breaking news
highest paid actors
-
ఇన్‌స్టా సంపాదనలో వీరిని మించిన వారే లేరు! జాబితాలో ఎవరున్నారంటే?
-
ఫోర్బ్స్ జాబితాలో బాలీవుడ్ హీరోలు
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆర్జిస్తున్న సినీనటుల జాబితాలో ముగ్గురు బాలీవుడ్ సూపర్స్టార్లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. ప్రముఖ మేగజైన్ ఫోర్బ్స్ మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మొత్తంలో ఆర్జిస్తున్న సినీనటుల జాబితాను విడుదల చేసింది. 2015 ఏడాదికి గాను రూపొందించిన ఈ జాబితాలో బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్‌లు టాప్-10లో నిలిచారు. 34 మంది గ్లోబర్ స్టార్స్‌తో కూడిన ఈ జాబితాలో షారుఖ్ ఖాన్, రణ్‌బీర్ కపూర్లూ చోటు దక్కించుకున్నారు. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ గత ఏడాది సుమారు 33.5 మిలియన్ డాలర్లు ఆర్జించి, సంయుక్తంగా 7వ స్థానంలో నిలిచారు. హాలీవుడ్ సూపర్స్టార్లు ది రాక్ జాన్సన్, జానీ డెప్ల కన్నా వీరు అధికంగా సంపాదిస్తుడడం విశేషం. 32.5 మిలియన్ డాలర్ల వార్షిక సంపాదనతో అక్షయ్ కుమార్ హాలివుడ్ నటులు జార్జి క్లూనీ, బ్రాడ్పిట్లతో సంయుక్తంగా 9 స్థానంలో నిలిచాడు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(26 మిలియన్ డాలర్లు) 18వ స్థానం దక్కించు కోగా, రణబీర్ కపూర్(15 మిలియన్ డాలర్లు) 30వ ర్యాంకులో నిలిచాడు. హాలీవుడ్ యాక్టర్ రాబర్ట్ డౌనీ జూనియర్ 80 మిలియన డాలర్లు సంపాదనతో అగ్రస్థానంలో నిలిచాడు. యాక్షన్ కింగ్ జాకీచాన్ రెండో స్థానం(50 మిలియన్ డాలర్లు) దక్కించుకున్నాడు. విన్ డీజెల్, బ్రాడ్లీ కూపర్, ఆడమ్ శాండ్లర్, టామ్ క్రూజ్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. అమెరికా తర్వాత భారత్ నుంచి ఎక్కువ మంది జాబితాలో చోటు దక్కించుకున్నారు. -
అమితాబ్= సల్మాన్ @ 7
వాషింగ్టన్: ధనార్జనలో ప్రపంచ టాప్-10 హీరోల జాబితాలో బాలీవుడ్ హీరోలు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్‌లకు చోటు దక్కింది. అమితాబ్, సల్మాన్ సంయుక్తంగా ఏడో స్థానంలో ఉండగా, అక్షయ్ కుమార్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. హాలీవుడ్ నుంచి హాంకాంగ్, బాలీవుడ్ వరకు అత్యధిక ధనార్జన గల హీరోల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. గతేడాది అమితాబ్, సల్మాన్ దాదాపుగా చెరో 213 కోట్ల రూపాయలను సంపాదించినట్టు వెల్లడించింది. ఇక అక్షయ్ 207 కోట్ల రూపాయలను ఆర్జించారు. ఈ జాబితాలో బాలీవుడ్ హీరోలు షారుక్ ఖాన్ 18, రణబీర్ కపూర్ 30 వ స్థానాల్లో ఉన్నారు. షారుక్ ఖాన్‌ను 'భారత్ లియెనార్డో డికాప్రియో'గా ఫోర్బ్స్ అభివర్ణించింది. ఈ జాబితాలో రాబర్ట్ డోనీ జూనియర్, జాకీచాన్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. గతేడాది రాబర్ట్ 510, జాకీచాన్ 320 కోట్ల రూపాయల చొప్పున సంపాదించారు.