-
TS:యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
సాక్షి,హైదరాబాద్ : తుంటి ఎముక సర్జరీ చేయించుకుని కోలుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ కాసేపటి క్రితం యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయి బంజారాహిల్స్‌లోని నందినగర్‌లోని ఆయన పూర్వ నివాసానికి వెళ్లారు. కేసీఆర్ కొద్దిరోజుల పాటు నందినగర్‌లోని ఇంట్లోనే ఉండనున్నారు. సర్జరీకి సంబంధించి డాక్టర్లకు అందుబాటులో ఉండాలన్న కారణంతోనే కేసీఆర్ గజ్వేల్‌లోని తన ఫామ్‌హౌజ్‌కు వెళ్లకుండా నందినగర్‌లోని ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. తొమ్మిదిన్నర ఏళ్ళ తర్వాత నందినగర్‌లోని సొంత ఇంటిలో కేసీఆర్ బస చేయనున్నారు. నందినగర్ ఇంటిని 2000 సంవత్సరంలో నిర్మించారు. 2021 జులై 13న ఇంటి మరమ్మతు పనులను కేసీఆర్ పరిశీలించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ ఇంటి నుంచే కేసీఆర్ కార్యాచరణ రూపొందించారు. తొమ్మిదిన్నరేళ్ల తర్వాత సొంత ఇంటికి కేసిఆర్ వస్తుండడంతో పూలదండలతో అలంకరించిన కుటుంబ సభ్యులు ఉదయమే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌజ్ బాత్రూమ్లో జారిపడడంతో తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. వెంటనే ఆయనను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఆయనకు తుంటి ఎముకు రిప్లేస్మెంట్ సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత వారంరోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్న ఆయనను శుక్రవారం వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆపరేషన్ కారణంగా కేసీఆర్ అసెంబ్లీలో ఇంకా ఎమ్మెల్యేగా కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇదీచదవండి..మాజీ సీఎం కేసీఆర్ భద్రత.. ప్రభుత్వ కీలక నిర్ణయం -
తుంటి ఎముక కీలు సర్జరీ..ఆ పద్ధతి ఎంత వరకు బెస్ట్!
మనిషి నిటారుగా నిలబడటానికి, కూర్చోడానికి, పరుగెత్తడానికి... ఒక్కమాటలో చెప్పాలంటే రోజులో చేయాల్సిన చాలా పనులకు తోడ్పడేది తుంటి ఎముక కీలు. తుంటి ఎముకలో సాకెట్ లాంటి గుండ్రటి ఖాళీ స్థలం ఉంటుంది. సరిగ్గా ఆ ఖాళీలో అమరిపోయేలా తొడ ఎముక చివరన బంతిలాంటి భాగం ఉండి, ఈ రెండింటి కలయితో కీలు (జాయింట్) ఏర్పడుతుంది. ఈ కీలు వల్లనే రోజువారీ చేసే అనేక పనులు సాధ్యమవుతాయి. ఇటీవల అనేక కారణాలతో... అంటే... వయసు పెరగడం వల్ల వచ్చే ఆర్థరైటిస్‌తో, తుంటి ఎముకలో అరుగుదల వల్ల, యాంకలైజింగ్ ఆర్థరైటిస్‌తో, మరీ ముఖ్యంగా ఇటీవల కరోనా తర్వాత పాతికేళ్ల లోపు యువతలో సైతం అవాస్క్యులార్ నెక్రోసిస్ కారణంగా తుంటి ఎముక అరగడం, విరగడం చాలా సాధరణమయ్యింది. ఇలాంటప్పుడు తుంటి ఎముక మార్పిడి సర్జరీ చేయడం అవసరమవుతుంది. అయితే ఇదే శస్త్రచికిత్సను ‘యాంటీరియర్ హిప్ రీప్లేస్మెంట్’ పద్ధతిలో కాస్త వైవిధ్యంగా నిర్వహిస్తున్నారు డాక్టర్ నితీశ్ భాన్. ఈ పద్ధతి అంటే ఏమిటో, దాని వల్ల ప్రయోజనాలేమిటో ఆయన మాటల్లోనే... ప్రశ్న : యాంటీరియర్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఏమిటి, దాని వల్ల ప్రయోజనాలేమిటి? నితీశ్ భాన్ : ‘యాంటీరియర్ హిప్ రీప్లేస్మెంట్’ అంటే ఏమిటో తెలుసుకునే ముందర, అసలు సంప్రదాయబద్ధంగా (కన్వెన్షనల్గా) చేసే ‘΄ోస్టీరియర్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్’ అంటే ఏమిటో తెలియాలి. అప్పుడు దానికీ దీనికీ తేడాలేమిటి అనేవి తెలుస్తాయి. నిజానికి హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీని మూడు రకాలుగా చేస్తారు. అవి... మొదటిది పిరుదు వెనకభాగం నుంచీ, రెండోది కాస్త పక్కగా చేసేవి. వీటినే పోస్టీరియర్ హిప్ జాయింట్ రీప్లేస్‌మెంట్‌గా చెప్పవచ్చు. ఇందులో మూడోది... మనం యాంటీరియర్గా చెప్పే...కాలి ముందు వైపు నుంచి చేసే శస్త్రచికిత్స. సాధారణంగా ‘΄ోస్టీరియర్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్’లో పిరుదు దగ్గర ఉండే మూడు కండరాల సముదాయంలో పెద్దదైన ‘గ్లుటియస్ మాక్సిమస్’ అనే పెద్ద కండరాన్నీ, మరికొన్ని కీలకమైన కండరాల్ని కట్ చేయాల్సి వస్తుంది. ఇలా కండరాలను కట్ చేసి, తుంటి కీలు వరకు వెళ్లాక కీలు మార్పిడి ప్రక్రియ అంతా ఒకేలా ఉంటుంది. కానీ... అతి పెద్దవీ, కీలకమైన కండరాలను కట్ చేయడం వల్ల గాయం తగ్గి, అంతా నయం కావడానికి కనీసం ఐదారు నెలలు పట్టవచ్చు. అయితే ‘యాంటీరియర్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్’లో ఇలా కీలకమైన కండరాల కోత అవసరముండదు కాబట్టి ఇది తగ్గడానికి 12 రోజులు చాలు. ప్రశ్న : శస్త్రచికిత్స ఏదైనప్పటికీ... ఆర్నెల్ల తర్వాతైనా అంతా మునపటిలా ఉంటుందా? నితీశ్ భాన్ : అదే చెప్పబోతున్నా. గ్లుటియస్ మాక్సిమస్ లాంటి అతి పెద్ద కండరం కట్ చేయడం వల్ల ‘΄ోస్టీరియర్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్’ శస్త్రచికిత్స తర్వాత అనేక ప్రతిబంధకాలూ, ప్రతికూలతలు ఉంటాయి. మనం నిలబడటానికి, కూర్చోడానికి, కూర్చున్న తర్వాత లేవడానికి, కదలడానికి, నడవడానికి, పరుగెత్తడానికి... ఇలా చాలా కదలికలకు తోడ్పడే కండరం కావడంతో... హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ తర్వాత అనేక ఆంక్షల్ని పాటించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒకవైపు ఒరిగి పడుకున్నప్పుడు కాళ్లు రెండూ దగ్గరగా తీసుకురాకూడదు. కూర్చున్నప్పుడు పాదాలు లోపలివైపునకు ఉండేలా కాళ్లు దగ్గరగా పెట్టుకోకూడదు. కూర్చుని ముందుకు వంగ కూడదు. కూర్చుని కాళ్లు ముడిచినప్పుడు 90 డిగ్రీల నుంచి 100 డిగ్రీలు లోపలికి ముడవలేం. కూర్చుని ముందుకు వంగి సాక్స్ తొడగలేము, షూలేసులు కట్టుకోలేం. అంతెందుకు... సోఫాలో నిర్భయంగా, నిశ్చింతగా, సౌకర్యంగా కూర్చోడానికీ జాగ్రత్త ΄ాటించాలి. ఎందుకంటే ΄ోస్టీరియర్ పద్ధతిలో కీలు మార్పిడి తర్వాత... ప్రతి కదలికలోనూ కీలు తన స్థానం నుంచి తొలగి ΄ోయేందుకు (డిస్‌లొకేషన్‌కు) అవకాశం ఉంటుంది. ΄ోస్టీరియర్లో గాయం తగ్గేందుకు ఆర్నెల్లు పట్టడం, ప్రతి కదలికలోనూ జాగ్రత్త వహించాల్సిరావడం, డిస్లొకేషన్ రిస్క్ ఉండటంతో చికిత్స తర్వాతా నిశ్చింతగా ఉండటం సాధ్యం కాదు. ఇది క్వాలిటీ ఆఫ్ లైఫ్‌పై ప్రభావం చూపుతుంది. ప్రశ్న : మరి యాంటీరియర్తో ప్రయోజనం ఏమిటి? నితీశ్ భాన్ : ఇంతకుమునుపు చెప్పుకున్న ప్రతి బంధకాలేమీ ఉండవు. ΄ాటించాల్సిన ఆంక్షలు ఒక్కటి కూడా ఉండవు. అంటే జీరో రిస్ట్రిక్షన్స్ అన్నమాట. ఎందుకంటే.... యాంటీరియర్ శస్త్రచికిత్సలో చిన్న గాటు తప్ప పెద్ద లేదా కీలకమైన కండరాలు వేటినీ కోయనక్కర్లేదు. దీంతో కండరాలు దెబ్బతినడం చాలా చాలా తక్కువ (లెస్ టీష్యూ డ్యామేజ్); కోలుకునే వేగమూ చాలా ఎక్కువ. అక్కడ కోత గాయం మానడానికి ఆర్నెల్లు పడితే, ఇక్కడ కేవలం 10, 12 రోజులు చాలు. నేను చేసిన కొన్ని శస్త్రచికిత్సల్లో రెండో రోజే పరుగెత్తడం, కొన్ని రోజుల వ్యవధిలోనే వాహనాలు నడపడం జరిగింది. వైద్య గణాంకాల ప్రకారం... యాంటీరియర్లో ఇలాంటి డిస్‌లొకేషన్‌కు అవకాశాలు కేవలం 1 శాతం లోపే. ఆస్ట్రేలియన్ జాయింట్ రిజిస్ట్రీ ప్రకారం ΄ోస్టీరియర్ పద్ధతిలో డిస్లొకేషన్ రిస్క్ 21.1 శాతం కాగా... యాంటీరియర్లో ఇది కేవలం ఒక శాతం కంటే కూడా తక్కువే. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గణాంకాలైతే, ఇప్పటివరకు నేను నిర్వహించిన దాదాపు 450 పైగా సర్జరీల్లో హిప్ డిస్లొకేషన్ అయిన కేసు, ఫెయిలైన కేసు ఒక్కటి కూడా లేనే లేదు. ప్రశ్న : మరి అందరూ యాంటీరియర్ పద్ధతిలోనే చేయవచ్చుగా? నితీశ్ భాన్ : ఇది సాంకేతికంగా, సునిశితత్వం çపరంగా చాలా ఎక్కువ నైపుణ్యాలు అవసరమైన శస్త్రచికిత్స. దీనికి చాలా నేర్పు కావాలి. సర్జరీ నిర్వహణను ఒక గ్రాఫ్‌లా గీస్తే సునిశితత్వం, నేర్పూ, నైపుణ్యాలూ ఇవన్నీ ఒక నిటారైన గీతలా ఉంటాయి. అంటే... యాంటీరియర్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్లో అంత సక్లిష్టత ఉంటుందన్నమాట. అందుకే దాదాపు ఈ పద్ధతిలో శస్త్రచికిత్స చేసేవారిలో పన్నెండేళ్ల కిందట దేశంలో ఆరేడుగురి కంటే ఎక్కువ లేరు. ఇప్పటికీ నా అంచనా ప్రకారం మహా అయితే తొమ్మిది మది ఉండి ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేనే సీనియర్. అంతెందుకు విదేశాల నుంచి కూడా వచ్చి... ముంబైలో కుదరక΄ోవడంతో... అక్కడున్నవారితో వాకబు చేసుకుని... అక్కడ్నుంచి ఇక్కడికి వస్తుంటారు. ప్రశ్న : ఈ యాంటీరియర్ హిప్ రీ–ప్లేస్మెంట్ సర్జీరీకి ఫీజులెలా ఉంటాయి? నితీశ్ భాన్ : హిప్ రీప్లేస్మెంట్లో ఏ రకమైనా ఒకేలాంటి ఫీజు ఉంటుంది. అయితే శస్త్రచికిత్స తర్వాత రీప్లేస్మెంట్ కోసం ఉపయోగించే కృత్రిమ కీలు (ప్రోస్థటిక్ జాయింట్)కే వేర్వేరు ధరలుంటాయి. డాక్టర్ నితీశ్ భాన్ సీనియర్ ఆర్థోపెడిక్ అండ్ నీ – హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ (చదవండి: శ్వాసకోశ సమస్యలకు.. శస్త్ర చికిత్స ఒక్కటే మార్గమా?) -
103 ఏళ్ల వృద్ధుడికి తుంటి మార్పిడి
సాక్షి, హైదరాబాద్: ప్రమాదవశాత్తు తుంటి ఎముక విరిగిపోవడంతో నడవలేక పోతున్న ఓ 103 ఏళ్ల వృద్ధుడికి సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. వందేళ్ల పైబడిన వారికి ఇలాంటి సర్జరీ చేయడం చాలా అరుదని, దేశంలోనే ఇది రెండోదని జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ మిథిన్ ఆచి చెప్పారు. బుధవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జహీరాబాద్‌లోని మొగడంపల్లి గ్రామానికి చెందిన బి. ఎస్.మాణిక్యం(103) ఇటీవల ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు. ఆస్పత్రికి తీసుకురాగా వైద్యులు ఆయన తుంటి ఎముక విరిగిపోయినట్లు గుర్తించారు. ఆగస్టు 26న శస్త్రచికిత్స చే శారు. ప్రస్తుతం మాణిక్యం కోలుకున్నట్లు ఆచి చెప్పారు. జొన్నరొట్టె, నాటుకోడి పులుసే ఆరోగ్య రహస్యం!: నిండా మూడు పదుల వయసు కూడా నిండని అనేక మంది యువతీయువకులు మధుమేహం, గుండె, మూత్ర పిండాల జబ్బుల బారిన పడుతున్న నేటి రోజుల్లో.. 103 ఏళ్ల వయసులో కూడా బీఎస్ మాణిక్యం ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. సొంత పనులన్నీ ఆయనే చేసుకుంటారు. జొన్నరొట్టె, నాటు కోడి పులుసు, సహజ సిద్ధంగా పండించిన పండ్లు, కాయకూరలే తన ఆహారం అని ఆయన చెప్పారు. మాణిక్యం, కమల దంపతులకు ఐదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు, 57 మంది మనుమళ్లు, మనుమరాళ్లు ఉన్నారు. 20 మంది మునిమనుమళ్లు ఉన్నారు. 30 ఏళ్ల వయసులోనే స్థానికంగా ఓ చర్చ్‌కి పాదర్‌గా ఎంపికై, 18 మంది ఆడపిల్లలను దత్తత తీసుకున్న మాణిక్యం వారికి సొంత ఖర్చులతో పెళ్లిళ్లు కూడా చేశారు.
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
వైట్‌హౌస్‌కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
టీడీపీ కార్యకర్తల దాడి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
తప్పక చదవండి
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- వెస్ట్ నైలు వైరస్‌ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement