breaking news
heritage products
-
హెరిటేజ్ పెరుగులో ఏంకలుపుతున్నారు..? బాబు, లోకేష్‌ను నిలదీసిన కారుమూరి
-
కల్తీ మహారాజు.. ముందు నీ హెరిటేజ్ చూసుకో.. ఆ స్వామి నీ నాలుకని..
-
చీప్ క్వాలిటీ.. తింటే ఇక అంతే.. బయటపడ్డ హెరిటేజ్ బండారం
-
చంద్రబాబు సొంత సంస్థ... హెరిటేజ్ పెరుగు ‘నాసిరకం’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సొంత సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ బండారం మరోసారి బయటపడింది. ఆ కంపెనీ తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో నాణ్యత డొల్లేనని అధికారికంగా ఇంకోసారి స్పష్టమయింది. ‘టోటల్ కర్డ్’అంటూ హెరిటేజ్ సంస్థ విక్రయిస్తున్న పెరుగు నాసిరకమని, అందులో ఉండాల్సిన ఫ్యాట్ కనీస స్థాయిలో కూడా లేదని భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) స్పష్టం చేసింది. కనీస ఫ్యాట్ కూడా లేని హెరిటేజ్ పెరుగు నాసిరకమైనదని నిర్ధారిస్తూ ‘సబ్–స్టాండర్డ్’అనే ముద్ర వేసింది. ఇలాంటి ఉత్పత్తులు విక్రయిస్తున్నందుకు రూ.లక్ష జరిమానా చెల్లించాలని హర్యానాలోని ఎఫ్ఎస్ఎస్ఏఐ డిప్యూటీ కమిషనర్ (అడ్జుడికేటింగ్ అథారిటీ) ఆదేశించటంతో విధిలేక హెరిటేజ్ సంస్థ ఆ జరిమానాను చెల్లించింది. ఈ విషయాన్ని సెబీ నిబంధనల ప్రకారం స్టాక్ మార్కెట్‌కు తెలియజేయాలి కనక... గత నెలలో హెరిటేజ్ సంస్థ స్వయంగా తెలియజేసింది. ‘‘ఎఫ్ఎస్ఎస్ఏఐ మా పెరుగు శాంపిళ్లను పరిశీలించింది. కాకపోతే నిబంధనల ప్రకారం వాటిలో ఉండాల్సిన కనీస పాల–ఫ్యాట్ కూడా లేదని ఆ సంస్థ తేల్చింది. ఈ మేరకు మా కంపెనీకి జజ్జర్‌లోని ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి నోటీసు వచ్చింది. మాకు రూ.లక్ష జరిమానా విధించగా మేం దాన్ని చెల్లించాం’’అని హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ స్టాక్ మార్కెట్లకు తెలియజేసింది. ఈ జరిమానా చెల్లించటం వల్ల తమ కంపెనీపై ఆర్థికంగా పెద్దగా ప్రభావం పడదని కూడా కంపెనీ తెలియజేసింది. ఇదంతా ఒకెత్తయితే పెరుగులో పాలకు సంబంధించిన ఫ్యాట్ కనీస స్థాయిలో కూడా లేకపోవటంతో ఇది దేంతో తయారవుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘‘పాల–ప్యాట్‌లో ఏ చిన్న తేడాలున్నా అది సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయమే.అలాంటిది పెరుగులో కనీస స్థాయిలో కూడా మిల్క్ ఫ్యాట్ లేదంటే ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే పాలతోనే కదా పెరుగు తయారవుతుంది? అందుకే మేం తరచూ శాంపిళ్లు తీసుకుంటుంటాం. హెరిటేజ్ పెరుగు నాసిరకమని తేలటంతో జరిమానా కూడా విధించాం’’అని ఫుడ్ సేఫ్టీ వర్గాలు తెలియజేశాయి. వాస్తవానికి జరిమానా మొత్తం చిన్నదే. దానివల్ల కంపెనీపై ఆర్థికంగా ప్రభావమేమీ ఉండకపోవచ్చు.కానీ పాలు, పెరుగు వంటివి భారీ సంఖ్యలో జనం నిత్యం వాడే ఉత్పత్తులు. ‘‘వీటిలో నాణ్యత లేదంటే ... అది కంపెనీ ఉత్పత్తులపై నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తుంది. దీర్ఘకాలంలో కంపెనీ మనుగడకు ఇలాంటి అంశాలు సవాళ్లు విసురుతాయి’’అని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కంపెనీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిదని, ఉత్పత్తుల్లో నాణ్యత లేకపోవటం ఏమాత్రం సమ్మతం కాదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
హెరిటేజ్ పెరుగా.. ఫెవికాల్ గమ్మా?
► తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో కలకలం ► హెరిటేజ్ పాలు తాగిన బాలుడికి అస్వస్థత శంఖవరం (పత్తిపాడు): తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో హెరిటేజ్ పాలు తాగిన ఏడాది బాలుడు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన వైనం కలకలం రేపింది. ఆ బాలుని తండ్రి ‘‘ఇవి పాలా, పెరుగా? హెరిటేజ్ గమ్మా?’’ అంటూ ఆ సంస్థ మార్కెటింగ్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి బాధితుడు షేక్ గౌస్ శనివారం విలేకర్లకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక హెరిటేజ్ ప్లాంట్‌లో శుక్రవారం రాత్రి గౌస్ రెండు పాల ప్యాకెట్లు కొనుగోలు చేశారు. వాటిలో ఒక ప్యాకెట్ పాలను ఆయన భార్య పెరుగుగా వాడుకునేందుకు తోడు పెట్టారు. మరో ప్యాకెట్ పాలను ఉదయం వారి కుమారుడు రెహెన్(1)కు ఇచ్చేందుకు ఫ్రిజ్‌లో పెట్టారు. ఉదయాన్నే పాలు కాచి పట్టించగా, రెహెన్‌కు వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే అతడిని హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి పరుగులు తీశారు. ప్రస్తుతం రెహెన్ ఆస్పత్రిలో కోలుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్లి గౌస్ భోజనం చేస్తుండగా పెరుగు వేసుకుందామని గిన్నెలో గరిటె పెడితే బయటకు రాలేదు. గమ్‌లా పెరుగు గరిటెను పట్టుకుని వదల్లేదని గౌస్ వివరించారు. దీంతో అనుమానం వచ్చిన ఆయన హెరిటేజ్ ప్లాంట్‌కు వెళ్లి అమ్మకందారును నిలదీశారు. ఆయన మార్కెటింగ్ మేనేజర్ ఫోన్ నంబరు ఇవ్వడంతో ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హెరిటేజ్ అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్ ఎస్.బాబి శనివారం సాయంత్రం వచ్చి ఆ పెరుగును పరిశీలించారని గౌస్ చెప్పారు. ఆయనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. తోడు పెట్టిన పెరుగును, ప్యాకెట్లను పరిశీలనకు పంపుతానని చెప్పి వెళ్లారని వివరించారు.


