమ వివాహ దుస్తులను కూడా డిజైన్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు అలీయాసీ తన ఇన్‌స్టాగ్రాంలో తన భాగస్వామి అలెక్సీతో కలిసి దిగిన వీడియోలను కూడా షేర్ చేసింది. ఆ పోస్ట్‌లో రోబోలు, హోలోగ్రామ్లోతో ప్రేమ, శృంగార జీవిత అనివార్యం అనేది గొప్ప వాస్తవం. అయితే వారు గొప్ప సహచరులుగా సానుభూతిని వ్యక్తపర్చగలరని రాసుకొచ్చింది. ఫోన్లు ఒంటరితనం నుంచి రక్షించి జీవితంలోని శూన్యాన్ని దూరం చేశాయి. అలాగే ఈ హోలోగ్రామ్‌లు మన ఇళ్లల్లో ఉంటూ మనతో ఇంటరాక్టివ్ అవుతూ ఉనికిని చాటుకుంటాయని అంటోంది అలీసియా. అందుకోసం తన స్నేహితురాలి జీవితాన్ని ఉదాహరిస్తూ..తన స్నేహితురాలు భర్త చనిపోవడం వితంతువుగా మిగిలిపోయిందని, ఇప్పుడు ఆమెకు భర్త లేని లోటుని భర్తీ చేయడం కష్టం అని చెప్పుకొచ్చింది. అలాంటప్పుడూ ఈ ఏఐ మానవ సహచరులు మనకు బెస్ట్ ఆప్షన్ అవ్వొచ్చు అని ధీమాగా చెబుతోంది. మనం ఇష్టపడ్డ ఇష్టపకపోయినా కొత్త తరం ప్రేమ పుట్టుకొస్తుంది. హోలోగ్రామ్‌లు, రోబోలను పెళ్లి చేసుకునే రోజులు వస్తాయి అని చెబుతోంది అలీసియా. ఇక భాగస్వామ్య సహచర్యం కూడా ఏఐ మాయతోనేనా..!. (చదవండి: నెల రోజులు పాలు, పెరుగు మానేస్తే ఏమవుతుందో తెలుసా?) -
నేతాజీకి జాతి ఘన నివాళి
న్యూఢిల్లీ: ఆజాద్ హిందు ఫౌజ్ దళపతి, స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని జాతి యావత్తూ ఆయనకి ఘనంగా నివాళులర్పించింది. స్వతంత్ర భారతావని సాధన దిశగా వేసిన సాహసోపేత అడుగులు, బోస్‌ను ‘జాతికి స్ఫూర్తి ప్రదాత’గా నిలిపాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు. గొప్ప జాతీయవాది, దూరదృష్టి కలిగిన నాయకుడు నేతాజీ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశవాసులకు పరాక్రమ్ దివస్ (నేతాజీ జన్మదినోత్సవం) శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి నేతాజీ అందించిన సేవలకు ప్రతి భారతీయుడు గర్విస్తాడని ప్రధాని ట్వీట్ చేశారు. అనంతరం ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆవిష్కరించారు. 28 అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పుతో ఉన్న ఈ విగ్రహాన్ని 4కే సామర్థ్యం ఉన్న ప్రొజక్టర్ ద్వారా ప్రదర్శిస్తున్నారు. గ్రానైట్‌తో రూపొందిస్తున్న నేతాజీ విగ్రహ నిర్మాణం పూర్తయ్యాక దీని స్థానంలో ఆ విగ్రహాన్ని స్థాపిస్తారు. కెన్ డూ.. విల్ డూ.. విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రజలందరూ నేతాజీ నుంచి కెన్ డూ (చేయగలము) విల్ డూ (చేస్తాము) అన్న స్ఫూర్తిని పొంది ముందడుగు వెయ్యాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఎందరో త్యాగధనులు, గొప్ప నాయకులు దేశానికి చేసిన సేవల్ని చరిత్ర పుటల నుంచి తొలగించే ప్రయత్నాలు జరిగాయని పరోక్షంగా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. గతంలో జరిగిన తప్పుల్ని సవరించుకుంటున్నామని, వారు దేశానికి సేవల్ని స్మరించుకుంటున్నామని చెప్పారు. దేశానికి స్వాంతంత్య్రం వచ్చిన వందేళ్లలోగా, అంటే 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా ఎదగాలన్న లక్ష్యాన్ని ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోలేదని అన్నారు. ఈ సందర్భంగా 2019 నుంచి 2022 సంవత్సరం వరకు సుభాష్ చంద్రబోస్ ఆప్డా ప్రబంధన్ పురస్కార్‌లు ప్రదానం చేశారు. విపత్తు నిర్వహణలో అద్భతమైన ప్రతిభ చూపించిన సంస్థలకి, వ్యక్తులకి ఈ అవార్డులను ఇస్తున్నారు. జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబెకు నేతాజీ రీసెర్చ్ బ్యూరో నేతాజీ అవార్డుని బహుకరించింది. అబె తరఫున కోల్‌కతాలోని జపాన్‌కు చెందిన కౌన్సెల్ జనరల్ ఈ అవార్డుని స్వీకరించారు. నేతాజీ అవార్డు తనకి ఇవ్వడం గర్వకారణమని షింజో అబె తన సందేశాన్ని పంపించారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాల కోసం తాను ప్రయత్నిస్తానని చెప్పారు. ఆ భాగాల్ని అనువదించలేదు నేతాజీ సుభాష్ చంద్రబోస్దిగా అనుమానించిన చితాభస్మానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి జపాన్‌లోని రెంకోజీ ఆలయం అనుమతి ఇచ్చినట్టుగా తాజాగా వెలుగు చూసిన లేఖలో వెల్లడైంది. అప్పట్లో నేతాజీ అనుమానాస్పద మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎంకె ముఖర్జీ కమిషన్‌కు చితాభస్మం డీఎన్ఏ పరీక్షలకు అనుమతినిచ్చినట్టుగా టోక్యోలోని రెంకోజీ ఆలయం ప్రధాన పూజారి 2005లో భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే జపాన్ భాషలో ఉన్న లేఖలో ఆ భాగాన్ని అనువదించలేదని సుభాష్ చంద్రబోస్ సోదరుడు శరత్ బోస్ మనవరాలు మాధురి బోస్ ఆదివారం ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. రెంకోజీ ఆలయం చితాభస్మంపై పరీక్షలకు అనుమతించలేదని ఆ కమిషన్ పేర్కొందని గుర్తు చేశారు. దేశ, విదేశాల్లో.. బోస్ జయంతిని సింగపూర్‌లో ఘనంగా జరిపారు. సింగపూర్ స్వాతంత్య్ర సాధనలో బోస్ పాత్రను దేశవాసులు స్మరించుకున్నారు. బోస్ జన్మదినోత్సవాన్ని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని బెంగాల్ సీఎం మమత డిమాండ్ చేశారు. ఆయన జ్ఞాపకార్థం జైహింద్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. నేతాజీ జన్మోత్సవ వేడుకలను తమిళనాడులో గవర్నర్, సీఎం ఘనంగా నిర్వహించారు. బెంగళూరులోని బోస్ విగ్రహాన్ని విధాన సభ ముందు ప్రతిష్టిస్తామని కర్ణాటక సీఎం ప్రకటించారు. ఒడిశాలో బోస్ జన్మస్థల మ్యూజియంలో పలు కార్యక్రమాలు జరిపారు. చండీగఢ్‌లో నేతాజీ నూతన విగ్రహాన్ని సీఎం ఖట్టర్ ఆవిష్కరించారు. At the programme to mark the unveiling of the hologram statue of Netaji Bose. https://t.co/OxRPKqf1Q7 — Narendra Modi (@narendramodi) January 23, 2022 -
కరోనా ఆంక్షలు.. బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి.. అప్పుడొచ్చింది ఓ మైండ్ బ్లోయింగ్ ఐడియా!
ఈ రోజుల్లో.. శుభకార్యాల్లో కనిపించే అక్షింతలన్నీ జూమ్, వాట్సాప్‌లోనే ప్రత్యక్షమవుతున్నాయి. మేసేజ్‌ల రూపంలో నిజంగా వేయకపోయినా.. వేసినట్లు టెక్నాలజీనీ ఉపయోగిస్తున్నారు. ఇదేవిధంగా ఓ తోడిపెళ్లికూతురు కూడా టెక్నాలజీని ఉపయోగించింది. ప్రత్యక్షంగా పెళ్లికి వెళ్లక పోయినా, తను నిర్వర్తించాల్సిన బాధ్యతలన్నింటినీ పాటించి, వారిని ఆశీర్వదించింది. ఇందుకోసం వేరే వ్యక్తిని కూడా పంపలేదు. తానే స్వయంగా పూర్తి చేసింది. ( చదవండి: అదొక అందమైన తోట.. ముచ్చటపడి ఏది ముట్టుకున్నా ప్రాణాలకు ముప్పే.. ) అది కూడా పెళ్లి ముహుర్తానికి, పెళ్లి మండపంలోనే. అదెలా? అని ఆశ్చర్యపోతున్నారా! వర్చువల్ టెక్నాలజీనీ ఉపయోగించి, పెళ్లితెరపై ప్రత్యక్షమైంది. ఎలాగనుకుంటున్నారా? హోలోగ్రామ్ రూపంలో.. సింపుల్‌గా చెప్పాలంటే రియల్ టైమ్ వర్చువల్ గ్రాఫిక్స్. జరిగింది ఏంటంటే.. మనం ఎక్కడ ఉన్నా మన ప్రతిరూపాన్ని కావాలనుకున్న చోట ప్రత్యక్షం చేసే టెక్నాలజీ ఈ హోలోగ్రామ్. రజనీకాంత్ రోబో సినిమా చూసి ఉంటే, వెంటనే అర్థమవుతుంది. సినిమాలో ఫ్రొఫెసర్ బోరాను వశీకరణ్ తన లాబ్‌లోకి అనుమతించడు. దీంతో బోరా తన వర్చువల్ బాడీని చిట్టీ ముందు ప్రత్యక్షం చేసి, మాట్లాడతాడు. సేమ్ ఇలాగే.. కరోనా ఆంక్షల కారణంగా లండన్‌కు చెందిన బీమ్ కెనడాలో జరిగే తన స్నేహితురాలి అంటారియా పెళ్లికి వెళ్లలేకపోయింది. తనను నమ్మి తోడిపెళ్లికూతురు బాధ్యతలు అప్పగించిన స్నేహితురాలిని బాధ పెట్టడం ఇష్టం లేక, హోలోగ్రామ్ ద్వారా పెళ్లిలో ప్రత్యక్షమైంది. అంతేకాదు, ఒక తోడిపెళ్లికూతురుగా వరుడికి వధువు గురించి చెప్పాల్సిన విషయాలను అందంగా వివరిస్తూ, ఆశ్చర్యపరచింది. తర్వాత అందరితో పాటు డ్రింక్ తాగుతూ, కాసేపు డాన్స్ చేసింది. ఇక చివరగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి అంతర్ధానమైంది. ఇదంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. కుంటిసాకులు చెప్పి, తప్పించుకునే ఫ్రెండ్స్ ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా పెళ్లికూతురి ఆదృష్టం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చదవండి: పదేళ్లుగా ఉదయాన్నే లేవడం, ఊరంతా బలాదూర్ తిరగడం.. ఈ కుక్క ప్రత్యేకత -
ఏపీలో చీప్ లిక్కర్ కొరత
నాటుసారా, కల్తీ మద్యం, లూజు విక్రయాలను నియంత్రించేందుకు చవక ధరలకు (చీప్ లిక్కర్) మద్యాన్ని టెట్రా ప్యాక్‌ల్లో అందిస్తామని ప్రభుత్వం చేసిన విధాన ప్రకటన అమలుకు నోచుకోవడం లేదు. అల్పాదాయ వర్గాలు ఎక్కువగా తాగే చీప్ లిక్కర్‌ను అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం అది చేయకపోవడంతో నాటుసారా, కల్తీ కల్లు, గుడుంబా లాంటివి తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కల్తీ మద్యం సేవించి కృష్ణా జిల్లాలో సోమవారం ఏడుగుగురు మృతి చెందగా, మరో 35 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం జరిగినా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో చీప్ లిక్కర్‌కు గేట్లు బార్లా తెరిచినా డిస్టిలరీలు మాత్రం ఉత్పత్తికి ముందుకు రాలేదు. చౌక మద్యంపై ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ తగ్గించినా తయారీకి ఉత్పత్తి కంపెనీలు ససేమిరా అంటున్నాయి. దీంతో రాష్ట్రంలో చీప్ లిక్కర్ కొరత ఏర్పడింది. మార్కెట్లో చౌకమద్యం దొరక్క నాటుసారా, కల్తీ కల్లు విక్రయాలు బాగా పెరిగాయి. గతంలో అన్ని జిల్లాల్లో కలుపుకొని రోజుకు 30 వేల లీటర్ల నాటుసారా అమ్ముడయ్యేది. ఇప్పుడు ఏపీలో సారా విక్రయాలు రోజుకు 50 వేల లీటర్ల వరకు జరుగుతున్నట్లు అంచనా. 20 శాతం చీప్ లిక్కర్ తయారు చేయాల్సిందే.. ఏపీలో మొత్తం 14 లైసెన్స్డ్ డిస్టిలరీలున్నాయి. వీటి ఉత్పాదక సామర్ధ్యం 1,221.58 లక్షల ప్రూఫ్ లీటర్లు. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు తమ డిస్టిలరీల్లో 20 శాతం చీప్ లిక్కర్ బ్రాండ్లను ఉత్పత్తి చేస్తామని కంపెనీల నిర్వాహకులు అంగీకార పత్రం ఇస్తారు. అయితే డిస్టిలరీలు కేవలం ప్రముఖ బ్రాండ్లను తయారు చేస్తూ చౌక మద్యాన్ని తయారు చేయకపోవడం వల్ల కొరత ఏర్పడింది. హాలోగ్రామ్ అసలు సమస్యా... లూజు విక్రయాలను నిరోధించేందుకు 60 మిల్లీ లీటర్ల చీప్ లిక్కర్ బాటిల్స్ అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావించింది. 60 మిల్లీ లీటర్ల బాటిల్ రూ.20కే అందించాలని నిర్ణయించింది. అయితే నిబ్ బాటిళ్ల తయారీకి హాలోగ్రామ్‌తో కూడిన లేబుల్ వేసేందుకు అదనంగా ఖర్చు కావడంతో వీటిని తయారు చేయలేమని, లీటరు బాటిల్ తయారు చేస్తామని తెగేసి చెబుతున్నాయి. డిస్టిలరీ కంపెనీలపై ఒత్తిడి తీసుకువచ్చి చీప్ లిక్కర్‌ను ఉత్పత్తి చేయించడంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. టెట్రా ప్యాక్‌లో చీప్ లిక్కర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించినా టెట్రా ప్యాక్ తయారీకి చైనా నుంచి మిషన్లు కొనుగోలు చేయాల్సి ఉన్నందున ఉత్పత్తి కంపెనీలు వాటి జోలికెళ్లడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు డిస్టిలరీ కంపెనీలు మాత్రమే చౌకమద్యం ఉత్పత్తి చేయడం గమనార్హం.


